జూడోలో మరో స్వర్ణం.. భారత్‌ ఖాతాలో 19వ పతకం | Harsh Singh Clinch Historic-Gold Medal Judo Mens 60 Kg Final CWG 2026 | Sakshi
Sakshi News home page

జూడోలో మరో స్వర్ణం.. భారత్‌ ఖాతాలో 19వ పతకం

Jul 31 2026 9:29 PM | Updated on Jul 31 2026 9:43 PM

Harsh Singh Clinch Historic-Gold Medal Judo Mens 60 Kg Final CWG 2026

Photo Credit: SAI Twitter

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. 4 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ బౌట్‌లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజ‌వా కట్జ్‌ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. 

తద్వారా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‌గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇది భారత్‌కు ఐదో స్వర్ణం కాగా, ఓవరాల్‌గా పతకాల సంఖ్య 19కి చేరినట్లయింది. ఇప్పటికే జూడోలో మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది.

ఇక కామన్‌వెల్త్‌లో భారత అథ్లెట్ల జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ 19 ప‌త‌కాలు (5 స్వ‌ర్ణాలు, 10 ర‌జ‌తాలు, 4 కాంస్యాలు) సాధించి ప‌ట్టిక‌లో 19వ స్థానంలో కొన‌సాగుతోంది. అయితే గేమ్స్‌లో 9వ రోజైన శుక్ర‌వారం ఒక్క‌రోజే భార‌త్ ఖాతాలో 13 ప‌త‌కాలు ఖ‌రార‌య్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 ప‌త‌కాలు ఉంటే, జూడో నుంచి మ‌రో మూడు ప‌త‌కాలు ఉన్నాయి. 

 

Read: జూడోలో భారత్‌కు స్వర్ణం.. ఒక్క‌రోజే 13 ప‌త‌కాలు ఖ‌రారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement