మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పిల్ | YSRCP MLC Files PIL in AP High Court Against Mega DSC | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పిల్

Jul 28 2026 5:19 PM | Updated on Jul 28 2026 5:30 PM

 YSRCP MLC Files PIL in AP High Court Against Mega DSC

విజయవాడ: ⁠మెగా డీఎస్సీ అక్రమాలపై ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు.⁠ ⁠డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ దర్యాప్తు కోరారు. ⁠మెగా డీఎస్సీ మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పిటిషన్ వేశారు. 

⁠పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, మెరిట్ జాబితాలపై సంచలన ఆరోపణలు చేశారు. ⁠డీఎస్సీకి సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ⁠స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నియామకాలు రద్దు చేయాలని కోరారు. ⁠లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ⁠ఆర్టికల్స్ 14, 16 ఉల్లంఘన జరిగిందని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement