ఉన్నతికి కాంస్యం | Indian player Unnati Sharma wins bronze medal in judo | Sakshi
Sakshi News home page

ఉన్నతికి కాంస్యం

Aug 2 2026 4:02 AM | Updated on Aug 2 2026 4:02 AM

Indian player Unnati Sharma wins bronze medal in judo

జూడోలో భారత ప్లేయర్‌ ఉన్నతి శర్మ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 63 కేజీల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఉన్నతి ఇపాన్‌ స్కోరు (100–0)తో స్కై క్నోస్టర్‌ (దక్షిణాఫ్రికా)ను చిత్తు చేసింది. చురుగ్గా ప్రత్యర్థిని పడగొట్టి అత్యధిక పాయింట్లు సాధించిన ఉన్నతి కేవలం 1 నిమిషం 7 సెకన్లలోనే పోరును ముగించింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఉన్నతి 1–100 స్కోరుతో సాయా మిడిల్టన్‌ (ఆ్రస్టేలియా) చేతిలో పరాజయంపాలైంది. పురుషుల 81 కేజీల కేటగిరీలో హర్ష్ టోకాస్‌ కాంస్యం కోల్పోయాడు.

మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్ష్ ఇపాన్‌ (0–100)తో కీషిన్‌ ఓచీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. బరిలో నిలిచిన ఇతర భారత జూడోకాలు ఇనున్‌గన్బి టాకెలంబమ్, కరణ్‌జిత్‌ సింగ్‌ మాన్‌ పతకాలు గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మరో వైపు పురుషుల లాన్‌ బౌల్స్‌లో ఇంగ్లండ్‌ ద్వయం నిక్‌ బ్రెట్‌–జేమీ వాకర్‌ చేతిలో పరాజయంపాలైన భారత జోడి నవనీత్‌ సింగ్‌–దినేశ్‌ కుమార్‌ పతకావకాశాలు కోల్పోయింది.

సైక్లింగ్‌ స్ప్రింట్‌ ఈవెంట్‌ పురుషుల విభాగంలో భారత సైక్లిస్ట్‌లు క్వాలిఫై కావడంలో విఫలమయ్యారు. రోజిత్‌ సింగ్‌ 22వ స్థానంలో, రొనాల్డో సింగ్‌ 24వ స్థానంలో, డేవిడ్‌ బెక్‌హామ్‌ 25వ స్థానంలో నిలిచి ని్రష్కమించారు. మహిళల 10,000 మీటర్ల రేస్‌వాక్‌లో భారత అథ్లెట్లు ప్రియాంక (45 నిమిషాల 53.93 సె.) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని చేజార్చుకోగా, రవీనా డిస్‌క్వాలిఫై అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement