breaking news
Red Book
-
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలన్న నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఎత్తిచూపారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తామని... వారికి భరోసా ఇస్తామని.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని తేల్చిచెబుతూ ‘ఎక్స్’లో తన ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వినతిపత్రం ఇవ్వడమే నేరమా? ‘‘చంద్రబాబు గారూ.. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా? మొదటి రోజు వైఎస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? ఉద్యోగులకూ మోసం..ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! ఐఆర్ లేదు! పీఆర్సీ లేదు! 5 డీఏలు పెండింగ్ ! సీపీఎస్/ఓపీఎస్‌ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన జీపీఎస్‌ను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్‌క్యాష్‌మెంట్ లీవులు ఇలా దాదాపు రూ. 35వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు. ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత? అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’’.మీరు చేయలేని పని చేయడానికి వారు ప్రయత్నించడమే తప్పా?మీ రెడ్‌బుక్ అరాచక జంగిల్‌రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు గారూ అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు.తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా? వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా? ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా? -
ప్రభుత్వ టీచర్లపై నారా లోకేష్ రెడ్‌బుక్ కక్ష
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ టీచర్ల పై నారా లోకేష్ రెడ్ బుక్ కక్ష సాధింపులకు దిగింది. ముగ్గురు టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను బాబు సర్కార్ సస్పెండ్ చేసింది.లక్షలాదిమంది ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రమంత్రికి విన్నవించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, వారితో వెళ్లారని ముగ్గురు ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. సంగమేశ్వర రెడ్డి, అమరనాథ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప డీఈవో.. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారంటూ తప్పుడు అభియోగాలతో సస్పెన్షన్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
నా భర్త ఆ రోజు అక్కడ లేడు... జగన్ శ్రీకాకుళం పర్యటనలో అక్రమ అరెస్ట్ లపై సంచలన నిజాలు
-
బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు
బీసీ నాయకులపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాలపై ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం.– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెన్నుపోటు పార్టీ రెడ్‌బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, బాధితులే నిందితులవుతున్నారని.. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయనపైనే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారు ఎమ్మెల్యేలైనా కూడా లెక్కలేకుండా అర్ధరాత్రి పూట పోలీసులే దొంగలు, బందిపోటు గూండాల మాదిరిగా ఇంట్లోకి చొరబడి సీసీ టీవీ కెమెరాలు దొంగిలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 3.50 గంటల ప్రాంతంలో ములాఖత్‌లో కలుసుకున్నారు. అరగంటపాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? ‘‘ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్ర పోతున్న ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇది జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి.. సీసీ కెమెరాలను దొంగిలించి.. డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో మరో 14 మందిపై కేసు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తంగా 38 మంది రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకుసహా కేసు పెట్టి జైలుపాలు చేశారు. మరో తమ్ముడి కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల ఆరు తప్పులు.. ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు ఆరు తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. (ఇందుకు సంబంధించి ఫోన్ కాల్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు చూపారు) 1 బాధితులపై దాడి చేసి.. వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంగాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీన రాత్రి 7.45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్ఐకి ఫోన్ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సీఐకి కూడా ఫోన్ చేస్తే కలువలేదు. తిరిగి 8.03 గంటలకు సీఐకి ఫోన్ చేసి కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8.08 గంటలకు గిరి.. ఎమ్మెల్యేకు మరోసారి ఫోన్ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంగాలకు వెళ్లి.. అక్కడ పరిస్థితులను తెలుసుకొని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసుల మొదటి తప్పు 2 నేమకల్లులో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లులో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చింపారని చెప్పి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారు. 3 ఎమ్మెల్యే కారుపైనే దాడి చేసి.. ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టి, దాడి చేసిన వారి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేపైనే మూడో కేసుపెట్టి పోలీసులు మూడో తప్పు చేశారు. 4 టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంగాల గిరి, చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యేపైనే రివర్స్ కేసు పెట్టారు. 5 సంగాల, నేమకల్లులలో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. పోలీసులే కేసులు కట్టడం ఐదో తప్పు. 6 ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొళ్లి.. పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం ఆరో తప్పు. ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులెవరూ ఫిర్యాదు ఇవ్వకున్నా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబూ ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావో తెలుసుకో.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పది మంది చూస్తుండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటకు రావడంతో రాష్ట్రం నివ్వెర పోయింది. చివరికి ఆ ఆడబిడ్డతో తప్పుడు మాటలు చెప్పించే పని చేయడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారి పోయిందో చెప్పడానికి చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలే నిదర్శనం. మీరే దాడి చేసి.. మీరే చేయి విరగ్గొట్టి.. మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంగాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగ్గొట్టిన సంఘటనల్లో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీ టీవీలను మాయం చేశారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు పేరు పొందిన బీసీ నాయకులపై చంద్రబాబునాయుడు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజుపై ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్ యాక్సిడెంట్‌ను వక్రీకరించి కుట్ర, హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టారు. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును నేను చూడడానికి వెళితే ప్రజలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి మహిళా ఎస్ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఇలాంటి కేసులు ఎలా కడతారు? వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి. ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తాఫాపై ఏరకంగా అక్రమ కేసు పెట్టారో చూశాం. ముస్తాఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా, తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తాఫా బా«ధితుడు అయితే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం. అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్.. లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు. నన్నూర్ టోల్గేట్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే ముందుకు సాగుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట గ్రిల్ వద్ద నిలబెట్టి వీడియోలు తీసి అవమానించారు.. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలకు హద్దే లేకుండా పోతోంది. దిగజారి కక్ష సాధింపులకు దిగుతున్నారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలుసుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. సాధారణంగా జైలులోకి ప్రవేశించిన తర్వాత వెళ్లిన వారిని కూర్చోబెట్టి వీడియో, ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించారు. ఎందుకిలా చేశారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నిస్తే.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీన్నిబట్టి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్దేశ పూర్వకంగానే నన్ను అవమానించాడు. ఇది దారుణం. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట. అన్యాయంగా కేసులు.. అరెస్టులుఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారు. కేసుల నమోదు, ఎఫ్ఐఆర్లు డొల్లతనంగా ఉన్నాయి. ఒక ఫిర్యాదులో ఉన్న నలుగురి పేర్లు.. అదే ఫిర్యాదులో వేరే నిందితులుగా చూపారు. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్‌ను ఏ–22గా కూడా చూపారు. ఏ–17 మాల గాదిలింగను ఏ–25గా.. ఏ–19 సత్తిరెడ్డిని ఏ–23గా ఎ.సత్యనారాయణరెడ్డి అని చూపారు. ఏ–18 కురవ లింగప్పను మళ్లీ ఏ–24 గా చూపించారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది. ఎల్లకాలం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి చూస్తూ చూస్తూ ఉండగానే రెండేళ్లయిపోయింది. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికి ఇంకో మూడేళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబునాయుడు నాటిన విష బీజాలు రెండింతలవుతాయని ఆయన గుర్తుంచుకోవాలి’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్నినాని.. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇషాక్‌బాషా, మధుసూదన్, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటెత్తిన జనసునామీ!కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు కదిలింది.. ఓర్వకల్లు హోరెత్తింది.. రహదారులు జనసంద్రాలయ్యాయి..! కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిపై జన ప్రభంజనం కనిపించింది. తుంగభద్ర, హంద్రీ ప్రవాహంతో పోటీ పడుతూ యువ తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసుల ఆంక్షలు, చెక్ పోస్టులు, అడ్డంకులను చేధించుకుని ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ కష్టాలు చెప్పుకునేందుకు.. తమ గోడు వెళ్లబోసుకునేందుకు.. న్యాయం కోసం మొరపెట్టుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆడబిడ్డ నిధి అందని మహిళలు.. తల్లికి వందనం మిస్సయిన తల్లులు.. ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్న యువత.. దగా డీఎస్సీలో మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగార్థులు.. కరువుసీమలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న రైతులు.. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు.. కష్టాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు.. సూపర్‌సిక్స్.. సూపర్‌సెవెన్ హామీలను నమ్మి మోసపోయామని వాపోతున్న వివిధ వర్గాల ప్రజలు.. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఒక్కటే ఆశ.. జగన్ తమ గోడు వింటారన్న నమ్మకం! తమకు అండగా ఉంటారన్న నమ్మకం ! వీరి ఆవేదనకు తోడుగా.. తమ అభిమాన నేతను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు జనసునామీ కనిపించింది. జననేత పర్యటన ఆసాంతం ‘జెన్ జీ’ యూత్ జోష్ వెల్లువెత్తింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. ఎండ తీవ్రత ఠారెత్తిస్తున్నా.. 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టేంతగా జనప్రవాహం ఉప్పొంగింది. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, నగర పురవీధులు ఎటుచూసినా జనసంద్రమే. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు.. పూలవర్షాలు.. ‘జై జగన్’ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. జనమే జనం.. జననేతకు బ్రహ్మరథం.. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు– హైదరాబాద్ జాతీయ రహదారి కూడలికి చేరుకునేందుకే అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత పూడిచెర్ల క్రాస్, రాక్ గార్డెన్, హెచ్ 8 హోటల్ జంక్షన్, నన్నూరు, నన్నూరు టోల్ ప్లాజా, ప్రజా నగర్, కర్నూలు రింగ్ రోడ్డు జంక్షన్, వెంకన్నబావి, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, కల్లూరు, షరీఫ్ నగర్, హ్యాంగవుట్ హోటల్ సెంటర్, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, కేశవ గ్రాండ్ హోటల్ జంక్షన్, బళ్లారి చౌరస్తా, ఆటోనగర్, సంతోష్ నగర్, పంచలింగాల సర్కిల్, పంచలింగాలపల్లె మీదుగా జిల్లాజైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగింది. జగన్‌ను చూసేందుకు కర్నూలు, నంద్యాల పరిసర జిల్లాల నుంచి వచ్చిన జనంతో కర్నూలు నగరం జనసంద్రాన్ని తలపించింది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు వద్ద భారీగా తరలి వచ్చిన జనసందోహానికి అభివాదం చేస్తున్న జననేత వైఎస్ జగన్‌కు డీఎస్సీ అభ్యర్థుల మొరమెగా డీఎస్సీ పేరిట తమను దగా చేశారంటూ.. అన్ని అర్హతలు ఉండి డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జాతీయ రహదారిపై ప్రజానగర్ వద్ద వీరంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. తప్పకుండా మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద్ద వైఎస్ జగన్‌ను కలిసిన డాక్యుమెంట్ రైటర్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొడుతోందంటూ వాపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు సంతోష్‌నగర్ వద్ద కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు పడవని, కరువుతో సీమ ప్రజలు అల్లాడిపోతుంటారని వాపోయారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజలు దారి పొడవునా వైఎస్ జగన్‌ను కలిసి తమ వినతులు అందజేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవి కలిసి తమగోడు చెప్పుకున్నారు. తనకోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను అన్ని విధాలుగా వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి జరిగిందంటే అది మీ హయాంలో మాత్రమేనని పార్వతి గుర్తుచేసుకున్నారు. -
టార్గెట్ వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియా కట్టడి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుతూ.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతూ.. అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా మరింత బరి తెగించింది! నిరసన గళాలపై అడ్డగోలుగా అక్రమ కేసులు బుక్ చేసేందుకు పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు చేపట్టే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టడి చేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. అక్రమ కేసుల నమోదులో ప్రతి నెలా మీ ఫెర్ఫార్మెన్స్ రిపోర్టులు పరిశీలిస్తామంటూ రెడ్‌బుక్ పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది! మెగా డీఎస్సీ 2025 స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున వెళ్లడం.. జెన్ జీ యువత, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు నిరసన ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంతో టీడీపీ పెద్దలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండటంతో కుట్రలకు మరింత పదును పెట్టి పోలీసులను పురిగొల్పుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.వేల మందితో వర్చువల్ భేటీ.. వైఎస్సార్సీపీ టార్గెట్‌గా.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యంగా రెడ్‌బుక్ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పచ్చ జెండా ఊపారు! ఈమేరకు ఎన్నడూ లేనివిధంగా అమరావతిలోని సచివాలయం వేదికగా బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1,200కిపైగా పోలీస్ స్టేషన్లకు చెందిన 1,632 మంది హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2.40 గంటలపాటు ఈ సమీక్ష నిర్వహించగా ఇందులో గంటన్నరకుపైగా సీఎం మాట్లాడటం గమనార్హం. ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేయాలి అంటూ..ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాను అణచివేసేలా వర్చువల్ భేటీలో ప్రభుత్వ పెద్దలు పోలీసులకు పరోక్షంగా డైరెక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, డీజీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకూ పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి నెలా మీ ఫెర్ఫార్మెన్స్ రిపోర్టులు పరిశీలిస్తామంటూ వారికి టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ప్రధానంగా ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేయాలంటూ పరోక్షంగా వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని డైరెక్షన్ ఇవ్వడం గమనార్హం. రోడ్లపై విన్యాసాలు చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని గట్టిగా సూచించారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే కార్యక్రమాలను అదుపు చేయాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చారు. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదని వ్యాఖ్యానించిన సీఎం.. ప్రస్తుతం రోడ్లపైకి వస్తున్న వారిలో 94 శాతం మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారంటూ వైఎస్సార్సీపీపై అసహనం వెలిబుచ్చారు. పోలీసులపై కోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తారని, అందుకు మీరేం భయపడొద్దని, ప్రభుత్వమే న్యాయ సహాయం అందిస్తుందని సీఎం చెప్పడం అంటే.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించాలని మరింత రెచ్చగొట్టినట్టేనని పలువురు తప్పుబడుతున్నారు.ఏ పనైనా చేస్తామన్న వీర విధేయ అధికారులు..! సీఎం అంతరంగాన్ని అర్థం చేసుకున్న టీడీపీకి అత్యంత విధేయుడైన ఓ ఐపీఎస్, మరో ఇద్దరు అధికారులు.. మీరు మాకు అండగా ఉంటే ఏ పని చెప్పినా చేస్తామంటూ అత్యుత్సాహంగా స్పందించడం పోలీసు వర్గాల్లో ఆంతరంగిక చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్.మధుసూదనరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ రవికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రోజులన్నీ ఒకేలా ఉండవు రెడ్ బుక్ సంగతి తేలుస్తాం
-
ఊడిగమంతా హుష్‘ఖాకీ’ పోలీస్ నెత్తిపైనా ‘సర్దుబాటు’ పిడుగు..
‘‘డీఏ బకాయిలు చెల్లించలేదు.. ఐఆర్ ప్రకటించలేదు.. పీఆర్సీ ఇవ్వలేదు.. వీటన్నింటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లకే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఉద్యోగులు ఉద్యమ బాట పడుతుండటంతో వారిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా రాçష్టపతి ఉత్తర్వుల (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమలును తెరమీదకు తెచ్చింది.’’ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అమలు భారాన్ని భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్న పోలీసులకే కీలెరిగి వాత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నింది. రక్షక భటుల నెత్తిన సర్దుబాటు పిడుగువేసింది. హామీల అమలు, వేతనాల పెంపు, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి అనేక కీలక అంశాలపై తోటివారితో కలిసి ఖాకీలు నోరెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు సర్కారు ఆగమేఘాలపై ఉద్యోగుల విభజన ప్రక్రియ కిటుకును వాడుకుంటోంది. ప్రభుత్వ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇప్పటికే ఏపీ పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 300 మంది పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సమయం, సందర్భం లేకుండా సరైన మార్గదర్శకాలు లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 27 నెలలు గడువున్నా.. ఇప్పుడెందుకు హడావుడి.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన(సర్దుబాటు) ప్రక్రియకు రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం 27 నెలల గడువు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని మెడమీద కత్తిపెట్టి మరీ ఉద్యోగులను మానసిక వత్తిడికి గురిచేస్తోంది. తగిన సమయం ఇవ్వకుండా, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన తీవ్ర గందరగోళంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975) ముఖ్య ఉద్దేశం ‘స్థానిక అభ్యర్థుల సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను, ఉద్యోగ రక్షణను కల్పించడం’. ఆర్టికల్ 371–డీ కింద ఇచ్చే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. ఉద్యోగుల విభజన పేరుతో అన్యాయం.. వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎక్కడా నిబంధనలేదు. అయినప్పటికీ ఉద్యోగుల విభజన సాకుతో జూలై 13 నుంచి సాధారణ బదిలీలు, పదోన్నతులను, జాబ్ క్యాలెండర్‌ను నిలిపివేయడం చట్ట విరుద్ధం. అనేక శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్, సీనియారిటీ వంటి సమస్యలు పరిష్కారం కాకుండానే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగుల సేవా హక్కులు దెబ్బతింటాయి. ఉద్యోగ నియామకాలపై బ్యాన్ పేరుతో కారుణ్య నియామకాలనూ నిలిపివేయడం బాధాకరం. కారుణ్య నియామకం అనేది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ చర్య అనే బాధ్యతను విస్మరించడం దారుణం. ఉద్యోగుల విభజనలో డిమాండ్లు ఇవి.. ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ఉద్యోగుల విభజనపై ఉద్యోగ వర్గాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలను ముందుగా సేకరించాలి. పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయాలి. సీనియారిటీని పూర్తిగా రక్షించాలి. కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించాలి. ఉద్యోగులకు బదిలీ భత్యం, గృహ వసతి సహాయం అందించాలి. ఉద్యోగుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలి. హడావుడిగా సర్దుబాటుతో ఉద్యోగుల హక్కులకు భంగం..ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును హడావుడిగా చేపట్టడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావిడిగా ప్రభుత్వం ముందుకు వెళితే వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతోపాటు న్యాయపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బలవంతపు బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, కార్యాలయ మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా అయోమయం, సిబ్బంది కొరత, న్యాయపరమైన వివాదాలు, స్థానికత సమస్య, మహిళా ఉద్యోగుల ఇబ్బందులు, వైద్యం, విద్య సౌకర్యాల ఇబ్బందులు వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, మున్సిపల్, విద్య శాఖల్లో ఉద్యోగుల విభజన చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో సీనియర్లలో పురుషులు, జూనియర్లలో మహిళలు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని విభజిస్తే కొత్త జిల్లాలకు అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లను కేటాయించడం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే విధంగా వారి విభజన చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ఏపీలో దిగజారిన శాంతిభద్రతలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ‘రెడ్‌బుక్’ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు గురువారం సాయంత్రం ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. మెగా డీఎస్సీ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడడం, భారతి సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూపు వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను అధికారమదంతో బెదిరించడం, వాటి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం వంటి కీలక అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా అందుకు అనుగుణంగా పోలీసు రక్షణ కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వివరించింది. వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన విధంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.. ఎంపీల బృందం లేవనెత్తిన అంశాలివే..పెచ్చుమీరిన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్షసాధింపు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత రెండు నెలల్లోనే నాలుగు లాకప్ డెత్‌లు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో భారీ అక్రమాలు టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని అమిత్‌షాకు వివరించారు. ఆయా అక్రమాలపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. భారతి సిమెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఫ్రెంచ్ గ్రూపు వికాట్, భారతి సిమెంట్స్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అ్రల్టాటెక్ సిమెంట్స్ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల కార్యకలాపాలను ఈ విధంగా అడ్డుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పించాలి గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై ఆందోళన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరవైందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినప్పటికీ, పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వైఖరి వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీసిందని చెప్పారు. గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా, చట్టబద్ధతను కాపాడేలా, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని నిలబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఆయా సమస్యలపై తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం లేవనెత్తిన ప్రధానాంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. -
రెడ్ బుక్ అరాచకం రక్తం వచ్చేలా దాడి..
-
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం గుజరాత్లో ఉన్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడుకు తీసుకొచ్చారు.అనంతరం ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముస్తఫాను నెల్లూరు జైలుకు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది. -
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ అరెస్ట్
పట్నంబజారు(గుంటూరు): నిన్నటి వరకు ప్రతిపక్ష బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ పంజా విసిరిన చంద్రబాబు సర్కారు మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబాలను వెంటాడి వేధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి వంటి వారిపైనా అక్రమ కేసులతో అరాచకం సాగించింది. ఇప్పుడు మైనార్టీ నేతలపై కక్షసాధింపులకు దిగి తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు అక్రమ కిడ్నాప్ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుజరాత్లో వీరిద్దరినీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడితో ఆగకుండా గుంటూరు కాకాని రోడ్డులోని ముస్తఫా కుమార్తె, వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నివాసంలోనూ దౌర్జన్యంగా తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. -
బీసీ నేతలపై రెడ్‌బుక్
చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా.. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను బాబు టార్గెట్ చేశారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం,సాక్షి ప్రతినిధి, కర్నూలు, ఆలూరు రూరల్: ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తామని మోసపూరిత హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే చంద్రబాబు సర్కారు తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు ఉద్యమ బాట పడుతున్న ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. ఇవి చాలదన్నట్లు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసి స్కామ్‌కు పాల్పడటంతో చంద్రబాబు సర్కారుపై యువత కన్నెర్ర చేస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. జెన్ జీని సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టడంతో చంద్రబాబు యథావిథిగా మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. అనుకున్నదే తడవుగా రెడ్‌బుక్ కుట్రలకు పదును పెట్టి పోలీసులను రంగంలోకి దించారు. ఈసారి వైఎస్సార్సీపీ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు దిగారు. మెగా డీఎస్సీ స్కామ్‌లో సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ బీసీ నేతలు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తుండటంతో చంద్రబాబు సర్కారు పరువు పాతాళానికి దిగజారిపోతోంది. వెనుకబడిన తరగతులకు చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(బోయ), చింతాడ రవికుమార్ (కాళింగ), మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు (మత్స్యకార), జోగి రమేష్ (గౌడ), మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తదితర వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రమైన నేరాలు మోపుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా.. మూడు ప్రాంతాల్లోను ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను బాబు సర్కారు టార్గెట్ చేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాబు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలైన పోలీస్ వ్యవస్థ మరింత అబాసుపాలవుతోందని పేర్కొంటున్నారు. పరాకాష్టకు చేరుకున్న బాబు సర్కారు బరి తెగింపు కుట్రలు ఇలా ఉన్నాయి...! వారి దుస్తులు వారే చింపుకొని..!కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను టీడీపీ మూకలు బంధించి చితకబాదుతుంటే ప్రాణభయంతో వీడియో కాల్ చేసిన ఓ కార్యకర్త తమను రక్షించాలని ఎమ్మెల్యే విరూపాక్షిని వేడుకున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తను విడిపించేందుకు అక్కడికి వెళ్లిన విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పచ్చముఠాల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు గాయాలయ్యాయి. ఈ కుట్రలు అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటీని తానే చింపేసి దారుణంగా వైఎస్సార్సీపీ నేతలపై నిందలు వేశాడు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం (307) కింద అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఆదివారం తెల్లవారుజామున (రాత్రి 2.45 గంటల సమయంలో) పోలీసు బలగాలు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నాయి. తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే విరూపాక్షితోపాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విధ్వంస కాండకు ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ హార్డ్ డిస్‌్కలను పోలీసులు దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకున్నారు.చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్‌డెత్‌లు.. ఆత్మహత్యలు.. మహిళలపై విచ్చలవిడిగా అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. మొన్న విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్.. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిద చేశారు! దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య..! కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్‌డెత్..! ఉయ్యూరులో పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగక దంపతుల ఆత్మహత్యా యత్నం..! అనంతపురం జిల్లా మదిగుబ్బ తండాలో టీడీపీ కార్యకర్తల బెదిరింపులతో ఉరి పోసుకుని గిరిజన మహిళ ఆత్మహత్య..! తాజాగా పల్నాడులో ఎస్ఐ వేధింపులు భరించలేక మిర్చి వ్యాపారి భార్య ఆత్మహత్యాయత్నం..! రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఒకపక్క రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోపక్క ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వేధించడమే లక్ష్యంగా బాబు సర్కారు కుట్రలకు మరింత పదును పెడుతోంది. పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. మెగా డీఎస్సీ పేరుతో స్కామ్‌కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతుండటం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్సార్సీపీలోని బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారు. జోగి రమేష్ కుటుంబంపై తీవ్రమైన కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం! మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర కేసులు నమోదు కావడం వెనుక టీడీపీ నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలున్నాయి. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం లాంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో జోగి రమేష్, కుమారుడు రాజీవ్, సోదరుడు రాము, సోదరి రమతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలో భాగమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వీడియోతో కుట్రలు బట్టబయలు... టీడీపీకి చెందిన మహిళ నైటీని స్వయంగా ఆమె భర్తే చింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలు తమ దుస్తులు తామే చింపుకొని, ఎమ్మెల్యేపై తప్పుడు ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. చివరకు మంత్రులు సైతం వాస్తవాలను మరుగునపరిచి దీన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే యత్నాలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ కుట్రలు బట్టబయలయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తదితరులపై అట్రాసిటీ, హత్నాయత్నం, వాహనం ధ్వంసం కేసులు నమోదు చేసి ఆలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు కర్నూలు జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించారు. ఘటనలో లేని వారిపైనా కేసులా..!మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు శ్రీకాకుళం వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో జన ప్రభంజనాన్ని చూసి కంటిపై కునుకు కరువైన సీఎం చంద్రబాబు తప్పుడు కేసులకు పోలీసులను పురిగొల్పారు. మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దాడి చేసినట్లు ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవితోపాటు మరో 20 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అసలు ఆ రోజు ఘటనా స్థలంలోనే లేని వారిపై కేసులు బనాయించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. తనపై కక్ష సాధించేందుకు కుట్రలకు తెరతీసి అక్కడలేని 20 మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని చింతాడ రవి వీడియో విడుదల చేయడంతో కలకలం రేగింది. ఏ–8గా చూపించిన లాయర్ ధనేటి రామ్మోహనరావు ఘటన సమయంలో ఆమదాలవలస కోర్టులోనే ఉన్నారు. ఆ కేసులో ఏ–9గా ఉన్న ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్‌లోనే లేరు. ఆయన తన కుమార్తెను యూనివర్శిటీలో చేర్చేందుకు పంజాబ్ వెళ్లారు. ఏ–11 డాక్యుమెంట్ రైటర్ సురేష్ ఆ రోజు సబ్–రిజి్రస్టార్ ఆఫీసులోనే ఉన్నారు. ఘటన సమయంలో దూరంగా ఉన్న, సంబంధం లేని వ్యక్తులనూ నిందితులుగా చేర్చడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు తప్పుబడుతున్నారు.రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చేశారు..శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బీసీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన దీన్ని ఏకంగా హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం రాజకీయ కక్షసాధింపు అని ప్రజలు తప్పుబడుతున్నారు. సాధారణ సెక్షన్లతో సరిపెట్టాల్సిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి చదువుకునే యువకుడిని, మాజీ మంత్రిని ఇబ్బందుల పాలుచేసేలా టీడీపీ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం ఏలూరు బలగాల మోహరింపు..గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా అధికారపక్షం ఇదే తరహా రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఓ వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ పోలీసులు తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం? వైఎస్సార్సీపీ నాయకుడు కాబట్టే కేసు పెడతారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏలూరు జిల్లాకు చెందిన పోలీసులు భారీ సంఖ్యలో గుంటూరు చేరుకుని ఐదు బృందాలుగా ఏర్పడి ముస్తఫాను అరెస్టు చేయడానికి చేస్తున్న యత్నాలు రెడ్‌బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనం. -
పకడ్బందీగా దాడి ఎలా తన ఇంటిపై దాడి చేసారో వివరించిన విరూపాక్షి భార్య
-
ఇది ప్రజాస్వామ్యమేనా? లేక జంగిల్ రాజ్యమా? YS జగన్ ఆగ్రహం
-
రెచ్చిపోయిన ఖాకీ గూండాలు అర్ధరాత్రి కలకలం.. విరూపాక్షి ఇంటిపై దాడి
-
అర్ధరాత్రి ‘ఆపరేషన్ విరూపాక్షి’!
ఆదోని: ఆదివారం అర్ధరాత్రి.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం, మండల కేంద్రమైన చిప్పగిరిలో తన భార్య, బిడ్డలతో మంచి నిద్రలో ఉన్నారు. ఐతే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొడుతున్న శబ్దంతో ఉలిక్కిపడి లేచారు భార్యాభర్తలు. ఇంట్లో నుంచి తొంగి చూస్తే దాదాపు 40 మందికి పైగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పక్కకు తిప్పేశారు. గునపాలు, కొడవళ్లతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. విధిలేక ఆ భయానక వాతావరణంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజనమ్మ తలుపులు తెరిచారు. ఒక్కసారిగా పోలీసులందరూ ఇంట్లోకి దౌర్యన్యంగా చొరబడ్డారు. నీ భర్త ఎక్కడ అంటూ ఆమె మీద చేతులు వేస్తూ పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూం ద్వారాన్ని కూడా గునపంతో బద్దలు కొడుతూ తెరిచే ప్రయత్నం చేస్తుంటే ఆయన తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఆరేడుగురు సీఐలు, దాదాపు నలభై మంది పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని చుట్టుముట్టి చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో తమ ఇంట్లో పోలీసులు జరిపిన దమనకాండ గురించి ఆలూరు ఎంఎల్ఏ విరూపాక్షి భార్య రామాంజనమ్మ నిలువెల్లా వణికిపోతూ చెప్పిన వివరాలివి. ఘటన పూర్వాపరాలను ఓమారు పరికిస్తే..టీడీపీ మూకల దాడి నుంచి కార్యకర్తను కాపాడుకునేందుకు..చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి శనివారం రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తనపై నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని, తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే సీఐకి ఫోన్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లడానికి తాత్సారం చేస్తున్న విషయాన్ని గ్రహించి వెంటనే తన కార్యకర్త కోసం తన సోదరుడు శ్రీరాములు, కొందరు కార్యకర్తలను తీసుకుని రాత్రికి రాత్రే నేమకల్లు గ్రామానికి వెళ్లారు. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీకి చెందిన ఇరుపక్షాలకు నచ్చచెప్పి ఇంటికి తిరుగు ముఖం పట్టారు. అయితే ముందస్తు పథకంలో భాగంగా గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు గూండాలు ఎమ్మెల్యేను చుట్టుముట్టి మా గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా దాడికి దిగారు. వారి దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు చేయి విరిగింది. వెంటనే తన సోదరుడిని వెంట తీసుకుని చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు టీడీపీ వర్గీయులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. అర్ధరాత్రి తన ఇంటికి తిరిగివెళ్లారు.పక్కా పథకం ప్రకారమే ఎమ్మెల్యే నివాసంపై దాడిముందు రచించుకున్న పథకం మేరకు ఇక పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలైన ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, ఆస్పరి స్టేషన్లకు చెందిన సీఐలను, పోలీసులను పిలిపించుకున్నారు. పక్కా పథకం మేరకు 2.45 గంటల సమయంలో నక్సల్స్‌ను పోలీసులు చుట్టిముట్టినట్లు సీఐలు, భారీ ఎత్తున పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న ఎమ్మెల్యే అనుచరులను ముందే స్టేషన్‌కు తరలించారు. ఇక ఇంట్లో కేవలం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మరో మహిళా బంధువు మాత్రమే మిగిలారు. తర్వాత పోలీసులు గుండాల్లా రెచ్చిపోయారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. గునపాలతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే భార్య తలుపులు తెరిచారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూంను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. చిప్పగిరిలో ఆదివారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి గడియ ధ్వంసం చేసిన పోలీసులు స్టేషన్ వద్ద కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే నివాసంపై దాడిచేసి అత్యంత దుర్మార్గంగా నిర్బంధించిన విషయం తెల్లవారుజామునే సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రమంతా వ్యాపించింది. దీంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు, నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తుండటంతో స్టేషన్ గేట్లను మూసివేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు గుంతకల్లు–ఆలూరు ప్రధాన రోడ్డు మీద బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడిచిపెట్టాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కార్యకర్తకు అండగా నిలవడం తప్పా?టీడీపీ మూకలు దౌర్జన్యం చేస్తున్నాయని పార్టీ కార్యకర్త గిరి బాధపడుతుంటే కాపాడుకోవాలని ఎమ్మెల్యే వెళ్లడం, కార్యకర్తకు అండగా ఉండడం తప్పెలా అవుతుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన విలేకరులకు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పెద్దల సూచనల మేరకు పోలీసులు పన్నిన పన్నాగమిది అని వ్యాఖ్యానించారు. కేసులకు బెదరబోమన్నారు. అంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి సీనియర్ న్యాయవాది జీవన్‌సింగ్‌తో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, ఎంఎల్సీ డా.మధుసూదన్‌లను స్టేషన్లోకి తీసుకువెళ్లి డీఎస్పీ వెంకటరామయ్య, తదితర పోలీసు అధికారులతో మాట్లాడారు.హత్యాయత్నం కేసు.. 14 రోజులు రిమాండ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు హత్యాయత్నం కేసు (ఎఫ్ఐఆర్ నంబరు: 37/2026) నమోదు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 16 మందికి ఆలూరు జేఎఫ్‌సీఎం కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. వీరిని కర్నూలు జైలుకు తరలించారు. కాగా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జీవన్‌సింగ్ ఆదివారం రాత్రి కీలక పిటిషన్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో కూడా రిమాండ్ అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరపనుంది. ఇదే సమయంలో ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను భద్రపరచాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఘటన అనంతరం ఎమ్మెల్యేను తీసుకువచ్చిన చిప్పగిరి పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టు ముందుంచాలని న్యాయవాది జీవన్‌సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సంబంధిత పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచి రెండు రోజుల్లోగా కోర్టు ముందుంచాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కేసు విచారణలో ఆ ఫుటేజీ కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీమంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిమంత్రాలయం రూరల్: ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. ఆలూరు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిని నిర్బంధించిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధులకు సైతం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాల దాడులు, దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఆలూరు సీఐ రవిశంకర్ ఎమ్మెల్యేను ఏకవచనంతో మాట్లాడడం అత్యంత హేయమని అని అన్నారు. -
సాక్షి ఎడిటర్‌పై కేసుకు ఏకంగా జీవో
సాక్షి, అమరావతి: ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మాకు పనిలేదు. మేం చేసే అవినీతి, అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం’ అన్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరింత బరితెగించింది. సాక్షిలో ప్రచురితమైన ఒక కథనానికి సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రధానంగా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టిస్తోంది. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తోంది. ఎడిటర్ పై నెలకు ఒక కేసు నమోదవుతోందంటే అక్రమాలను వెలుగులోనికి తెస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎడిటర్, పబ్లిషర్ తదితరులపై మరో అక్రమ కేసు నమోదుకు అనుమతినిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ ప్రత్యేక జీవోఆర్టీ 1486 జారీ చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన అద్వైక ట్రేడింగ్ కంపెనీ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ వ్యవహారానికి సంబంధించిన కథనంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తరఫున న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఈ జీవో ద్వారా అనుమతి ఇచ్చారు. తగిన ఆధారాలతోనే కథనంవిజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అద్వైక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు, బాధితుల సమస్యలు, కేసు పరిష్కార ప్రక్రియపై తగిన ఆధారాలతోనే సాక్షి లో కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో దర్యాప్తును ప్రభావితం చేశారనే ఆరోపణలు, నిందితులతో అనధికారికంగా పరిష్కారం కుదిరిందనే అనుమానాలు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు కథనంలో ప్రస్తావించింది. ఈ ఆరోపణలు వాస్తవమా? కాదా? అన్నది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలే. ఆరోపణలు నిరాధారమైతే సంబంధిత అధికారులు వాస్తవాలను వెల్లడించి ప్రజలకు స్పష్టత ఇవ్వవచ్చు. అయితే అందుకు బదులుగా పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడమే లక్ష్యంగా కేసు నమోదుకు ఏకంగా జీవోను జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మీడియా గొంతు నులిమేందుకు తప్పుడుదారులుప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని మీడియా ప్రశ్నించడం సహజమైన ప్రక్రియ. ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక మోసాలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత. అయితే ఒక వార్తపై అభ్యంతరం ఉంటే వివరణ ఇవ్వడం, వాస్తవాలను వెల్లడించడం, అవసరమైతే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం సాధారణ ప్రక్రియ. కానీ వార్తా కథనాల కారణంగా మీడియా సంస్థలు, పబ్లిషర్లు, రిపోర్టర్లపై కేసులకు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే. నిజాలను ప్రశ్నించే మీడియా గొంతుకను అణచివేస్తే, ప్రజలకు వాస్తవాలు చేరే మార్గాలు మూసివేయవచ్చనే దురభిప్రాయంతో కూటమి ప్రభుత్వం తప్పుడుదారుల్లో అక్రమ కేసులు పెడుతోంది. రాజకీయ, మీడియా వర్గాల ఖండనపత్రికా స్వేచ్ఛ అణచివేతకు ప్రత్యేక జీవో జారీ చేయడాన్ని రాజకీయ, మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘వార్తలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వడం లేదా ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడం అనేది బాధ్యతగల ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ అది మానేసి, కథనం ప్రచురించిన పత్రికా సంస్థ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలకు అనుమతి ఇవ్వడం ఏమిటి?’ అని పత్రికా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.ఇది ప్రజాస్వామ్యంపై దాడివైఎస్సార్సీపీ నేతలు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీమంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మండిపడ్డారు. సాక్షి దినపత్రిక పబ్లిషర్, రిపోర్టర్‌తో పాటు, వార్త ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీచేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనల్లో ఆక్షేపించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసుకు సంబంధించిన దర్యాప్తు, పరిష్కార ప్రక్రియపై సాక్షి కథనంలో ప్రస్తావించిన అంశాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా ఆ వార్తను ప్రచురించిన పత్రికా ప్రతినిధులపైనే చర్యలకు సిద్ధపడటం అత్యంత దారుణమన్నారు. సమాధానం చెప్పలేక కేసులతో బెదిరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
జగన్‌కు రెడ్ బుక్ ఆంక్షలు.. తిప్పికొట్టిన ప్రజలు..
-
బూతులు తిట్టి.. మర్మాంగంపై కొట్టి..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో పాలక పార్టీల నేతల సేవలో తరిస్తూ పలువురు పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. వారి నుంచి ఫిర్యాదు వచ్చిందే తడవుగా విచక్షణ మరచి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారే శిక్షలు విధిస్తున్నారు. వరుస లాకప్ మరణాలతో రాష్ట్రం హోరెత్తి పోతున్నా కొందరు ఖాకీల్లో ఇసుమంతైనా మార్పు రావడం లేదు సరికదా.. మరింత రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పోలీసుల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మేరకు.. రామచంద్రాపురం మండలం రాయలచెరువులో నివాసముంటున్న సుబ్రమణ్యం (51)కు, పక్కనే నివాసముంటున్న జనసేన మండల అధ్యక్షుడు సంజీవని హరికి శనివారం ఇంటి ముందు నీళ్లు నిలవడంపై చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో హరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ సాయంతో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆపై చంద్రగిరి డీఎస్పీ ద్వారా ఎస్ఐకు ఫోన్ చేసి సుబ్రమణ్యంపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల ఎదుటే సుబ్రమణ్యంను బూటు కాలితో తన్నుకుంటూ.. బూతులు తిడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. హెడ్‌కానిస్టేబుల్ రాజశేఖర్.. పిడిగుద్దులు గుద్దుతూ.. బూటు కాలితో తంతూ, పరుష పదజాలంతో దూషించారు. అనంతరం సుబ్రమణ్యంను దేశ ద్రోహి తరహాలో బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. విచక్షణా రహితంగా కొట్టి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా ఆదివారం మరోసారి సుబ్రమణ్యంను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎలాంటి మహిళా పోలీసులు లేకుండానే ఆయన భార్య నిర్మల, మైనర్ కొడుకు, కూతురు ప్రశాంత్, జయమ్మలను సైతం బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆపై ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ వీరిని అసభ్య పదజాలంతో దూషించారు. తండ్రిని కళ్లెదుటే కొడుతుంటే తట్టుకోలేక కుమారుడు అడ్డుకోబోగా.. అతడ్ని సైతం కొట్టారు. ఆపై వారి కళ్లెదుటే సుబ్రహ్మణ్యం మర్మాంగంపై లాఠీలతో కొట్టారు. ఆదివారం రాత్రి కదల్లేని స్థితిలో అతికష్టంగా ఇల్లు చేరుకున్న బాధితుడు.. అవమాన భారం తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికీ సర్కారు అండ చూసుకుని పోలీసులు చేసిన హత్యే అని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.సెటిల్మెంట్కు పోలీసుల యత్నం ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో పోలీసు పెద్దలు ఆందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబంతో మాట్లాడి పరిహారం ఇచ్చేలా సెటిల్మెంట్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జనసేన నేత సంజీవని హరి కొంత డబ్బు ఇచ్చేలా ప్రామిసరి నోట్లు రాయించి బాధితులకు అందజేసేందుకు యత్నించారు. తాము కూడా కొంత డబ్బు ఇస్తామని బాధితులతో పోలీసులు బేరాలాడారు. ఎలాగైనా కేసును నీరుగార్చేందుకు పోలీసులు, కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
బాబు పాలన అన్నిటా అథమం!
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2024– 25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైంది. అదే బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రెండేళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా రూ.3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రెడ్‌బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా రూ.6,215 కోట్లు కావడం గమనార్హం. ఇక రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొలమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత రెండేళ్లలో ఎంత దారుణంగా పతనమయ్యాయో ఒకసారి పరిశీలిస్తే.. జీఎస్డీపీలో తగ్గిపోయిన జీఎస్టీ వాటా రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. లక్షలాది మందికి ఉపాధి లభించింది... రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు రాష్ట్రంలో ప్రతి నెలా నమోదవుతున్న జీఎస్టీ గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గత రెండేళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీలో 2.20 శాతంగా ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90 శాతానికి పడిపోయింది. 2025–26లో జీఎస్డీపీ రూ.17,62,357 కోట్లుగా ఉంటే అందులో జీఎస్టీ రాబడి కేవలం 1.9 శాతం అంటే రూ.34,301 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. సంపద సృష్టిస్తే జీఎసీడీపీలో జీఎస్టీ వాటా పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని ఆర్థికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతా అప్పులే.. ఆస్తుల్లేవ్ రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిన చోటల్లా అప్పులు చేయడమేగానీ ఆస్తుల కల్పన ఊసే మరిచారు. అన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమాన్ని ప్రజలకు అందించడం లేదు. రెండేళ్లలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ లోపల, బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో ఊహించవచ్చు. అంటే రోజూ రూ.492 కోట్లు అప్పు చేయనిదే బాబు సర్కారుకు పూట గడవడం లేదు. సంపద సృష్టి మాటే లేదు. అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన కొనసాగుతోంది. శాంతి భద్రతల్లో 26వ స్థానం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే 26వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పోలీసు సంస్కరణలు, నేర, న్యాయ చట్టాల అమల్లో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపించింది. కీలకమైన శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం లాంటి అంశాలలో కనుక ర్యాంకులు ప్రకటిస్తే మొదటి స్థానం దక్కేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్య, రెవెన్యూ లోటుల్లో అగ్రస్థానంద్రవ్య, రెవెన్యూ లోటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని కాగ్ కుండబద్ధలు కొట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట నిబంధనలను ఉల్లంఘించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తారస్థాయికి చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ –5.09 శాతం ద్రవ్యలోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఇదే సమయంలో రెవెన్యూలోటు ఏకంగా రూ. –60,285 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో నిలిచింది. 2024–25లో భారీగా అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ అందులో మూలధన వ్యయానికి కేవలం 27 శాతమే వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. చేసిన అప్పులను మూలధన వ్యయానికి కాకుండా ఇతర రెవెన్యూ వ్యయాలకు వెచ్చించటాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక నిర్వహణ విధానం ఎంత దారుణంగా ఉందో వెల్లడవుతోంది. వచ్చినవి రూ.6,962 కోట్లే పోయినవి రూ.6,215 కోట్లు.. రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. రెండేళ్లలో 24 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించేశామంటూ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. గత రెండేళ్లలో ఏపీకి కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో రాష్ట్రంలోకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ప్రసాద తాజాగా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కారు కప్పం వసూళ్లకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిన కోకోకోలా, జ్యూపిటర్, అజాద్ మొబిలిటీ, ఐస్పేస్, జిన్ఫ్రా లాంటి కంపెనీల పెట్టుబడులు రూ.6,215 కోట్లుగా ఉండటం గమనార్హం. అంతేకాదు.. లోక్‌సభలో కేంద్రం మరో ప్రశ్నకు సమాధానమిస్తూ గడిచిన రెండేళ్లలో ఏపీలో 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, తద్వారా 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండేళ్లలో 22,167 ఉద్యోగాలు వస్తే ఇదే సమయంలో 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఈ రెండేళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం రాకపోగా ఉన్న 26,310 మంది ఉద్యోగులను రాష్ట్రం కోల్పోయింది. పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ట్రాల్లో 8వ స్థానంరెండేళ్ల క్రితం దాకా పెట్టుబడుల ఆకర్షణలో మొదటిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది మెట్లు దిగజారిపోయింది. పెట్టుబడిదారుల అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించడం మొదలు పెట్టిన 2019 నుంచి 2023 వరకు సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ స్థానంలో తీసుకొచ్చిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో 8వ స్థానానికి పడిపోయింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 131 మంది పారిశ్రామికవేత్తల నుంచి ఎనిమిదికిపైగా రంగాల పనితీరు ఆధారంగా ఆ ర్యాంకులను ప్రకటించారు. పెట్టుబడుల స్నేహశీల రాష్ట్రాల ర్యాంకుల్లో గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఎనిమిది రంగాల డేటా విశ్లేషణ ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు వస్తే సర్వేలో 22.2 పాయింట్లు లభించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని, రెండేళ్లలో రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం నిజమైతే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. -
ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ
సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు... తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసుల పనితీరును స్పష్టంగా నిర్ధారించింది. అన్ని విషయాల్లోనూ తీసికట్టు అని తేల్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు.. 26వ స్థానానికి దిగజారినట్లు కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడించింది. కానీ రెడ్‌బుక్ అమలులో ఏపీ పోలీసులు అద్భుతమైన నైపుణ్యం సంపాదించారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, అమాయకులపైనా, సోషల్ మీడియా కార్యకర్తలపైనా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం.. ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు.. ఈ విషయాల్లో పాయింట్లు ఇస్తే.. దేశంలో నెంబర్ ఒన్‌గా నిలిచేవారేమో..! దిగజారిన ఏపీ పోలీసు శాఖ ర్యాంకు ప్రజలకు భద్రత, సత్వర న్యాయం అందించడంలో ఏపీ పోలీసు శాఖ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పోలీసు సంస్కరణలు, నేర న్యాయ చట్టాల అమలులో దేశంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపు కుట్రలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న పోలీసు శాఖ సామాన్యులకు న్యాయం అందించాలన్న తన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీసు శాఖల పనితీరుపై కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 26వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. పోలీసు సంస్కరణలలో భాగంగా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎన్ఎస్), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాల అమలుపై కేంద్ర హోమ్ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. నాలుగు విభాగాలుగా దేశంలో పోలీసుల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార – సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్)కు 25 శాతం, పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది. అన్ని విభాగాల్లోనూ దారుణమే ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోమ్ శాఖ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. టాప్ 10లో ఉన్న రాష్ట్రాల్లో పోలీసు శాఖ పనితీరు బాగున్నట్టుగా పరిగణిస్తారు. ఏపీ పోలీసు టాప్ 25లో కూడా స్థానం సాధించలేకపోయింది. దేశంలో 26వ స్థానానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ ఏపీ పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. సంస్కరణల అమలు సక్రమంగా లేదు పరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు 14.84 పాయింట్లు వచ్చాయి. కేసుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తీసుకువచ్చిన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం సంభవిస్తే... అక్కడికి చేరుకున్న దర్యాప్తు అధికారి ఘటనా స్థలంలో స్కెచ్ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని.. ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. స్కెచ్ వేస్తున్న సమయం, సీడీ ఫైల్లో అప్లోడ్ చేసిన సమయం కూడా రికార్డు అవుతాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్‌లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌కు కేవలం ఒక ట్యాబ్‌ను మాత్రమే అందించింది. అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్ మాత్రమే ఉంది. అధికార పార్టీ నేతలు రాజకీయ కక్ష సాధింపుతో పాల్పడిన నేరాలు, అత్యాచారాల దర్యాప్తునకు ట్యాబ్‌లు తీసుకువెళ్లడం లేదు. సమగ్ర దర్యాప్తు ప్రమాణాల్లో వీక్ కీలకమైన శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు తీసికట్టుగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీకి 29.88 పాయింట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నేరాల దర్యాప్తు విధానంపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల దర్యాప్తు ప్రమాణాలు పెంపొందించే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రాదు సమాచార – సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అంశాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందుకే ఐటీసీ విభాగంలో మొత్తం 25 మార్కులకు ఏపీ పోలీసు శాఖ సగం మార్కు కూడా దాటలేకపోయింది. 12.75 మార్కులకే పరిమితమైంది. ఈ విభాగంలో పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర కీలక అంశాల పనితీరును కేంద్ర హోమ్ శాఖ మదించింది. నిందితులను పోలీస్ స్టేషన్‌కు ఎప్పుడు తీసుకువచ్చారు?.. లాకప్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి...? నిందితుడిని న్యాయస్థానానికి ఎప్పుడు తీసుకువెళ్లారు.. మొదలైనవి సీసీ కెమెరాల్లో రికార్డు కావాలి. కానీ రాష్ట్ర రాజధాని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే లాకప్ హత్య చేసి...సీసీ కెమెరాల వీడియో ఫుటేజీని మాయం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. అంత దారుణంగా ఉంది ఏపీ పోలీసు శాఖ పనితీరు. ఇతర శాఖలతో సమన్వయం లేదు నేరాలను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులకు శిక్షలు పడేలా చేయడం కోసం పోలీసు, ఫోరెన్సిక్, వైద్య – ఆరోగ్య, జైళ్ల శాఖల మధ్య సమన్వయం అవసరం. అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖ 7.06 పాయింట్లకే పరిమితమైంది. ఏపీ కన్నా చిన్న రాష్ట్రాలే భేష్పోలీసు సంస్కరణల అమలులో ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. మొత్తం 100 పాయింట్లకు ఏకంగా 95.58 పాయింట్లతో హర్యానా దేశంలో మొదటి స్థానం సాధించగా... 92.86 పాయింట్లతో గోవా రెండో స్థానంలో, 88.37 పాయింట్లతో అస్సాం మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు, అయిదో స్థానంలో దాద్రానగర్ హవేలీ, ఆరో స్థానంలో చండీగఢ్ ఏడో స్థానంలో రాజస్థాన్, ఎనిమిదో స్థానంలో మహారాష్ట్ర, తొమ్మిదో స్థానంలో పంజాబ్, పదో స్థానంలో త్రిపుర ఉన్నాయి. ఏపీ మాత్రం ఎక్కడో అట్టడుగున 26వ స్థానానికే పరిమితమైంది. -
లోకేష్ రెడ్ బుక్ కి మించి.. ల జగన్ 2.0 సూపర్ యాప్ సంచలనం
-
రెడ్ బుక్ వేధింపులు..ఏపీకి గుడ్ బై
-
రెడ్ బుక్ ని చూసుకుని రెచ్చిపోతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
పోలీసులు చితకబాదడం వల్లే నా తమ్ముడు చనిపోయాడు
చంద్రబాబు కర్కశ పాలనలో ఖాకీలు కాలాంతకుల్లా మారుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసుస్టేషన్లు బడుగుజీవుల బలికోరే వధశాలలవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగరంలో పోలీసుల అధికారమదానికి బలైన కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతికుమార్ మరణాలను మరిచిపోకముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై దాష్టీకానికి మరో దళిత యువకుడు ఏడుకొండలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వేధింపులకు మైనార్టీ ఉద్యోగి దరియా హుసేన్ అసువులుబాశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఖాకీలు మోగిస్తున్న ఈ మరణ మృదంగం రాష్ట్రంలో బాబు సర్కారు సాగిస్తున్న రెడ్‌బుక్ నరమేధానికి సజీవసాక్ష్యమై నిలుస్తోంది. రక్షణ చట్టాలకు ఉరితాడు బిగించి వికటాట్టహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎస్కే హనీఫ్ ఖాకీ దుస్తులు ధరించిన క్రిమినల్ మాదిరిగా అరాచకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని చర్చించుకుంటున్నారు. తప్పు చేస్తే నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పర్చాల్సిన ఎస్సై.. నిందితులను, అమాయకులను చచ్చే వరకు కొడుతున్నాడని పేర్కొంటున్నారు. ఆయన అరాచకాలకు ఎన్నో ఉదంతాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. బదిలీపై వచ్చి.. ఈ ఏడాది మే 9వ తేదీన పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన గాలం హరికృష్ణ అనే రైతును టీడీపీ నేతల ఆదేశాల మేరకు అకారణంగా స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీలతో చితకబాదాడు. ఈ సన్నివేశాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు లైవ్‌లో చూపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గూడూరు ఇన్చార్జి డీఎస్పీ దీనిపై విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో ఆ ఎస్సైను మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో 6వ తేదీన బాధ్యతలు చేపట్టారు. చోరీ కేసులో పైశాచికత్వం బంగారం చోరీ కేసులో మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హనీఫ్, కానిస్టేబుళ్లు రెండు రోజుల పాటు స్టేషన్లో వారిని లాఠీలతో కుళ్ల బొడిచారు. ఈ క్రమంలో వారిని ఆదివారం రాత్రి వదిలేసి.. మర్నాడు రావాలంటూ హెచ్చరించారు. సోమవారం ఇద్దరు మాత్రమే స్టేషన్‌కు రాగా ఏడుకొండలు రాలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాధవరావు, మరో కానిస్టేబుల్ కారులో ఏడుకొండలు ఉన్న గ్రామానికి చేరుకుని విచక్షణారహితంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన ఏడుకొండలను కారు డిక్కీలో కుక్కి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్పృహలో లేకపోవడంతో నీళ్లు చల్లి మరీ చావబాదినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఏడుకొండలును గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చోరీ కేసులో కొట్టి చంపొచ్చా..? చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలును అదుపులోకి తీసుకున్న మనుబోలు పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచాలి. కానీ ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నాలుగు సవర్ల బంగారం పోయిందని కేసు నమోదైతే.. నిందితులను కొట్టి, హింసించి 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. వారి నుంచి బంగారం కొనుగోలు చేసిన వారిని బెదిరించి కేసులు పెడతామని మరో 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. చివరకు 2 సవర్లు మాత్రమే రికవరీ చూపించారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్‌కు తరలించి చావబాదడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని స్పష్టమవుతోంది. ఎస్పీ అజిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ అది లాకప్ డెత్ కాదన్నారు. మరి ఎలా చనిపోయాడనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మనుబోలు పోలీస్‌స్టేషన్ వద్ద ఏడుకొండలు మృతదేహంతో ఆందోళనకు దిగిన కాకాణి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గడ్డి మందు తాగి చనిపోయాడంటూ.. ఏడుకొండలు మృతి చెందాడని గుర్తించిన పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేసి మీ అన్న గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోయాడని, ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టాలని తొలుత చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గడ్డి మందు తాగి ఎలా చనిపోతాడని బాధితులు స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. చంపేసి గడ్డి మందు తాగాడని చెబుతున్నారంటూ మండిపడ్డారు. గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోతే నిబంధనల ప్రకారం స్థానిక వీఆర్వో ద్వారా ఫిర్యాదు తీసుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించాలి. కానీ ఏడుకొండల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అసలు గడ్డి మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. పోలీసుల అదుపులో వ్యక్తి ఆస్పత్రిలో శవంగా తేలటాన్ని బట్టి దెబ్బలకు తాళలేకే చనిపోయాడన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పంచనామా రిపోర్టులో ఆ వివరాలేవి? ఏడుకొండలు మృతిపై పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలేనని శవ పంచనామా రిపోర్టే తేటతెల్లం చేస్తోంది. ఏడుకొండలును మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని డ్యూటీ డాక్టర్ చెప్పినట్లు పంచనామా రిపోర్టులో పొందుపరిచారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్లు నిజంగానే గడ్డి మందు తాగి ఉంటే.. పాయిజన్ వాసన వస్తుంది. శరీరం రంగు మారడం లాంటివి జరగాలి. కానీ ఇవేవి లేవు. కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఎక్కడ ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారనే విషయం పంచనామా రిపోర్టులో రాయలేదు. పోలీసులు మొదట చిత్రీకరించిన ప్రకారం.. గడ్డి మందు తాగి చనిపోయి ఉంటే వీఆర్వో ఫిర్యాదు లేకుండా ఎలా తరలించారు? ఎవరి ద్వారా సమాచారం లేకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రాథమికంగా చేపట్టాల్సిన శవ పంచనామా చేయకుండా నేరుగా ఆస్పత్రికి ఎలా తరలించారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. -
బాబు సర్కారు ‘సోషల్’ వేట!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి బరి తెగించి వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తన నిరంకుశ, అరాచక పోకడలను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమైంది! తన తప్పిదాలను ఎండగట్టే సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడం.. అక్రమ కేసులు బనాయించడం.. జైళ్లకు పంపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. సోషల్ మీడియాను కట్టడి చేయడమే పనిగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా, ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న వ్యక్తులు చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే సరిదిద్దుకోవడానికి బదులుగా విద్వేషంతో ఏకంగా ఆ గళాలను పెగలకుండా చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వంలోని వ్యక్తులను అవమానపరుస్తూ దాడులు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచార శాఖ మంత్రి కె. పార్ధసారధి మీడియాతో పేర్కొన్నారు.ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారని చెప్పారు. సోషల్ మీడియా దుర్వినియోగం ఆరోపణలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సమాజానికి ఒక రోగంలా మారింది..!సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ విద్వేషాలు, వ్యక్తిత్వ హననం, దాడులు చేసే వారిని గుర్తించేందుకు ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా పోలీసు శాఖను సీఎం ఆదేశించారని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఐటీ చట్టంలోని లొసుగులు, లోపాలతో తప్పించుకుంటున్నారని.. ఆ చట్ట పరిధిలో న్యాయస్థానాల పనితీరుపైన, కేసులు నడుస్తున్న తీరుపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. సోషల్ మీడియా సమాజానికి ఒక రోగంలా మారిందని, ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ కలిగిస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను అవమాన పరిచేందుకు, ప్రజల్లోకి అబద్ధాలను తీసుకువెళ్లడానికి కొన్ని పార్టీలు, వ్యక్తులు సోషల్ మీడియాకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఆ రాజకీయ పార్టీలను, వ్యక్తులను గుర్తించారా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఎవరినీ గుర్తించలేదని, ప్రొసీజర్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకున్నామని , అందుకు అనుగుణంగా విచారణ జరిపిన తరువాత ఎవరు ఉన్నారనేది తెలుస్తుందని చెప్పారు. మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాచార, సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత..వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం, దుష్ప్రచారం నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం... సోషల్ మీడియా నేరాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, న్యాయపరమైన వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం లాంటి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానించి మద్దతు అందిస్తామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థంగా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గం పరిశీలించాక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పసుపు కార్యాలయాలకు పచ్చజెండా..!» అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెందిన 2 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు ఆమోదం. » గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో 0.50 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం. » అనంతపురం జిల్లా రాయదుర్గంలో 50 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం.» ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయంలో నెలకు రూ.70,000 వేతనంతో అవుట్ సోర్సింగ్‌పై కెమెరామెన్ పోస్టుకు ఆమోదం.» 2024 జూన్ 12 తర్వాత రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన యజమానులకు పదేళ్ల పాటు కౌలు చెల్లించేందుకు ఆమోదం. ఏడాదికి యాన్యుటీ మెట్ట భూములకు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంపు. జరీబు భూములకు యాన్యుటీ ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచేందుకు ఆమోదం. » రాజధానిలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు 12 నెలల పాటు అద్దె కింద నెలకు రూ.10,000 చొప్పున చెల్లింపునకు ఆమోదం. » ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి వచ్చే పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో రుణమాఫీ పథకానికి ఆమోదం. -
నీ మోకానికి ఒక్క సబ్జెక్టు పాస్ అయ్యావా.. రెడ్ బుక్ ఒకటి మాత్రం పట్టుకుని..
-
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్‌డెత్‌లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్‌తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్‌కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్‌లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్‌కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్‌కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో భీతావహ పాలన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు తాము అత్యంత భయపడేది పోలీసులకేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రెడ్‌బుక్ పాలన సృష్టిస్తున్న భీతావహ ఘటనలను దేశం దృష్టికి తీసుకొస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు, రహస్యంగా దహనం.. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో, శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకున్న కళావతి, కర్నూలు జిల్లాలో విచారణ పేరుతో పోలీసుల చిత్రహింసల కారణంగా దళిత మహిళ గంగమ్మ మరణించిందనే ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరడాన్ని ఆ పోస్టులో వైఎస్ జగన్ ప్రస్తావించారు. ‘ఏపీలో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దేశం దృష్టికి తీసుకొస్తూ వైఎస్ జగన్ చేసిన పోస్టు సంచలం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే.. హలో ఇండియా! చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందిఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు అత్యంత భయపడేది పోలీసులకేనా? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్), అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు.. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు కేవలం విషాద ఘటనలు మాత్రమే కావు. ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ పాలన’ పెంచి పోషిస్తున్న ప్రమాదకర సంస్కృతికి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగం పోలీసు వ్యవస్థకు నిర్వచనంగా మారుతోంది.ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా?రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రకటించిన నాడే వైఎస్సార్సీపీ ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే.. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, వ్యవస్థలు కలుషితమవుతాయని.. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాలు, నిబంధనలను మీరి, వాటికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఈ రోజు చేదు నిజంగా మారింది. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా మారారు.తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ తర్వాత జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ ధోరణి.. ఇప్పుడు అదుపు తప్పిన పోలీసింగ్‌గా మారింది. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా పోలీసుల వేధింపులకు, బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి బాధితులుగా మారుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది. తన కుమారుడి ఆచూకీ కోసం, కనీసం అతని అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి ఈ రోజు అధికారులను వేడుకుంటోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా? క్రాంతికుమార్ ఘటన కూడా అంతే ఆందోళనకరం. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను పోలీసులు వేధిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తూ, సంబంధిత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు.తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగా మరణించిందని ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు.. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రమాదకర ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.సీఎం, హోం మంత్రి, డీజీపీ వైఖరే కారణంఅదే సమయంలో పోలీసుల దాష్టీకాలు సాధారణం అయిపోయాయి. కోడి కోశారన్న, మేక కోశారన్న చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తులు, జడ్జిలు పాత్రలన్నీ తామే పోషిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. కేసులు నమోదు చేయడం లేదు. ఈ బరితెగించిన ద్వంద్వ వైఖరి, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది.ఈ పరిస్థితికి రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. దిగజారిన ఈ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాల బాధ్యతల నుంచి వారు తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ.. రెడ్‌బుక్ పాలన కాదు. పోలీసులు ఉన్నది ప్రజల హక్కులను పరిరక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, న్యాయం అందించడానికే గానీ రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే.. చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే.. చివరకు ప్రజాస్వామ్యమే బలవుతుంది’ అని పేర్కొన్నారు. -
లాకప్‌లలో... మరణ మృదంగం
సాక్షి, అమరావతి, ఆదోని: విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేయడం అన్నది చంద్రబాబు ప్రభుత్వం అధికారిక విధానంగా చేసుకున్నట్లుంది! అందుకే బిగ్‌బాస్ నుంచి రాష్ట్రంలో జిల్లాస్థాయి అధికారుల వరకూ అదే ఖాకీ మార్కు క్రౌర్యాన్ని బరితెగించి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ పోలీసులు యథేచ్ఛగా సాగిస్తున్న లాకప్ మరణాల దారుణాలు మరిన్ని బట్టబయలవుతున్నాయి. విజయవాడలో సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం ఇప్పటికే సంచలనంగా మారగా.... క్రాంతికుమార్ అనే దళిత యువకుడు పోలీసుల థర్డ్ డిగ్రీ వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు ఓ దళిత మహిళను విచారణ పేరుతో పాశవికంగా కొట్టి చంపేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అమానుష కాండపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో తమ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు బిగ్‌బాస్ నేతృత్వంలో పోలీసులు కొత్త కుట్రకు తెర తీస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..దళిత మహిళపై పోలీసుల క్రౌర్యంకర్నూలు జిల్లా కౌతాళం గ్రామానికి చెందిన గంగమ్మ అనే దళిత మహిళను పోలీసులు ఓ కేసులో తమదైన శైలిలో విచారించారు. ప్రత్యేకంగా ఏర్పడిన సిట్ అధికారులు విచారణ సమయంలో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అచేతనంగా పడిపోయారు. ఆమె చనిపోయిందని గ్రహించడంతో రాయలసీమలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారిని సంప్రదించారు. ఆయన సూచనలతో పక్కాగా కథ నడిపించారు. అందుకు గంగమ్మ కుమార్తెను తమదైన శైలిలో బెదిరించి అనుకూలంగా మలచుకున్నారు.గంగమ్మ కాలుజారి పడిపోయి చనిపోయిందని ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాలు జారిపడిపోతే పోలీసులు ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం ఏముందీ అంటే... లాకప్ మరణాన్ని కప్పిపుచ్చేందుకు ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు ఈ ఎత్తుగడ వేశారన్నది స్పష్టమవుతోంది. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య గంగమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, దళిత సంఘాల ఆదోళనతో ప్రభుత్వం తూతూ మంత్రంగా స్పందించింది.హైకోర్టులో పిటిషన్..గంగమ్మను ఖననం చేశారనే విషయాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గంగమ్మ డీఎన్ఏ శాంపిల్స్‌ను భద్రపరిచి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని పూర్తి వివరాలతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దాంతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడలపై బిగ్‌బాస్, రాయలసీమ అనకొండ ఐపీఎస్ తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. గంగమ్మ లాకప్ మరణం ఉదంతంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు గంగమ్మతో పాటు కస్టడీలోకి తీసుకున్న 47 ఏళ్ల బ్యాగారి దర్గప్ప ఖాకీ దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. మర్డర్ కేసు నమోదు చేయాలి..కస్టోడియల్ టార్చర్‌లో లాకప్ డెత్ జరిగితే వెంటనే సదరు పోలీసు అధికారులపై మర్డర్ కేసు బుక్ చేయాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది. దొంగతనం చేశాడన్న ఆరోపణలు వస్తే ముందుగా కేసు రిజిస్టర్ చేస్తున్నారా లేదా? విచారణలో దొంగతనం చేయలేదని తేలితే వదిలేస్తారు. అదేవిధంగా కస్టోడియల్ టార్చర్‌లో లాకప్ డెత్ జరిగితే తక్షణమే పోలీసులపై కేసు రిజిస్టర్ చేయాల్సిందే. సిట్ వేస్తాం, ఐపీఎస్ అధికారితో విచారణ జరిపిస్తామంటే కుదరదు. ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే.. ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అన్నది కోర్టు రుజువు చేస్తుంది. అంతేగానీ స్టేషన్లలో పోలీసులు కాదు. రాజస్థాన్‌లో ఒక ఎంపీని చంపితే 30 ఏళ్ల తర్వాత 15 మంది పోలీసు ఆఫీసర్లు జైలుకెళ్లారు. వీరిలో రిటైర్ అయిన వారూ ఉన్నారు. ఒకాయనకు 82 ఏళ్లు. అయినా జైలుకు పోక తప్పలేదు.– డాక్టర్ బి.పురుషోత్తమరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది -
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేసి.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎత్తి చూపారు. చంద్రబాబు మోసాలను ఎవరైనా ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో అణగదొక్కే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి.. మిగిలింది మూడేళ్లు మాత్రమే.. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది.. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుందని స్పష్టం చేశారు. ‘వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలకమైన సమయం.. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. మీరు ప్రజల కోసం నిలబడండి.. వారి కోసం కష్టపడండి.. మీ అందరి బాధ్యత నాది. నేను స్వయంగా చూసుకుంటాను.. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.. అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే కొనసాగిస్తాం’ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతోన్న వైఎస్ జగన్.. ఆ దిశలో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలు, నాయకులను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ఏజెన్సీలో అభివృద్ధి ప్రాజెక్టులతో గిరిజనులకు మేలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..మన పాలన, చంద్రబాబు పాలనపై ప్రతి ఇంట్లో చర్చ » ‘ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్‌ను చూశాం.. ఆయన ఐదేళ్ల పాలన చూశామని, ఆ పాలనకు, ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడా ఏమిటనేది ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించామని గర్వంగా చెబుతున్నా. » మనం రాక ముందు వరకు మేనిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ప్రజలకు ఎన్నెన్నో చేస్తామని ఎన్నికల్లో మాట చెప్పి, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. అదే మనం వచ్చాక, తొలిసారిగా మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి, 99 శాతం అమలు చేసిన పార్టీ ఒక్క మన వైఎస్సార్సీపీ మాత్రమే. బడ్జెట్ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశాం.» మనం రాకముందు స్కూళ్లు ఎలా ఉండేవి? మనం వచ్చిన తర్వాత ఎలా మారాయి?.. అనేది నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. మనం రాక ముందు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండేది? మనం వచ్చాక ఆరోగ్యశ్రీని ఎంత బాగా అమలు చేశాం.. అనేది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. మనం వచ్చిన తర్వాత రైతన్న ఎలా బాగుపడ్డాడు.. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు గ్రామాల్లో ఏ పథకం అందక, పరిపాలన అందక, దేనికైనా ఎవరెవరికో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, పాలన ఎలా మారింది? గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందాయి? అన్నీ చేసి చూపించాం. » సచివాలయాల వ్యవస్థ.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్. ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని గొప్ప మార్పులు తీసుకురాగలిగాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పించాం. వారికి తోడుగా నిలబడ్డాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను సచివాలయంలో ఉంచాం. గిరిజనులు.. గిరిజన ప్రాంతాల్లో మార్పులు » ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా మన హయాంలోనే జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 3,22,528 ఎకరాలు, ఆర్ఓఎఫ్ఆర్ డీకేటీ భూముల భూ పట్టాలు పంపిణీ చేశాం. ఒక్క రంపచోడవరంలోనే 20 వేల మందికి 80 వేల ఎకరాల భూముల ఆర్ఓఎఫ్ఆర్ డీకే పట్టాలు పంపిణీ చేశాం. » ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, వాటిలో ఒక్క మన ప్రాంతంలోనే పాడేరు, పార్వతీపురంతో పాటు, ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు తెచ్చాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మన గిరిజనులు బాగు పడాలి.. వారు చదువుల్లో ముందుండాలన్న ఆరాటం కేవలం మన ప్రభుత్వంలోనే కనిపించింది. » ఎప్పుడూ చూడని విధంగా ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో తలపెట్టి, వేగంగా పనులు చేశాం. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని గర్వంగా చెప్పగలను. ఒక తపన, తాపత్రయంతోనే ఇవన్నీ చేశాం. మనుషుల జీవితాలు బాగు పడాలి. వారి బతుకులు మారాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న తపనతో పని చేశాం.ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారుచంద్రబాబుకు ఎందుకు ఓటేశాం? జగన్‌ను ఎందుకు పోగొట్టుకున్నామనే విషయంపై ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుంది. అంతా అన్యాయమైన పాలన. చంద్రబాబు మోసాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు. రెడ్‌బుక్ రాజ్యాంగం.. అందరినీ కోరేది ఒక్కటే. చీకటి ఎప్పటికైనా పోతుంది. వెలుగు రాక తప్పదు.ఎన్నికల ముందు వారేం చెప్పారు?ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో బాండ్లు పంపారు. ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా? అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని చెప్పారు. 18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? రెండేళ్లు గడిచాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి పిల్లాడికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మరోవైపు అమ్మ ఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే. కొందరికి రూ.13 వేలు ఇచ్చారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానన్నాడు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితం అన్నారు. రెండేళ్లలో రెండు మాత్రమే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలేదు.పేదల పక్షాన నిలబడండి.. జగన్ 2.0లో మీకే అధిక ప్రాధాన్యం ఇంకా మూడేళ్లు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి. ఈ రెండేళ్లు చాలా ముఖ్యం. ఈ కాలంలో పార్టీని మోయాల్సిన బాధ్యత, బాధితులైన ప్రజల పక్షాన పార్టీ తరఫున నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందని మర్చిపోవద్దు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. గత పాలనలో మన కార్యకర్తలను అంత బాగా చూసి ఉండకపోవచ్చు. మనం రాగానే కోవిడ్ రావడంతో, రెండేళ్లు పరిపాలన మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. కానీ, ఈసారి అలా ఉండదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతుల మీదుగానే అందిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పేదలకు అండగా, తోడుగా ఉండండి. అది మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మిగతా అన్ని విషయాల్లో మీకు తోడుగా నేనుంటాను’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో కార్యకర్తలు ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరఫున పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే పరిహారం ఇస్తామని చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నాగులాపల్లి ధనలక్ష్మితో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై విమర్శలు చేశారని మంత్రి టీజీ భరత్.. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మంత్రి భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. -
దేశద్రోహం.. మనోళ్లే వదిలేద్దాం!
‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఓ అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ, ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి : ‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం.. సమగ్ర విచారణ లేకుండా కనికట్టు చేస్తాం.. అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతోంది. ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టులే గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొందరు పోలీసులను హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశ పూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైనా ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ లేకుండా విషయాన్ని కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇలా ఉంది. ఏవోబీలో మావోయిస్టులకు కీలక పరికరాలు, నిధులు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్టు సంస్థకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్టు పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో ఆయన మావోయిస్టులకు భారీగా నిధులు సమకూర్చడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వర్గాలు గుర్తించాయి.ఎస్ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలీ కమ్యూనికేషన్ పరికరాలు (నిఘా పరికరాలు), బంగారం, నగదు, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్టు విచారణలో వెల్లడైంది.ఎన్నో ఏళ్లుగా ఆ కాంట్రాక్టు్ట సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌ను అరెస్టు చేశారు. దేశ ద్రోహ నేరంగా యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం, టెలీగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సహయం అందిస్తోంది.. మావోయిస్టులను ఏఏ ప్రాంతాల్లో కలుస్తున్నది.. ఈవ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులెవరనేది గుర్తిస్తారని అంతా భావించారు. కుట్రతో కేసును నీరుగార్చిన అధికారి ⇒ సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగ ప్రవేశం చేశారు. టీడీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ కేసులో బడా కాంట్రాక్టు సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కు అయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే, బరితెగించి పక్కాగా కేసును నీరుగార్చేందుకు కథ నడిపారు. ⇒ నిబంధనల ప్రకారం సంఘటన స్థలంలో అరెస్టు అయిన కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌నే కాకుండా నిధులు అందించిన కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే యజమాని ఇచ్చిన నిధులు, పరికరాలనే మేనేజర్ మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం కేవలం మేనేజర్‌పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టు సంస్థ యజమానిని కనీసం పిలిచి విచారించనూ లేదు. ⇒ యూఏపీఏ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. చార్జ్‌షిట్ దాఖలు చేయాలి. కానీ ఐపీఎస్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో తాను చెప్పింది చెప్పినట్టు చేసే ఓ సీఐకి విచారణ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో చార్జ్‌షిట్ దాఖలు చేయించారు. ⇒ యూఏపీఏ కేసులను జిల్లా కేంద్రంలోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం విచారించాలి. కానీ ఐపీఎస్ అధికారి ఆ కేసును అరకు న్యాయస్థానంలో విచారణకు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కూడా పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. ⇒ఈ నేపథ్యంలో దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరం కేసులో కూడా నిందితులను న్యాయస్థానం విడిచిపెట్టింది. పైగా అరకు న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ఆ బడా కాంట్రాక్టర్ తమకు అస్మదీయుడు కావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చూసీ చూడనట్టు వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమగ్ర విచారణకు ఆదేశం ⇒ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు విషయం బయటపడింది. ఆ కాంట్రాక్టు సంస్థ సమకూర్చిన నిధులతోనే 2018లో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి బృందం అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారని కూడా గుర్తించింది. ఎంతో మంది పోలీసులను హతమార్చడానికి కూడా ఆ నిధులనే వాడుకున్నారని వెల్లడైంది. దేశ ద్రోహానికి పాల్పడిన కేసులో నిందితులకు పోలీసులు అండగా నిలవడం ఏమిటని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ⇒ ఫలితంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా ఎస్పీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నంలోని ఏడీజే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. ⇒ దాంతో బడా కాంట్రాక్టరు, ఐపీఎస్ అధికారి (ఆయన అప్పటికి అమరావతికి బదిలీ అయ్యారు) బెంబేలెత్తారు. కేసు సమగ్రంగా విచారిస్తే ఇద్దరి బాగోతం బయట పడుతుందని ఆందోళన చెందారు. అందుకే విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత కథే⇒ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పోలీసు శాఖ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బడా కాంట్రాక్టర్, అవినీతి ఐపీఎస్ అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. ఇక ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తూ బరితెగించి ‘అవినీతి అనకొండ’గా చెలరేగిపోతున్నారు.⇒ ఈ కేసును సమగ్రంగా విచారిస్తే వారిద్దరి బాగోతం బయట పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పోలీసు శాఖలో కొందరు సూచించారు. ⇒ హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలి. లేకపోతే ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే శాశ్వతంగా మూసి వేసినట్టు అవుతుంది.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలిపోతుంది.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఇతర కుటుంబాలను అవమానించినట్టు అవుతుందని వారు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం మాత్రం సుముఖంగా స్పందించలేదని తెలుస్తోంది.⇒ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేందుకు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా 90 రోజుల గడువు ముగిసేలా చేయాలన్నదే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం, ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్, రెడ్‌బుక్ వేధింపులకు అండగా నిలుస్తున్న అవినీతి ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా దేశద్రోహం కేసునే అడ్డగోలుగా మూసి వేసేందుకు బరితెగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్‌బుక్ కుట్రలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై మైన్స్ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్ డీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు. -
రాజకీయ స్వలాభం కోసమే.. బాబు చెప్పు చేతుల్లో ఏపీ పోలీసులు
-
అది రెడ్ బుక్ కాదు.. అది బ్లడ్ బుక్! తండ్రి కొడుకులపై రజిని ఫైర్
-
సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్
-
కిల్లర్ పార్టీ ?.. 23 నెలల్లో 740 దారుణ హత్యలు
-
లోకేష్ రాసిపెట్టుకో... నా ప్రాణం పోయినా సరే అబ్బా కొడుకుకు అంబటి వార్నింగ్
-
కర్రలు.. రాళ్లతో దాడులు.. భయపడేలా అక్రమ కేసులు.. బాబు, లోకేష్ విధ్వంస పాలన
-
పోలీసు కస్టడీలో పూడి శ్రీహరి
-
సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్.. ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై రెడ్ బుక్
-
అర్చకులపై రెడ్‌బుక్ టెర్రర్
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. దిగజారుడు రాజకీయం ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. -
హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి తన మార్కు హత్యా రాజకీయ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెర తీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించినా, టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగజారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దాంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరోసారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు దిగజారుడు రాజకీయం వైఎస్సార్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘకాలంగా వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతాయన్నది వైఎస్సార్ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతుండటం గమనార్హం. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అనే కొత్త ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఆస్తుల విషయంలో గొడవతోనే ఆయన్ను హత్య చేశారని నిధారార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కాగా ఆ ఆరోపణలను హతుడు దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించడం గమనార్హం. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని ఆమె తేల్చి చెప్పారు. అసలు తన భర్త పెద్ద దస్తగిరికి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు పేరిట కుతంత్రం ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్సై రాజేశ్వర రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్‌లో ఉన్న బాలస్వామిరెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించారు. ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామి రెడ్డి నేతృత్వంలో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించ లేదు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేహత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. తన ప్రభుత్వ హయాంలో ఇంకెంతగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు.. అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యటీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలేదు. 1985 అక్టోబరు 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరామ్‌ను దారి కాచి మరీ దారుణంగా దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం గమనార్హం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్‌ను హత్య చేశారన్నది స్పష్టమైంది. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యచంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజా రెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు. వంగవీటి రంగా దారుణ హత్యవిజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను పాశవికంగా హత్య చేశారు. టీడీపీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నందునే చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ హత్యకు తెగబడ్డారని పరిశీలకులు స్పష్టం చేశారు. ఆ హత్యలో స్వయంగా పాల్గొని నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల నుంచి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కూడా విశాఖ టీడీపీలో ఈయన కీలకమే. కాగా, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి నారాయణ రెడ్డితోపాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది.ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించే వారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం. మహానేత వైఎస్సార్‌కే నేరుగా బెదిరింపు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2009లో ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విస్మయ పరిచాయి. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’ అని చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని బెదిరించడం గమనార్హం. అనంతరం కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు. దాంతో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన హెచ్చరికలను పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు కూడా. 2024 నుంచి రెడ్‌బుక్ అరాచకం 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్‌బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయ పరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలిచింది. -
కుదిరితే అరెస్ట్.. లేదంటే నరుకుడే.. ఆంధ్రాలో అరాచకాలు
-
కాకర్లపై రెడ్ బుక్ అరాచకం.. శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్..
-
రెడ్ బుక్ అరాచకం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఆయన ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్‌కు బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్ కుమార్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్‌కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్ కుమార్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్ స్టేషన్లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు. శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.హెబియస్ కార్పస్ పిటిషన్‌తో... కిడ్నాప్ పన్నాగానికి తెర...శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను సోషల్ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్ఎస్ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు. -
వెంట్రుక కూడా పీకలేవు .. నీకు ఇక మంగళమే, బాబుకు పేర్ని నాని వార్నింగ్
-
‘పచ్చ’ నేతలకు జీ హుజూర్!
సాక్షి, అమరావతి: ప్రాణాలకు రక్షణ కల్పించండి అని పోలీసు స్టేషన్లో బాధితుడు గగ్గోలు పెట్టినా దిక్కులేదు.. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఓ యువతి కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోనే పరిస్థితి లేదు.. ఫలితంగా ఆ ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. అసలు ప్రజల భద్రత తమ బాధ్యతే కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అధికార టీడీపీ కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడానికి అలవాటుపడ్డ పోలీసు శాఖ.. అసలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారుతున్నాయి. సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు ఇలా ఉన్నాయి.రక్షణ కల్పించమంటే ముఖం చాటేసిన పోలీసులుతన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసు స్టేషన్లోనే బాధితుడు వేడుకున్నా కడప పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించలేని పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. గంజాయి బ్యాచ్ ఏకంగా కడపలోని రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ ఆ యువకుడిని హత్య చేసింది. కడపలోని అలంకాపల్లిలో 4వ తేదీన జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. జాతర సందర్భంగా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసినా, ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జాతరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే పోలీసులు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు.మరోసారి ఆ వర్గాలు ఘర్షణ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇరువర్గాల మధ్య గత ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. ఏకంగా గంజాయి బ్యాచ్‌లు రంగంలోకి దిగి కత్తులు పట్టుకుని మరీ వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గంజాయి బ్యాచ్ చేతిలో తీవ్రంగా గాయపడిన పెద్ద దస్తగిరిని కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడం గమనార్హం. ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలనే విషయాన్ని పోలీసులు పట్టించుకోనేలేదు. కాసేపటి తర్వాత వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. తాను బయటకు వెళితే గంజాయి బ్యాచ్ చంపేస్తుందని ఆయన వాపోయారు.అయినా పోలీసులు వినిపించుకోలేదు. ‘పోలీస్ స్టేషన్లో ఉండొద్దు.. వెళ్లిపోండి.. రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మీరే చికిత్స చేయించుకోండి’ అని ఆదేశించారు. కనీసం రిమ్స్ ఆస్పత్రి వరకు తోడు రావాలని ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో పెద్ద దస్తగిరి ఒక్కరే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన్ను ఆసుపత్రి సిబ్బంది వార్డులో చేర్చుకుని చికిత్స చేశారు. కాగా అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి బ్యాచ్ ఏకంగా రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ దస్తగిరిపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. అందరూ చూస్తుండగానే కత్తులతో స్వైర విహారం చేసి పాశవికంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది.తన ప్రాణాలకు హాని ఉందని పెద్ద దస్తగిరి ఎంతగా చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన ఇరువర్గాలను వెంటనే పంపించి వేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు. దాంతోనే బాధితులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎంతగా వాపోయినా సరే పోలీసులు పట్టించుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. ఫలితంగా గంజాయి బ్యాచ్ బరితెగించి హత్యకు పాల్పడింది. టీడీపీ నేతల అండదండలు ఉన్న గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించడంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి తటపటాయించారని తెలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడితోనే బాధితులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించి వేశారని సమాచారం.ప్రాణహాని ఉందన్నా పోలీసులు బేఖాతరుకుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఓ కొత్త పెళ్లి కూతురు ఎంతగా వేడుకున్నా పల్నాడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకంగా ఓ పరువు హత్యకు సహకరించడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. ఈ ఉదంతం బయట పడటంతో సీఐని సస్పెండ్ చేసి పోలీసు శాఖ కనికట్టు చేస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతోనే ఆ సీఐ అలా వ్యవహరించారని సమాచారం. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చౌడేశ్వరి కనిపించడం లేదని ఆమె తండ్రి చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేజర్లు అయిన చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ద్వారా కథ నడిపించారు. ఆమెను తమకు అప్పగించేలా మాచర్ల పోలీసులను ఆదేశించాలన్నారు. టీడీపీ నేతల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి సమ్మతించారు. మాచర్ల సీఐ వెంకటరమణతో కూడా చంద్ర శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. ఆయనకు రూ.6.50 లక్షలు లంచం ఇచ్చారు. ఓ వైపు పోలీసు ఉన్నతాధికారి ఆదేశించగా, మరోవైపు భారీగా లంచం కూడా ముట్టడంతో సీఐ వెంకటరమణ చెలరేగిపోయారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, చంపేస్తారని తాను వెళ్లనని ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినా సీఐ తురకా వెంకట రమణ వినిపించుకోలేదు. మేజర్ అయిన తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని చెప్పినా వినకుండా చౌడేశ్వరిని తీవ్రంగా బెదిరించారు.ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫలితంగా తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని చంద్ర శ్రీను గత నెల 18న హత్యచేశారు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పరువు హత్య వ్యవహారం, అందుకు సహకరించిన సీఐ వెంకటరమణ బాగోతం బయట పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు శాఖ సీఐ వెంకటరమణను సస్పెండ్ చేసింది. కానీ చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆయన పాత్రను పోలీసు శాఖ కప్పిపుచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
ఊర్లోకి వస్తే చంపేస్తాం.. పల్నాడులో రెడ్ బుక్ పడగ
-
జగన్ కు ఎదురు రావాలని చూడకు.. తట్టుకోలేవు
-
Sunil Naik : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి బీహార్ ఝలక్
-
రెడ్‌బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమాగుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.రెడ్‌బుక్ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజురాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్‌బుక్ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. -
రెడ్‌బుక్ రివర్స్.. బిహార్‌లో బేజార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ అరాచకాలకు బిహార్ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది! రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్‌లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. ప్రస్తుతం బిహార్‌లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేస్తామని కూడా వ్యాఖ్యానించింది. దాంతో బిహార్‌లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్క మొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చి తీవ్ర అవమానభారంతో వెనుదిరిగారు. యావత్ దేశంలో సంచలనంగా మారిన ఏపీ పోలీసుల రెడ్‌బుక్ అరాచకం ఇలా ఉంది..!! కిడ్నాపర్ల మాదిరిగా ఏపీ పోలీసులు.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచి్చన ఫిర్యాదుపై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరితెగించి వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్ పోలీసు శాఖకు రెడ్‌బుక్ టాస్క్ ను అప్పగించారు. దాంతో గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించి దర్యాప్తు పేరిట దళిత, గిరిజన ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. అందుకోసం అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయినా సరే ఈ కేసు దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో సీఐడీ డీఐజీగా పని చేసిన గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.ప్రస్తుతం బిహార్‌లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి సోమవారం తెల్లవారుజామున సునీల్ నాయక్ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టిముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్ నాయక్ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు వందమంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు... కేసు డైరీ, వారెంటూ లేదు.. బిహార్ అగ్ని మాపక శాఖ డీజీతోపాటు పలువురు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు అక్కడకు చేరుకుని గట్టిగా నిలదీయడంతో ఏపీ పోలీసుల బండారం బయటపడింది. తాను ఎస్పీనని.. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు వచ్చామని దామోదర్ చెప్పడంతో బిహార్ పోలీసు అధికారి, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా ఏపీ పోలీసులు తెల్లమొహం వేశారు. పోనీ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు..? కేసు డైరీ ఉందా..? ఎఫ్ఐఆర్ కాపీ ఉందా..? స్థానిక కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్ ఉందా..? అని నిలదీయడంతో అవేవీ తమ వద్ద లేవని బదులిచ్చారు. అసలు సునీల్‌నాయక్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని న్యాయవాదులు గుర్తు చేయడంతో ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. అయినా సరే.. 35 బీఎన్ఎస్ఎస్ కింద సునీల్‌నాయక్‌ను తాము అరెస్టు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.అయితే ఆ నిబంధన కింద అరెస్టు చేసేందుకు వారికి అధికారం లేదని న్యాయవాదులు అభ్యంతరం తెలిపినా ఆలకించలేదు. ఆయన్ను అరెస్టు చేశామని, తమతో తీసుకువెళ్తామని మొండిగా వాదించారు. సునీల్‌నాయక్‌ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో బిహార్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. వంద మందికిపైగా పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసు బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడకు చేరుకున్న పట్నా ఎస్పీ (ఈస్ట్) భానుప్రతాప్‌సింగ్ ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ నాయక్‌ను మీరు అరెస్టు చేశామనుకుంటే అనుకోండి..! కానీ ఆయన్ను మా అనుమతి లేకుండా... న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఏపీ పోలీసులపై పట్నా కోర్టు ఫైర్.. సునీల్ నాయక్ అరెస్టుకు ‘నో’ ఈ క్రమంలో సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు సోమవారం ఉదయం పట్నా కోర్టును ఆశ్రయించారు. బిహార్ ఐపీఎస్ అధికారిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఓ ఐపీఎస్ అధికారి నివాసంలోకి ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం గోడదూకి చొరబడటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పట్నా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.సునీల్ నాయక్‌ను అరెస్టు చేశామని చెబుతూ, ఏపీకి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. దీనిపై బిహార్ పోలీసుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. అనంతరం సునీల్ నాయక్‌ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పట్నా కోర్టు సునీల్ నాయక్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్ నాయక్‌కు వ్యతిరేకంగా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించింది. సునీల్ నాయక్‌పై 30 రోజుల వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఎస్పీ దామోదర్ బృందం బిహార్‌లో భంగపాటుకు గురైంది. ఏపీ డీజీపీ vs బిహార్ డీజీపీసునీల్ నాయక్ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసికొట్టడంతో నాలు క కరుచుకున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఫోన్లో బిహార్ డీజీపీ వినయ్‌కుమార్‌తో మాట్లాడించినట్లు సమాచారం. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బిహార్ డీజీపీ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఐజీ సునీల్ నాయక్ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి.ఈ రోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు. ఆయన్ను ఎత్తుకు పోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్‌లో నా బంగ్లాలోకి కూడా అక్రమంగా ప్రవేశించి నన్నూ ఎత్తుకుపోతారేమో..’ అని తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఐపీఎస్ అధికారిని అపహరించేందుకు యత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.బందిపోటు దొంగల్లా వచ్చారు..! బిహార్‌కు చెందిన ఐజీ సునీల్ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు. ఏపీకి చెందిన ఎస్పీ స్థాయి అధికారి గోడదూకి సునీల్‌నాయక్ నివాసంలోకి చొరబడ్డారు. ఏపీ పోలీసులు ఎటువంటి నిబంధనలను పాటించలేదు. వారి వద్ద అరెస్టు వారెంటూ లేదు.. కేసు డైరీ లేదు.. ఎఫ్ఐఆర్లో కనీసం సునీల్ నాయక్ పేరు లేదు. బిహార్ వచ్చి ఏదైనా చేయవచ్చని అనుకుంటే ఎలా..? ఏపీ పోలీసుల తీరును పట్నా కోర్టు తప్పుబట్టింది. సునీల్ నాయక్‌ను అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. – శ్రీవాస్తవ్, కునాల్ తివారీ, సునీల్‌నాయక్ తరపు న్యాయవాదులు -
ఆ రోజు రాత్రి 12 గంటల వరకు.. లోకేష్ రెడ్ బుక్ కు కుక్కలు కూడా లెక్క చెయ్యవు
-
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారాయణస్వామి, కుమార్తె కృపాలక్ష్మి
-
హిందూ మఠాలపై చంద్రబాబు రెడ్‌బుక్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ బాధ్యతారహితమైన ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అవి అసత్యాలని సీబీఐ–సిట్ దర్యాప్తులో తేలడంతో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తన అబద్ధాలను నిజం చేయించుకోవాలని, అవమానకర పరిస్థితుల నుంచి బయటపడాలని రోజుకో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హిందూ ఆధ్యాత్మిక మఠాలపైనే తన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు, ప్రతిష్టను దెబ్బతీసే అపవిత్ర కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవోలో ఓ అధికారికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, టీటీడీలో కొందరు అధికారులు వీరికి సహాయపడుతున్నారు. దక్షిణాది సహా దేశంలోని హిందూ ఆధ్యాత్మిక మఠాలకు వెళ్లి వారిని ఒత్తిళ్లకు గురిచేసి, అసత్యాలు చెప్పి తనకు అనుకూలంగా మఠాధిపతుల చేత లేఖలు విడుదల చేయించడం, వాటిని తమ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించి, దుర్బుద్ధితో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్ద జీయంగార్పై కొద్దిరోజులుగా ఒత్తిడి తిరుపతిలోని పెద్ద జీయంగార్ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది. చంద్రబాబు తన ప్రత్యేక కార్యదర్శి, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్రను పెద్ద జీయర్ వద్దకు పంపి తనకు అనుకూలంగా లేఖ రాయించుకున్నారు. వేయి సంవత్సరాల రామానుజాచార్యుల పరంపరనే భ్రష్టుపట్టించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. ఈ కార్యక్రమాల కోసమే ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. వేల సంవత్సరాల ప్రతిష్ట ఉన్న తిరుమల ఆలయాన్ని రాజకీయాలకోసం దెబ్బతీయడం అత్యంత శోచనీయం. శ్రీవారి భక్తులు, మఠాలపై చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో చేస్తున్న దాడిగానే దీన్ని చూడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి ప్రతి ఒక్కరు వాటిని తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రెడ్‌బుక్ రాక్షసం.. జంగిల్ రాజ్ బీభత్సం
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు ముఠా అసహనంతో రగిలిపోతోంది. దాంతో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు తాము పన్నిన పన్నాగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బరి తెగించారు. అదే ముసుగులో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలకు తెగబడటంతోపాటు.. వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించేందుకు కుతంత్రం పన్నారు. ఈ పచ్చ మూకల దారుణ బీభత్స కాండను పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. వరుస దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతో రాష్ట్రంలో చంద్రబాబు ముఠా రావణకాష్టం రగిలిస్తోంది. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్‌లు ఇచి్చన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో స్పష్టం కావడంతో శ్రీవారి భక్తులు ఊరట చెందారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజారడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ కూటమి అత్యవసరంగా మరో కుతంత్రానికి తెరతీసింది. లడ్డూ ప్రసాదంపై టీడీపీ దుష్ప్రచారంతో లడ్డూ ప్రసాదానికి కలిగిన కళంకానికి పరిహారంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయశి్చత్త పూజలు, యజ్ఞాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే అదనుగా డైవర్షన్ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రం పన్నింది. ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలను అడ్డుకోవడం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడాలని తమ పార్టీ కార్యకర్తలు, గూండాలను రంగంలోకి దించింది. కర్రలు, రాడ్లు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని మరీ కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడులతో విరుచుకు పడాలని ఆదేశించింది. పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా ఉండి పరోక్షంగా సహకరిస్తారని.. టీడీపీ గూండాలు ఎవరూ వెనక్కు తగ్గవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు స్వయంగా అధికార పార్టీనే పన్నాగం పన్నడం విభ్రాంతి కలిగిస్తోంది. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారం నుంచి ప్రజల దృష్టిని శాంతిభద్రతల సమస్యపైకి మళ్లించాలన్నది టీడీపీ లక్ష్యం. అదే అవకాశంగా చేసుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ కీలక నేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడాలన్నది లోగుట్టు. అనంతరం వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలన్నది పన్నాగం. వెరసి తిరుమలపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు మరచిపోయేట్టు చేయడమే టీడీపీ కుట్ర అంతిమ లక్ష్యం. పక్కా పన్నాగంతోనే అంబటిపై హత్యాయత్నం ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో టీడీపీ గూండాలు బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పక్కా పన్నాగంతో హత్యాయత్నానికి తెగబడ్డారు. లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు కలిగించిన కళంకానికి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన గుంటూరులోని గోరంట్లకు శనివారం ఉదయం బయలుదేరారు. అప్పటికే కర్రలు, రాడ్లు, రాళ్లు పట్టుకుని మాటువేసిన టీడీపీ గూండాలు అంబటి రాంబాబు వాహనంపై ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. ఆయన వాహనంపైకి రాళ్లు విసిరి బీభత్సం సృష్టించారు. వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకుని ఆయన్ని కిందకు దించి హత్య చేయాలన్నది వారి లక్ష్యం. ఆయన వాహనంపైకి టీడీపీ గూండాలు దండెత్తినా సరే పోలీసులు వారిని వారించేందుకు యత్నించనే లేదు. ఆ హత్యాయత్నం నుంచి అంబటి రాంబాబు అతి కష్టం మీద తప్పించుకుని బయటపడ్డారు. కానీ టీడీపీ గూండాలు మాత్రం శాంతించ లేదు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే టీడీపీ రౌడీలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా రాళ్లు విసిరారు. ఆయన నివాసంలోకి చొరబడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో వారిపై దాడికి పాల్పడ్డారు. రాత్రికి ఆయన కారుకు, కార్యాలయానికి నిప్పు పెట్టారు.బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు టీడీపీ గూండాల దాడిలో బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్న వారిని వారించేందుకు అంబటి రాంబాబు యత్నించారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆయనపైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ వెంటనే నకిరేకల్ పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు గుంటూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయనపై వేర్వేరు పోలీసు స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అంటే ఆయనపై అక్రమ కేసు ఒక్క నకిరేకల్ పోలీసు స్టేషన్‌కే పరిమితం కాదని స్పష్టమవుతోంది. తద్వారా ఆయన్ను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. కాగా, తమకు భద్రత కల్పించాలని అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర హైకోర్టులో శనివారం రాత్రి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు ప్రాయశ్చిత్త పూజలు చేసే వైఎస్సార్సీపీ నేతలపై దాడులతో విరుచుకుపడాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలో పరిహార హోమం నిర్వహిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దాడికి యత్నించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజినీపై టీడీపీ రౌడీ మూకలు దూషిస్తూ దాడికి యత్నించారు. వినుకొండలో పరిహార పూజలు నిర్వహించి ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్న టీడీపీ గూండాలను విడిచిపెట్టి, తమను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో లాఠీలతో పోలీసులు విరుచకుపడ్డారు. ఈ ఘటనలో బ్రహ్మనాయుడు గాయపడ్డారు. కానీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇదే రీతిలో టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్ర, పోలీసుల అండతో టీడీపీ రౌడీ మూకలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలతో అరాచకానికి తెగబడుతున్నాయి. పోలీసు విధులేంటి? వారు చేసిందేంటి? అంబటి లక్ష్యంగా టీడీపీ గూండాల దాడి.. టీడీపీ గూండాగిరికి ప్రభుత్వ యంత్రాంగం దాసోహంరాష్ట్రంలో చంద్రబాబు రౌడీ మూకలు సృష్టిస్తున్న జంగిల్ రాజ్ అరాచకానికి పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తోంది. అంబటి రాంబాబును అంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ గూండాలు శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయన వాహనం, పార్టీ కార్యాలయం, నివాసాలపై వరుస దాడులకు తెగబడ్డారు. అయినా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విస్మయ పరిచింది. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వైఎస్సార్సీపీ అధిష్టానం.. ముఖ్య నేతలు ఆయనకు తక్షణం భద్రత కల్పించాలని కోరేందుకు చేసిన ప్రయత్నాలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈ అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన స్పందించలేదు. ఓ మాజీ మంత్రి ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదారు గంటలపాటు ప్రయత్నించినా కనీసం అందుబాటులోకి రాలేదు. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని సంప్రదించేందుకు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఆయన కూడా వారికి అందుబాటులోకి రాలేదు. దాంతో అంబటి రాంబాబుకు భద్రత కల్పించే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి అంబటికి పటిష్ట భద్రత కల్పించాలని కోరాలని బొత్స, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. వారిద్దరి ఫోన్ కాల్స్‌కు గుంటూరు ఎస్పీ స్పందించ లేదు. ఉద్దేశపూర్వకంగా పోలీసు పెద్దల ప్రేక్షక పాత్ర వందలాది మంది టీడీపీ గూండాలు దాడితో అంబటి రాంబాబు దంపతులు ఓ గదిలో తలుపు వేసుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల బృందం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసేందుకు శనివారం రాత్రి ఆయన కార్యాలయానికి వెళ్లింది. దాదాపు గంటపాటు ఎస్పీ కార్యాలయంలో వేచి ఉన్నా ఎస్పీ వకుల్ జిందాల్ వారిని కలవనేలేదు. గంట తర్వాత అదనపు ఎస్పీ రమణమూర్తిని కలవమని సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అదనపు ఎస్పీ రమణమూర్తిని కలిసి పరిస్థితిని వివరించారు. రాత్రి 10.30 గంటల సమయంలో అంబటి రాంబాబును పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. మరోవైపు టీడీపీ గూండాలు శనివారం అర్థరాత్రి దాటినా అంబటి రాంబాబు కార్యాలయం, నివాసాలపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆయ ఇంటి ముందున్న కారుకు నిప్పంటించారు. తెల్లవారేసరికి ఆయన నివాసాన్ని నేలమట్టం చేస్తామని టీడీపీ గూండాలు బహిరంగంగా ప్రకటిస్తున్నా పోలీసులు మాత్రం వారిని అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించక పోవడం విస్మయ పరుస్తోంది. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పోలీసు పెద్దలు ఉద్దేశ పూర్వకంగా ప్రేక్షక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీ మూకలు ఇదే తీరులో విధ్వంసం సృష్టించినా పోలీసులు స్పందించలేదు. పైగా ఆయనపైనే కేసు పెట్టారు. -
GVMC Council: మీడియాకు అనుమతి నిరాకరణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. ఇవాళ ఉదయం వరకు మీడియాకు అనుమతి ఉందంటూ ప్రకటించిన అధికారులు.. మీడియా ప్రతినిధులకు పాసులు కూడా జారీ చేశారు. కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుందనగా మీడియాకు అనుమతి లేదంటూ సమాచారం ఇచ్చారు.కౌన్సిల్ సమావేశంలో గీతం భూదోపిడీని నిలదీస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిసందే. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్ సమావేశానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా కాసేపట్లో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలు బయలుదేరనున్నారు. -
‘వీసీ’ 420 వేషాలు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యా వ్యవస్థను సైతం భ్రష్టు పట్టిస్తోంది. అస్మదీయులకు అడ్డగోలుగా వైస్ చాన్సలర్ పదవులు కట్టబెట్టి యూనివర్సిటీలను సర్వ నాశనం చేస్తోంది. 420గా ముద్రపడిన మోసగాళ్లు, అత్యంత వివాదాస్పదులను వీసీ పోస్టులో కూర్చోబెట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. విద్యా వేత్తలకు ఇవ్వాల్సిన ఉన్నత పదవిని ఓ నేర చరితుడికి ఇవ్వడం విస్తుగొలుపుతోంది. కాకినాడ జేఎన్టీయూ వీసీ నియామకమే దీనికి నిదర్శనం. డాక్టర్ అల్లం అప్పారావు లాంటి ప్రముఖ విద్యావేత్తలు సారథ్యం వహించిన కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్‌ను గతేడాది ఫిబ్రవరిలో కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయనపై అవినీతి, ఫోర్జరీ లాంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ వీసీగా ఎంపిక చేయడం చంద్రబాబు సర్కారు బరితెగింపునకు తార్కాణం. ఫోర్జరీ పత్రాల నిందితుడికి వీసీ పోస్టు!కాకినాడ జేఎన్టీయూ వీసీగా నియమించిన సీఎస్ఆర్కే ప్రసాద్‌పై తెలంగాణలోని పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల్లో పలు సెక్షన్ల కింద కుప్పలు తెప్పలుగా కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాలతో కోర్టును ఉద్దేశపూర్వకంగా మోసం చేశారనే అభియోగంతో ఇటీవలే హనుమకొండ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏకంగా 415, 416, 418, 420, 464, 468, 469, 471 సెక్షన్ల కింద సమన్లు ఇవ్వడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సెక్షన్లను పరిశీలిస్తే.. దారుణమైన మోసం, వేరొకరిలా నటించి మోసం చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలిసీ మోసానికి పాల్పడటం, నకిలీ సంతకాలతో మోసగించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఫోర్జరీ పత్రాలు తయారీ, నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించి వినియోగించడం వంటి నేరాల్లో నిందితులుగా లెక్క. వీటిల్లో అధిక సెక్షన్లలో నేరం రుజువైతే ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎంపికలో దారుణ వైఫల్యం..విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యావంతులు, భవిష్యత్తు సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే మేధావులకు పెద్దపీట వేయాలి. కానీ టీడీపీ పెద్దలు తమ అస్మదీయుడనే ఒకే ఒక అర్హతతో కొందరికి వీసీ పోస్టులు కట్టబెట్టేశారు. ఇందులో భాగంగానే అవినీతి, ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎస్ఆర్కే ప్రసాద్‌ను కాకినాడ జేఎన్టీయూ వీసీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. దీంతో వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీల పాత్ర మరోసారి ప్రశ్నార్థకమైంది. సెర్చ్ కమిటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా సిద్ధం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపుతోంది. ఇక వీసీల నియామకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక తూతూమంత్రంగా మారింది. ఇవీ సీఎస్ఆర్కే ప్రసాద్ నిర్వాకాలు..!వరంగల్ నిట్ ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో సీఎస్ఆర్కే ప్రసాద్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ఐటీ వరంగల్ ఆలూమ్ని అసోసియేషన్ (నిట్వా) అందించిన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆ తప్పును కప్పిపుచ్చేందుకు యత్నించారు. ప్రతిభావంతులకు మేలు చేసేందుకు నిట్‌లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుత, పూర్వ విద్యార్థులను అనుసంధానించేందుకు నిట్వా రూ.1.30 కోట్లు సమీకరించింది. అయితే భవనం ఆధునికీకరణలో రూ.40 లక్షలు దారి మళ్లాయని, సీఎస్ఆర్కే ప్రసాద్‌కు అత్యంత సన్నిహితులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సీఎస్ఆర్కే ప్రసాద్ ఒత్తిడితో అప్పటి ఐఆర్‌ఏఏ డీన్ 2022లో నిట్వా ఎన్నికల్లో తమ అనుకూల వర్గాన్ని గెలిపించేందుకు అక్రమంగా ఓట్లు జొప్పించారు. ఈ కేసు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో ఉంది.కోర్టు కళ్లు గప్పేందుకు యత్నించి..!ఎన్నికల్లో అక్రమాలపై నిట్వా మాజీ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సీఎస్ఆర్కే ప్రసాద్ అప్పటి డైరెక్టర్‌పై ఒత్తిడి చేసి ఇందులో చేర్చారు. అనంతరం ఆ డైరెక్టర్ బదిలీపై వెళ్లిపోగా సీఎస్ఆర్కే ప్రసాద్ న్యాయస్థానాన్ని మోసం చేసే కుట్రకు తెర తీశారు. గత డైరెక్టర్ సంతకాలు, పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) లేకుండానే ఆయన అథారిటీ ఇచ్చినట్లుగా కేసును నడిపించారు. పాత న్యాయవాది నుంచి నో అబ్జెక్షన్ లేకుండానే మరో న్యాయవాదితో వకాలత్ వేయించి మరో తప్పు చేశారు. ఈ విషయం బయటపడటంతో తాను ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వలేదని అప్పటి డైరెక్టర్ రాత పూర్వకంగా కోర్టుకు నివేదించారు. సీఎస్ఆర్కే ప్రసాద్ ఫోర్జరీ, అవినీతి బాగోతంపై ‘నిట్వా’ మాజీ అధ్యక్షుడు ఎన్ఐటీ డైరెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.ఇక 2025 ఫిబ్రవరిలో ఖాజీపేట పోలీసు స్టేషన్లో సీఎస్ఆర్కే ప్రసాద్‌పై ఫిర్యాదు చేయగా సివిల్ కేసుగా పరిగణించారు. దీంతో గత ఆగస్టులో కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం స్వీకరించి నిందితుడు సీఎస్ఆర్కే ప్రసాద్‌కు 8 రకాల ఐపీసీ సెక్షన్లు కింద సమన్లు జారీ చేసింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కరెస్పాండెంట్ అనుమతి లేకుండా సీఎస్ఆర్కే ప్రసాద్ దొంగ సంతకాలతో నడిపించడం గమనార్హం. ఎన్ఐటీ పూర్వ విద్యార్థి, నిట్వాలో సభ్యుడు అయినప్పటికీ అసోసియేషన్‌కు నష్టం చేకూర్చేలా వ్యవహరించారు. ఆయన జేఎన్టీయూ కాకినాడ వీసీగా వచ్చినప్పటి నుంచి పాలనా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టి అనర్హులకు పెద్దపీట వేయడం, అవినీతిని ప్రోత్సహిస్తుండడంపై వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు
సాక్షి ఎన్టీఆర్ జిల్లా: రెడ్‌బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. అయితే అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగిరమేశ్కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైళ్లో తోస్తుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ఎంత హింసిస్తే వైఎస్సార్సీపీ నేతలు అంత పట్టుదలగా పార్టీ బలోపేతానికి సిద్ధపడతారని తెలిపారు. ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్నే సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పరోక్షంగా జనం సంతృప్తిగా లేరని తెలిపారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందన్నారు. చంద్రబాబు , లోకేష్‌ల పోకడే వారి పతనానికి నాంధి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచిన వారు రెడ్ బుక్ పేరుతో చేస్తున్న బెదిరింపులకు భయపడతారా అని అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమలలో లడ్డూ తయారికీ దశలవారిగా నెయ్యిపరీక్ష చేస్తారన్న సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబుకు ఆయన విగ్రహాం పెట్టే అర్హత ఎంతమాత్రం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైఎస్సారీపీ నేతలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది
-
రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు: శైలజానాథ్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్‌తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!ఏపీ బ్రాండ్ ఇమేజ్ను రెడ్‌బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్ లేదు. సోషల్ మీడియాలో లైక్, కామెంట్ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు. -
RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం
-
లోకేష్ రెడ్ బుక్ లోని మిగిలిన 97 పేజీలు మడిచి ఎక్కడైనా పెట్టుకో..
-
అంతటా దాడులూ... దౌర్జన్యాలే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో రాష్ట్రం దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతికదాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతోపాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది.పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలుటీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలావరకు కేసులు నమోదు చేయడం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా... 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6శాతం పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1,403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా... 2025లో హత్యాయత్నం కేసులు 1,566కు పెరగడం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. భారీగా పెరిగిన ఆర్థిక నేరాలుచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు.. రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7,667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా... 2025లో ఆ కేసుల సంఖ్య 8,034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా, 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం⇒ మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు⇒ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలకు డీజీపీ కౌంటర్‘తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనా... వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల–తిరుపతిలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాటపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... లక్షల్లో భక్తులు వస్తుంటే భద్రత కల్పించడం, తగిన ఏర్పాట్లు చేయడం పూర్తిగా సాధ్యం కాదని డీజీపీ బదులిచ్చారు. అందుకు చాలా కారణాలు ఉంటాయని, పోలీసుల వైఫల్యంగానే చూడకూడదన్నారు. ఇక భద్రత కోసం మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను డీజీపీ గుప్తా వ్యంగ్యంగా తిప్పికొట్టారు.‘మహిళా భద్రతలో పోలీసు వైఫల్యం గురించి జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిర్దిష్టంగా చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో 1,10,193 కేసులు నమోదు కాగా, 2025లో 1,03,397 కేసులకు తగ్గాయని తెలిపారు. నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో 153 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు శ్రీకాంత్, రవికృష్ణ, పాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్
-
రెడ్‌బుక్ అరాచకం.. పోలీసు పైశాచికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పచ్చ ఖాకీ’లు పేట్రేగిపోతున్నారు. రెడ్‌బుక్ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్లుగా బరితెగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి.. వారి భద్రతను గాలికొదిలేసినా అడిగేవారు ఉండరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు మోపుతున్నారు. సీపీఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాష్ట్రప్రభుత్వ దన్నుతో ఖాకీల బరితెగింపునకు పరాకాష్ట అని విమర్శకులంటున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో రప్పారప్పా అన్నందుకే వారిని పోలీసులు అరెస్టు చేసి నడిరోడ్డులో నడిపిస్తూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారు.ఇలా చేయడం దేనికి సంకేతం? పోలీసులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా? వ్యవస్థలు దిగజారుతున్నాయనడానికి ఇదే సంకేతం. ఇలాంటి చర్యలతో న్యాయం బతుకుతుందా? అని మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. జంతు బలి ఇవ్వడాన్ని సాకుగా చేసుకుని హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసించి నడిబజార్లో నడిపిస్తారా!? రప్పా రప్పా అన్నారని, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. వారేదో దేశద్రోహులన్నట్లుగా నడిబజారులో కొట్టుకుంటూ నడిపించడం చూసి అంతా విస్తుపోయారు. ఈ ఉదంతాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించడం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి.. ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాఢ్యాన్ని మొదలు పెట్టింది టీడీపీయే. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు ఒకటీ రెండు కాదు పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్త తర్పణం చేశారు. ఆ తలలను గుచ్చి దండలా ఫ్లెక్సీలకు వేలాడదీశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఫ్లెక్సీకి రక్తాభిõÙకం చేయలేదా? ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చాలాచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిందేమిటి? ఇలాగే పొట్టేళ్ల తలలు నరికి, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేయలేదా? వాటిని ఏమంటారు? ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్.. యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిన్నరలోనే తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని హడలిపోతున్నారు. అయినా, దోపిడీ విధానాలను ఆయన విడిచిపెట్టడంలేదు. అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఇలా ఏడాదిన్నరలోనే వేలాది అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుంది. బల్క్‌డ్రగ్ పరిశ్రమ పేరిట రైతుల భూములను కొల్లగొట్టాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. బల్క్‌డ్రగ్ పార్క్ ముసుగులో భూదోపిడీ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, గాజువాకలో సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో భూదోపిడీపై అప్పలరాజు నిలదీస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తారు. ‘ఆయన సంగతి తేల్చండి’ అన్న ప్రభుత్వ పెద్దల హుకుంకు పోలీసులు యస్ బాస్ అన్నారు. అంతే.. ఏకంగా 2013 నుంచి పెండింగులోని కేసులను తిరగదోడి మరీ అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. జై జగన్ అన్నా అక్రమ కేసులు, వేధింపులు..ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పచ్చ ఖాకీల క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. అక్రమంగా నిర్బంధించి నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీతో వేధిస్తోంది. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక వైఎస్సార్సీపీ శ్రేణులందరూ నీరుగారిపోతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వారు పోరుబాట పట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కుతుండడం ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలపై వెయ్యికిగా పైగా అక్రమ కేసులు పెట్టినా సరే అది వారిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. అక్రమ కేసులు పెడుతున్న కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఆ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలను తలపించాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయమని వారికి అర్ధమైంది. అంతే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై సరికొత్త కుతంత్రానికి తెగించారు. జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఆ వేడుకలపై అక్కసు వెళ్లగక్కి వారిని ఏం చేయాలన్న దానిపై పోలీసులకు స్పష్టమైన సంకేతాలిచ్చారన్న ఆరోపణలున్నాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి.. ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదుచేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. వారికి అలా.. వీరిని ఇలా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటివరకు 265 మంది బాలికలు, యువతులు అత్యాచారానికి గురయ్యారు. 15 మంది యువతులను అత్యాచారంచేసి హత్య చేయడం అరాచకానికి పరాకాష్ట. టీడీపీ కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులే నిందితులు. కర్నూలు జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన ఉదంతం జరిగి ఏడాది దాటినా పోలీసులు ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. బెడిసికొట్టిన ప్రభుత్వ కుట్ర.. తాజాగా.. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అజయ్ దేవ కొద్దిరోజుల క్రితం ఓ గర్భిణిని కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్నీ వైఎస్సార్సీపీ మీదకు నెట్టేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కూడా దు్రష్పచారం చేసింది. కానీ, అజయ్ జనసేన కార్యకర్త అని.. అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని కుటుంబ సభ్యులే చెప్పడం, అందుకు తగిన ఆధారాలు కూడా బైటపడడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసుల కుట్ర బెడిసికొట్టింది.ఏపీ పోలీసుకు లాస్ట్ ర్యాంకు..ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా దిగజారిపోతున్నా పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ పోలీసు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. ఆ చట్టాలను పటిష్టంగా అమలుచేస్తే రెడ్‌బుక్ వేధింపులకు ఆస్కారం ఉండదు. అందుకే ఆ చట్టాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే వెల్లడించింది.అమిత్ షా అసహనంఏపీ పోలీసు శాఖ అసమర్థతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఆపదలో ఉన్నవారు ఫిర్యాదుచేస్తే 25.50 నిమిషాల వరకు పోలీసులు స్పందించడంలేదని ఆయన స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చండీఘడ్ పోలీసులు కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందిస్తుంటే.. ఏపీ పోలీసులు మాత్రం 25.50 నిమిషాల వరకు మొద్దునిద్ర పోతున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిజానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు నిమిషాల్లోనూ, పల్లె ప్రాంతాల్లో ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుని రక్షణ కల్పించేవారు. అందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసింది. అయితే, ఏడాదిన్నరలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది. -
మితిమీరిన టీడీపీ అరాచకాలు.. YSRCP చైత్యన్య కారుపై దాడి
-
Chevireddy Mohith: లోకేష్ 100 కు 10 రెట్లు అనుభవిస్తావ్
-
కొమ్మినేని గారు నవ్వితేనే కేసు పెట్టారు.. అర్నాబ్ గోస్వామిని తలుచుకుంటేనే బాధేస్తుంది
-
YS Jagan: వెర్రితలల.. రెడ్ బుక్ రాజ్యాంగం
-
రెడ్‌బుక్ రాజ్యాంగం.. సీఐపై క్రమశిక్షణ చర్యలు
సాక్షి, నంద్యాల: కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు బలవుతున్నారు. అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ ఓపెన్ చేసిన ఓ సీఐను జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ తీవ్రంగా మందలించింది. దీనికి సంబంధించిన వివరాలివీ.. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరీం తన స్నేహితుడు, నంద్యాలలోని అలీనగర్‌కు చెందిన చికెన్ షాప్ నిర్వాహకుడు మెహతార్ జాహీద్‌కు గతేడాది రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ దాడిపై గతేడాది డిసెంబర్లో కరీం రెండో పట్టణ సీఐగా పనిచేస్తున్న ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు జాహీద్ మంత్రి అనుచరులను ఆశ్రయించడంతో టీడీపీ కార్యాలయం నుంచి సీఐకి సిఫారసు వెళ్లింది. దీంతో సీఐ ఇస్మాయిల్ ఆగమేఘాల మీద కరీంపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారు. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి ఎదుట కరీంను హాజరుపరచగా సెక్షన్ల చూసిన జడ్జి, కరీంకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక కరీంను వదిలేశారు. దీనిపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి రెచ్చిపోయిన సీఐ ఇస్మాయిల్, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేశారనే కారణంతో పాటు అనుమతి లేకుండా ధర్నాలు చేశారనే అభియోగాలు నమోదుచేసి కరీంపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీంతో తనపై అక్రమంగా తప్పుడు కేసులు నమోదు చేశారని సీఐ ఇస్మాయిల్‌పై చర్యలు తీసుకోవాలని జనవరిలో జిల్లా పోలీస్ కంప్లెంట్ అథారిటీని కరీం ఆశ్రయించారు. నలుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. అనంతరం సీఐ ఇస్మాయిల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధర్మాసనం చైర్మన్ వెంకట రమణారెడ్డి ఈనెల 14న తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. -
చిట్ట చివరన ఏపీ పోలీస్.. చట్టం.. చతికిల!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం.. అధికార దుర్వినియోగం.. రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి చంద్రబాబు సర్కారు రాజకీయ పాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలైంది! కుప్ప కూలినట్లు వెల్లడైంది. పనితీరులో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఇదీ!దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన 2025 నివేదికలో ఏపీ పోలీసు శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ తాజా నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖల పనితీరును మదించి ఈ ర్యాంకులు ప్రకటించింది.ఏపీ పోలీసు శాఖ 100 పాయింట్లకు గానూ కేవలం 16 పాయింట్లే తెచ్చుకుని 36 స్థానానికి పడిపోవడం గమనార్హం. అయితే మావోయిస్టులను కట్టడి చేశామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 50 మందిని పట్టుకున్నామని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, కేంద్ర బలగాల ద్వారా జరిగిందని.. ఏపీ పోలీసుల ద్వారా అరెస్టును మాత్రమే చూపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో దేశంలోనే అట్టడుగున ఏపీ పోలీసు శాఖ ఉందని పేర్కొన్న కేంద్ర హోం శాఖ నివేదిక 16.70 శాతం పాయింట్లతో చిట్టచివరన 100 మార్కుల పరీక్షలో కనీసం 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లు లెక్క! మరి బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసు శాఖ వంద పాయింట్లకు ఎన్ని సాధించిందో తెలుసా..? కేవలం 16.70 పాయింట్లకే పరిమితమైంది. అంటే కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయ్యింది. జాబితాలో చిట్ట చివరన అంటే 36వ స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కలిపి దేశంలో పోలీసు శాఖ సగటు పాయింట్లు 36. అంటే దేశ సగటును కూడా ఏపీ పోలీసు శాఖ చేరుకోలేకపోయింది.నాలుగు విభాగాలుగా పనితీరు మదింపు పౌరులకు సత్వరం, సక్రమంగా పోలీసు సేవలను అందించడం.. బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో సంస్కరణలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి అమలులో ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) చట్టాల స్థానంలో బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలను ప్రవేశపెట్టింది. పోలీసు సంస్కరణల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. కేసుల నమోదు, దర్యాప్తు, విచారణలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.తద్వారా పోలీసులు నిబంధనలను ఉల్లంఘించకుండా పౌరులకు సత్వరం సక్రమంగా సేవలు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్ర హోంశాఖ విశ్లేషించింది. ప్రధానంగా నాలుగు విభాగాలుగా పోలీసు శాఖల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార–సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్)కు 25 శాతం, పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది. దేశంలో మొదటి స్థానంలో అసోంబీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో దేశంలో అసోం మొదటి స్థానం సాధించింది. మొత్తం వంద పాయింట్లకు అసోం పోలీసు శాఖ ఏకంగా 72.03 శాతం పాయింట్లు సాధించడం విశేషం. హర్యానా 62.70 పాయింట్లతో రెండో స్థానంలో, సిక్కిం 60.87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడుకుతున్నప్పటికీ జమ్మూ–కశ్మీర్ 59.20 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు బిహార్ కూడా 47.92 పాయింట్లు సాధించి 15వ స్థానం దక్కించుకుంది.అక్రమ చొరబాట్లతో అతలాకుతలమవుతున్నప్పటికీ మణిపూర్ 45.74 పాయింట్లతో 21 స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మాత్రం 16.70 పాయింట్లకు పరిమితమై దేశంలోనే అట్టడుగున 36 స్థానానికి పడిపోయింది. చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగం పోలీసు వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందన్నది ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. బాబు సర్కారు రాజకీయ కుట్రలకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులు కొమ్ముకాస్తుండటంతో ఏపీ పోలీసు శాఖ పరువు బజారున పడిందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నాలుగు విభాగాల్లోనూ విఫలం..కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ రాష్ట్ర పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందులో ఏపీ పోలీసుల దారుణ పనితీరు ఇలా ఉంది..!పాలన సంస్కరణలకు కూటమి మోకాలడ్డుపరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకుగానూ ఏపీ పోలీసు శాఖకు కేవలం 8.77 పాయింట్లే లభించాయి. కేసుల దర్యాప్తులో అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తెచి్చన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం జరిగితే దర్యాప్తు అధికారి ఘటనా స్థలానికి చేరుకుని స్కెచ్ వేయించి ఫొటో తీసి కేస్ డైరీ (సీడీ) ఫైల్లో నమోదు చేసేవారు. అయితే ఈ ప్రక్రియలో లొసుగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. దీంతో ఘటనా స్థలంలో కేవలం ఫోటో కాకుండా స్కెచ్ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని, ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్లో అప్లోడ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.తద్వారా స్కెచ్ వేస్తున్న సమయం, సీడీ ఫైల్లో అప్లోడ్ చేసిన సమయం రికార్డు అవుతాయి. అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్‌లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌కు కేవలం ఒక ట్యాబ్‌ను మాత్రమే అందించింది. పట్టణ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్ మాత్రమే ఉంది.దాంతో తీవ్రత తక్కువ ఉన్న కేసుల దర్యాప్తునకు ట్యాబ్ తీసుకెళుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడిన నేరాల దర్యాప్తునకు ట్యాబ్‌లు తీసుకువెళ్లడం లేదు. అధికార టీడీపీ కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యాచార ఘటనలను తొక్కిపెడుతుండటంతో పోలీసు వ్యవస్థ పనితీరు దారుణంగా దిగజారింది. ఫలితంగా పాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖ 8.77 పాయింట్లే తెచ్చుకుంది. కుప్పకూలిన నిర్వహణ సామర్థ్యంకీలకమైన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తులో ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే రావడం అందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకునేందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాలి.కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆధునిక దర్యాప్తు ప్రక్రియలపై కనీస శిక్షణ కూడా అందించలేదు. ‘అప్పా’ ఏర్పాటును విస్మరించింది. టీడీపీ కూటమి నేతలు బరితెగించి పాల్పడుతున్న కేసుల దర్యాప్తును నీరుగార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హత్యలు, లైంగిక దాడులు, సోషల్ మీడియాలో వేధింపులు, ఫోరెన్సిక్, సైబర్ నేరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు నీరుగారుతున్నాయి. పోలీసులకు శిక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దానివల్లే ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే వచ్చాయి.సమాచార, సాంకేతికతలో గుండు సున్నా చంద్రబాబు ప్రభుత్వం పోలీసు శాఖను ఏ స్థాయికి దిగజార్చిందో కేంద్ర హోంశాఖ నివేదికలోని ‘సమాచార సాంకేతిక అమలు (ఐసీటీ అప్లికేషన్స్) విభాగం బట్టబయలు చేసింది. ఈ విభాగంలో 25 పాయింట్లకుగానూ ఏపీ పోలీసులకు వచి్చంది గుండు సున్నా. ఈ విభాగం కింద రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, డేటా కమ్యూనికేషన్ల వ్యవస్థ, వెబ్సైట్ల సక్రమ నిర్వహణ తదితర అంశాలను కేంద్రం నిర్దేశించింది. ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు ఎప్పుడు తెచ్చారు?.. లాకప్ పరిస్థితులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఎప్పుడు తరలించారు?.. న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు..? లాంటి ప్రక్రియలన్నీ సక్రమంగా పాటించేందుకు విధి విధానాలను నిర్దేశించింది.అందుకే సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని చెవికెక్కించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా సరే.. 9 నెలలుగా పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కారణం.. రెడ్‌బుక్ వేధింపులతో వైఎస్సార్సీసీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తుండటమే! కనీసం వారిని అరెస్టు చేసిన విషయం కూడా చెప్పకుండా వివిధ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతికంగా, మానసికంగా హింసిస్తోంది.టీడీపీ కూటమి సర్కారు పాలనలో రాజమహేంద్రవరంలో ఓ దళితుడిని అర్ధనగ్నంగా లాకప్‌లో హింసించిన విషయం తెలిసిందే. ఇక వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించింది. రెడ్‌బుక్ దౌర్జన్యాలు, వేధింపులు బయటపడకూడదనే పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. ఇక సాంకేతిక మౌలిక సదుపాయల పేరుతో నిధులు పక్కదారి పట్టించారు. కన్సల్టెన్సీ పేరుతో అస్మదీయ కంపెనీకి రూ.10 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పట్టించుకోలేదు. అందుకే కేంద్ర హోంశాఖ ఐసీటీ విభాగంలోనూ ఏపీ పోలీసులకు సున్నా మార్కులు ఇచ్చింది.సమన్వయం శూన్యంకేసుల సమగ్ర దర్యాప్తు, పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు, ఫోరెన్సిక్, వైద్య –ఆరోగ్య, కోర్టులు, జైళ్ల శాఖలను సమన్వయపరుస్తూ ఒక గొడుగు కిందకు తేవాలి. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సమన్వయం విభాగంలో మొత్తం 10 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు దక్కిన పాయింట్లు సున్నా. ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ విభాగం కింద ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత అన్ని విభాగాలను సమన్వయం చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తు వివరాలు, ఫోరెన్సిక్, వైద్యుల నివేదిక, విచారణ ప్రక్రియ, తీర్పు, నేరస్తుడిని జైలుకు తరలించడం, ఇతర వివరాలన్నీ కంప్యూటర్లో ఒక్క క్లిక్‌లో అందుబాటులో ఉండాలి.అందుకోసం ప్రతి కేసుకు ప్రత్యేకంగా నంబరు కేటాయించాలి. పోలీస్ స్టేషన్, ఫోరెన్సిక్ విభాగం, ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, జైళ్ల శాఖలకు తక్షణం అందుబాటులో ఉంచాలి. తద్వారా అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ విభాగం గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి నేతల అరాచకాలు, అక్రమాల కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించడమే లక్ష్యంగా సమన్వయం లేకుండా చేస్తోంది. అన్ని విభాగాలను ఒకే ఛత్రం కిందకు తేవడం లేదు. అందుకే ఈ విభాగం పనితీరులో కేంద్ర హోంశాఖ ఏపీ పోలీసు శాఖకు సున్నా మార్కులు కేటాయించింది. -
అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం
-
దేవుడా!.. చంద్రబాబు పొలిటికల్ పాలన
2015లో చంద్రబాబు ప్రచార కండూతితో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట.. 29 మంది మృతివిచారణ నివేదికను తొక్కిపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వంఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్లో తొక్కిసలాట. ఆరుగురు సామాన్య భక్తులు మృతి.ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి గాల్లో కలిసిన ఏడుగురు భక్తుల ప్రాణాలు.నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల దుర్మరణం.సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన తేవడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి... దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకు భరోసా కరువైంది! కేవలం పది నెలల కాలంలో మూడు ఆలయాలలో మూడు ఘోర దుర్ఘటనలు. ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని ఉంటే, అన్ని గుడుల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే దారుణాలు జరిగేవి కాదన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వరుస దుర్ఘటనల్లో భక్తులు దుర్మరణం చెందుతున్నా, పోయేది సామాన్యుల ప్రాణాలే కదా అన్నట్లు చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పాపాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ని విషాదాలు జరుగుతున్నా అమెరికా కంటే గొప్ప టెక్నాలజీ తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తుపానునే కంట్రోల్ చేశానని, సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజ్ఞుడినని చెప్పుకొంటూ సీఎం ప్రచార ఆర్భాటంతో కాలం వెలిబుచ్చుతున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోతున్నా నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని, కనీసం మంచినీళ్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.29 మందిని బలిగొన్న బాబు ప్రచార కండూతి» చంద్రబాబు ప్రచార కండూతి 2015 గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29మంది భక్తుల దుర్మరణానికి కారణమైంది. రాజమహేంద్రవరం ఘాట్ వద్ద వేలాది భక్తుల సమక్షంలో సీఎంగా బాబు కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం చేసేలా వీడియో తీయాలని భావించారు. ముందు రోజే ఘాట్ గేట్లు మూసి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పడిగాపులు కాసేలా చేశారు. చంద్రబాబు రాగానే గేట్లు తెరిచారు. భక్తులు ఒక్కసారిగా స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయంగా మారింది. దీనిపై బాబు కనీసం నైతిక బాధ్యత తీసుకోలేదు. పైగా పుష్కరాల దుర్ఘటనపై విచారణ కమిషన్ నివేదికను తీవ్ర జాప్యం చేశారు. చివరికి ఎవరి బాధ్యత లేదని తేల్చారు.» ఇక 2017లో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవ్రిత సంగమం వద్ద కృష్ణా నదిలో పర్యాటకుల బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. » 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండే 30పైగా ఆలయాలను కూల్చివేశారు.» తిరుమలలో 1472లో నిర్మితమైన వేయి కాళ్ల మండపాన్ని 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూల్చివేశారు. » చంద్రబాబు హయాంలోనే... విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇంకోవైపు, చంద్రబాబు గతంలో సీఎంగా కొనసాగిన సమయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ ఎగతాళిగా మాట్లాడారు.కూటమి పాలనలో అపచారాలు ఎన్నో...» తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో ఈ ఏడాది జనవరి 8న తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోయింది. » తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో జనవరి 13న షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. » ఈఏడాది ఫిబ్రవరి 18న శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట టీటీడీ ఉద్యోగి, పాలకమండలి సభ్యుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మార్చిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర కాశినాయన క్షేత్రంలో అన్నదాన భవనం, సత్రాలు, గోశాలను కూల్చివేశారు. » ఏప్రిల్‌లో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో వెలిశారని భక్తులు విశ్వసించే శ్రీ కూర్మంలో పెద్దసంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి.»300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేట బాల శశిశేఖర ఆలయంలో ఈ ఏడాది మే 18న కొందరు వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్‌సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్‌సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్‌ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్‌ని టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్‌కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్‌కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్‌కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్‌ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్‌బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ కేసు మరో ఉదాహరణ
-
‘ప్రజలను వేధించడానికే.. కూటమి అధికారంలోకి వచ్చింది’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాకినాడ రూరల్‌లో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
బరి తెగించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ వేధింపులను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తీవ్రతరం చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టుల పరంపరకు తెగించింది. భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రకు ఈసారి సీఐడీని అస్త్రంగా చేసుకుంది. పక్కా పన్నాగంతో ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ ఒక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. సీఐడీ, డీజీపీ కార్యాలయాల పర్యవేక్షణలో బరితెగించి సాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్ర ఇలా ఉంది... ఒకే ఒక ఎఫ్ఐఆర్... అన్ లిమిటెడ్ అక్రమ కేసులు రాష్ట్రంలో గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల భావ ప్రకటన హక్కును కాలరాయడమే పనిగా పెట్టుకుంది. ఏడాది కాలంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఏకంగా 282 పోలీసు కేసులు నమోదు చేయడంతోపాటు 84 మందిని అరెస్టు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాయి. పోలీసులను గట్టిగా మందలించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది.ఆ కుట్రలకు ఈసారి సీఐడీ విభాగాన్ని అస్త్రంగా చేసుకుంది. సోషల్ మీడియా పోస్టులపై ఈ నెల 9న సీఐడీ ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరిపై కేసు నమోదు చేశారన్నది స్పష్టం చేయకుండా ఫేస్బుక్ యూఆర్ఎల్, ఇన్‌స్ట్రాగామ్ యూఆర్ఎల్లను నిందితుల కాలమ్‌లో పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రాన్ని స్పష్టం చేస్తోంది. అంటే తాము లక్ష్యంగా చేసుకున్న సోషల్ మీడియా కార్యకర్తల్లో ఎవర్నయినా అక్రమంగా అరెస్టు చేసేందుకే ఈ కుయుక్తి పన్నిందన్నది సుస్పష్టం. అక్రమ అరెస్టులకు తెగబడుతున్న సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత డీజీపీ కార్యాలయం, సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ అరెస్టులకు తెగబడటం మొదలెట్టాయి. డీఎస్పీలు, ఇతర అధికారులతో కూడిన ఈ బృందాలకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. డీజీపీ, అదనపు డీజీ(శాంతి భద్రతలు) ఈ వ్యవహారాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసులకు కనీస సమాచారం లేకుండానే అక్రమంగా అరెస్టులకు తెగబడాలని కార్యాచరణ రూపొందించారు. ఈ అరాచక పర్వానికి ఈ ఘటనలే మచ్చుకు ఉదాహరణ.. గుంటూరులో నిర్బంధంలో సోషల్ మీడియా కార్యకర్త.. సోషల్ మీడియా కార్యకర్త పాలక ప్రతాప్‌రెడ్డిని గుంటూరులో బుధవారం అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఎవరు అదుపులోకి తీసుకున్నారు..? ఎక్కడికి తరలించారు? అనే కనీస సమాచారం కూడా లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్టుపై అభ్యంతరంతో అదుపులోకి తీసుకున్నారో కూడా తెలియదు. సీఐడీ బృందాలుగా భావిస్తున్న అధికారులు గుంటూరు బస్ స్టేషన్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. సోషల్ మీడియా కార్యకర్త స్నేహితుడినీ.... సోషల్ మీడియా కార్యకర్తలనే కాదు.. వారి స్నేహితులను కూడా అక్రమంగా అరెస్టు చేస్తుండటం చంద్రబాబు సర్కారు పాశవిక విధానాలకు నిదర్శనం. నెల్లూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త భరత్ చంద్రను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు యత్నించారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ భరత్ సోదరి ప్రీతిని పది రోజుల క్రితం ఆత్మకూరు పోలీసుస్టేషన్లో సీఐడీ పోలీసులు నిర్బంధించారు. భరత్ తల్లి, అక్క, చెల్లెలు ఫోన్లు సీజ్ చేశారు. న్యాయవాదుల చొరవతో భరత్ సోదరి విడుదలయ్యారు. మహిళలను సైతం వేధిస్తుండటంపై నివ్వెరపోతున్నారు. భరత్ చంద్ర జాడ తెలియకపోవడంతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన ఆయన స్నేహితుడు బులగొండ సాయి భార్గవ్‌ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసేందుకు తెగబడటం విస్మయపరుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో స్నేహితులని, ఇద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలున్నాయనే సాకుతో ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించింది.వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులో ఓ సోషల్ మీడియా కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ బృందాలు ప్రయతి్నస్తున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో అక్రమ అరెస్టులను మరింత తీవ్రతరం చేసేందుకు సీఐడీ సన్నద్ధమవుతుండటం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు బేఖాతర్.. హైకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన రెడ్‌బుక్ వేధింపులే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తోంది. హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయవద్దని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అటువంటి కేసుల్లో అరెస్టు చేస్తే రిమాండ్ విధించవద్దని కూడా న్యాయస్థానాలకు నిర్దేశించింది. ఈమేరకు ‘అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్’ కేసుల్లో విస్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో విరుచుకుపడింది. ఏడాది కాలంలోనే 253 అక్రమ కేసుల్లో 822 మందికి నోటీసులిచ్చింది. 86 మందిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ అక్రమ అరెస్టులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ ఏడాది జూలైలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా కేసుల్లో అక్రమ అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. అటువంటి కేసుల్లో రిమాండ్ విధించవద్దని మేజి్రస్టేట్లను ఆదేశించింది.ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మేజి్రస్టేట్లకు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వీటిపై 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం, సీఐడీ విభాగం దీన్ని లెక్క చేయకుండా బరి తెగించాయి. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బీఎన్ఎస్ 35 (ఐపీసీ 41 ఏ) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా ఆ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అక్రమ అరెస్టులతో అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టు సవేంద్రరెడ్డిని తాడేపల్లిలో అక్రమంగా అదుపులోకి తీసుకుని ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నించడం సర్వత్రా తీవ్ర విభ్రాంతి కలిగించింది. హైకోర్టు తక్షణం స్పందించడంతో ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు. -
పాత్రికేయ కుతంత్రం
చంద్రబాబు కుట్రల ముందు నక్క జిత్తులు ఎందుకూ పనికిరావు... ఈనాడు పత్రిక కట్టుకథలకైతే శకుని కుతంత్రాలు కూడా తీసికట్టే...అలాంటి ఇద్దరూ కుమ్మక్కై బరితెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా...?అబద్ధానికి ప్రతిరూపంలా... దుర్మార్గానికి నిలువుటద్దంలా నిలుస్తుంది...అడ్డగోలుతనానికి అక్షర రూపంలా... ఓ నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది..మద్యం అక్రమ కేసులో చంద్రబాబు– ఈనాడు ఇలానే పన్నాగాలు పన్నుతున్నారు.. సిట్‌ను అడ్డం పెట్టుకుని... సిగ్గులేకుండా అవాస్తవాలు అచ్చోస్తున్నారు...సాక్షి, అమరావతి: నక్కజిత్తులను తలదన్నే చంద్రబాబు, శకుని కుతంత్రాలను మించిన ఈనాడు పత్రిక తోడుదొంగల మాదిరి మద్యం అక్రమ కేసులో కట్టుకథలు వండివారుస్తున్నారు. చంద్రబాబు విషపు రాజకీయాలను కొమ్ముకాసే రామోజీ కుటుంబ విష పుత్రిక ఈనాడు అంతకంతకూ బరితెగిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే తమ ‘బాబు’కు గొడుగు పడుతూ అసలు నైజం చాటుకుంటోంది. నిత్యం ఉషోదయాన అసత్యాలను ప్రవచించడమే ఏకైక విధానంగా చేసుకున్న ఈనాడు... ఈ కోవలోనే ‘వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు’ శీర్షికన శనివారం ఓ అబద్ధపు కథనాన్ని అచ్చోసింది. పాత్రికేయ విలువలకు పాతరేస్తూ... అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.⇒ మద్యం అక్రమ కేసులో సిట్ సోదాలు నిర్వహించిన రెండు కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గతంలో డైరెక్టర్‌గా ఉన్నారంటూ∙అసత్యాన్ని ఈనాడు నిస్సిగ్గుగా ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ భారతి ఏనాడూ డైరెక్టర్‌గా లేరని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డులు స్పష్టం చేస్తున్నా... పచ్చ పత్రిక మాత్రం ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాన్ని వదిలింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలో ప్రధాన పాత్రధారిగా అసత్య కథనాలతో తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించింది. వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్నారని మొదటి పేజీలో విషం చిమ్మిన ఈనాడు బాబు, ఈనాడు క్షుద్ర రాజకీయానికి పరాకాష్టవైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు, ఈనాడు సాగిస్తున్న కుట్ర పరాకాష్టకు చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం స్కాంను ఉన్నట్టుగా చూపించేందుకు సాగిస్తున్న వారి కుతంత్రాలు మరింత పదునెక్కాయి. ఈసారి ఏకంగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి దిగి కుట్రను పతాకస్థాయికి తీసుకెళ్లారు. మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్‌రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోలపాటు మరో ఆరు కంపెనీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. అయితే, ఇదే అవకాశంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వ డైరెక్షన్లో... వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేసేందుకు ఈనాడు బరితెగించింది. ⇒ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నారని ఈనాడు నిస్సిగ్గుగా అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ నిధులు మళ్లించేందుకు 2019లో ఆ కంపెనీలను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకొచ్చింది. అబద్ధాల విష పుత్రిక అయిన ఈనాడు... పాత్రికేయ విలువలు కాలరాస్తూ అసత్య కథనాన్ని శనివారం ప్రధాన ఎడిషన్ మొదటి పేజీ, రెండో పేజీ ప్రచురించింది. వైఎస్ జగన్ సతీమణి భారతి గతంలో డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు అని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఆ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఏనాడూ లేరుస్పష్టం చేస్తున్న ఆర్వోసీ రికార్డులుఅసలు వాస్తవం ఏమిటంటే... వైఎస్ అనిల్‌రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి ఏనాడూ డైరెక్టర్‌గా లేనే లేరు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) డిన్ (డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్)ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓ వ్యక్తి గతంలో ఏయే కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు...? ప్రస్తుతం ఏ కంపెనీల్లో ఉన్నారనే విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్వోసీ రికార్డులు ఓపెన్ డాక్యుమెంట్లే. వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అయినా సరే, ఈనాడు కుట్రపూరితంగా అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నారని పచ్చి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.పక్కా కుట్రతోనే దుష్ప్రచారంచంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు పక్కా పన్నాగంతోనే మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అవాస్తవ కథనం ప్రచురించింది. ఆర్వోసీ కేటాయించే డిన్తో రికార్డులు పరిశీలిస్తే ఒక వ్యక్తి గతంలో, ప్రస్తుతం ఏఏ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారన్నది వెల్లడవుతుంది. ఒకే ఇంటి పేరు, ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల పట్ల కూడా సందేహం రాకుండా ఉండేందుకు అందరి పేర్లతో పాటు వారి తండ్రి, భర్త పేర్లు, వయసు వంటి వివరాలు అందులో పొందుపరుస్తారు. కానీ, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉండేవారు అని దురుద్దేశపూర్వకంగానే ఈనాడు కథనం రాసింది. ఆర్వోసీ రికార్డులను పరిశీలిస్తే ఆ రెండు కంపెనీల్లో గతంలో డైరెక్టర్ గా వ్యవహరించినది వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి భారతి అని తెలుస్తుంది. ఆమె వయసు, ఆమె భర్త పేరు కూడా ఆ రికార్డుల్లో ఉన్నాయి. డైరెక్టర్‌గా వ్యవహరించింది వైఎస్ జగన్ సతీమణి భారతి కాదు వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి వైఎస్ భారతి అని స్పష్టంగా ఉంటుంది. కానీ, ఈనాడు చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్‌గా వ్యవహరించారని అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది.దుష్ప్రచారం... దుమ్మెత్తిపోయడం...ప్రత్యర్థిని దొంగదెబ్బ తీసేందుకు దుష్ప్రచారం... విషం కక్కుతూ దుమ్మెత్తిపోయడం చంద్రబాబు, ఈనాడు సారథ్యంలోని పచ్చముఠాకు వెన్నతో పెట్టిన విద్య. వారం రోజుల వ్యవధిలోనే వారు చేసిన దుష్ప్రచారం చూస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. ఉమ్మడి ఏపీలో నమోదైన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ అసలు నిందితుడే కాకపోయినా.. ఆయనను ప్రధాన నిందితుడిగా(ఏ1) పేర్కొంటూ ఈ నెల 13న ఈనాడు అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసింది. చంద్రబాబు కుట్రలో భాగంగా 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును తెరపైకి తెచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్ నిందితుల జాబితాలోనే లేరు. కానీ, ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఇదే కేసులో ఏ–7 హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్‌రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, విదేశాలకు నిధులు తరలించారని అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. ఇలాంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని అయినా ప్రయత్నించలేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించినా నిజాలు వెల్లడవుతాయి. అయితే, కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్‌పై బురదజల్లడమే లక్ష్యం అయిన ఈనాడు అవేమీ పట్టించుకోలేదు. ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. తాజాగా మద్యం అక్రమ కేసులో సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్నారంటూ విషపు రాతలు కూడా ఈ తరహాలోనివే. గతంలో డైరెక్టర్‌గా ఉన్నారనే అసత్యాన్ని ఈనాడు అచ్చోసింది.ఇదంతా చూస్తుంటే ఈనాడు క్షుద్ర పాత్రికేయం స్పష్టం అవుతోంది. అబద్ధం అని తెలిసి కూడా దానిని ప్రజల్లోకి వదలడం దాని విష ప్రచారానికి అద్దంపడుతోంది.ఈనాడుపై న్యాయపరమైన చర్యలుసాక్షి, అమరావతి: తన ప్రతిష్ఠకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. సిట్ సోదాలు నిర్వహించిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో తాను 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నట్లు ఈనాడు ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని వైఎస్ భారతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనాడు ప్రచురణ సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు తన న్యాయవాదుల ద్వారా శనివారం నోటీసులు పంపించారు. ⇒ భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించారని, తాను కాదని ఆమె వెల్లడించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ప్రకారం ఆమె గుర్తింపు నంబరు (డిన్–డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్) 02584220 కాగా, తన డిన్ 01580536 అని తెలిపారు. సిట్ సోదాలు నిర్వహించిన కంపెనీలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ భారతి తేల్చి చెప్పారు. కానీ, ఆ రెండు సంస్థల్లో తాను డైరెక్టర్‌గా ఉన్నట్లు, అక్రమ నిధులను మళ్లించినట్లు ఈనాడు దురద్దేశపూర్వకంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనం తన ప్రతిష్ఠకు భంగం కలిగించేదిగా ఉంది అని వైఎస్ భారతి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఈనాడు పత్రిక తక్షణం వివరణను ప్రచురించాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినంత ప్రాముఖ్యతతో అదే (మొదటి) పేజీల్లో తన వివరణను రెండు రోజుల్లో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే ఈనాడు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిందని భావించాల్సి వస్తుందన్నారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. నిన్న.. ఎమ్మాఆర్ కేసులో అసలు నిందితుడే కాకపోయినా వైఎస్ జగన్ ఏ1 అంటూ ఈనాడు అచ్చోసిన అబద్ధం చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే...టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంతగా బరితెగించి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు దుష్ప్రచారం చేస్తోందంటే... చంద్రబాబు అవినీతి దందాను కప్పిపుచ్చేందుకే అనే సమాధానం ఠక్కున వస్తుంది. ఎందుకంటే మద్యం, ఇసుక, ఇతర ఖనిజాల దందాలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2014–19 టీడీపీ హయాంలో మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్ బరితెగించి దోపిడీ చేసింది. రెండు చీకటి జీవోలతో బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించింది. తద్వారా రూ.5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించి రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది. వెరసి రూ.25 వేల కోట్లు దోపిడీ చేసింది. ఈ వాస్తవాన్ని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చి... చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైన ఉన్నారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం, ఇసుక, ఖనిజాల దందాకు చంద్రబాబు తెరతీశారు. టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా 4,700 మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చింది. అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. 924 బార్లు ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెడుతున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా దోపిడీ చేస్తున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ రాకెట్ రాష్ట్రంలో చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడి... టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల ద్వారా రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూపాయి కూడా రాలేదు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు రోజూ వేల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధింపులకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా తొలినుంచీ అదే కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి దర్యాప్తు పేరిట చంద్రబాబు సర్కారు తొలినుంచీ కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.⇒ మద్యం విధానంతో గాని అసలు ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను ఈ అక్రమ కేసులో ఇరికిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతోంది. అక్రమ కేసు కాబట్టి ఎలానూ నిరూపించలేరు... ఈలోగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి వారి పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయొచ్చన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం.⇒ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పేర్లను మద్యం అక్రమ కేసుతో ముడిపెట్టింది. వారిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేసింది. తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతటితో చంద్రబాబు కుట్రలకు తెరపడలేదు. మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చింది.⇒ సిట్ కుట్రలు ఇంకా కొనసాగాయి... హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది నర్రెడ్డి సునీల్‌రెడ్డి, సజ్జల భార్గవ్ పేర్లను కూడా సిట్ కుట్రపూరితంగానే ఈ కేసుతో ముడిపెట్టింది. ఇక వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులను తీవ్రం చేసింది. ఇలా రోజుకో పేరును తెరపైకి తెస్తూ వైఎస్ జగన్ తరఫున వ్యవహారాలు చక్కబెడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రతి రోజూ అవాస్తవ కథనాలను వండి వారుస్తోంది.⇒ మద్యం అక్రమ కేసులో ఒక్కో పాత్రను తెస్తూ కుతంత్రాలు పన్నుతోంది కూటమి ప్రభుత్వం. ముందుగా ఎవరో ఒకరిపై బురదజల్లడం, సోదాలు, అరెస్టులు చేయడం.. వారితో సంబంధాలు ఉన్నాయని 10 మందిని అరెస్టు చేయడం పనిగా పెట్టుకుంది. దొంగ డాక్యుమెంట్లు, నగదును చూపెడుతూ దుష్ప్రచారం సాగిస్తోంది. ఎవరిని అరెస్టు చేయాలనుకున్నా, ఎవరి కంపెనీలు, నివాసాల్లో తనిఖీలు చేయాలన్నా సరే... వారు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు అంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, అనంతరం సిట్ అధికారులు రంగంలోకి దిగడం... ఇలా పక్కా పన్నాగంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ లెక్కన ఈనాడు రామోజీరావు కుటుంబం, టీడీపీ ఎంపీ భరత్ కుటుంబం యావత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. మరి ఈనాడు–ఈటీవీ సంస్థలు, రామోజీ ఫిలింసిటీ, గీతం విద్యా సంస్థలు చంద్రబాబువే అవుతాయా...!? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు కూడా చంద్రబాబు పచ్చ తానులో ముక్కలే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువేనా!? టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈనాడుతో పాటు ఎల్లో మీడియా వైఎస్ జగన్ విషయంలో అదే రీతిలో వాదిస్తున్నాయి మరి. ఇక రెడ్‌బుక్ కుతంత్రాలకు పరాకాష్టగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పేరును కూడా ఈ అక్రమ కేసు ఉచ్చులోకి లాగేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అందుకే వైఎస్ భారతికి ఏమాత్రం సంబంధం లేకపోయినా షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఆమె గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారనే తప్పుడు కథనాన్ని కుట్రపూరితంగానే ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. -
