జో రూట్ క్లాసీ ఇన్నింగ్స్‌ | Phoenix beat Fire, Phoenix won by 7 wickets | Sakshi
Sakshi News home page

The Hundred: జో రూట్ క్లాసీ ఇన్నింగ్స్‌

Aug 2 2026 9:19 AM | Updated on Aug 2 2026 9:20 AM

Phoenix beat Fire, Phoenix won by 7 wickets

ది హండ్రెడ్ మెన్స్‌ కాంపిటీషన్-2026లో వెల్ష్ ఫైర్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెల్ష్ ఫైర్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే సాధించగల్గింది. 

ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (18), జో క్లార్క్ (35) మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి బర్మింగ్‌హామ్ మిడిలార్డర్ మాత్రం దారుణంగా విఫలమైంది. ఆఖరిలో కెప్టెన్ డోనోవన్ ఫెరీరా (23), స్కాట్ కర్రీ (17) దూకుడుగా ఆడడంతో బర్మింగ్‌హామ్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో మార్కో జాన్సన్, లాకీ ఫెర్గ్యూసన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, సామ్ కుక్ తలొక వికెట్ తీశారు.

రూట్ హాఫ్ సెంచరీ
అనంతరం 138 పరుగుల లక్ష్యాన్ని వెల్ష్ ఫైర్ 3 వికెట్లు కోల్పోయి 96 బంతుల్లో చేధించింది. ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లతో 46), జోరూట్‌(40 బంతుల్లో 7 ఫోర్లతో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. బర్మింగ్‌హామ్ బౌలర్లలో సాకిబ్‌ మహ్మద్‌, క్రిస్‌ వుడ్‌, మిచెల్‌ ఓవెన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్‌కు మరో అగ్నిపరీక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement