సౌతాఫ్రికా యువ ఆటగాడి విధ్వంసం.. వణికి పోయిన ముంబై బౌలర్లు | Pretorius’ 28-ball 64 powers Spirit to first win of season | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా యువ ఆటగాడి విధ్వంసం.. వణికి పోయిన ముంబై బౌలర్లు

Jul 30 2026 8:52 AM | Updated on Jul 30 2026 9:48 AM

Pretorius’ 28-ball 64 powers Spirit to first win of season

ది హండ్రెడ్ 2026లో లండన్ స్పిరిట్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం ది ఓవల్ మైదానం వేదికగా ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 

ఓపెనర్ విల్ జాక్స్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (19 బంతుల్లో 41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లండన్‌ స్పిరిట్‌ బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ మూడు, టై, కోల్స్‌ తలా వికెట్‌ సాధించారు.

ప్రిటోరియ‌స్ విధ్వంసం
అనంత‌రం 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని లండ‌న్‌ స్పిరిట్ కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ భారీ ల‌క్ష్య చేధ‌న‌లో 20 ఏళ్ల దక్షణాఫ్రికా యువ సంచలనం లువాన్-డ్రే ప్రిటోరియస్ విధ్వంసం సృష్టించాడు. ఓవల్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌల్ట్‌ వంటి సీనియర్‌ బౌలర్లను సైతం ఈ యువ ఆటగాడు వదల్లేదు.

ఈ క్రమంలో ప్రిటోరియస్ కేవలం 23 బంతుల్లోనే హండ్రెడ్‌లో తన తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  ఓవరాల్‌గా 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ప్రిటోరియస్‌.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవిల్‌ బ్రెవిస్‌ కూడా(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్‌) తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, గ్లీసన్‌, స్టోన్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement