మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు | Case Filed On Meta India head over posts targeting PM Modi during CJP protest | Sakshi
Sakshi News home page

మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు

Jul 31 2026 9:22 AM | Updated on Jul 31 2026 9:29 AM

Case Filed On Meta India head over posts targeting PM Modi during CJP protest

సాక్షి, హైదరాబాద్: ఇటీవల  జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్‌ అరుణ్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ప్రధాని మోదీకి సంబంధించినటువంటి  అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్‌పారమ్‌లపై  (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.

కాగా నీట్‌లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement