టీమిండియాకు శుభవార్త | Team India Gets Big Bumrah Boost Passes fitness test Ahead Tests vs SL | Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభవార్త

Jul 31 2026 3:40 PM | Updated on Jul 31 2026 4:16 PM

Team India Gets Big Bumrah Boost Passes fitness test Ahead Tests vs SL

PC: BCCI X

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. లంక పర్యటనకు అతడు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

పీటీఐతో సదరు అధికారి మాట్లాడుతూ.. ‘‘జస్‌ప్రీత్‌ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పొందాడు. శ్రీలంకతో రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. జట్టు ప్రణాళికల్లో భాగంగా అతడు రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 

కీలక సిరీస్‌..
కాగా ఆగష్టు 15 నుంచి 27 మధ్య టీమిండియా శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచకప్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో ఈ సిరీస్‌ భాగం. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా టీమిండియా ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. మిగిలి ఉన్న తొమ్మిది టెస్టుల్లో కచ్చితంగా ఏడు విజయాలు సాధించాలి.

ఈ నేపథ్యంలో శ్రీలంకను 2-0తో వైట్‌వాష్‌ చేయడం టీమిండియా ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా మారింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది కాబట్టి లంక గడ్డ మీద విజయాలు సాధిస్తే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఇలాంటి కీలక సిరీస్‌లో ప్రధాన బుమ్రా ఫిట్‌నెస్‌ ఆధారంగా ఆడతాడని బీసీసీఐ తొలుత తెలిపింది.

గాయాల బెడద
ఇక ఇప్పటికే యువ ఆటగాళ్లు హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి గాయాల వల్ల జట్టుకు దూరం కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా కోలుకోని కారణంగా శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. కాగా బుమ్రా సైతం మోకాలి గాయం వల్ల ఇంగ్లండ్‌తో ఆఖరిదైన మూడో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌, సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సారాంశ్‌ జైన్‌.

చదవండి: ఇదేం బ్యాటింగ్‌ బ్రో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement