DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం | AP High Court Expresses Anger Over Illegal DSC Appointments | Sakshi
Sakshi News home page

DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం

Feb 10 2026 5:32 PM | Updated on Feb 10 2026 5:37 PM

AP High Court Expresses Anger Over Illegal DSC Appointments

సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్‌ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్‌లో పూరించడంపై సీరియస్‌ అయ్యింది.

గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.

ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement