Photo Credit: SAI Twitter
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్ ఫైనల్లో అడుగుపెట్టడంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారు కానుంది. శుక్రవారం మహిళల 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. ఫైనల్లో ప్రీతి ఓడినప్పటికీ భారత్‌కు రజతం దక్కనుంది. హర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి పవార్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో విజయం తర్వాత ప్రీతి పవార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామన్‌వెల్త్ గేమ్స్‌లో నా ప్రతీ ఫైట్‌కు ముందు కోచ్‌తో పర్యవేక్షణలో ప్రత్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి పవార్ తెలిపింది.
జూడో క్వార్టర్స్‌లో భారత ప్లేయర్లు
జూడోలో రోహిత్ బసిర్, శ్రద్ధా చొపాడేలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్‌కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. మరోవైపు జేన్ మసాక్వియోను ఇప్పోన్‌లో ఓడించిన శ్రద్ధా కూడా క్వార్టర్స్ చేరుకుంది.
VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia's Catherine Mwape in the last-four stage.
She says, "I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0— Press Trust of India (@PTI_News) July 31, 2026
Read: క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!


