breaking news
DSC
-
ఏపీలో నిరుద్యోగ యువత కీలక నిర్ణయం.. జేఏసీ ఏర్పాటు
సాక్షి,అమరావతి: సాక్షి,అమరావతి: ఏపీ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అంతా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.డీఎస్సీ, కానిస్టేబుల్స్,ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరినీ ఏకం చేస్తూ నూతనంగా ‘నిరుద్యోగ జేఏసీ’ని ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎంబేటి రామచంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించేందుకు, తమ సమస్యలను విన్నవించుకునేందుకు మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు కుక్కలను తరిమినట్లు తరిమేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులపై జరుగుతున్న ఇటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.మరోవైపు పోలీసు నియామకాలపై కూడా జేఏసీ మండిపడింది. గత ప్రభుత్వ హయాంలోనే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పోస్టుల భర్తీపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.కాగా డీఎస్సీ అక్రమాలపై ఇదివరకే వైఎస్సార్సీపీ ఉద్యమ బాట ప్రకటించింది. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చొప్పున వెంటనే ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం విధితమే. -
దగా డీఎస్సీపై దండయాత్ర
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనల మార్పు, జీవోల మార్పులతో సహా వైఎస్సార్సీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతోపాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. -
DSC టాపర్ ఉద్యోగం ఎక్కడ..? డబ్బులు తీసుకుని చర్చకు రమ్మంటావా..
-
Ambati : లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ తీవ్ర డిమాండ్
-
సాక్ష్యాలున్నా లోకేష్ ను విచారించరా? DSC స్కామ్ పై YSRCP ఫైర్
-
దొంగ ఉద్యోగాలకు లోకేష్ టోకెన్లు ఇచ్చాడు
-
ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్సీపీ వినతి పత్రాలు
సాక్షి, కృష్ణా జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ.. ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పించింది.ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడుతూ.. డీఎస్సీలో అనర్హులలకు ఉద్యోగాలు ఇచ్చారని... లోకేష్ రికమండ్తో కొంత మంది ఉద్యోగం పొందారని.. నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నిలదీశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు లూటీ చేశారన్న పేర్ని నాని.. 16 వేల మందిలో దొంగ టీచర్లు కూడా ఉన్నారన్నారు.అన్నమయ్య జిల్లా: డీఎస్సీలో జరిగిన అక్రమాలను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. మదనపల్లి జాయింట్ కలెక్టర్‌కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారు. అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది’’ అని ఆయన మండిపడ్డారు.అనంతపురం జిల్లా: డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ టీడీపీ నేతలు అమ్ముకున్నారని.. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మంత్రి నారా లోకేష్‌కు పదవిలో కొనసాగేందుకు ఒక్క క్షణం కూడా అర్హత లేదని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు.వైఎస్సార్ జిల్లా: కడపలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరపాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్నపత్రాల అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనం. డబ్బులు ఇచ్చిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ నిలదీసింది. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. -
డీఎస్సీ స్కామ్‌పై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయం, ఫీజుల బకాయిల చెల్లింపు వంటి ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు(కో–ఆర్డినేషన్), రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులకు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. జూలై 31న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం నుంచి ప్రారంభించి, టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీల వరకు పార్టీ ప్రకటించిన కార్యాచరణను విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ అంశం ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగ యువకుడికి సంబంధించినదని, అందుకే ఇది కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా యువత ఉద్యమంగా మారాలన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు అన్ని చోట్లా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులను నేరుగా కలుసుకొని టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీల్లో భాగస్వాములను చేయాలన్నారు. బాధితులే మాట్లాడేలా వేదిక కల్పిస్తే ఉద్యమానికి మరింత బలం వస్తుందని సజ్జల స్పష్టం చేశారు.ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలిటౌన్హాల్ సమావేశాలు కేవలం పార్టీ సమావేశాలుగా కాకుండా సమాజ చర్చలుగా కనిపించాలన్నారు. విద్యావేత్తలు, రిటైర్డ్ అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పాల్గొనేలా చూడాలన్నారు. రిలే నిరాహార దీక్షల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, స్కిట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే, ఎస్ఐఆర్ ప్రక్రియ, ఏఎస్డీ జాబితాలు, అన్మ్యాప్డ్ ఓటర్లు, ఫారమ్6, ఫారమ్7, డూప్లికేట్ ఓట్ల అంశాలను ప్రతి నియోజకవర్గంలో జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలతో సమన్వయం కొనసాగిస్తూ అవసరమైతే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్‌జీ వార్...
-
‘నీట్’ లీకేజీని మించి ‘డీఎస్సీ’ మెగా స్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ– 2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దేశంలో ‘నీట్’ లీకేజీ కంటే మెగా డీఎస్సీ అతిపెద్ద కుంభకోణ మని ధ్వజమెత్తారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల భద్రత, మెరిట్ జాబితా, స్పోర్ట్స్ కోటా నియా మకాల్లో పారదర్శకతను పూర్తిగా దెబ్బ తీశారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరి పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురు మూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి డిమాండ్ చేశా రు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తే అత్యున్నత ర్యాంకులు సాధించడం ప్రశ్నపత్రాల లీకేజీకి నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రాల డిజిటల్ యాక్సెస్ ఎవరి నియంత్రణలో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నపత్రంతో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది? అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదని ఎంపీలు విమర్శించారు. పారదర్శకతకు సమాధి..పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతుందో డిస్ట్రిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు తెలుసని ఎంపీ గొల్ల బాబూరావు చెప్పారు. ప్రశ్నపత్రాల రూపకల్ప న, పరీక్షల నిర్వహణ బాధ్యతలు డీఎస్సీ కన్వీనర్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఆ బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించారన్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో పార దర్శకత దెబ్బతిన్నదన్నారు. పేపర్స్ తయారీ, ప్రింటింగ్, డిజిటైజేషన్.. ప్రతి దశ లోనూ అవుట్సోర్సింగ్ వ్యక్తుల్ని పెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో ఎటువంటి ఆరోపణలు, అవకతవ కలకు తావులేకుండా పారదర్శకంగా 1.50 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కొన్ని సంఘాల సర్టిఫికెట్లతో అసాధారణ నియామకాలు..నీట్ పేపర్ లీకేజీ కంటే మెగా డీఎస్సీ పెద్ద కుంభకోణ మని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా జీవోలను రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకురావడం, పోస్టుల కేటాయింపులో అవకతవ కలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనబెట్టి కేవలం పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కొన్ని క్రీడా సంఘాలు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా అసాధారణ సంఖ్యలో నియామకాలు జరిగాయ న్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉండగా, జూడో అసోసియేషన్‌కు నారా లోకేశ్‌కు బంధువైన విశాఖ ఎంపీ భరత్ గౌరవాధ్య క్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇదే సంఘాల నుంచి జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి సర్టిఫికెట్లు జారీ కావడంనియామకాలపై తీవ్ర అను మానాలు కలిగిస్తోందన్నారు. డీఎస్సీ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. జీవో నెం.3 అమలుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టి స్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు కేవలం 6 శాతమే ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలి..మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో స్వతంత్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి, మీడియా వేదికలపై డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టామన్నారు. దాదాపు 3.5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాసి 16 వేల ఉద్యోగాల కోసం పోటీ పడితే మొత్తం నియామక ప్రక్రియనే అధికార పార్టీకి అనుకూలంగా మార్చారని ఆరోపించారు. 2012 నుంచి అమలులో ఉన్న జీవో నంబర్ 74తో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి ఎంపిక చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకే జీవో నంబర్–4, జీవో నంబర్–47 తీసుకొచ్చారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 384 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కట్టబెట్టిన తర్వాత మళ్లీ జీవో నంబర్–25, జీవో నంబర్–56 ద్వారా పాత నిబంధనలను అమలు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు చెల్లిస్తే టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని బేరం పెడుతూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డు వైరల్ అయిందని ఎంపీ డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా దర్యాప్తు ముందుకు సాగకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి దాగి ఉంది? అని నిల దీశారు. నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నట్లుగానే డీఎస్సీలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ కూడా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. -
డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ ఉద్యమ బాట
డీఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమ బాట ప్రకటించింది. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చొప్పున వెంటనే ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ డిమాండ్లకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయి. ఈ ఆందోళన కొనసాగింపులో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రకటించారు. వీటిని యువత, విద్యార్థులతో కలిసి పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. కార్యాచరణ ఇలా..రేపు (శుక్రవారం): వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం అందజేయాలి.ఆగస్టు 3 లేదా 4వ తేదీన: నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి.ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు: నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలి.ఆగస్టు 10వ తేదీ: నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలి. -
మెగా డీఎస్సీ స్కామ్‌పై జెన్‌జీ వార్!
సాక్షి, అమరావతి: ‘నీట్’ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్‌జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే.. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేశ్ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గు చేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు ఎన్నో ఉదంతాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాల పర్వం.. మెగా డీఎస్సీ 2025 ప్రక్రియ మొదలు పెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్ లోడింగ్‌ను, డిజిటలైజేషన్‌ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్ జిల్లా టాపర్‌గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను భ్రష్టు పట్టించడానికి లోకేశ్ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లో ప్రదర్శించాల్సిన మెరిట్‌లిస్ట్ ఎందుకు పెట్టలేదు? టాప్ ర్యాంకర్‌గా వచ్చిన నవీన్‌ను తీసేసి రెండో లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి నవీన్‌ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో దొడ్డి దారిన అమ్మేశారు.. స్పోర్ట్స్ కోటా కోసం జీవో 74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేశ్ మంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్ 19న ప్రకటన చేయటానికి గంట ముందు స్పోర్ట్స్ కోటా కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో జీఏడీ జీవో 47 ఇచ్చింది. అందరితోపాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్, డీఎస్సీలు రాయాల్సిన పని లేదని పేర్కొంది. మెగా డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని, 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి, మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు. అడ్డగోలుగా సర్టిఫికెట్లు.. వాటితో ఉద్యోగాలు కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా 38 మంది టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేశ్ తోడల్లుడు భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్ నంబర్ కనిపిస్తున్నా.. ఎఫ్ఐఆర్లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేశ్ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదు? సీబీఐ విచారణ జరగాల్సిందే: పేర్ని నానిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా వైఎస్ జగన్ ఇంటి గేటు బయట నిలబడ్డా! పిలిచాను! ఆయన రాలేదు! అని సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చిన డబ్బులతో స్కూల్ కడితే విద్యాశాఖను మార్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ‘రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది..?1. ప్రశ్నపత్రాల తయారీతోపాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం పారదర్శకతకు పాతర కాదా?2. ప్రశ్నల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం పేపర్ లీకేజీకి పునాది కాదా?3. ఔట్సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకులు రావడం పేపర్ లీకేజీని నిర్ధారిస్తోంది. ఆ తర్వాత నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ లిస్టు నుంచి పేరు తొలగించారు. డేటాను మాయం చేసి కాల్‌లెటర్ కూడా పంపలేదు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన పేపర్‌తో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బు చేతులు మారింది? వీటిపై విచారణ ఏది?4. జీవో నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతంగా ఉండేది. ఇతర అభ్యర్థులతో సమానంగా అన్ని అర్హతలు కలిగి, సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరి. కానీ డీఎస్సీ 2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్షను ఎత్తివేశారు. కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేయగానే జీవో నంబర్లు 4, 47ను రద్దు చేసి, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 56 జారీ చేశారు.మొదట ఇచ్చిన జీవోలు సరైనవే అని అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దుచేస్తూ జీవోలు ఎందుకు తెచ్చారు? అంటే.. తమవారితో పోస్టులు నింపడానికి గేట్లు తెరిచి, పని పూర్తికాగానే మళ్లీ మూసేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి.. ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో సర్టిఫికెట్లు చూపించి నియామకాలు చేపట్టారు. 5. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే. సర్టిఫికెట్లు ఇచ్చేదీ వారే. ఇక పారదర్శకత ఎక్కడుంది?6. ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యను 1 : 1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టారు.7. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపారు. వీడియోలో ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించినా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారు. బలమైన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. ఇది కుంభకోణం వెనుక పెద్దల ప్రమేయానికి రుజువు కాదా? -
‘డీఎస్సీపై లోకేష్‌తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు.ఇసుక దోపిడీకి బాధ్యత వహిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను కూడా సిద్ధమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డీఎస్సీపై లోకేష్‌తో చర్చకు సిద్ధం:టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జీవోలను మార్చారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను మా పార్టీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ నియామకాలలో మెరిట్ లిస్టులు, రోస్టర్లు బహిరంగంగా ప్రకటించలేదు. ఇది పారదర్శకత లోపానికి నిదర్శనం. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.కొండపిలో టీడీపీ నాయకుల ఇసుక అక్రమ మైనింగ్:రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దోపిడీకి పాల్పడుతోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ఆధారాలతో అక్రమ ఇసుక తవ్వకాల అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.మైనింగ్ శాఖ అధికారులే స్వయంగా టిడిపి మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇంచార్జులు, మాజీ ఎంపిపిల పేర్లను (అనుమోలు సుధా, పోకూరి రవి, దాసరి కృష్ణారావు, ఎర్ర నరేంద్ర, కొండగుంట శ్రీనివాసరావు మొదలైనవారు) రాస్తూ, వీరిపై పిడి యాక్ట్ పంపాలని లేదా మండల బహిష్కరణ చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినా, స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ టీడీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల పేర్లతో పోలీసులకు లేఖలు రాసి, వారిపై పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ అవి అమలు కాలేదు. హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రాలేదు.మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాజీనామా చేయాలి:కొండేపి నియోజకవర్గంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్‌పై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. హైకోర్టు ఆదేశాలు, మైన్స్ శాఖ నివేదికలు, అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి ఆదేశాలతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా సీఎం చంద్రబాబే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి క్యాబినెట్ అంతా ‘దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నడుస్తోంది. యువత మరియు ప్రజల హక్కు సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. -
డీఎస్సీలో అక్రమాలు.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఎస్ఈఆర్టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్ఈఆర్టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్‌ని టాపర్‌గా ప్రకటించి మళ్ళీ లిస్ట్‌లో మార్పులు చేశారు. నవీన్‌ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్‌కి దమ్ముంటే దేవాన్స్కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
లోకేశ్ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే..YS జగన్ ట్వీట్..
-
కదిలిన YSRCP యువత.. లోకేష్ వెన్నులో వణుకు.. రాజీనామా చేస్తాడా..?
-
చంద్రబాబులో టెన్షన్.. ఏపీలో యువత తిరుగుబాటు.. లోకేష్ రాజీనామా?
-
DSC స్కామ్ లో చంద్రబాబు హస్తం..! ఇవే ప్రూఫ్ లు.. DSC అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!
-
అసలు మెగా DSC స్కామ్ ఎలా బయటపడిందంటే.. విద్యార్థుల కళ్ళు తెరిపించే వీడియో..
-
ఏపీలో డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
-
లోకేష్ మేము రెడీ మీరు రెడీనా..? లైవ్ లో DSC అభ్యర్థి ఓపెన్ ఛాలెంజ్
-
ఢిల్లీ సీన్ రిపీట్.. జగన్ కు సవాల్ విసరడం కాదు.. దమ్ముంటే డిబేట్ కు రా
-
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలు విజయవంతమవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల వీడియోలను జతచేస్తూ ‘నారా లోకేశ్ మస్ట్ రిజైన్’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..‘డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్–జెడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు.ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వంం.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కానీ ఇప్పటి వరకు వాటిపై నోరు మెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు.రేపు శ్రీకాకుళానికి వైఎస్ జగన్ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పరామర్శసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. -
కదంతొక్కిన యువజనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అందరి నోట అదే డిమాండ్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్‌ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. -
డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరగాలి: ఎంపీ గురుమూర్తి
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై జరిగిన చర్చలో ఆయన వైఎస్సార్సీపీ తరఫున పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల ఎంతోమంది అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఈ మెగా రిక్రూట్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖలో టీచర్ పోస్టులను అడ్డగోలుగా అమ్ముకున్నారని, దీనికి సంబంధించిన ఆడియో సంభాషణలు కూడా బయటపడ్డాయని సభ దృష్టికి తెచ్చారు.ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.డీఎస్సీ లీకేజ్ కేసులో ముందుకు వెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా ఉన్నతాధికారుల లేదా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాబట్టి, కేంద్రం తీసుకొస్తున్న ఈ యాంటీ పేపర్ లీక్ చట్టం కిందికి అన్ని రాష్ట్రాలను, అన్ని రకాల పరీక్షలను తీసుకురావాలని ఆయన కోరారు.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, కేవలం మెరిట్ ప్రాతిపదికన లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశామని గురుమూర్తి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి రిక్రూట్‌మెంట్‌లోనూ అక్రమాలు జరుగుతున్నాయని, చివరకు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో సైతం భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాకు నిర్వహించాల్సిన అర్హత పరీక్షలను రద్దు చేసి, కనీసం పరీక్ష పాస్ కాని 384 మందికి అక్రమ మార్గంలో ఉద్యోగాలు ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్రం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కోరారు. -
మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పిల్
విజయవాడ: మెగా డీఎస్సీ అక్రమాలపై ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ దర్యాప్తు కోరారు. మెగా డీఎస్సీ మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పిటిషన్ వేశారు. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, మెరిట్ జాబితాలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్సీకి సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నియామకాలు రద్దు చేయాలని కోరారు. లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్స్ 14, 16 ఉల్లంఘన జరిగిందని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
DSC స్కాంపై సీబీఐ విచారణ..? లోకేష్ రాజీనామా..? ఏపీలో వేడెక్కిన రాజకీయం!
-
రాజమండ్రిలో హైటెన్షన్.. YSRCP ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
-
దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు)
-
మీరు మీరు ఒకటేగా... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నువ్వు కూడా
-
పేకాట అడినోళ్లకే ఉద్యోగం.. గుంటూరు యువత వినూత్న నిరసన
-
DSC స్కామ్ ను బట్టబయలు చేసిన నెల్లూరు YSRCP నేతలు
-
నేను వస్తా... దమ్ముంటే రా.. ఆఫాల్ మొదటి సారి ఎమ్మెల్యే గాడివి...!
-
డీఎస్సీపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
-
జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు..! నీకు మంత్రి పదవి అవసరమా..?
-
‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై విచారణ జరిపించాలని.. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ఆమె మండిపడ్డారు. డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్సీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, రిక్రూట్ మెంట్లో అనర్హులకు పట్టం కట్టారు. 420 జీవో తీసుకొచ్చి.. 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని ఆర్కే రోజా తేల్చి చెప్పారు.‘‘191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు మూడు వేలు భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. కోటిన్నరకు పైగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జగనన్న ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబును అడుగు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళలు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చంద్రబాబు.. నీ కొడుకు లోకేష్‌తో రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది..లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుంది. జగనన్న పాలనలో లక్ష 30 వేల పోస్టులు. ఆంధ్రజ్యోతి పేపర్‌కు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం బయట పడింది. చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది. ఆడ పిల్లలలపై అత్యాచారం జరిగితే కేసులు లేవు. భజన పత్రికలు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP DSC : 4 నెలల గడువు..బాబు సర్కార్ కి హైకోర్టు డెడ్‌లైన్
-
యువత ఆందోళనలతో లోకేష్ కు టెన్షన్
-
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. -
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అక్రమాలపై విచారణ. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
-
దగా డీఎస్సీపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో నష్టపోయిన అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా దగా, మోసం, పెద్ద కుంభకోణమని నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్, స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల అమ్మకం, నియామక ఉత్తర్వుల జారీలో అవకతవకలు ఇలా డీఎస్సీలో జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనకాడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్రం బాధ్యత వహించినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని నినదిస్తున్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ కూడా రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.స్కామ్‌ల డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలను నిర్వహించబోతోంది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, బాధితుల పక్షాన నిలుస్తూ ఈ ఏడాది జూన్ ఒకటిన వైఎస్సార్సీపీ యువజన విభాగం కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్లు, ఆర్డీవోలు, ప్రభుత్వానికి అనేక వినతులు సమర్పించింది. అయితే నిష్పçక్షపాతంగా సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు బాబు సర్కార్ జంకుతోంది. సీబీఐ విచారణంటే బెరుకెందుకు.?నీట్ యూజీ తరహాలోనే ఏపీ డీఎస్సీ ప్రశ్నాపత్రం సైతం తయారీ చేసిన దగ్గరే లీక్ అయిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ, ఆన్లైన్ అప్లోడ్ చేయడం వంటి ఎంతో గోప్యమైన ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాప్ ర్యాంకర్‌గా నిలవడమే పేపర్ లీక్‌కు పెద్ద సాక్ష్యమని చెబుతున్నారు. టాప్ ర్యాంకర్‌గా నిలిచినప్పటికీ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకపోగా, రెండో దఫా ఇచ్చిన మెరిట్ లిస్ట్‌లో నవీన్ వివరాలను తొలగించడంతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైందని యువత గుర్తుచేస్తోంది. అయితే ఈ లీక్ ఎంత వరకూ వెళ్లింది? లీకైన పేపర్ ద్వారా ఎంత మంది ఉద్యోగాలు సాధించారు? లీక్ వెనుక అసలు కుట్రదారులు ఎవరు? అనే విషయాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అభ్యర్థులు నమ్ముతున్నారు.ప్రభుత్వం నిష్పక్షపాతంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం వాదిస్తోంది. పేపర్ లీక్ కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే నవీన్ టాప్ ర్యాంకర్‌గా నిలిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సెలక్షన్ లిస్టులో అతని పేరు తొలగించడమే కాకుండా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయించడం... ఇలా ప్రభుత్వం చేసిన తప్పుల మీద తప్పులే పేపర్ లీక్‌కు మెగా సాక్ష్యాలని అభ్యర్థులు బల్లగుద్ది వాదిస్తున్నారు.జీవోలే సాక్ష్యం.. బేరసారాలే రుజువు..రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా స్పోర్ట్స్ కోటా కింద అతిపెద్ద కుంభకోణం జరిగిన మాట వాస్తవం కాదా? అని బాబు సర్కార్‌ను యువత నిలదీస్తోంది. స్పోర్ట్స్ కోటా కుంభకోణానికి ప్రభుత్వం డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే ఇచ్చిన జీవో 4.. 47 అతిపెద్ద సాక్ష్యాలు కాగా.. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా పప్పుబెల్లాలు మాదిరిగా సాగిన టీచర్ పోస్టుల విక్రయాలకు బేరసారాల ఆడియోలే రుజువని స్పష్టం చేస్తున్నారు.తామనుకున్నవారికి టీచర్ పోస్టులు అడ్డగోలుగా కట్టబెట్టడం కోసమే జీవో 4.. 47 తెచ్చారని నష్టపోయిన నిజమైన క్రీడాకారులు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో స్వర్ణపతకాలు సాధించిన వారికి సైతం అన్యాయం చేస్తూ టీడీపీ ప్రజా ప్రతినిధులు అధ్యక్షులుగా ఉన్న సంఘాల నుంచి పాల్గొన్న సర్టిఫికెట్లున్న వారికి టీచర్ పోస్టులు ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరం పెట్టారని, ఇందుకు సంబంధించిన ఆడియోలు వెలుగు చూసినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీస్తున్నారు.బడా స్కామ్‌కు బాధ్యత ఎందుకు వహించరు?దేశ చరిత్రలో వెలగు చూసిన ఆర్ఆర్బీ, మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్, పశ్చిమ బెంగాల్ సేవా కమిషన్ స్కామ్, ఇటీవల వెలుగు చూసిన నీట్ యూజీ పేపర్ లీక్ వంటి అనేక స్కామ్‌లను తలదన్నేలా ఏపీ డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని లక్షలాది మంది అభ్యర్థులు చెబుతున్నారు. వారు చేస్తున్న ప్రతి ఆరోపణకు పక్కాగా డిజిటల్, ఆడియో, వీడియో, రికార్డెడ్ సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ చేపట్టదని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు బాధ్యత వహించరని నిలదీస్తున్నారు. -
ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నాపత్ర భద్రత, నియామక విధానం, క్రీడాకోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉపాధ్యాయుల నియామకాలు, వారి సేవా నిబంధనలు, నియామక ప్రక్రియ పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ దేశంలోని ఎక్కువ పాఠశాలలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉంటాయని తెలిపారు. అందువల్ల ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, పోస్టింగ్‌లకు సంబంధించిన అంశాలు వాటి పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను పారదర్శకంగా, పటిష్టంగా, సాధ్యమైనంతవరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు పార్లమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024ను తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించేందుకు ఇది ఒక నమూనా చట్టంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. మెగా డీఎస్సీకి సంబంధించి రాష్ట్రంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం కేంద్రమంత్రి జవాబివ్వలేదు. -
డీఎస్సీ అక్రమాలపై విచారణ
సాక్షి, అమరావతి: లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టిన మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 2025 మెగా డీఎస్సీలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులు, రిట్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై నాలుగు నెలల్లోతగిన నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఫిర్యాదులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు...అంతకు ముందు పురుషోత్తం తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది పలువురు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, అలాగే 2025 డీఎస్సీలో కూడా ఉద్యోగాలు సంపాదించారన్నారు. అంతేకాక వైద్య విద్యలో కూడా ప్రవేశాలు పొందారని తెలిపారు. వీటన్నింటిపై పిటిషనర్ ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఆరోపణలకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను కోరినా స్పందించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యల నిమిత్తం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీలు జరగకపోయినా సర్టిఫికెట్లు..ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందినవారు.. వారు సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పిటిషనర్ పిటిషన్లో వివరించారు. పోటీలు జరగకపోయినా జూడోలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్లు ఇచ్చారు. అసలైన జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లతో సంబంధం లేని తేదీలు, వేదికల పేరుతో నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 సర్టిఫికేట్లను సృష్టించారు. టోర్నమెంట్లలో పాల్గొనని, మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన అభ్యర్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను తయారు చేశారు. ఈ నకిలీ పత్రాల ద్వారా స్పోర్ట్స్ ప్రాధాన్యత జాబితాలో మొదటి స్థానాలు పొంది, నిజమైన క్రీడాకారుల హక్కులను కాలరాశారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు..విశాఖపట్నం జిల్లాలో సుమారు 20 మంది నకిలీ జూడో సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు. కె.చందన అనే అభ్యర్థి ఇంటర్–డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్ నకిలీ సర్టిఫికేట్‌తో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఎంపికైంది. ⇒ పల్లిపాటి రిత్విక్‌ను 2017 డిసెంబర్ లో చెన్నైలో జరిగిన సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్‌షిప్‌లో 66 కేజీల కేటగిరీలో అనర్హుడిగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ పోటీ ఆధారంగా పొందిన నకిలీ సర్టిఫికేట్‌తో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటా సీటు సాధించాడు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. టోర్నమెంట్లలో అనర్హత పొందిన వారికి, కేవలం పాల్గొన్న వారికి ఎటువంటి మెరిట్ సర్టిఫికెట్లు జారీ చేయమని స్పష్టంగా చెప్పింది. ⇒ ఇదే రీతిలో పశుసంవర్థక శాఖలో కూడా పలువురు ఉద్యోగాలు పొందారు. టోర్నమెంట్ రికార్డులు, పతకాల ప్రదానోత్సవ వివరాలను పరిశీలించగా, పలువురు అభ్యర్థులు చూపిన సర్టిఫికేట్లు నకిలీవని రూఢీ అయింది. ఆకుమల్ల హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీలలో ఎటువంటి స్థానమూ సాధించకపోయినా, మెరిట్ సర్టిఫికేట్‌తో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పి. ఇస్మాయిల్ బాషా, పల్లపు అభినయ్, అయితు అప్పలస్వామి, పి. అశ్విని తదితరులు పోటీ రికార్డుల్లో పేర్లు లేకున్నా నకిలీ స్పోర్ట్స్ ఫారమ్‌ల ఆధారంగా ఉద్యోగాలు సాధించారు. ఏ టోర్నమెంట్ అధికారిక రికార్డులలో లేదా ఎంట్రీ ఫారమ్‌లలో లేదు. అయినా సరే నకిలీ సర్టిఫికేట్ల ద్వారా జాబితాలో చేరి ఉద్యోగం సాధించారు. ఇదో పెద్ద కుంభకోణం.. దీని వెనుక కుట్రకోణం..పోటీలు జరగని తేదీలతో, ఇతర విజేతల స్థానాలను తమ స్థానాలుగా చెప్పుకుంటూ, జూనియర్ టోర్నమెంట్లను సీనియర్ టోర్నమెంట్లుగా చిత్రీకరిస్తూ సమర్పించిన దరఖాస్తులను జూడో సంఘం కార్యదర్శి పవన్ ఎలాంటి పరిశీలన చేయకుండా ఫారమ్ 2 సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణంలో భాగం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) లోని అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది ఈ నకిలీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ధృవీకరించారు. సమాచార హక్కు చట్టం కింద పాత సమాచారాన్ని కోరినప్పుడు, ఈమెయిల్‌లు, ఇతర ఆధారాలు డిలీట్ అయ్యాయని అధికారులు చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. ఏపీ జూడో అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్ నమిశెట్టి, పవన్ సందీప్ నమిశెట్టి తదితరులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 లను జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలి.’ అని పురుషోత్తం తన పిటిషన్లో పేర్కొన్నారు.డీఎస్సీలోనూ అవే నకిలీ సర్టిఫికెట్లు..మెగా డీఎస్సీ నోటిఫికేషన్ –2025 కింద దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు జూడో అసోసియేషన్ నుంచి సంపాదించిన నకిలీ సర్టిఫికేట్లను జతపరిచారు. ఖమ్మం, విజయవాడ, గుంటూరులలో జరిగిన టోర్నమెంట్ల పేరుతో సమర్పించిన ధృవీకరణ పత్రాలు అసలు ఫలితాల జాబితాతో సరిపోలడం లేదు. జరగని పోటీలను జరిగినట్లు చూపడంతో పాటు, పోటీల్లో తాము ఫలానా స్థానం సాధించామని తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారు. ⇒ డాకోజి పాండు ఖమ్మంలో జరిగిన సీనియర్ జూడో ఛాంపియన్‌షిప్‌లో 2వ స్థానం సాధించినట్లు నకిలీ సర్టిఫికేట్, హామీ పత్రం సమర్పించగా, జూడో అసోసియేషన్ కార్యదర్శి పవన్ సందీప్ దీనికి ఫారమ్–2 మంజూరు చేశారు. ⇒ మిట్నసాల సుధారాణి 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వగా, 23.05.2025న పవన్ సందీప్ ఫారమ్–2 జారీ చేశారు. ⇒ దేసావత్ చంద్ర నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు హామీ పత్రం ఇవ్వగా, 20.05.2025న పవన్ ఫారమ్–2 సర్టిఫికేట్ ఇచ్చారు. ⇒ రియాజుల్లా నల్బంది 73 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు తప్పుడు రికార్డు చూపగా, పవన్ 20.05.2025న ఫారమ్–2 జారీ చేశారు.⇒ షేక్ ఇనామ్ హుస్సేన్ 73 కేజీల సీనియర్ విభాగంలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ చూపారు. ఏ స్థానంలో అయితే తాను విజయం సాధించానని హుస్సేన్ చెప్పారో, అధికారిక రికార్డుల ప్రకారం కె.హరికృష్ణ ఆ స్థానాన్ని సాధించినట్లు తేలింది. అయినా సరే హుస్సేన్‌కు పవన్ ఫారమ్–2 ఇచ్చారు.⇒ అక్కల సురేఖ 63 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు తేదీలతో ఉన్న పత్రాలు ఇవ్వగా, పవన్ ఫారమ్–2 జారీ చేశారు.⇒ నొస్సం కరిష్మా 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు నకిలీ తేదీల సర్టిఫికేట్ సమర్పించగా, జూడో సంఘం కార్యదర్శి నుంచి ఫారమ్ 2 సంపాదించారు. ⇒ హస్వంత్ సూర్య నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు రికార్డులతో ఫారమ్–2 సర్టిఫికేట్ పొందారు. ఇలా పలువురు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగాలు పొందారు. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
-
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్
-
నైతిక బాధ్యతతో లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
-
ఏపీలో Gen-Z తుఫాన్ నారా మోసం అంతా ఇంతా కాదు
-
Dsc పరీక్షలో అవకతవకలు జరిగాయి.. స్కామ్ ని పిన్ టూ పిన్ వివరించిన నాగార్జున యాదవ్
-
లోకేశ్.. మీ సంగతేంటి!?
సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.లోకేశ్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్‌ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
లోకేశ్.. మీరు రాజీనామా చేయరా?
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని జెన్ జీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్ పేపర్ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డీఎస్సీ–2025 కుంభకోణం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది.డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్‌మాల్‌పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, బాబు ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించక పోవడంపై ఏపీ జెన్ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీట్ తరహాలోనే డీఎస్సీ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీస్తోంది. సీబీఐ వంటి థర్డ్ పార్టీ దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని నినదిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, నష్టానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏపీ జెన్ జీ పట్టుపడుతోంది. లీక్‌ను కప్పిపుచ్చే యత్నం 16 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహించింది. ప్రశ్నపత్రం రూపకల్పన నుంచే డీఎస్సీ స్కామ్‌కు బీజం వేసినట్టు జరిగిన తతంగం స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రం రూపకల్పన, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షల్లో కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచాడు. టీజీటీ పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడని తెలిస్తే డీఎస్సీ పేపర్ లీక్ బట్టబయలు అవుతుందని ప్రభుత్వమే లీక్‌ను కప్పిపుచ్చే ప్రయత్నానికి పూనుకుంది.నీట్ పేపర్ ఎన్టీఏ ప్యానెల్ సభ్యుల నుంచి లీక్ అయినట్టే ఏపీ డీఎస్సీ ప్రశ్నపత్రం తయారైన దగ్గరే లీక్ అయిందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర విచారణ చేపట్టలేదని, లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో ఎందుకు గుర్తించలేదని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నవీన్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు 1ః1 ప్రాతిపదికన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించాక కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మంది ప్రతిభావంతులకు వెన్నుపోటు పొడిచారు. నియామక ఉత్తర్వుల జారీలోను అర్హులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇలా నష్టపోయిన అభ్యర్థులు పక్కా ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. డీఎస్సీ–2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీచేసిన జీవో నెం.23 బేరసారాల సాక్ష్యాలు బయటపడ్డా గప్‌చుప్ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెగా స్కామ్ ఏపీలో చోటు చేసుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే స్కామ్ పాలసీలో భాగంగా జీవో 4.. 47 ప్రభుత్వం తెచ్చింది. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టులను కట్టబెట్టే దగాకోరు విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలతో సత్తా చాటిన వారిని కాదని చంద్రబాబు బంధువు ఎంపీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి వంటి వారు చైర్మన్లుగా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ పోస్టులు ఇచ్చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో సాక్ష్యాలు బయటపడ్డాయి. జిల్లా, కాలేజ్, విశ్వవిద్యాలయం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా, కేవలం పోటీల్లో పాల్గొన్నారనే సరి్టఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంతా స్కామ్‌గా మారినట్లు కళ్లెదుటే సాక్ష్యాలు, నష్టపోయిన అభ్యర్థులు కనిపిస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.స్పోర్ట్స్ కోటా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టే నీట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను నిందితులు అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వాట్సప్ గ్రూప్‌లు, డిజిటల్ ఆధారాలతోనే సీబీఐ నిందితులను పసిగట్టి జైలుపాలు చేసింది. ఇదే రీతిలో టీచర్ పోస్టుల అమ్మకానికి బేరసారాలాడిన వ్యక్తుల ఫోన్ నెంబర్, ఆడియో రికార్డింగ్‌తో సహా పక్కా ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై నిష్పపక్షపాత విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయట పడుతుందని జీవో 4.. 46 రద్దు చేసి అక్రమాలను ప్రభుత్వమే కప్పి పెట్టేందుకు పూనుకుందని యువత విమర్శిస్తున్నారు. జీవితాలతో చెలగాటంవైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించింది. ఏపీలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కల అయిన డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంది. డీఎస్సీ స్కామ్ గురించి ప్రజల్లో చర్చకు వచి్చనప్పుడల్లా డైవర్షన్ రాజకీయం చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలు, ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక అవాస్తవాలతో అసలు విషయాన్ని దాటవేస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి హామీతో గద్దెనెక్కి స్కామ్‌ల డీఎస్సీతో చంద్రబాబు సర్కారు తమ భవిష్యత్‌తో చెలగాటం ఆడిందని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. -
నీట్ తరహాలో ఏపీ డీఎస్సీలో అక్రమాలు
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువత తిరగబడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థి పోరాటాలు నిరూపించాయని భూమన గుర్తుచేశారు. దేశంలో నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షల్లోనూ అడ్డగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తూ.. డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులను కూడా వదలకుండా విక్రయించారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకుంటూ లోకేష్ రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. తప్పు చేయడం కంటే అవినీతికి పాల్పడటం అత్యంత ప్రమాదకరమని, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. -
ధర్మేంద్ర ప్రధాన్ సంగతి ఓకే.. పేపర్ లీకేష్ లోకేష్ రాజీనామా ఎప్పుడు?
-
ఎన్నో సాక్ష్యాలున్నా డీఎస్సీ స్కామ్‌పై బుకాయింపా?
సాక్షి, అమరావతి: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టెట్, డీఎస్సీ పరీక్ష, అసలు డిగ్రీనే లేకున్నా బరితెగించి టీచర్ పోస్టులు కట్టబెట్టడంపై సాక్షాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నాపత్నం అప్లోడ్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టు సిబ్బందే డీఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవడం.. మొదటి జాబితాలో ఉన్న వారి పేర్లు రెండో జాబితాలో మాయం కావడం.. ఆపై అభ్యర్థి కోర్టుకు వెళ్లడం.. అతని ఐడీని బ్లాక్ చేయడం.. ఒక్కో పోస్టు రూ.15 లక్షలు అంటూ అంగట్లో సరుకులా బేరం పెట్టి అమ్మిన ఆడియోలు బట్టబయలు కావడం.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం.. కేవలం జిల్లా, జోన్ స్థాయి ఆటల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం.. ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇవ్వడం.. ఇలా ఎన్నో సాక్ష్యాధారాలు స్కామ్‌ను బట్టబయలు చేశాయి. ఈ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ చేసిన విన్యాసాలు.. తప్పుమీద తప్పులు చేయడాలు.. అధికారులతో అబద్ధాలు చెప్పించడాలు అందరికీ తెలిసిందే. ఇంత అరాచకంగా, లెక్కలేనితనంతో సాగించిన ఈ స్కామ్.. నీట్ పేపర్ లీక్ కంటే రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. డీఎస్సీ బాధితులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినప్పటికీ బాబు సర్కార్ కనీస బాధ్యత వహించలేదు. తాజాగా నీట్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేసిన క్రమంలో డీఎస్సీ స్కామ్‌కు లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు.జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్యాయం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2025ను బాబు ప్రభుత్వం నిర్వహించింది. 16 వేల పోస్టుల్లో 3 శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వు చేసింది. స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమాలకు పాల్పడి కావాల్సిన వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ కుంభకోణం కోసమే జీవో 4.. 47 తెచ్చారు. తద్వారా టెట్, రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టు కట్టబెట్టే దారుణానికి బరితెగించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ చంద్రబాబు బంధువు.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చైర్మన్‌గా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్మేసుకునే బేరసారాలకు సంబంధించిన వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చాయి. మరోవైపు సాధారణ డీఎస్సీ కింద టీచర్ పోస్టుల భర్తీలోను పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్పోర్ట్స్ డీఎస్సీ కుంభకోణంతో నిజమైన క్రీడాకారులం నష్టపోయామని ఎందరో రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన తనకు టీచర్ ఉద్యోగం రాలేదని పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు దుర్గయ్య వంటి వారెందరో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్లకు ఉద్యోగాలన్నీ ఇచ్చేసుకున్న తర్వాత జీవో 23.. 25.. 56 జారీ చేసి.. అంతకు ముందు ఇచ్చిన జీవో 4.. 47ను రద్దు చేసేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ రూపంలో జరిగిన స్కామ్ రాష్ట్ర ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దుర్గయ్య తరహాలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులెందరో స్పోర్ట్స్ డీఎస్సీలో దగాకు గురయ్యారు. నష్టపోయిన వీరంతా తమకు అన్యాయం జరిగిందని ఎక్కడికక్కడ నిలదీసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస చలనం లేదు. ఐడీ బ్లాక్ చేసి.. వివరాలు తొలగించి..ఈ కుంభకోణం కోసమే పక్కా స్కెచ్‌లో భాగంగా డీఎస్సీ కన్వీనర్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలుతే పక్కన పెట్టేసింది. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించింది. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. డీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నవీన్ విషయం బయటకు వస్తే గుట్టురట్టు అవుతుందని అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పింది. తీరా అతని ఐడీని బ్లాక్ చేసి.. వివరాలు డీఎస్సీ డేటాలోనే లేకుండా ప్రభుత్వం చెరిపేసి కుట్రకు పాల్పడింది. అయితే మెరిట్ సాధించినా తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ కోర్టును ఆశ్రయించడంతో బాబు సర్కార్ కుట్రలు బెడిసికొట్టాయి. ఈ ఘటన అనంతరం డీఎస్సీ పేపర్ లీక్.. నవీన్ ఒక్కడితో ఆగలేదని, సీబీఐ విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. 1:1 నిష్పత్తిలో పిలిచి మొండి చేయిడీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోస్టుల భర్తీకి 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని.. డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధన ఆధారంగా ఒక పోస్టుకు ఒకరి చొప్పున కాల్ లెటర్ పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. ఈ క్రమంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చిన అభ్యర్థుల్లో పలువురికి పోస్టులు దక్కలేదు. సెలక్షన్ లిస్ట్‌లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పించారు. ఇలా డీఎస్సీ ప్రక్రియలో ఆద్యంతం అక్రమాలు, అన్యాయాలు, బరితెగింపులు చోటు చేసుకున్నాయి. జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాలతో బట్టబయలు అయింది. నష్టపోయిన అభ్యర్థులు కళ్లెదుటే కనిపిస్తున్నారు. వారంతా సీబీఐ విచారణ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చాలని, లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయింది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో లోకేశ్ సైతం అదే బాటలో రాజీనామా చేసి, డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహించాలని రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు.వీటినేమంటారు?⇒ స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిఫేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో 270 పోస్టులు ఇచ్చేశారు. ⇒ ఆయా గేమ్స్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటెన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.⇒ వివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వివిధ యూనివర్సిటీల నుంచి పార్టిసిపేట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ⇒ ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షలు అంటూ బేరసారాలు ఆడిన వీడియో బయటపడింది. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం అన్నింటికంటే దారుణం. ⇒ ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్లిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. అందుకే థర్డ్ పార్టీ ఎంక్వైరీ.. అంటే సీబీఐతో విచారణ జరిపించాలి. -
నారా లోకేశ్ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే..: వైఎస్ జగన్
తాడేపల్లి: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్‌లో చంద్రబాబును ప్రశ్నించారు.‘‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2026 -
‘నారా లోకేష్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి’
తాడేపల్లి: నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీనేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీనేతలు మీడియాతో మాట్లాడారు.వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీనేతలు ఏమన్నారంటే..డీఎస్సీ దగాకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలిగుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రినిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతూ డీఎస్సీ నియామకాలను వివాదాలమయం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక తప్పించుకోలేరు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత లోకేష్‌పై లేదా? డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? అభ్యర్థులకు న్యాయం చేసేది ఎవరు? లోకేష్ ఇంకా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? రాష్ట్ర నిరుద్యోగ యువత అడుగుతున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.ఎన్డీఏలో ఒక న్యాయం.. ఏపీలో మరో న్యాయమా?: పేట్ల ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యేనీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డీఎస్సీలో జరిగిన అక్రమాలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా చంద్రబాబు, లోకేష్ స్పందించడం లేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారుబింగి హరికిరణ్‌రెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీఅధికార ప్రతినిధిమెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థుల కలలను ఛిద్రం చేసింది. డీఎస్సీలో జరిగిన అవకతవకలను శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడటం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలి. యువత రోడ్డెక్కే పరిస్థితి రాకముందే నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలిమద్దూరు సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్‌సీపీరాష్ట్ర కార్యదర్శిడీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ సహా తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్‌కు ఏమాత్రం నైతికత ఉన్నా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ వ్యవహారంలోని వాస్తవాలను ప్రజల ముందుంచాలి.కేంద్రంలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా?: బెందాళం పద్మావతి, వైఎస్సార్‌సీపీరాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకల ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనం వీడకపోవడం దారుణం. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత ఆ డేటా తొలగించడం, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ప్రశ్నించినా చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.చంద్రబాబు, లోకేష్ స్పందించకపోవడం దారుణం: తాలే రాజేష్, వైఎస్సార్సీపీరాజాం నియోజకవర్గ సమన్వయకర్తడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు బయటపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణం. నిబంధనల మార్పు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, విద్యాశాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదుచిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యేడీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు, విద్యాశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, నిబంధనలను మార్చి నియామకాలు చేపట్టారన్న అంశాలపై వాస్తవాలను బయటపెట్టాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. -
ధర్మేంద్ర ప్రధాన్ చేసినట్టే.. లోకేష్ కూడా రాజీనామా చేయాలి..!
-
డీఎస్సీలో అక్రమాలు..మెడికల్ కాలేజీల అమ్మకాలు
-
DSC స్కాంపై చంద్రబాబును నిలదీసిన మోదీ..! తండ్రీకొడుకుల మౌనం
-
మెగా డీఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అంతులేని అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సన్నద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న దాదాపు 16వేల టీచర్ల నియామకానికి సంబంధించిన మెగా డీఎస్సీ–2025లో భారీ స్థాయి అక్రమాలపై పార్లమెంట్ ఉభయసభలలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయ సభల్లో వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభలో ఎంపీ ఎం.గురుమూర్తి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. ‘నీట్’ సమస్యంత తీవ్రమైనదే.. ‘మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టాయి. ప్రస్తుతం 22.79 లక్షల మంది ‘నీట్’ అభ్యర్థుల సమస్యపై పార్లమెంటులో చర్చించినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలపైనా చర్చ జరగాలి. అంతేకాదు ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు. ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించిన అంశం. అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పోటీపరీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం, పరీక్ష నిర్వహణను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, తుది ఫలితాలకు సంబంధించి మెరిట్, రోస్టర్ జాబితాలను బహిర్గతం చేయకపోవడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత కూడా జాబితాల నుంచి అభ్యర్థుల పేర్లను తారుమారు చేయడం, స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు చేయడం, రిజర్వేషన్లు పాటించకపోవడం, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తడం, పరీక్షా పనులతో సంబంధం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా మొదటి ర్యాంకు రావడం, దీనిపై విమర్శలు రావడంతో తర్వాత అతని పేరును తుది జాబితా నుంచి తొలగించడం వంటి పలు అవకతవకలు టీచర్ అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. డిజిటల్ «ఆధారాలను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలి, అర్హులైన టీచర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి’అని వాయిదా తీర్మానాల్లో ఎంపీలు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, విశ్వసనీయతను కాపాడేలా సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. వీటన్నింటిపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాల్సి ఉందని ఉద్ఘాటించారు. మామిడి మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి లోక్‌సభ ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి మామిడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశలో కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ అంశాన్ని లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలోకు రూ.25 వరకు ధర పలికిన తోతాపూరి మామిడిని ప్రస్తుతం కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.7 మధ్య మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు నాలుగైదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు సాగు ఖర్చులు కూడా రావట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ, దానికి చట్టబద్ధ హామీ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కూడా ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు కొనుగోలు అవుతోంది. చెల్లింపుల్లోనూ జాప్యమవుతోంది’ అని ఎంపీ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతులను బలోపేతం చేసి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అభ్యరి్థంచారు. -
జీవో 3పై బాబు నాలుక మడత టీచర్ ఉద్యోగాలపై మరో మోసం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో యువతను వంచించిన సీఎం చంద్రబాబు చివరకు అడవి బిడ్డలనూ వదల్లేదు! గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు వంద శాతం గిరిజనులకే కల్పించే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మంగళం పాడేశారు! 2024 ఎన్నికల ముందు అరకు బహిరంగ సభలో చంద్రబాబు.. సాలూరు, పార్వతీపురం, పాలకొండ సభల్లో లోకేశ్ జీవో 3 పునరుద్ధరిస్తామంటూ హామీలిచ్చి మభ్యపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలోనూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. గతేడాది డీఎస్సీ సమయంలో జీవో 3ని పునరుద్ధరించకుంటే తాము తీవ్రంగా నష్టపోతామంటూ గిరిజన యువత రెండు రోజులు ఏజెన్సీ బంద్ నిర్వహించడంతో మరోసారి మభ్యపుచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జీవో పునరుద్ధరణ జరగకపోవడంతో ఏజెన్సీ గ్రామాల్లో నిరుద్యోగ గిరిజన యువత రగిలిపోతోంది. ఇదీ జీవో 3 ప్రస్థానం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులకే (ఎస్టీ) రిజర్వ్ చేసేలా సీనియర్ ఐఏఎస్ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఆర్ శంకరన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని 5(1) అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం 5–11–1986లో జీవో 275 తెచ్చింది. గిరిజనులు విద్య, ఉద్యోగాల ద్వారా ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నది దీని లక్ష్యం. ఆ జీఓపై పలువురు కోర్టుకు వెళ్లడంతో గిరిజన అభ్యర్థులు అందుబాటులోకి వచ్చే వరకు ఆ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనేతరులు ఉండవచ్చని జీవో 275ను సవరిస్తూ 25–4–1988లో జీవో 73 ఇచ్చారు. అయితే షెడ్యూల్డ్ ప్రాంతంలో తమకు అవకాశం ఇవ్వకపోవడంపై గిరిజనేతరులు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న క్రమంలో ఆరి్టకల్ 244 షెడ్యూల్ 5 ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ గ్రామాల్లో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా జీఓ 3ను 10–01–2000లో తెచ్చారు. కానీ టీడీపీ పాలనలోనే ఈ జీవోను సవాలు చేస్తూ గిరిజనేతరుడు లీలా ప్రసాద్ చాబ్రోలు సుప్రీం కోర్టులో 2002లో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యాయ వివాదాలు రేకెత్తగా అత్యధిక కాలం టీడీపీనే అధికారంలో ఉంది. వీటిని పరిష్కరించకుండా టీడీపీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించింది. సుప్రీం తీర్పుతో.. గిరిజనేతరులు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనువుగా ఈ జీవో లేదని రద్దు చేస్తూ 22–4–2020(కరోనా సమయం)లో తీర్పు చెప్పింది. ఇదే తరహా జీవో మళ్లీ తెస్తే 1986 నుంచి గిరిజనులకు ఇచ్చిన ఉద్యోగాలు కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా 3–4–2024న(ఎన్నికల ముందు) డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా తాము జీవో 3ను పునరుద్ధరిస్తామంటూ గిరిజనులను నమ్మించి వంచించారు. ఇదే హామీని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేస్తే చంద్రబాబు దొంగాట ఆడుతున్నారంటూ గిరిజన యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓట్ల కోసం గిరిజనులను మోసం చేస్తారా?: పీడిక రాజన్నదొర, మాజీ ఉపముఖ్యమంత్రి ్డ -
మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధం
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం వైఎస్సార్సీపీ పోరాడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.ఈ క్రమంలో మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబ్సర్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నిరసనలు నిర్వహించనుంది.వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కోటిమంది యూత్ ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.72 వేల కోట్ల బకాయి పడ్డారు. డీఎస్సీలో భారీగా జరిగిన అక్రమాలను సాక్షాలతో బయటపెట్టాం. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. బంగ్లాదేశ్‌లో యువత తిరగపడితే ఏం జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు.‘‘ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలు ఎలా ఉన్నాయో చూడండి. చంద్రబాబు యువత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి. నీట్ తప్పులు, ఫీజు రీయింబ్సర్మెంట్పై పోరాటం చేస్తాం. 28న జిల్లా కేంద్రాల్లో యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తాం’’ అని జక్కంపూడి రాజా తెలిపారు.స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో పారదర్శకత లేదని.. మొదటి ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మెరిట్, రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా వారు డీఎస్సీ పరీక్షలు రావాల్సిన పనిలేదని జీవో ఇచ్చారు. బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?. డీఎస్సీలో అన్నీ అక్రమాలే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. రూ.9 వేల కోట్లపైనే బకాయిలు పడ్డారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పార్లమెంట్‌ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025లో టీచర్ పోస్టులను అక్రమార్కులకు కట్టబెట్టి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందని అర్హత ఉన్నా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ, ఉద్యోగాలు రాని బాధిత అభ్యర్థులు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దివ్యాంగుడు గెరివి అంజినప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉడదల ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.వీరికి ఇతర డీఎస్సీ అభ్యర్థులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. తమకు న్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పేదలకు, అర్హులకు న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు.డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, న్యాయం కోసం నిలబడితే జైళ్లకు పంపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి సోదరుడు, టీడీపీ కార్యకర్త ఉడదల శివ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్.వసంత్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, దివ్యాంగ విభాగం అనంతపురం జిల్లా కార్యదర్శి బోయ రాజేష్ తదితరులు ప్రసంగించారు.నేను ఫేక్ కాదు.. నిరూపిస్తా పది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా. నా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. దివ్యాంగుడినైన నాకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, అధికారులు చాలా అన్యాయం చేశారు. ఐఏఎస్ అధికారులంతా నేను ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపిస్తా. మరి అసలు అర్హతే లేని కురువ శ్రీనివాసులుకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మంత్రి లోకేశ్‌ను కలిసినా న్యాయం జరగలేదు. కొందరు అధికారులు కోర్టులకు కూడా తప్పుడు సమాచారం పంపుతున్నారు. – గెరివి అంజినప్ప, దివ్యాంగుడు, డీఎస్సీ బాధితుడు, సత్యసాయి జిల్లాడీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చినా... నాకు డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చింది. గెరివి అంజినప్పది పీహెచ్ కోటాలో ఉద్యోగం పోయినందువల్ల హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల నా ఉద్యోగం పోయిందని చెప్పారు. కానీ అది బీసీ–ఏ కోటా. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కాదు అధికారుల మోసం వల్లే పోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మా కుటుంబమంతా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాం. మంత్రి లోకేశ్‌ను మూడుసార్లు కలిశాం. భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డిని కలిస్తే నాలుగు రోజులు ఆగండి జాబ్స్ ఇప్పిస్తామన్నారు. మాకు అర్హత ఉందని అందరికీ తెలిసినా, మేము ఫేక్ అని మాట్లాడుతున్నారు. – ఉడదల ప్రభావతి, డీఎస్సీ అభ్యర్థని, గుంతకల్లు -
పట్టుకోండి చూద్దాం!(ఫోటోలు)
-
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మలిచిందని ఆ పార్టీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో రూపొందించిన భారీ కుంభకోణమని.. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినపతిపత్రం అందచేశారు. అందులోని ముఖ్యాంశాలు.. పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతర 16వేల పోస్టుల భర్తీ కోసం జరిపిన డీఎస్సీ పరీక్షలో పారదర్శకతను కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకీ, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వినర్‌కు ఉండేది. అయితే, ఈసారి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే, ప్రశ్నపత్రాల అప్లోడ్ తదితర బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే డీఎస్సీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పేపర్ లీక్‌కు ప్రత్యక్ష నిదర్శనం. అయితే, మెరిట్ జాబితా నుంచి అతని పేరు తొలగించారు. ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం ఇక ఫలితాల ప్రకటనలో కూడా ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు. గతంలో కలెక్టరేట్ నోటీసుబోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆన్‌లైన్‌కు పరిమితం చేయడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు, కటాఫ్ మార్కుల ఆధారంగా ఎంపిక పూర్తయిన తర్వాతే ధృవపత్రాల పరిశీలన జరగాలి. కానీ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కూడా పలువురు అభ్యర్థులను తప్పించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కొత్త జీఓలు జారీచేసింది. మరోవైపు.. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్లు తెలిసినా అసలు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదుచేయకుండా దర్యాప్తును బలహీనపరిచారు. ఈ డీఎస్సీ కుంభకోణం పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కంటే తీవ్రమైనది. అందువల్ల సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. -
డీఎస్సీపై ప్రశ్నిస్తున్నందుకు పర్వతరెడ్డి విద్యాసంస్థలపై దాడులు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలతోపాటు, కల్తీ నెయ్యి ముసుగులో జరుగుతున్న హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ శాసనమండలిలో, ప్రెస్మీట్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రశ్నించే గొంతును నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 16 వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా? ఇదే సంప్రదాయాన్ని రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా?’ అని నిలదీశారు. డీఎస్సీలో ఏ తప్పూ జరగలేదని భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు అప్పిరెడ్డి సవాలు విసిరారు. నేడు నెల్లూరుకు వైఎస్సార్సీపీ నాయకుల బృందం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఈ నెల 22న (సోమవారం) వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయనను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్‌ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్హెచ్ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్‌కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్‌ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్‌కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్‌ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్‌ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్‌ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్‌ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్‌లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్‌లు వేసేవాళ్లు. కానీ లోకేష్‌ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్‌కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్‌ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్‌లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్‌కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..
-
దమ్ముంటే చర్చకు రండి...! లోకేష్ పై డీఎస్సీ విద్యార్థుల ఫైర్!
-
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్‌లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్‌కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్‌కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్‌కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్‌లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్‌పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం
-
DSC పేపర్ లీక్‌కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్‌లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్‌కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్‌కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్‌డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
-
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
-
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్‌లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్‌గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్‌మాల్‌తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్‌జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్‌కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్‌లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్‌లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్‌లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్‌కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్‌లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
పరీక్ష లేకుండానే పోస్టులిచ్చేశాం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ–2025లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ, క్రీడా శాఖల మంత్రులు అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తప్పుకున్నారు. దగా డీఎస్సీపై గత 20 రోజులుగా ఆధారాలతో సహా వస్తున్న వరుస కథనాలపై నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పిన కథలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం సంయుక్తంగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. నిజానికి స్పోర్ట్స్ డీఎస్సీలో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, పోటీల్లో పాల్గొన్న వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం నిర్ణయం మేరకు జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డీఎస్సీ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ ముగిశాక మళ్లీ తన నిర్ణయం మార్చుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని జీవో ఇచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఆ మేరకు తాము పని చేశామని వివరణ ఇచ్చారు. కీలక ఆరోపణలపై సమాధానం దాటవేత కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌లో జిల్లా మొదటి ర్యాంకు, టీజీటీలో ఆరో ర్యాంకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు సమాధానం దాటవేశారు. నవీన్ సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి నవీన్‌కు కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేసింది. కాల్ లెటర్ లేకుండా ఎలా హాజరు కాగలడన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. డీఎస్సీ కన్వీనర్‌ను తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను నియమించడం, ప్రశ్నావళిని రూపొందించే వారికే పగ్గాలు అప్పగించడాన్ని కూడా అధికారులు సమర్థించుకున్నారు. ఈ రెండు విభాగాలు విద్యా శాఖలోనే ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వ పాలసీ మేరకు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చిందని మరోమారు వెల్లడించారు. పరీక్ష లేకుండా పోస్టు.. ప్రభుత్వ పాలసీ స్పోర్ట్స్ డీఎస్సీలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా, అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు ఐదేళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీగా చెప్పడం గమనార్హం. తమిళనాడులో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తున్నారని, స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించడం విస్తుగొలుపుతోంది. మళ్లీ క్రీడా పాలసీ జీవో మార్చి.. ఇకపై పరీక్షలు ఉంటాయని ఎందుకు పెట్టారన్న అంశంపైనా సరైన సమాధానం రాలేదు. అది ప్రభుత్వ పాలసీ అని, తామేమీ చేయలేమన్నారు. అంతా పారదర్శకంగానే చేశామంటూ.. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్ అని చెప్పుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు పరిశీలించిన తర్వాతే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపినప్పుడు.. దానిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అధికారులు చెప్పడం చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే అక్రమాలను దాస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. వాస్తవానికి మెరిట్లో ఉండి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల్లో మొదటి విడత సర్టిఫికెట్ పరిశీలనకు తొలిరోజు హాజరైన వారే అధికంగా ఉన్నారు. వారంతా రిజర్వేషన్ పరిధిలో ఉన్నప్పటికీ, లేరని చెప్పడం విస్తుగొల్పుతోంది. -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్‌కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్‌లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్‌లోడ్‌లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్‌లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్‌ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్‌జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్‌లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టించారు. అయితే, నవీన్‌కి మొదటి ర్యాంక్‌పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్‌లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్‌కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్‌పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు. -
మా సపోర్ట్ వల్లనే గెలిచారు మాట మీద నిలబడకపోతే... బాబు ప్రభుత్వంపై ఉద్యోగులు ఫైర్
-
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్‌తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్‌మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్‌లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్‌బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్‌కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
ఒక్క తప్పు జరగకుండా గర్వాంగా చెప్తున్నా ...
-
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
మెగా డీఎస్సీ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, బాధిత నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్చార్జి ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలపై యూత్, స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జోనల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ, మండల అధ్యక్షులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.సాంబశివారెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే టౌన్‌హాల్ ఇండోర్ సమావేశాల్లో డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు ప్రధాన చర్చాంశంగా ఉండాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
అర్హత ఉన్నా డీఎస్సీలో పోస్టు రాలేదు
విజయనగరం అర్బన్: నిబంధనల ప్రకారం డీఎస్సీ–2025లో దరఖాస్తు చేసుకుని మెరిట్లో నిలిచిన అభ్యర్థులను నట్టేట ముంచేశారని, అదే తప్పుడు సమాచారంతో వ్యవస్థను మోసం చేసేవారికి రెడ్‌కార్పెట్ పరిచి ఉద్యోగం ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పీఈటీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలతో పోస్టుకు దూరమయ్యాయని వాపోయారు. ఆయన ఏమన్నారంటే... ‘‘విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక్క పీఈటీ పోస్టు ఉంది. ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందు వరుసలో ఓ యువతి, నేను ఉన్నాం. వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆ యువతికి పోస్టు దక్కింది. అయితే, ఇక్కడ ఒక పెద్ద అక్రమమే చోటుచేసుకుంది. ఆమెది పాఠశాల రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1992 సెప్టెంబర్ 20. పోటీలకు సరిపోయేందుకు సృష్టించిన తప్పుడు పుట్టిన రోజు 1992 మార్చి 10. పాఠశాల విద్య రికార్డుల్లో ఉన్న అసలు పుట్టిన రోజు ప్రకారం చూస్తే... ఆమె పాల్గొన్న సదరు జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆమెకు అసలు వయస్సే సరిపోదు (అర్హత లేదు). ఆ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా వయసును మార్చుతూ పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆ తప్పుడు పత్రంతోనే రిజ్రస్టేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇప్పుడు అవే పతకాలను చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీలో పీఈటీ కొలువును దక్కించుకున్నారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్... స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌పై స్పష్టమైన ఆధారాలతో సహా డీఎస్సీ నిర్వహణ ఉన్నతాధికారులకు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. దానిపై ఎలాంటి విచారణ చేయలేదు. వేర్వేరు పుట్టిన రోజులతో ఎలా చలామణి అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం ఆ పత్రాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా ఏ స్థాయిలోనూ చేయలేదు. ఆమె తప్పుడు పత్రాలతో పతకాలు కొట్టి, ఆ అర్హతతోనే డీఎస్సీ పోస్టుకు ఎంపికైంది. దీంతో తర్వాత స్థానంలో ఉన్న నాకు పోస్టు దూరమైంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నాకు జరిగిన నష్టమే నిదర్శనం’’ అని నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం» వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ వెల్లడి» డీఎస్సీ– 2025లో ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలి» కృష్ణా జిల్లా టాపర్ నవీన్ ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి» డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదు?» ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి విమర్శలు చేయించడం తగదుసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటి నిర్ణయించింది. అక్రమాలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీలో అక్రమాల కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం కొనసాగించాలని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని నిర్ణయించారు. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్‌గా నిలవడం, అయినా డీఎస్సీలో ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొందరు ఉన్నతాధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డీఎస్సీ– 2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ? » మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి » ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో » అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు » న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు వినతి యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తూనే ఉంది. మెగా డీఎస్సీ–2025లో ఉమెన్స్ కోటాలో అర్హత ఉన్నప్పటికీ ఓ ఎస్టీ మహిళకు పోస్టు దక్కలేదు. ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో తనకు దక్కాల్సిన పోస్టు ఇతరులకు ఏ విధంగా కేటాయించారని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని పాతచెరువు తండాకు చెందిన మూడ క్రాంతి ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు మెయిల్ ద్వారా శనివారం వినతి పత్రం పంపింది. అందులో.. ‘‘నేను డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్) పోస్టుకు ప్రకాశం జిల్లాలో ఎస్టీ (ఉమెన్) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఏపీ మెగా డీఎస్సీ ప్రకారం మహిళల రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రూపంలో అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్)గా ఎస్టీ కేటగిరిలో 5 పోస్టులు కేటాయించినా ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు తగిన విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలైందా? అనే అంశంపై సందేహం ఉంది. నేను ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మెరిట్ జాబితాలో 2వ ర్యాంక్ సాధించినా నాకు ఉద్యోగం రాలేదు’’ అని పేర్కొంది. రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో సరైన విధానం అనుసరించారో లేదో పరిశీలించాలని, ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్) పోస్టులకు పూర్తి రోస్టర్ వివరాలు వెల్లడించాలని, ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలును పరిశీలించి ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారం తనకు న్యాయం చేయాలని క్రాంతి కోరింది. ప్రతి 100 రోస్టర్ సైకిల్లో ఎస్టీలకు మొత్తం 6 రోస్టర్ పాయింట్లు ఉంటాయని, వాటిలో 2 పాయింట్లు ఎస్టీ ఉమెన్‌గా గుర్తించబడ్డాయని క్రాంతి తెలిపారు. జిల్లాలో ఉన్న 92 పోస్టుల్లో 8, 58వ రోస్టర్ పాయింట్ ఎస్టీ ఉమెన్‌కు దక్కాల్సి ఉండగా 58వ పాయింట్(తనకు దక్కాల్సిన పోస్టు) ఓపెన్ కేటగిరీలో చేర్చి ఎస్టీ అభ్యరి్థకి పోస్టు ఇచ్చారని ఆమె తెలిపింది. -
పదే పదే ‘మెగా’ అబద్ధం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తప్పులను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా, ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ‘ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని (1:1 నిష్పత్తి) మాత్రమే’ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా.. అని నిలదీస్తున్నారు.మెరిట్ అభ్యర్థులకు మాత్రమే కాల్‌లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు.. ఎంపిక జాబితా లేదా తిరస్కరణ జాబితాలో ఏదో ఒకదాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ రెండు లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజాంటల్ రిజర్వేషన్ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి రెండు టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి?, అతన్ని ఎందుకు కౌన్సెలింగ్‌కు రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయడం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. వీరందరినీ ఎందుకు పిలిచారు? కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం ఆ అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే.. ఫలితాల్లో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్నవారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. కానీ డీఎస్సీలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్నీ సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్లో లేకుంటే వీరందరినీ ఎందుకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు? పై రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన పుష్పాంజలికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హైమావతికి ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ ఆ ర్యాంకర్ వివరాలు తొలగించి.. డీఎస్సీ ఫలితాలు విడుదలలో భాగంగా తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా డీఎస్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ నిలిచాడు. ఇతను సోషల్ స్టడీస్‌లో మొదటి ర్యాంకు, టీజీటీ (తెలుగు) జోన్–2లో ఆరో ర్యాంకు సాధించాడు. అయితే, తొలుత అతడి వివరాలతో మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని ఆ లిస్టులను రద్దు చేసి, రెండో ర్యాంకు నుంచి రెండో లిస్టు విడుదల చేశారు. ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్ ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించినట్టు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఫలితాల్లో అతడు టాపర్‌గా నిలిచినా పోస్టు ఇవ్వకుండా, అతడి క్యాండిడేట్ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైనా చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.సీబీఐ విచారణ చేయాలిమెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికారులు మాత్రం పారదర్శకంగా జరిగినట్టు వివరణ ఇవ్వడం హాస్యాస్పదమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబేటి రామచంద్ర విమర్శించారు. డీఎస్సీ–2025 చాలా మందికి చివరి అవకాశంగా కష్టపడి చదివి మెరిట్ సాధించారని, అలాంటి వారికి సైతం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీలో జరిగిన దారుణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.హారిజాంటల్‌లో ఒక్కటి.. నింపింది రెండుచిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఎం.ఏకాంబరం (బీసీ–డీ 125 ర్యాంకు) ఘటనను తీసుకుంటే.. ఈ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు బీసీ–డీ కేటగిరిలో 7 ఉన్నాయి. ఇందులో రెండు ఓపెన్‌లోను, 5 పోస్టులు లోకల్ మెరిట్‌కు కేటాయించారు. హారిజాంటల్‌లో ఐదింటిలో ఒకటి ఉమెన్‌కు కేటాయించారు. బీసీ–డీ విభాగం మెరిట్లో చివరి ర్యాంక్ 114 అని ఒకసారి, 116 అని మరోసారి అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే్త 114 ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినప్పటికీ బీసీ–డీలో చూపించారు. 116 ర్యాంకు ఉమెన్, ఈమె మెరిట్ లిస్టులో ఎంపికైంది కాబట్టి ఇక హారిజాంటల్ రిజర్వేషన్లో కేటాయించిన ఒక పోస్టును తర్వాత మెరిట్లో ఉన్న ర్యాంకుకు కేటాయించాలి, అంటే 125 ర్యాంకు అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ, జనరల్ మెరిట్లో ఉన్న ఏకాంబరాన్ని కాదని, రెండు పోస్టులను హారిజాంటల్‌లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఇచ్చారు. వాస్తవానికి బీసీ–డీలో ప్రకటించిన 7 పోస్టుల్లో వీరికి ఒక్క పోస్టు కూడా చూపలేదు. కానీ చట్ట ప్రకారం ఒక్క పోస్టునే ఇవ్వాల్సి ఉన్నా రెండు పోస్టులు ఇవ్వడం గమనార్హం.చట్టాన్ని కాదని ఎస్టీ అభ్యర్థికి అన్యాయంకడప జిల్లాలకు చెందిన ఎం.జగదీష్ నాయక్ విషయంలో ప్రభుత్వం చట్టానికి కొత్త అర్థం చెబుతోంది. ఎస్టీ కేటగిరీకి చెందిన జగదీష్ డీఎస్సీలో 363 ర్యాంకు సాధించారు. జిల్లాలో ఎస్జీటీ ఉర్దూ మీడియం (బ్యాక్లాగ్) 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 జనరల్, మరో 2 ఉమెన్ అభ్యర్థులకు కేటాయించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముగ్గురిని మాత్రమే పిలిచారు. ఇందులో రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరు మేల్, ఇంకొకరు ఫీమేల్‌గా పేర్కొన్నారు. ‘మిగిలిన రెండు పోస్టులను అర్హులైన ఎస్టీ ఉమెన్ అభ్యర్థులు లేక భర్తీ చేయలేదని’ ప్రకటించారు. » గతేడాది కూటమి ప్రభుత్వం మైన్స్ అండ్ జియాలజీ శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టు ఒకటి భర్తీకి (క్యారీఫార్వర్డ్) నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. 1996లో జీఏడీ ఇచ్చిన జీవో 436 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లో అర్హత గల మహిళా అభ్యర్థి లేకపోతే తర్వాత మెరిట్లో ఉన్న పురుష ఎస్టీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీలో అర్హత గల పురుష ఎస్టీ అభ్యర్థి జగదీష్ నాయక్ ఉన్నా, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఓసీ–ఈడబ్లు్యఎస్ పోస్టు బీసీకి ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ ఎస్ఏ బయలాజికల్ సైన్స్ (ఉర్దూ మీడియం)లో 11వ ర్యాంకు సాధించారు. బయోలాజికల్ సైన్స్‌లో 2 పోస్టులు ఉండగా, ఒకటి ఓసీ–ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వ్ చేశారు. ఇతనికంటే ముందున్న మరో అభ్యర్థి 7వ ర్యాంకులో ఉండటంతో పోస్టుకు అతన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి పోస్టుకు ఎంపికైన అభ్యర్థి (బీసీ–ఈ) ముస్లిం. ఇదే కేటగిరీలో 2008, 2012, 2014, 2018 డీఎస్సీలకు హాజరయ్యాడు. 2025లో అతడు ఓసీ–ఈడబ్ల్యూఎస్‌గా నమోదు చేసుకుని తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడు. ఇతనివి తప్పుడు పత్రాలని ఆధారాలతో సయ్యద్ జమీల్ నిరూపించినా అధికారులు పట్టించుకోలేదు. బాధితుడు ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయగా ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్‌తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’ అని ఓ అధికారి మాట్లాడారని వాపోయాడు. -
జగన్ ను కలిసిన DSC అభ్యర్థులే టార్గెట్?
-
అబద్ధాలు నిజమవుతాయా?
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం నిండా మునిగిపోయింది. ‘సాక్షి’లో కథనాల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రం అవుతుండటంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల చేత నోటికొచ్చిన అబద్ధాలు, వక్రభాష్యాలు పలికిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణితో కూడిన అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా శాప్ ఎండీ భరణి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, అవినీతి లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. భరణి చెప్పిన అంశాలు... ఇందుకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే..1 శాప్ ఎండీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ కొన్ని చోట్ల ఏ, బీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలనే ఏపీలో పెట్టాం.వాస్తవం: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ, ఏపీలో 65 క్రీడాంశాల్లో కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనివి ఉంచారు. కుడో, ఈక్వెస్టారియాన్(గుర్రపుస్వారీ)లను తొలగించి వాటి స్థానంలో మెట్రన్ పెంటాథ్లాన్, సెయిలింగ్‌ను తీసుకొచ్చి.. వాటిని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్ను అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ‘ఏ’ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగ్ ఎంత మంది ఆడుతున్నారు? దానిని ‘ఏ’ కేటగిరీలో ఎందుకు పెట్టారు? అన్నది పాలకులకే అర్థం కావాలి.2 శాప్ ఎండీ: అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్‌కు కాకుండా నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉన్నా ఉద్యోగం రాలేదు.వాస్తవం: దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ ను పరిశీలిస్తారు. కానీ, ఏపీలో క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్‌మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరసలోకి వచ్చి నేషనల్ చాంపియన్ షిప్ కిందికి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పతకం రాకున్నా నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్యకు నేషనల్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం.3 శాప్ ఎండీ: సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ వర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికెట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం.వాస్తవం: వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించాడు. దానికి బ్యాకప్‌గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికెట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ/కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు, స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికెట్‌ను ఎలా బ్యాకప్‌గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్‌కు పంపిస్తే వర్సిటీ తరఫున ఆడొచ్చు గానీ, ఆ బ్యాకప్ సర్టిఫికెట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీనిని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండీ చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం.4 శాప్ ఎండీ: స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే, అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం.వాస్తవం: ప్రభుత్వం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్లపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పైగా జెన్యూనిటీ సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెబుతున్న ఎండీ.. సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్‌కు మయాస్లో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూనిటీని ఎలా వాస్తవమని నిర్ధారిస్తారో చెప్పలేదు.5 శాప్ ఎండీ: ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్‌షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేశాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ను చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం: ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్నీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లే. పతకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్స్ గేమ్స్‌కు, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కాలేజీ అడ్మిషన్లలో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఉండేది. -
దగా డీఎస్సీపై మెగా కవరింగ్..
సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్) పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్ (ఓపెన్ లేదా అదే రిజర్వేషన్) అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. అలాగే, ‘కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!డీఎస్సీ మెరిట్ బాధిత అభ్యర్థులను ‘ఫేక్’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారంకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్‌ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్‌లెటర్ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్‌లెటర్ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? » ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్‌లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
‘డీఎస్సీలో అక్రమాలు నిజం’
తాడేపల్లి : ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగింది నిజమేననడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడం డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి నిదర్శమన్నారు. అసలు తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు అన్యాయం జరిగింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాల్ లెటర్స్ 1:1 రేషియోలో పంపాము అంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటి..?, వారి మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ యధాతథంగా అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారిని హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇచ్చాం అంటున్నారు. ఏ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వస్తారో మీకు తెలియదా ?, స్పోర్ట్స్ కోటాలో కొందరికి ఇవ్వటానికి పిలిచిన వాళ్లలో కొంతమందిని బలిచేసినట్లుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడా జరగదు. మీరు చేసింది కరెక్టేనా అనేది పునః సమీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ విధానంలో చేయని విధంగా మీరు చేశారు. మీరు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనిది వాస్తవమా.. కాదా ?, కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. టీచర్, డాక్టర్ పోస్టులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కుదరదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాన్ని వైలెట్ చేయడానికి లేదు. ఆర్డర్స్ తయారు చేసిన వాళ్లు, అమలు చేసిన వాళ్లు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ, టెట్ రాయకుండా.. బీఎడ్, డీఎడ్ చదవకుండా వారికి ఎలా పోస్ట్స్ ఇస్తారు. శాప్ ధృవీకరణ ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులతో మా పార్టీ వారిని తిట్టిస్తున్నారు. అన్యాయం అయినవారి పట్ల సానుభూతి చూపించాలి..పోస్టులు అమ్ముకున్న ఉదంతాలపై విచారణ చేపట్టాలి. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ రాయటం రాని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ కాని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. -
ఫస్ట్ ర్యాంకర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..?
-
‘వేళ్లన్నీ లోకేష్‌వైపే.. రాజీనామా చేయాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేక ఉత్తరకొరియా పాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయటం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అన్ని వేళ్లు విద్యాశాఖ మంత్రివైపు చూస్తున్నాయి. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గానీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి. డీఎస్సీలో స్పోర్ట్స్ కోట పేరిట ఎలా ఉద్యోగాలు ఇస్తారు. నీట్లో జరిగిన అక్రమాలు బయటపడి దేశవ్యాప్తంగా ఎలా కలకలం రేపాయో.. ఏపీలో డీఎస్సీ వ్యవహారం కూడా అదే స్థాయిలో బయటపడుతోంది. చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటుంది. అన్ని వేళ్ళు విద్యాశాఖ మంత్రి వైపే చూపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్‌కు ఆద్యుడు చంద్రబాబే. రష్యాలో లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ చేస్తామంటున్నారు. అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదు. సంపద సృష్టి అని చెప్పిన చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు ఓటేస్తున్నారంటే మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్ర బ్రష్టుపట్టాయని, ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మెగా డీఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట (బ్రిడ్జ్) గేమ్‌ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల యువత భవిష్యత్తులో క్లబ్బుల బాట పట్టే ప్రమాదం ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత దానికి సమాధానం చెప్పకుండా, గత ప్రభుత్వం టీచర్లను వైన్‌షాప్‌ల వద్ద కాపలా పెట్టిందని అబద్ధాలు మాట్లాడారు. దీనికి ఆధారాలు చూపిస్తారా? ఇలా జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? ఇలా అబద్ధాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పండి. నిజానికి మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల వద్ద ఉద్యోగులతో అడ్డదిడ్డమైన పనులు చేయించింది చంద్రబాబు సర్కారే. ఇందుకు సహకరించని ఉద్యోగులను అక్రమ కేసులు పెడతామని బెదిరించిన చరిత్ర కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే’ అని విమర్శించారు. ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు చంద్రబాబు సర్కార్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని కాకర్ల స్పష్టం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తడిగుడ్డతో ఉద్యోగుల గొంతు కోస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వేధింపులకు గురి చేస్తోంది. ప్రభుత్వంలో ఒత్తిడి భరించలేక 100కు పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన మేలు, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశారో బేరీజు వేసుకుంటే ఎవరు ఉద్యోగులకు మేలు చేశారో తెలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఐఆర్, పీఆర్సీ, డీఏలు లేవు. ప్రమోషన్లు లేవు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. పైగా రెగ్యులరైజేషన్ కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఎల్లో మీడియాలోనే వచ్చింది. ఇలా అడ్డగోలు పనులు చేస్తూ వాటిని ప్రశ్నిస్తే నాలాంటి వారిని డిస్మిస్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడైనా.. ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డగోలు పనులకు వినియోగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీడియాకు కాకర్ల చూపించారు. వీటిని హోం మంత్రి అనిత చూడాలని అన్నారు. -
'కోఎంప్ట్'కు కోట్ల ఫలహారం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేశ్ పేషీ అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకూ పాకింది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోఎంప్ట్ సంస్థ నిర్వాకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కోఎంప్ట్ సంస్థతో మంత్రి లోకేశ్ పేషీ సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా రూ.172 కోట్ల చొప్పున రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేశ్ పేషీ సాగించిన అవినీతి నిర్వాకం విస్తుగొలుపుతోంది. డిజిటల్ మూల్యాంకనం ముసుగులో దోపిడీ హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ దోపిడీకి తెగబడింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి.. కోఎంప్ట్ సంస్థకు టెండరు కట్టబెట్టేయడం విస్మయ పరుస్తోంది. నిధుల దోపిడీకి కోఎంప్ట్ ఎడ్యూటెక్ మూడు కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేశ్ పేషీ ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక్కో విద్యార్థి పరీక్షా పత్రం మూల్యాంకనం కోసం రూ.32, ఒక్కో పరీక్షా పత్రం ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం రూ.25.75 చొప్పున కోట్ చేసింది. మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం రూ.115 చొప్పున కోట్ చేయడం గమనార్హం. అంతేకాదు కోఎంప్ట్ ఎడ్యూటెక్కు కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూల ధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోఎంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపాదనలను లోకేశ్ పేషీ ఆమోదించి ఆ మేరకు కోంఎప్్టతో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చజెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఒత్తిడి వస్తుండంతో తమకు మరోమార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏటా రూ.172 కోట్ల ప్రాజెక్టుకు ఎత్తుగడ విశ్వవిద్యాలయాల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ముసుగులో కోఎంప్ట్ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు కలిపి 1.50 కోట్ల బుక్లెట్లు (పరీక్షా పత్రాలు) రాస్తారు. ఒక్కో బుక్‌లెట్‌కు రూ.115 చొప్పున ఏడాదికి మొత్తం రూ.172 కోట్ల కాంట్రాక్టును కోఎంప్ట్ కు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు లోకేశ్ పేషీ మంత్రాంగం వేగవంతం చేసింది. ఆ ప్రకారం రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ముసుగులో కమీషన్ల రూపంలో భారీ అవినీతికి పన్నాగం పన్నింది. వాస్తవానికి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలు పెట్టింది. ఇంతలో సీబీఎస్ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కోఎంప్ట్ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిలుపుదల చేసింది. కోఎంప్ట్ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనం చేట్టింది. సీబీఎస్ఈ వ్యవహారంతో ప్రస్తుతం నిలిపివేసింది. అయినా సరే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిజిటల్ మూల్యాంకనం కోసం కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేశ్ పేషీ తీవ్ర ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు టైమ్ లిమిట్ పెట్టి మరీ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణాలో 20 మంది ఆత్మహత్య కోఎంప్ట్ నిర్వాకం గతంలో తెలంగాణను హడలెత్తించింది. 2019లో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుంది. అడ్డగోలుగా మూల్యాంకనం చేసింది. మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది అంటే 40 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఆ సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా మార్చుకోవడం గమనార్హం.అప్పట్లోనే వెనకేసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం 2013లో అదే గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ జేఎన్టీయూలో రూ.230 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌గా అప్పటి జేఎన్టీయూ ఉన్నతాధికారులు కాంట్రాక్టు కట్టబెట్టారు. గ్లోబెరేనా టె క్నాలజీస్ ఇ–కంటెంట్ కోసం మలేషియాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్టు కింద జేఎన్టీయూ గ్లోబెరేనా టెక్నాలజీస్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. అడ్డగోలుగా టెండరు కట్టబెట్టడం, నిబంధనలకు విర్దుద్ధంగా నిధుల చెల్లింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం విచారణ కమిటీ పేరుతో కనికట్టు చేసింది. కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి అవినీతిని నిగ్గు తేల్చింది. బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. దీనిపై గ్లోబెరేనా టెక్నాలజీస్.. కాంట్రాక్టు మేరకు రూ.230 కోట్లు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.పేరుమార్చుకుని ఏమార్చిన కోఎంప్ట్ సీబీఎస్ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం, డిజిటలైజేషన్ ప్రక్రియలో అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ బాగోతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఆ సంస్థను బ్లాక్లిస్టు్టలో పెట్టారు. కానీ అదే సంస్థ కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా పేరుమార్చుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే మస్కా కొట్టింది. పరీక్షా పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ ఈ ఏడాది ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్ఎం) విధానం చేపట్టింది. ఆ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ సంస్థ దక్కించుకుంది.సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల వెల్లడితో ఆ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్షా పత్రాలను పబ్లిక్ క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్) బకెట్లలో భద్రపరచడం పట్ల సైబర్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లీకేజీ బయట పడింది. ఇక పరీక్షా పత్రాలు కంప్యూటర్ స్క్రీన్ మీద సరిగా కనిపించక పోవడం, విద్యార్థులు రాసిన జవాబులకు.. వచ్చిన మార్కులకు పొంతన లేకపోవడం, విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వేయడం తదితర లోపాలు వెల్లడయ్యాయి. అంతేకాదు కోఎంప్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యవహారాన్ని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పరిశోధించి మరీ వెలుగులోకి తెచ్చారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదనే నిబంధనను కోఎంప్్టకు అనుకూలంగా మార్చారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకే అర్హత లేదని మార్చడం గమనార్హం. కోఎంప్ట్ కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరించారు. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని మరుగున పరిచేందుకే కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా పేరుమార్చుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్, కోఎంప్ట్ నిర్వాకంపై యావత్ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శిని పదవుల నుంచి తొలగించింది. -
కాపీ కొట్టి దొరికిపోయిన ‘శాప్’ చైర్మన్?
సాక్షి, అమరావతి: పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన వ్యక్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్‌గా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఇది నిజమంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు. వారు చెబుతున్న దానికి సాక్ష్యంగా టీడీపీకి నిత్యం బాకా ఊదే ఈనాడులో అప్పట్లో ప్రచురితమైన వార్తా కథనాలను సాక్ష్యంగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో తిరుపతిలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో భాగంగా జరిగిన మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రవేశ పరీక్షకు ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు) హాజరయ్యారు.ఆ సమయంలో ఆయన పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్టు ఈనాడు సహా అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాల ప్రకారం.. పరీక్ష చివరి దశలో విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా హాల్లోకి వెళ్లి ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రవినాయుడు కాపీ కొడుతూ పట్టుబడ్డారని వార్తలు వెలువడ్డాయి. క్రీడాకారుల భవిష్యత్‌కు సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి వెనుక ఇలాంటి గతం ఉండటం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడేమంటారో!! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అవన్నీ నిరాధార ఆరోపణలని, బాధితులు కూడా లేరని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని శాప్ చైర్మన్ ప్రగల్బాలు పలికారు. ఆయన సవాల్‌కు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గట్టి సమాధానం ఇస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ సమయంలో బంగారు పతకం సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా కాంస్య పతకం, పార్టిసిపేషన్ సరి్టఫికెట్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారంటూ ఆధారాలతో సహా చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలను రవికుమార్ సవాల్‌కు చెంపపెట్టుగా నెటిజన్లు చూపిస్తున్నారు. -
స్పెషల్ కమిషన్ వేస్తా.. మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేస్తా..! DSC అభ్యర్థులకు జగన్ హామీ
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
లోకేష్ గుట్టురట్టు.. పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు.. మెగా DSCలో లీకులు
-
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్‌తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్‌కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ను కలవడానికి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్‌బెల్ట్ ఛాంపియన్‌ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్‌లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్‌కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్‌లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్‌లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్‌కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్‌లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్‌లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్‌లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్‌లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్‌లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్‌లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్‌బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్‌లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్‌కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
సెలక్షన్.. అంతా కలెక్షన్!
డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో సాఫ్ట్‌బాల్ విభాగంలో 38 పోస్టులు భర్తీ చేశారు. వీటిల్లో అత్యధికంగా 18 పోస్టుల వరకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు ఇచ్చేశారు. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్తో ఆరు మందికి పోస్టులు దక్కాయి. మిగిలినవి సౌత్ జోన్ చాంపియన్ షిప్, సీనియర్ నేషనల్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్‌కు కట్టబెట్టేశారు. ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ 38 మంది క్రీడా సర్టిఫికెట్లలో ఆరింటికి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయి. మిగిలిన వాటికి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జెన్యూనిటీ నిర్ధారించాయి. జెన్యూనిటీని నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో కచ్చితంగా గుర్తింపు ఉండాలి. కానీ, కొన్నేళ్లుగా ఎస్ఏఐకు మయాస్లో గానీ, ఐఓఏలో గానీ గుర్తింపు లేదు. ఎస్ఏఐపై దేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ, ఎస్ఏఐ తమకు తాము ఐఓఏ గుర్తించినట్టు ప్రకటించుకోడంపై ఐఓఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకే గుర్తింపు లేనప్పుడు రాష్ట్రంలోని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు ఎలా గుర్తింపు వచ్చింది? సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లు ఇచ్చిన జెన్యూనిటీని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఎలా అంగీకరిస్తుంది? ఇందులో దొంగ సర్టిఫికెట్లు లేవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అనంతపురంలో 2021-22లో సాఫ్ట్‌బాల్ నేషనల్స్ స్పోర్ట్స్ మీట్లో ఆడకుండానే సర్టిఫికెట్టు తెచ్చుకుని, న్యాయస్థానంలో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఇప్పటికీ కేసులు నడవట్లేదా? ఇందులో శాప్ అధికారులు 2024 సెప్టెంబర్‌లో ముందుగా సర్టిఫికెట్‌ను ధ్రువీకరించి.. ఆ తర్వాత కాదని కోర్టుకు చెప్పలేదా? అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఇందులో పారదర్శకత ఎక్కడుంది? టీడీపీ ఎమ్మెల్యే ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటమే అన్నింటికంటే పెద్ద అర్హతా?జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మందికి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ మీట్ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారు రాష్ట్రం దాటి వెళ్లలేదు. మరో 16 మందికి ఆలిండియా ఇంటర్ వర్సిటీ, స్టేట్ మీట్లో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు ఏకంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు లేరా? అత్యంత దారుణంగా జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారికి పతకం రాకపోయినా పాల్గొంటే చాలని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జిల్లా స్థాయిలో ఆడటమేనా క్రీడా మెరిట్? పైగా 2018 నవంబర్‌లో నిర్వహించిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో చాంపియన్ షిప్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు.. తాజాగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు పొంతనే లేదు. ఒరిజినల్ రిజల్ట్ లిస్టులోని వ్యక్తుల స్థానంలో కొత్తవారు వచ్చి ఉద్యోగాలు పొందారు.సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్ లిస్టు మరింత బలపరుస్తోంది. డీఎస్సీ నియామకాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును రెండు రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పతకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ‘మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా’(ఎంఎస్క్యూ)కు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది.విచిత్రంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. పదికిపైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే.. ఇందులో కేవలం నాలుగు క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో గుర్తింపు లేని సంఘాలు, కోర్టు కేసుల్లో ఉన్న సంఘాల నుంచి క్రీడా సర్టిఫికెట్ల జెన్యూనిటీ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గపు విధానాలను అవలంభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మెరిట్‌కు అర్థం మార్చేసిన ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా, ఏపీ క్రీడా కోటా డీఎస్సీలో మాత్రం 90 శాతం పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. ఒలింపిక్ మొదలకొని ఏషియన్ గేమ్స్, వరల్డ్‌కప్ (4ఏళ్లు), కామన్ వెల్త్, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్‌షిప్, ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్/యూత్ గేమ్స్/ఆలిండియా ఇంటర్ వర్సిటీ చాంపియన్ షిప్, సౌత్ జోన్ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ వర్సిటీ చాంపియన్‌షిప్, స్టేట్ చాంపియన్ షిప్‌ల ద్వారా వరుస క్రమంలో పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. వీటిల్లో పతకాలతో పాటు పార్టిసిపేషన్ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇలా 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ చాంపియన్ షిప్లో అత్యధికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్ చాంపియన్ షిప్‌లకు ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడ నేషనల్ గేమ్స్‌ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు? అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 65 క్రీడాంశాలను ఎందుకు విభజించారు?కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రంలో 65 క్రీడాంశాలను రెండుగా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. 65లో రెండు, మూడు క్రీడలను మార్చి.. ‘మాస్టర్ మైండ్’ (శాప్‌లో పెద్ద తలకాయ తనకు తానుగా పెట్టుకున్న పేరు) సొంతంగా క్రీడలను చేర్చారు. ఇలా ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ–కేటగిరీలో స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇవ్వగా.. బీ–కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాత పరీక్షకు కూడా హాజరు కాని వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత తీరిగ్గా జీవోను సవరించారు. క్రీడా కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లో పోస్టు పొందాలంటే కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్ష రాయాలని పేర్కొనడం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. చిత్తురు జిల్లా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లతో భారీ అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.క్రీడా ట్రయల్స్ ఎందుకు పెట్టలేదు?కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు క్రీడా కోటాలో ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో కచ్చితంగా క్రీడా ట్రయల్స్ నిర్వహిస్తాయి. అందులో ప్రతిభను చూసి పోస్టులకు ఎంపిక చేస్తాయి. కానీ, డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఎక్కడా రాత పరీక్ష లేకపోగా, కనీసం క్రీడా ట్రయల్స్‌ను నిర్వహించక పోవడం గమనార్హం. తాజాగా హైకోర్టు సైతం డీఎస్సీకి సంబంధించిన కేసులో సర్టిఫికెట్ నిర్ధారణకు సాఫ్ట్‌బాల్‌లో ట్రయల్స్ పెట్టమని ఆదేశించింది. 20– 24 ఏళ్ల కిందటి క్రీడా సర్టిఫికెట్లతో..అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆలిండియా ఇంటర్ వర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాల్ బ్యాడ్మింటన్‌లో 48 పోస్టులు భర్తీ చేస్తే 34 పైగా, ఖోఖో 49కి గాను 24కుపైగా, హ్యాండ్‌బాల్ 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకుపైగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఇచ్చేశారు. ఫొటోలు, మెడల్స్‌ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.సారూ.. వీటినేమంటారు?» అనంతపురంలో వాలీబాల్/బీచ్ వాలీబాల్‌లో ఓ క్రీడాకారుడికి ఎస్ఏ హిందీ పోస్టు వచ్చింది. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్ జోన్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగం దక్కింది.» చిత్తూరు జిల్లాలో హ్యాండ్ బాల్ కోటాలో ఓ మహిళకు ఎస్ఏృజీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆమె 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ (2021 మార్చి 5-7)లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ (2021 మార్చి17-21)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందింది. ఇక్కడ 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్‌కి.. అదే ఏడాది 49వ సీనియర్ ఉమెన్ నేషనల్ మీట్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తోంది.» పశ్చిమగోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఓ మహిళకు ఎస్ఏృఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చింది. ఆమె 2022 డిసెంబర్ 13-22 మధ్య హైదరాబాద్‌లో జరిగిన 32వ నేషనల్ గేమ్స్‌లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికెట్ చూపించారు. దీనికి తోడు 2001లో డిసెంబర్ 19-23 మధ్య పుణెలో 37వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్ షిప్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందుపరిచారు. వాస్తవానికి 2022 సెప్టెంబర్‌లోనే గుజరాత్లో 36వ నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ లెక్కన ఏది నిజం? సదరు క్రీడాకారిణి జెన్యూనిటీ పరిశీలించారా? » చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్ విభాగంలో ఓ మహిళకు ఎస్ఏృఇంగ్లిష్ పోస్టు వచ్చింది. సదరు క్రీడాకారిణికి ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ (2008-09)లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చారు. 2008-09లో తిరుచ్చిలో ఇంటర్ వర్సిటీ సౌత్ జోన్ టోర్నీలో బాల్ బాడ్మింటన్‌లో పాల్గొన్నట్టు బ్యాకప్ సర్టిఫికెట్ చూపించారు. అసలు బ్యాడ్మింటన్‌లో బ్యాకప్ సర్టిఫికెట్ చూపించాలి కదా?» చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమె 2019-20లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారు. ఇక్కడ అండర్ ఏజ్, సీనియర్ చాంపియన్ షిప్‌లలో పాల్గొనకుండానే ఉద్యోగం వచ్చేసింది.» తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమెకు 2006 అక్టోబర్‌లో 7వ సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్(విశాఖ)లో 2వ స్థానం దక్కింది. అంతకు ముందు ఆమె గెలిచిన ఒక్క పతకానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపరచలేదు. జూనియర్ స్థాయిలో ఆడకుండానే సీనియర్ చాంపియన్ షిప్‌కు వెళ్లిపోయారా? -
మెగా డీఎస్సీ ఒక ‘మెగా స్కామ్’: సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్‌లో కానీ, రిజెక్షన్ లిస్ట్‌లో కానీ లేకుండా మాయం చేశారు.స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్‌కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర: ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.సూపర్ సిక్స్ మోసం:ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.విద్యార్థులపై నిర్లక్ష్యం:జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.బెల్ట్ షాపుల విజృంభణ:బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్‌కు తెరలేపారు.రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలుచంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్‌కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు."కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
-
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!
-
మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది.. జగన్ భరోసా
-
డీఎస్సీ అభ్యర్థులతో వైఎస్ జగన్, కంటతడి పెట్టుకున్న మహిళా
-
డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వ డీఎస్సీ స్కాంకు బలైన డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ తమను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించారు. తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై వైఎస్ జగన్ స్పందించారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తాం. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా నిలుస్తాం. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తోడుగా ఉంటాం. పార్టీకి చెందిన లీగల్ విభాగం ఈ పోరాటంలో మీకు సహాయపడుతుంది. ఆ లీగల్ ఖర్చులను మేమే భరిస్తాం.డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న కేసులన్నింటి మీద రీ ఎంక్వైరీ చేయిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ ఎంక్వైరీ చేయిస్తాం. ఈ ప్రత్యేక కేసులమీదే కమిషన్కూడా వేయిస్తాం. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తామని జీవో ఇచ్చారు.ఉద్యోగాలు పూర్తిచేశాక, మళ్లీ ఆ జీవోను మార్పు చేసి మళ్లీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఎవరికోసం మొదట జీవో తీసుకొచ్చారు. ఎవరికి మేలు చేయడానికి తీసుకొచ్చారు. చంద్రబాబు తన వాళ్లకోసం గేట్లు తెరిచారు. వాళ్ల పని అయిపోయిన తర్వాత మళ్లీ జీవోను ఉప సంహరించుకున్నారని చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు.. వైఎస్ జగన్‌కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు. -
డీఎస్సీలో కప్పిపుచ్చుకునే ‘గేమ్స్’
సాక్షి, అమరావతి: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో అర్ధరాత్రి వేళ శాప్‌లో హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు (సెక్షన్ ఆఫీసర్లు) మురుసటి రోజు మంగళవారం ఉదయం 7 గంటల తర్వాతే ఇళ్లకు వెళ్లారు. శాప్ ఉన్నతాధికారి సైతం సోమవారం అర్ధరాత్రి 3 గంటల తర్వాత కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లగా.. తిరిగి ఉదయం 7 గంటలకే కార్యాలయానికి తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగులకు షిప్టులు వేసి మరీ కార్యాలయం పని వేళల కంటే ముందుగా రప్పించి.. అర్ధరాత్రి వరకు పని చేయించడం గమనార్హం. తాము చెప్పిన సమయానికి రాకపోతే.. చెప్పిన పని చేయకపోతే సస్పెషన్ వేటు వేయడంతోపాటు బదిలీ చేస్తామని సాక్షాత్తూ శాప్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం రాత్రి వరకూ ఇదే తంతు నడిచింది. డీఎస్సీ ముగిసి 8 నెలల దాటిన తర్వాత ఇప్పుడు శాప్‌లో కూర్చుని డేటాను తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.జాబితా ఎందుకు మారింది?రాత్రంతా క్రీడా కోటా డీఎస్సీలో అభ్యర్థుల డేటాపై మల్లగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫోన్లు సైతం సదరు అధికారి వద్దనే పెట్టుకుని పని చేయించడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో రాత పరీక్ష లేకుండా పోస్టులు పొందిన 382 మంది జాబితాను మంగళవారం ఉదయానికి ఓ ప్రత్యేక లింక్ ద్వారా విడుదల చేశారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ లింక్‌లోని డేటాలో మార్పులు కనిపించాయి. 382 మంది సెలక్షన్ లిస్టులో తొలుత ట్రయథ్లాన్‌లో ముగ్గురు క్రీడాకారులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు చూపించారు. ఇందులో జరుబుల రాము అనే వ్యక్తి పేరును సవరించిన జాబితా నుంచి తొలగించారు. అతనికి ఉద్యోగం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు తొలగించారు? ఉద్యోగం రాకపోతే ఎందుకు జాబితాలోకి పేరు చేరింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విచిత్రం ఏమంటే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో స్కూల్ అసిస్టెంట్ పీఈటీగా పని చేస్తున్న వ్యక్తి పేరు ముందుగా అప్లోడ్ చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం. సదరు క్రీడాకారిణి ఏషియన్ ఉమెన్ చాంపియన్ షిప్లో పతకం సాధించారు. నియామక సమయంలో తొలుత ఆమెకు పోస్టు ఇవ్వడానికి నిరాకరిస్తే ఏకంగా హైకోర్టులో కేసు వేసి ఆధారాలతో సహా సమర్పించగా కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం దక్కని అర్హులైన ఎందరో క్రీడాకారులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ, 382 మంది జాబితా చూస్తే క్రీడల్లో పతకాలు సాధించిన వారి కంటే పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ చాంపియన్ షిప్లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే పోస్టులు రావడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పాదర్శకంగా చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో అర్ధరాత్రి హడావుడి పడుతూ డేటాను మార్చాల్సిన అవసరం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పబ్లిక్ డొమైన్లో జాబితాలు పెట్టకుండా ఇప్పుడు ఉరుకుల పరుగులపై విడుదల చేయడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఎంపిక జాబితా ఇచ్చారే తప్ప 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన 2వేల మంది క్రీడాకారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఉద్యోగాలు దక్కని అర్హులైన క్రీడాకారులు నిలదీస్తున్నారు. -
'తొలి సంతకం' మోసం గురూ!
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025.. అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు నయ వంచనకు పాల్పడిందని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు పాతరేసి నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడుతున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా.. వారిచ్చిందే ర్యాంకు, చెప్పిన వారికే ఉద్యోగం అన్న చందంగా డీఎస్సీని మార్చేశారని అర్హులు ఆవేదన చెందుతున్నారు. జీవో నం.77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరిగా అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతుండటాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి పాలకులే ఈ జీవో అమలును తుంగలో తొక్కేశారని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఓపెన్ మెరిట్లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని పేర్కొంటున్నారు. నిరుద్యోగులను దగా చేసి డీఎస్సీపై న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టించడంపై విస్తుపోతున్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తప్పుడు ప్రచారాలకు వంత పాడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లు మార్చేశారని, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.కటాఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు? మెగా డీఎస్సీ–2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించారు. జిల్లా ఎంపిక కమిటీలను నీరుగార్చి ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నా పలు దఫాలు ‘టెట్’ మార్కులు ‘ఎడిట్’ చేశారు. డీఎస్సీలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారు. దీంతో మొదట మెరిట్లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి. చివరిగా ఇచ్చిన మెరిట్ లిస్టుల్లోనూ ఓపెన్ ‘కటాఫ్’, సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కటాఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్‌ను సైతం విడుదల చేయాలి. తర్వాత ‘లోకల్ మెరిట్’ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కటాఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నం.77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధానం అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఒక్క అభ్యర్థికి కూడా అర్థం కాకుండా చేశారు. రిజర్వేషన్ వర్తింపులోనూ అన్యాయమే..!డీఎస్సీలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లనూ దారి తప్పించారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వుడు కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వంద శాతం పోస్టుల్లో కచ్చితంగా 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33 శాతం కంటే మహిళలు తగ్గితే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారిస్థానంలో మెరిట్లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి. ఒకవేళ మహిళా అభ్యర్థులు 33 శాతానికి మించి ఉంటే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ వర్తించదు. హారిజాంటల్ రిజర్వేషన్లో ఒకటి ఉమెన్, రెండోది స్పెషల్ రిజర్వేషన్. స్పెషల్ రిజర్వేషన్లో డిసేబుల్ (4 శాతం), మెరిట్ స్పోర్ట్స్ (3), ఎక్స్ సర్వీస్‌మెన్ (2) శాతం ఎంపిక చేయాలి. వీరిని సామాజిక రిజర్వేషన్లో లోకల్ పోస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా సామాజిక కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో చివరిలో ఉన్న అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులను చేర్చాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అభ్యర్థి మెరిట్లో ఉంటే.. మరో స్పెషల్ కేటగిరీ (హారిజాంటల్) అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే అభ్యర్థులకు 1 : 1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపాలి. ఓపెన్ మెరిట్, రిజర్వేషన్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ల వర్తింపు పూర్తి చేశాక మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న వారికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలన పూర్తిచేసి ఉద్యోగం ఇవ్వాలి. అత్యంత అరుదుగా మాత్రమే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. సర్టిఫికెట్లలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువునివ్వాలి. కానీ ఈ డీఎస్సీలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లో ప్రక్రియను ముగించారు. 1,500 మంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం!సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల మేరకు, నిబంధనల ప్రకారం.. ‘కటాఫ్’కు పైన ఉన్న అభ్యర్థులను తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయాలి. వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చేందుకు ఆస్కారం లేదు. కానీ డీఎస్సీ – 2025లో ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్టునే తీసుకుంటే.. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన వారిని వివిధ సామాజిక రిజర్వేషన్లోని లోకల్ పోస్టుల్లో (80 శాతం) నింపారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్లో ఉన్నా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉన్నట్టు అంచనా! విజయనగరం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో ఈ అక్రమాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయి. 88వ ర్యాంకు నుంచి 101వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులను ‘ఓపెన్ కేటగిరీ’ లోకల్లో ఎంపిక చేస్తే.. 87వ ర్యాంకు అభ్యర్థిని ‘బీసీ–ఏ’ లోకల్ పోస్టులో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ రిజర్వు కేటగిరీ అభ్యర్థి పోస్టు కోల్పోయారు. ఈ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు బీసీ–ఏ లోకల్లో 15 ప్రకటించారు. ఈ పోస్టుల్లో హారిజాంటల్ స్పెషల్ రిజర్వేషన్‌కు ఒక్క పోస్టు కేటాయించారు. మిగిలిన 14 బీసీ– ఏలోని మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలి. ఇదే తరహాలో అన్ని సామాజిక కేటగిరీలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం ఎక్కడా పాటించలేదని అభ్యర్థులు, గతంలో డీఎస్సీ నిర్వహణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఎస్జీటీ కేటగిరీలో నలుగురు రిజర్వుడు అభ్యర్థులు నష్టపోయారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను రిజర్వుడు పోస్టులో భర్తీ చేయరాదని 2007లో సుప్రీంకోర్టు రాజేశ్‌కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో తీర్పు ఇచ్చింది. అలాగే 2025 డిసెంబర్లో రజత్‌యాదవ్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన తీర్పు వెల్లడించింది. కానీ వీటిని తుంగలో తొక్కి డీఎస్సీ–2025లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
-
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్‌కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్‌ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
‘యువగళం’ బ్యాచ్‌కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్‌లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్‌లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్‌కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్‌గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్‌గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్‌గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్‌ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్‌లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్‌లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్‌మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్‌కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్‌ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్‌కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్‌మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్‌కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్‌మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్‌తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్‌లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్‌పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్‌పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్‌లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్‌లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..
