జూడోలో మరో పతకం.. భార‌త్ ఖాతాలో 20వ మెడల్ | Yamini Mourya Gets Silver Medal in Judo at Common wealth Games | Sakshi
Sakshi News home page

Yamini Mourya: యామినికి రజతం.. ఒకే రోజు మూడు పతకాలతో రికార్డ్

Jul 31 2026 11:25 PM | Updated on Jul 31 2026 11:27 PM

Yamini Mourya Gets Silver Medal in Judo at Common wealth Games

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా చాటుతోంది. ఇవాళ ఒక్క రోజే ఇండియన్ ప్లేయర్స్ అదరగొట్టేశారు. జూడోలో ఏకంగా ఒక్క రోజే మూడు పతకాలు సాధించారు.  జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. తాజాగా జూడో మహిళల విభాగంలో యామిన్ మౌర్య రజతం సాధించింది. ఈ పతకాలతో జూడోలో ఓకే రోజు మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా జూడోలో మూడు ఓకే రోజు మూడు పతకాలు రావడం తొలిసారి కావడం విశేషం.

ఓకే రోజు మూడు మెడల్స్.. 

మొత్తానికి 9వ రోజు జూడో అథ్లెట్లు ప‌త‌కాల పంట పండించారు. జూడో మ‌హిళ‌లు, పురుషుల విభాగాల నుంచి భార‌త్ ఖాతాలో ప‌త‌కాలు సాధించారు. జూడో  మ‌హిళ‌ల 57 కేజీల విభాగంలో యామిన్ మౌర్య.. ఇంగ్లండ్‌కు చెందిన ఎసీలా టోప్ర‌క్‌ చేతిలో పోరాడి ఓడింది. దీంతో రజతం కైవసం చేసుకుంది. దీంతో ఓవరాల్‌గా భారత్ పతకాల సంఖ్య 20కి చేరినట్లయింది. అంతకుముందే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలిచి.. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. అంతేకాకుండా పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఫైనల్ బౌట్‌లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజ‌వా కట్జ్‌ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. తద్వారా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‌గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇప్పటి వరకు భారత్‌కు ఐదు స్వర్ణాలు చేరాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement