కొత్త లుక్‌లో రోహిత్ శ‌ర్మ‌.. వ‌య‌సులో ప‌దేళ్లు వెన‌క్కి! | Rohit Sharma Stunning Clean Shaven New Look Photo Went Viral, Fans Say He Looks 10 Years Younger | Sakshi
Sakshi News home page

కొత్త లుక్‌లో రోహిత్ శ‌ర్మ‌.. వ‌య‌సులో ప‌దేళ్లు వెన‌క్కి!

Jul 31 2026 6:52 PM | Updated on Jul 31 2026 7:41 PM

Rohit Sharma Stunning New Look Viral-Fans React-Age-Reversed 10 Years

Photo Credit: (x) Twitter

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. శుక్ర‌వారం భారత మాజీ క్రికెట‌ర్ ర‌విశాస్త్రితో క‌లిసి దిగిన ఫొటోలో రోహిత్ శ‌ర్మ క్లీన్ షేవ్‌తో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీంతో వ‌యసులో రోహిత్ శ‌ర్మ‌ ఒక ప‌దేళ్లు వెన‌క్కి మ‌ళ్లిన‌ట్లుగా అనిపించింది. ఇక ర‌విశాస్త్రి కూడా రోహిత్ కొత్త లుక్‌పై ఆస‌క్తిక‌ర పోస్టును పెట్టాడు. రోహిత్‌ను ఇలా చూస్తుంటే చాలా రిలాక్స్‌గా అనిపిస్తోంది అని కామెంట్ చేశాడు.

ఇటీవ‌లే ఇంగ్లండ్‌తో  జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో 39 ఏళ్ల రోహిత్ 110 బంతుల్లో 138 ప‌రుగులతో రాణించాడు. అయితే ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ స‌మ‌యంలోనే అత‌డి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ‌చ్చాయి. రోహిత్ శ‌ర్మ త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల‌ను కొట్టిపారేయ‌గా, బీసీసీఐ కూడా 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్రణాళిక‌ల్లో రోహిత్ టీమిండియా జ‌ట్టులో స‌భ్యుడిగా ఉంటాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంతో రిటైర్మెంట్ వార్త‌ల‌న్నీ పుకార్లేన‌ని తేలిపోయింది. 

ఇక కోహ్లితో పాటు రోహిత్ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నున్నాడు. ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్-న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక రోహిత్ శ‌ర్మ సెప్టెంబ‌ర్‌లో వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు.

 

చదవండి: ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement