
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఎస్సీ కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఐడీ నంబర్‌తో వెబ్‌సైట్‌లో వివరాలను స్వయంగా సరిచేసుకునేందుకు శుక్రవారం వరకు అవకాశం పొడిగించామన్నారు.