రెడ్‌బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి | Ambati Rambabu Fires On Lokesh Redbook | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి

Feb 28 2026 3:44 PM | Updated on Feb 28 2026 4:37 PM

Ambati Rambabu Fires On Lokesh Redbook

సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమా
గుంటూరు నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.

రెడ్‌బుక్‌ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్‌బుక్‌ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది.

రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్

Advertisement
 
Advertisement
Advertisement