
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్‌తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
