విశాఖలో సింహాచలం గిరి ప్రదక్షణ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ట్రాఫిక్ మళ్లించడంలో పోలీస్ శాఖ చేతులేత్తేసింది. దాదాపు 5 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కనీసం పట్టించుకోవడం లేదని భక్తులు వాపోయారు. ఎటు కదలలేని పరిస్థితిలో గిరి ప్రదక్షణ చేస్తూ ఇబ్బందులకు గురయ్యారు.
పోలీసులు, అధికారుల సమన్వయ లోపంతో సింహాచలం గిరి ప్రదక్షణ నిర్వహణ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్‌తో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గిరి ప్రదక్షణలో అప్పన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకోజిపాలెం, హనుమంతువాక వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో నేషనల్ హైవే మీదుగా గిరి ప్రదక్షణ చేస్తున్నారు. మాధవధార మీదుగా వెళ్లాల్సి ఉండగా.. సరైన ప్రణాళిక లేక హైవే మీదుగా ప్రదక్షణ కొనసాగిస్తున్నారు.
#Simhachalam Giri Pradakshina #visakhapatnam pic.twitter.com/T6jYJ70nl8
— P Pavan (@PavanJourno) July 28, 2026