-
ఇదే నాకు లాస్ట్ ఛాన్స్.... లోకేష్ వల్ల నా జీవితం నాశనం అయింది
-
‘హెరిటేజ్ పాలు అమ్మినట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్మకం’
విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్‌లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్‌ను ఏ-1గా అరెస్ట్ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్‌కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే..డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్‌ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు. -
లోకేష్ వస్తే యువత బతుకులు మారతాయి అంటే ఏంట్లో అనుకున్న ఈ రేంజ్ లో మారుస్తావ్ అనుకోలేదు నాయన
-
DSCలో దగా.. లోకేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయండి
-
YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్సార్సీపీ నిరసన
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ:కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీవిద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలుజరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలునెల్లూరు:మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిమెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిబాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజామెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీలక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారులక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారునిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలిపవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలిడీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజుఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలిలోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారుప.గో జిల్లా:కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులుమహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులుఅనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలురాజమండ్రి:స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసనవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.తూర్పుగోదావరి జిల్లా...రాజమండ్రిలో భారీ ర్యాలీబొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీవేణు గోపాలకృష్ణ కామెంట్స్..ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.పోస్టులను అమ్ముకున్నారుడీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలిస్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారుడీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలిగుంటూరు..వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందిఅనేక అవకతవకలు జరిగాయి.డీఎస్సీలో భారీ అవినీతి జరిగిందినిరుద్యోగులకు న్యాయం చేయాలిడీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.లోకేష్‌కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలిదగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.లోకేష్ రాజీనామా చేయాలిమిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలిఅక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.కృష్ణా జిల్లా..డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టుజిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులుపేర్ని కిట్టు కామెంట్స్..సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడుడబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోందిడీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారుముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చుస్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారురాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడంనీపేరు లోకేష్ కాదు లో క్యాష్డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదునిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాంవిశాఖ..జక్కంపూడి రాజా కామెంట్స్..డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్‌కు వినిపించలేదా?.డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.హెరిటేజ్‌లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారులోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.అనంతపురం..డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటవైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిభారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహంతిరుపతి..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనతిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడిపార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనపద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహంసీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు, -
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!
-
జీవో ఒకలా.. అమలు ఇంకోలా!
సాక్షి, అమరావతి: హారిజాంటల్ రిజర్వేషన్ అమలు ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకుంటూ మెగా డీఎస్సీ–2025పై ఆరోపణలు చేస్తున్నారని పాఠశాల విద్యా శాఖ బుకాయిస్తోంది. డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు అవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదోలా ఈ స్కామ్ నుంచి బయట పడాలని విద్యా శాఖ ద్వారా పొంతనలేని రీతిలో సమాధానాలిప్పిస్తోంది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తప్పు జరగలేదంటూనే పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షి దినపత్రికలో ‘తప్పుపై తప్పు.. స్పోర్ట్సు డీఎస్సీపై మాకు తెలియదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వివరణ ఇస్తూ విద్యా శాఖ డైరెక్టర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు జారీ చేసినప్పటికీ, వెరిఫికేషన్‌కు హాజరైన పలువురు అభ్యర్థులకు తుది ఎంపిక జాబితాలో చోటు దక్కలేదన్న ఆరోపణ సరికాదు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చింది.అర్హత, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించే ఉద్దేశంతో, నోటిఫై చేసిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఆయా వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ వర్గాల పరిధిలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లు జారీ చేశాం. ఆ తర్వాత తుది ఎంపిక జాబితాలను సిద్ధం చేసే సమయంలో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌కు వర్తించే హారిజాంటల్ రిజర్వేషన్ సర్దుబాట్లను జీవో ఎంఎస్ నం.77 ప్రకారం వర్తింపజేశాం. ఇది అర్థం చేసుకోలేక సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన వారిలో కొందరు తమకు ఉద్యోగాలు రాలేదంటున్నారు’ అని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తి అంటే అర్థమేంటి మరి?జీవో77 ప్రకారం 1:1 జాబితా ఎప్పుడు తయారవుతుందంటే హారిజాంటల్ రిజర్వేషన్లను (మహిళలు, వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు) మొదట మార్కుల మెరిట్ ఆధారంగా ఓసీ, తర్వాత సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్) వారీగా జాబితాలను సిద్ధం చేయాలి. ఆ తర్వాతే మహిళలు, ఇతర హారిజాంటల్ కోటాలో లోటును తనిఖీ చేసి, అవసరమైతే జాబితా చివరన ఉన్న అభ్యర్థులను తొలగించి, నిర్దేశిత ప్రత్యేక వర్గాల అభ్యర్థులను చేర్చి ‘తాత్కాలిక ఎంపిక జాబితా’ ఖరారు చేయాలి.ఇలా హారిజాంటల్ రిజర్వేషన్లు అప్లై చేసి పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసిన తర్వాతే, కచ్చితంగా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉన్న వారితోనే 1:1 (ఒక పోస్టుకు ఒకరు) జాబితాను ప్రకటించాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితా (1:1) సిద్ధం చేయాలి. అందులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేయడానికి కాల్ లెటర్లు పంపాలి.సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యాక, ఎటువంటి లోపాలు లేని వారితో తుది జాబితాను ప్రకటించాలి. మెగా డీఎస్సీ–2025లో ఇలా చేయకుండా కొందరు అభ్యర్థులకు అన్యాయం చేయడం వాస్తవమని బాధిత మెరిట్ అభ్యర్థులు వాపోతున్నారు. దీన్ని ఒప్పుకోకుండా అధికారులు వింత వాదనను వినిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నంత మాత్రాన పోస్టు ఎంపికకు గ్యారంటీ లేదని ముందే పేర్కొన్నామంటూ ‘కండీషన్స్ అప్లై’ అన్న రీతిలో చెప్పడం కొసమెరుపు. -
అంతర్ జిల్లా క్రీడా సర్టిఫికెట్తో టీచర్ పోస్టా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత దారుణంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్ మైండ్ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. మెరిట్ జాబితా ఎక్కడ? క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్‌కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమోదించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్‌మైండ్ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది! బ్యాక్‌గ్రౌండ్ జల్లెడ పడుతున్న అభ్యర్థులు.. క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్‌మైండ్’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్ గ్రౌండ్‌ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్‌మైండ్ విరుచుకుపడటాన్ని శాప్ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి. సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్ లేకున్నా స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్‌లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్ సర్టీ ఫికెట్‌ను సృష్టించి పోస్టు అమ్మేశారు. అదే శాప్.. క్రీడా సర్టీ ఫికెట్తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్ ఆయా వర్సిటీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్‌మైండ్’ స్కెచ్‌కు నిదర్శనమని పేర్కొంటున్నారు.సర్టిఫికెట్‌కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్‌మైండ్ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!
సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్.. వెర్టికల్.. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది. అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్..! ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్‌టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ (వర్టికల్/హారిజాంటాల్) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదేం రిజర్వేషన్ లెక్కో? 1:1 నిష్పత్తి ప్రకారం జోన్ ఆఫ్ కన్సిరడేషన్, పోస్ట్ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్ ద్వారా (ఉమెన్/ స్పోర్ట్సు/ఎక్స్ సర్వీస్‌మెన్/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్లో ఉమెన్‌కు కేటాయిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్‌లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్లో చివరి ర్యాంకర్ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్లో ఉమెన్ లేకపోతే హారిజాంటాల్ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! వాస్తవానికి మెరిట్లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్. ఆమె ఓవరాల్ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్ఏ సోషల్‌కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్ రిజర్వేషన్లో కాకుండా హారిజాంటల్‌లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్‌లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. డిలీట్.. అప్లోడ్.. డిలీట్! వెబ్సైట్లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. -
‘డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి’
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. 80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారుఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.ఇసుక విధానంపై రోజుకో మాటచంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం. నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయంగత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్‌ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలిసంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్నువైఎస్సార్సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకుని, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తో రాజకీయ ప్రసంగాలు చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి మండిపడ్డారు. కోన శశిధర్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్ ట్యాబ్ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై తేలిపోయిన కోన శశిధర్ వివరణ::లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీరాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించారు. ఆయన ఏకపక్షంగా మాట్లాడి, విలేఖరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది ? మెరిట్ లిస్ట్ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్ ల ద్వారా కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్ పిన్ బౌలింగ్ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్ ఆఫ్ వార్ గేమ్ ను కూడా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దుమీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంతో పాటు ఆభివద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా ? మాట్లాడితే కేసులు పెడతారా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్ నిర్వహించబోతున్నాం.రాజకీయ నేతగా కోన శశిధర్ వ్యాఖ్యలు:పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రెస్మీట్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అని మర్చిపోయి రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏంటి? అసలేం జరిగింది, దాని మీద మేమేం మాట్లాడాం ? వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. కానీ మీరు వాళ్ల పాత్రను తీసుకుని బెదిరింపులకు దిగడం నిరుద్యోగులు, ప్రజలు హర్షించలేదు. నిరుద్యోగుల వేదనపై కోన శశిధర్ గారి నుంచి సమాధానం వస్తుందని భావించాం, కానీ తెలియదు, అవగాహన లేదు, తన దృష్టిలో లేదని చెప్పేశారు. సరైన సమాధానం చెప్పలేక బెదిరింపులకు దిగి ప్రెస్ మీట్ ముగించారు. డీఎస్సీలో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి సోషల్ స్టడీస్, తెలుగు మెథడాలజీలో పరీక్షలు రాస్తే సోషల్ లో ఫస్ట్ ర్యాంక్, తెలుగులో ఆరో ర్యాంక్ వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే కోన శశిధర్.. ఆయన మా దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, పరీక్ష రాసేటప్పుడు ఎన్వోసీ ఇవ్వలేదు కాబట్టి పక్కనబెట్టామన్నారు. తర్వాత అడిగితే సర్టిఫికెట్ల «ధృవీకరణకు రాలేదని పక్కనబెట్టామన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన చెప్పాలి. నవీన్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్లు వెబ్ సైట్ లో పెట్టాక, ఆరోపణలు రావడంతో మెరిట్ లిస్ట్ తీసేసి, దాని స్ధానంలో రివైజ్డ్ లిస్ట్ పెట్టారు. ‘బైజూస్’ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్జగన్మోహన్రెడ్డి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్స్ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్ ట్యాబ్స్ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.ఒక్క నవీన్ విషయంలోనే ఎన్నో అనుమానాలు:వెబ్ సైట్ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించాక, అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారు. సెప్టెంబర్ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్ చేశాక కూడా అతనికి కాల్ లెటర్ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే అవకాశం ఉంటుంది ? నా లాగిన్ బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదని అంటే అతని లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారో, అతని ఫస్ట్ ర్యాంక్ ను ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేలక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ల ప్రకారం సెలెక్షన్ లిస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. కాల్ లెటర్స్ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్ లెటర్స్ పంపక ముందు చూసుకోలేదా ? హారిజాంటల్ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్ పాయింట్స్ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం కాకుండా జనరల్ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్ సిస్టమ్ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్ కోటాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించారు. 2025 ఏప్రిల్ 18న ఇంకో 36 గేమ్స్ కలిపి మొత్తం 65 క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. 2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. డీఎస్సీ పేపర్ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఉద్యోగం నుంచి తొలగించారు. కోన శశిధర్ కూడా మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కేవలం దాటవేత ధోరణి ప్రదర్శించారు. నవీన్ గురించి మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అర్దమవుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
DSC పేపర్ అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ కు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చింది?
-
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
-
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
-
తప్పుపై తప్పు.. స్పోర్ట్స్ డీఎస్సీ మాకు తెలీదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్‌లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు. నవీన్ విషయంలో 3 సమాధానాలుమీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం. వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్‌లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు. వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదుకార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు. కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదుకార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్‌పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)వాస్తవాలు దాచి సమాధానం దాటవేతడీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్‌కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్‌కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.గ్రీవెన్స్‌లోనూ తప్పులేకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.ఇదో అవినీతి క్రీడ⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్‌లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్‌కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్‌లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు? -
లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి
నెల్లూరురూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని, ఆ ఆరోపణలకు తూతూమంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహిస్తున్నామని, ఈ స్కాంపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్టు రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వం పిలిచిందని, కానీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, అటు వారిని రిజెక్టెడ్ జాబితాలోనూ చూపలేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.అభ్యర్థులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, బేఖాతరు చేస్తూ అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీఎస్సీ ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారన్నారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు లేకుండా చేశారన్నారు.మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్టు తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు ఒక పోస్టుకు ఒకరిని చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని, చివరకు వారికి కూడా మొండిచేయి చూపారన్నారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్‌ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్‌కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్‌గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్‌కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్‌లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్‌లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్‌కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్ఈఆర్టీలో పనిచేసే నవీవ్‌కి టాప్ ర్యాంక్‌పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్‌కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.నవీన్ లాగిన్‌ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు.


