టోర్నీ మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన షాహీన్ షా అఫ్రిది!? | Shaheen Afridi Exits LPL 2026 Mid-Tournament After Alleging Match-Fixing | Sakshi
Sakshi News home page

LPL 2026: టోర్నీ మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన షాహీన్ షా అఫ్రిది!?

Aug 2 2026 11:12 AM | Updated on Aug 2 2026 12:34 PM

Shaheen Afridi Exits LPL 2026 Mid-Tournament After Alleging Match-Fixing

పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్ షా అఫ్రిది కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026లో క్యాండీ రాయ‌ల్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అఫ్రిది.. సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల అత‌డు త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ పొట్టి క్రికెట్ టోర్న‌మెంట్‌లో షాహీన్ త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. అఫ్రిది 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. 10.18 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. వైదొలగడానికి వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ, దీని వెనుక వేరే కథ ఉన్నట్లు సమాచారం. క్యాండీ రాయల్స్‌కు మేనెజ్‌మెంట్‌కు అఫ్రిది మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

అసలేమి జరిగిందంటే?
ఈ లీగ్‌లో భాగంగా కొలంబో క్యాప్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిదిని  'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దించుతామని క్యాండీ జట్టు మేనెజ్‌మెంట్ చెప్పింది. కానీ మ్యాచ్ షీట్ తయారీలో అనలిస్ట్‌ల పొరపాటు వల్ల అతడి ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్‌లో కనిపించలేదు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగేందుకు అంపైర్‌లు అనుమతించలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షాహీన్‌.. వెంటనే యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) ను ఆశ్రయించాడు. ఈ వివాదం నేపథ్యంలో టోర్నీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఫ్రాంచైజీ జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పడంతో కొద్దిరోజులు జట్టుతో పాటు ఉన్నాడు. 

కానీ ఇప్పుడు అతడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. కాగా షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ టెస్ట్ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. వెస్టిండీస్‌, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక కాకపోవడంతో అతడి రెడ్‌బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్‌కు మరో అగ్నిపరీక్ష!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement