‘కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’ | TTD Former Chairman Bhumana Slams Chandrababu Over Laddu Issue | Sakshi
Sakshi News home page

‘కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’

Feb 10 2026 4:27 PM | Updated on Feb 10 2026 4:37 PM

TTD Former Chairman Bhumana Slams Chandrababu Over Laddu Issue

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.  ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై  సిట్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

బీఆర్‌ నాయుడు, ముద్దాడ, రవిచంద్ర బలవంతంగా పెద్ద జీయర్‌ స్వామితో లేఖ రాయించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయంలేదని సిట్‌ స్పష్టంగా చెప్పింది. కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు. చంద్రబాబు క్షద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారు. స్వాములను భయపెట్టి చంద్రబాబ ఏం సాధించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.

‘కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలు ఎక్కువ అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులపైనే ఎల్లో మీడియా దాడులు చేస్తోంది. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు రెడ్‌బుక్ పాలన పెద్ద జీయర్‌స్వామిపైకి మళ్లింది. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement