ది హండ్రెడ్ లీగ్ 2026లో సదరన్ బ్రేవ్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ జట్టుకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు.
బౌలర్లకు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సదరన్ బ్రేవ్ పేసర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ నాలుగు వికెట్లు పడగొట్టి లండన్ జట్టును దెబ్బ తీశాడు. ఆర్చర్ తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.
అయితే ఒకానొక దశలో 103/5తో ఉన్న లండన్ స్పిరిట్.. కేవలం 2 పరుగుల వ్యవధిలోనే మిగతా 5 వికెట్లను కోల్పోయి 105 పరుగులకే ఆలౌట్ అయింది. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఆర్చర్‌తో పాటు స్టోయినిష్ మూడు వికెట్లు పడగొట్టాడు. లండన్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (56 పరుగులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
అనంతరం 106 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు సదరన్ బ్రేవ్స్ కూడా తీవ్రంగా శ్రమించింది. లక్ష్య చేధనలో బ్రేవ్స్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
ఈ సమయంలో డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 39 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును గెలిపించాడు. మిల్లర్‌తో పాటు ఓపెనర్ జేమీ స్మిత్ 36 పరుగులతో రాణించాడు. లండన్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు, జంపా, కోల్స్ తలా వికెట్ సాధించారు.
చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్‌కు మరో అగ్నిపరీక్ష!


