జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా బాధిత మహిళతో కొద్ది రోజుల పాటు ఓకే ఇంట్లో కలిసున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అదే క్రమంలో మహిళను వదిలించేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.


