breaking news
Preeti Pawar
-
బాక్సింగ్‌లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్‌లో రెండు పతకాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన బాక్సర్ స్కార్లెట్ సవన్నాహ్పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి పవార్ ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ఇక రెండో బౌట్లోనూ ప్రీతి తన ప్రత్యర్థి ముఖంపై పంచుల వర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో బౌట్లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్‌ను న్యాయ నిర్ణేతలు యునానిమస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇప్పటికే బాక్సింగ్ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రీతి సాధించిన స్వర్ణం భారత్‌కు 6వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 24వ పతకం.👉ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో జాస్మిన్ ఐర్లాండ్‌కు చెందిన మికెలియాను చిత్తు చేసి పసిడి పతకం సాధించింది. కామన్వెల్త్లో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 25వ పతకం. JAISMINE LAMBORIA IS BOXING 57KG COMMONWEALTH GAMES CHAMPION 🇮🇳🥇- She defeated Northern Ireland’s boxer via unanimous decision 5:0 in the FinalsTOTAL DOMINATING WIN! 🔥🔥🔥 pic.twitter.com/fgu6Nt0jCG— The Khel India (@TheKhelIndia) August 1, 2026 👉ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.SELVA PRABHU WINS THE BRONZE MEDAL FOR INDIA IN TRIPLE JUMP! 🥉- 27th Medal for India at CWG 2026 pic.twitter.com/2Y2AjToipA— The Khel India (@TheKhelIndia) August 1, 2026PRAVEEN CHITRAVEL WINS THE SILVER FOR INDIA IN TRIPLE JUMP! 🥈- 26th Medal for India at CWG 2026 pic.twitter.com/wbnXWA02DB— The Khel India (@TheKhelIndia) August 1, 2026 -
జూడోలో భారత్‌కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్‌లో ఇది భారత్‌కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా భారత్‌కు ఇది 18వ పతకం. ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 18 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్‌లో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. జూడో గేమ్‌లో హర్ష్ సింగ్, యామిని మౌర్య, అస్మితా దే ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతాలు దక్కనున్నాయి. ఇక బాక్సింగ్‌లో భారత్ పంచ్ పవర్ అదుర్స్ అనిపిస్తోంది. భారత బాక్సర్లలో ప్రీతి పవార్, అంకుశ్ పంగల్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతీ చౌదరీలు శనివారం ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. గెలిస్తే ఐదు స్వర్ణాలు.. ఓడితే ఐదు రజతాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఇక మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్‌కు అర్హత సాధించడంతో కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ కచ్చితంగా స్వర్ణం లేదా కనీసం రజతమైనా ఒడిసిపడతడని అంతా భావిస్తున్నారు. నీరజ్‌తో పాటు మరో ఇద్దరు భారత జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉండడంతో పతకాలపై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఇలా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13 పతకాలకు పైగా ఖరారు కావడంతో భారత్‌కు ఆదివారం లోగా 30 నుంచి 31 పతకాలు వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ జూడో మహిళల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైనల్ ఆడనుండగా, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడనుండడంతో భారత్ పతకాల సంఖ్య 20కి చేరనుంది. 🇮🇳🥹 India's first-ever Commonwealth Games Gold Medal in Judo.Asmita Dey has etched her name into Indian sporting history! 🥇She defeats Canada's Heidi Quach 2-1 to win the Women's -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026 𝐀𝐒𝐌𝐈𝐓𝐀 𝐃𝐄𝐘 𝐂𝐑𝐄𝐀𝐓𝐄𝐒 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘! 🇮🇳🥇 Becomes the FIRST-EVER Indian JUDOKA (male or female) to win a Commonwealth Games GOLD medal! Defeats Heidi Quach in 48kg Final. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/Ux3mQQ8Jf3— India_AllSports (@India_AllSports) July 31, 2026 -
CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్ ఫైనల్లో అడుగుపెట్టడంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారు కానుంది. శుక్రవారం మహిళల 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. ఫైనల్లో ప్రీతి ఓడినప్పటికీ భారత్‌కు రజతం దక్కనుంది. హర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి పవార్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో విజయం తర్వాత ప్రీతి పవార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామన్వెల్త్ గేమ్స్‌లో నా ప్రతీ ఫైట్‌కు ముందు కోచ్‌తో పర్యవేక్షణలో ప్రత్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి పవార్ తెలిపింది.జూడో క్వార్టర్స్‌లో భారత ప్లేయర్లుజూడోలో రోహిత్ బసిర్, శ్రద్ధా చొపాడేలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్‌కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. మరోవైపు జేన్ మసాక్వియోను ఇప్పోన్లో ఓడించిన శ్రద్ధా కూడా క్వార్టర్స్ చేరుకుంది. VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia's Catherine Mwape in the last-four stage.She says, "I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0— Press Trust of India (@PTI_News) July 31, 2026Read: క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!


