Photo Credit: SAI Twitter
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్‌లో ఇది భారత్‌కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా భారత్‌కు ఇది 18వ పతకం.
ఇక కామన్‌వెల్త్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 18 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్‌లో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి.

జూడో గేమ్‌లో హర్ష్ సింగ్, యామిని మౌర్య, అస్మితా దే ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతాలు దక్కనున్నాయి. ఇక బాక్సింగ్‌లో భారత్ పంచ్ పవర్ అదుర్స్ అనిపిస్తోంది. భారత బాక్సర్లలో ప్రీతి పవార్, అంకుశ్ పంగల్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతీ చౌదరీలు శనివారం ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. గెలిస్తే ఐదు స్వర్ణాలు.. ఓడితే ఐదు రజతాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి.

ఇక మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్‌కు అర్హత సాధించడంతో కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ కచ్చితంగా స్వర్ణం లేదా కనీసం రజతమైనా ఒడిసిపడతడని అంతా భావిస్తున్నారు. నీరజ్‌తో పాటు మరో ఇద్దరు భారత జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉండడంతో పతకాలపై ఆశలు మరింత పెరుగుతున్నాయి.
ఇలా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13 పతకాలకు పైగా ఖరారు కావడంతో భారత్‌కు ఆదివారం లోగా 30 నుంచి 31 పతకాలు వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ జూడో మహిళల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైనల్ ఆడనుండగా, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడనుండడంతో భారత్ పతకాల సంఖ్య 20కి చేరనుంది.
🇮🇳🥹 India's first-ever Commonwealth Games Gold Medal in Judo.
Asmita Dey has etched her name into Indian sporting history! 🥇
She defeats Canada's Heidi Quach 2-1 to win the Women's -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026
𝐀𝐒𝐌𝐈𝐓𝐀 𝐃𝐄𝐘 𝐂𝐑𝐄𝐀𝐓𝐄𝐒 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘! 🇮🇳🥇
Becomes the FIRST-EVER Indian JUDOKA (male or female) to win a Commonwealth Games GOLD medal!
Defeats Heidi Quach in 48kg Final. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/Ux3mQQ8Jf3— India_AllSports (@India_AllSports) July 31, 2026