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
ఏలూరు సిటీ: కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసుల విధి ‘సత్యం వధ.. ధర్మం చెర’గానే మారింది. మొదట్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై బుసలు కొట్టిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనా కోరలు చాస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై టీడీపీ మూకలు దాడికి తెగబడగా.. అసలు నిందితులను వదిలేసి అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని, పార్టీ శ్రేణులపైనా తప్పుడు కేసులు నమోదు చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అంటే ఏమిటో పోలీసులు మరోసారి రుజువు చేశారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ నెల 21న వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడి పామాయిల్ గెలలను కోస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదే క్షేత్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ మూకలు బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడి చేసి వీరంగం చేశారు.ఈ ఘటనపై బాధితుడైన అబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడికి యతి్నంచిన టీడీపీ మూకలను వదిలేసి ఆయనపైనే ఎదురు కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సోదరులు చల్లగోళ్ల ప్రదీప్, తేజ, ఉప్పలపాటి ప్రసాద్‌తో పాటు మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనూ పోలీసులు వదల్లేదు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు ఇదే అంశంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపైనా పోలీసులు మంగళవారం అక్రమ కేసు నమోదు చేశారు. అబ్బయ్యచౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో టీడీపీ మూకలు దాడికి యతి్నంచిన విషయం తెలిసి మాజీమంత్రి పేర్ని నాని తదితరులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఈ నెల 22న కొండలరావుపాలెంలో అబ్బయ్యచౌదరి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి.. ఆయనకు సంఘీభావం ప్రకటించింది. అనంతరం పేర్ని నాని, సాకే శైలజానాథ్ ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమరి్పంచారు.అబ్బయ్య చౌదరి నివాసం, ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాడికి యతి్నంచిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిప్రంలో కోరారు. అనంతరం పోలీస్ జిల్లా కార్యాలయం వెలుపల మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఉంటే రాజకీయపరంగా చూసుకుందామని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరైన విధానం కాదని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు హితవు పలికారు.టీడీపీ నేతలు, కార్యకర్తల దాషీ్టకాలపై రాజకీయ విమర్శలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, రెండు వర్గాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేశారని ఏలూరు మండలం పాలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నేతల రవి ఈ నెల 25న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు పేర్ని నానిపై తప్పుడు కేసు నమోదు చేశారు. -
మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్’ ప్రయోగం
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్‌కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్‌కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు. -
పోలీస్ ‘తిరుగుబాటు’
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా... వందమందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగులు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికిపైగా జీతాలు లేవు... కుటుంబాలను ఎలా పోషించేదని నిలదీశారు. పైగా... ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు అంటూ వేధింపులను మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు.అసలు పోస్టింగులే లేవు... ఇక మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి? మేం బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలి? అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే జరగడం గమనార్హం. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. ఇంతకూ ఏం జరిగిందంటే...?తీరు మార్చుకోకపోగా.. మరింత దారుణంగాచంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా... అదనపు ఎస్పీ నుంచి సీఐ స్థాయి వరకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్లో ఉన్న వందమందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగుల విషయం తేలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారులు అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని కలిశారు. వెయిటింగ్లో ఉన్నవారంతా రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్‌రెడ్డి చెప్పారు. డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు తెలిపారు. ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరంఅదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో... ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. ‘‘డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రివంటివారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? వందలమంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వరిస్తున్నారు? అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలవన్నట్టు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎక్కడ ఉండాలి..?‘‘కుటుంబాలన్నీ మేం ఏడాది క్రితం పనిచేసిన పట్టణాలు, నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్ లేకుండా మేం కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి...? డీజీపీ కార్యాలయానికి రోజూ ఉదయం, సాయంత్రం ఎలా వచ్చేది?’’ అని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ‘‘పోస్టింగులు ఇవ్వండి. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం. ఉదయం, సాయంత్రం ఏమిటీ...? రోజుకు పదిసార్లు బయోమెట్రిక్ వేయమన్నా వేస్తాం’’ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పోస్టింగులు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమానవీయం అని వాపోయారు.⇒ పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకూ సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు.తన మాటను నెగ్గించుకునేందుకే...‘‘వెయిటింగ్లో ఉన్నా పోస్టింగే’’ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీస్ బాస్‌లకు నోట మాట రాలేదు. కాగా, ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీసు బాస్‌ల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.పోస్టింగులపై హామీ ఇవ్వని డీజీపీఅదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని కలిసిన అనంతరం పోలీసు అధికారులు కొందరు జట్టుగా, మరికొందరు విడివిడిగా డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా వద్దకు వెళ్లినట్లు సమాచారం. సమస్యలను ఆయనకు కూడా వివరించినట్లు తెలిసింది. పోస్టింగులపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉండడం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్డ్ పోస్టే’’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘‘...మరి వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారా? ఏడాదిగా జీతాలివ్వకుండా పోస్టింగ్‌లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారు’’? అని ప్రశ్నించారు. -
‘కన్ఫర్డ్ ఐపీఎస్’లకు రెడ్‌బుక్ కుట్ర బాధ్యతలు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నద్దమవుతోంది. అందుకోసం క్యాడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్ఫర్డ్ ఐపీఎస్’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెడ్‌బుక్ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.సీఐడీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు. అస్మదీయ కన్ఫర్డ్ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్ కుట్ర.. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీయులైన కన్ఫర్డ్ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అ«దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా క్యాడర్ ఐపీఎస్ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. -
Big Question: EVM సర్కార్ ఇంతే..! గాలి కబుర్లతో కాలక్షేపం
-
తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
-
సూత్రధారి చంద్రబాబే
సాక్షి, అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం.. నిస్వార్థం దాని కవచం’ అని కూడా చెబుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించిన కుట్ర స్క్రిప్ట్‌తో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. అన్నీనూ చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశ పెడుతున్న పాత్రలే. హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ న్యాయస్థానం క్రియాశీలత, అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ రెడ్‌బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం కచ్చితంగా చంద్రబాబేనన్నది అంతిమంగా నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసి కొడుతున్నాయి. దాదాపు ఏడాదిగా సీఐడీ, సిట్లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్నా, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్‌బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కా పన్నాగంతో ప్రవేశ పెడుతున్నారు. టీడీపీ మూలాలు ఉన్న వారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరికోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్సార్సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టల జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు. తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే.. నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే.. సిట్ అధికారులూ టీడీపీ వీర విధేయులే.. సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా, టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైన వైనం ఇలా ఉంది. టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా దగ్గరివారే.. టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్) టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే తీగల విజయేందర్‌రెడ్డి ⇒ మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించని సీఐడీ, సిట్.. వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్‌హౌస్‌లో 2024 జూన్‌లో ఆ నగదును దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ రూ.11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టుకథ వినిపించారు. ⇒ ఈ హైడ్రామాకు సిట్‌కు పూర్తిగా సహకరించింది వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజి యజమాని తీగల విజయేందర్ రెడ్డి. తమ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను అట్ట పెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణా రెడ్డి సోదరుని కుమారుడు. ⇒ తీగల విజయేందర్ రెడ్డికి చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్‌బుక్ కుట్ర కేసు వీగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది. ⇒ కాగా, ఆ నగదును ఆర్బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే.. ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఏమిటన్నది వెల్లడవుతుంది. ఆ నోట్లను ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది.. వాటిని ఎవరు, ఎప్పుడు డ్రా చేశారు.. ఏ బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి. ⇒ 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలు అన్నీ గానీ, వాటిలో కొన్నిగానీ ముద్రించినట్టు వెల్లడైతే.. సిట్ చెప్పింది అంతా కట్టుకథేనని తేలి పోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంకు నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే.. ఆ బ్యాంకు ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది.⇒ అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై సత్వరం న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని.. బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని.. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో రూ.11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసి కొట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటేశ్ నాయుడు (ఫైల్) లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి⇒ లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే ఈ భేతాళ కుట్ర కథకు చంద్రబాబు పక్కాగా స్క్రిప్ట్ రచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కేవలం రెండేళ్లపాటు చేసిన రాజ్ కేసిరెడ్డికి ముడి పెడుతూ ఈ అక్రమ కేసు నమోదు చేశారు. తాము చెప్పమన్నట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించారు. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి తిరస్కరించారు. ఆ విషయాన్ని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికే వెల్లడించింది. ⇒ అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే.. రాజ్ కేసిరెడ్డి.. మంత్రి నారా లోకేశ్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కనుక. కేశినేని చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామా(జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. లోకేశ్ తన బినామీ అయినందునే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. పారని బాబు తాజా పాచిక⇒ అయినా సరే పట్టు వదలని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా మరో కట్టుకథను వ్యాప్తిలోకి తెచ్చారు. వెంకటేశ్ నాయుడు చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫొటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన డబ్బుతోనే వెంకటేశ్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టు కథలను టీడీపీ సోషల్ మీడియాతోపాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది. ⇒ కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేశ్ నాయుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడన్నది ఫొటో ఆధారాలతోసహా బట్టబయలైంది. వారిద్దరికి ఆయన అత్యంత సన్నిహితుడనే నిజాన్ని ఆ ఫొటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది. ⇒ వెంకటేశ్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా.. చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ కంపెనీది. టీడీపీ నేతలతో కలిసే వెంకటేశ్నాయుడు ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫొటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫొటోలు బయట పడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది.చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుడే వెంకటేశ్ నాయుడు⇒ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేశ్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్‌లో రూ.5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ రూ.5 కోట్లు నగదు అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని... 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. ⇒ కాగా, ఆ రూ.5 కోట్లలో 2023 మే లోనే ఆర్బీఐ ఉపసంహరించిన రూ.2 వేల నోట్ల కట్టలు ఉండటాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్సార్సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేశ్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది. -
వైఎస్సార్సీపీ యాప్‌తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి విన్నపం
-
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
Nellore Tour : మీరెవరు మమ్మల్ని ఆపడానికి
-
జగన్ స్వీట్ వార్నింగ్.. ఇది రెడ్ బుక్ కి మించి..
-
అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసిన SIT
-
మంత్రి లోకేష్‌కు YSRCP నేత సతీష్ రెడ్డి వార్నింగ్
-
జైల్లో మిథున్ రెడ్డి సౌకర్యాల పై అడ్వకేట్ షాకింగ్ కామెంట్స్
-
నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరైన ప్రసన్న కుమార్ రెడ్డి
-
జిల్లా YSRCP యువ నాయకుడు కామిరెడ్డి నాని ఇంటివద్ద భారీగా పోలీసులు
-
ఏలూరులో టెన్షన్.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులే టార్గెట్‌గా అక్రమ కేసులు నమోదు చేస్తూ.. అరెస్ట్‌లు జరుగుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్‌ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో వారిని అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదు. అనంతరం, వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు.ఇక, గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని కచ్చితంగా జైలుకు పంపుతానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంత మందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు. -
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్ చార్జ్జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్ తన చార్జ్‌షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్కే దక్కుతుంది. కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్... కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.⇒ సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్‌బుక్ కుతంత్రం బట్టబయలవుతోంది.కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అంటూ బురిడీ కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్జషీట్లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్ కాల్స్, వందలాది వాట్సాప్ చాటింగ్‌ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్ యత్నించింది. పోనీ ఆ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్ చార్జ్జషీట్లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్‌కాల్స్, చాటింగ్లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యంవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్‌బుక్ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సిట్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్‌షీట్‌ను స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్‌జషీట్ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్ బరితెగించి ప్రకటిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి.. లోకేశ్ బినామీ కేశినేని చిన్ని భాగస్వామి ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్‌కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారు. ⇒ కేశినేని చిన్ని మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్ కేసిరెడ్డి..వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబుగానీ ఇటు సిట్‌గానీ స్పందించకుండా మౌనం వహించడం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.బాబు కుట్ర కథే... సిట్‌తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటేచంద్రబాబు సిట్ ద్వారా రెడ్‌బుక్ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్‌బుక్ కుట్ర అమలుకు సిట్ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్‌జషీట్ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్ రిపోర్టులు, చార్జ్‌జషీట్ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్కే సాధ్యపడింది. రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్‌బుక్ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్ ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమేడిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇక బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్‌యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్‌కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. టీడీపీ సిండికేట్‌కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్‌విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానంనాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే.సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణవైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతమద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?డిస్టిలరీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్‌తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్ కోడ్ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్‌కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరిట్‌ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్ జగన్‌వేనని సిట్‌తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్ హోటల్ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్‌కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్ పెట్టడంతో పాటు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? -
మీ తప్పులు ప్రశ్నిస్తే... ఏకిపారేసిన రోజా
-
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది. సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్‌షీట్ రూపంలో కూడా కొనసాగించింది.మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్శనివారం ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. ⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. అవాస్తవాల పుట్ట.. రెడ్‌బుక్ కుట్ర సిట్ చార్జ్షీట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు సిట్ చార్జ్‌షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్లో పునరుద్ఘాటించారు. తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్‌ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడూ ప్రజాపక్షం
ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడని తెలిసే ఆయన్ను ఎవ్వరూ కలవడం లేదు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే అని మా తలుపులు తడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్లకు జరిగిన అన్యాయాలు, సమస్యల గురించి చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబూ.. మాపై నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు పెట్టే తప్పుడు కేసులకు నీతోపాటు నీకు పావులుగా మారిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తూ వేసిన విత్తనమే రేపు విష వృక్షమవుతుంది. రేపు మేం అధికారంలోకి వచ్చాక మీతోపాటు టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఈ రోజు దెబ్బతిన్న వారు రేపు ఊర్కోరు కదా.. నేను చెప్పినా సరే మావాళ్లు వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడి వారి పక్షాన పోరాటం చేయడం ప్రతిపక్షం ధర్మం. విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చి న 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసి పరిపాలన సాగిస్తున్నారని ఎత్తి చూపారు. ‘చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది.. ఏ సమస్య వచ్చి నా చంద్రబాబు పరిష్కరించండని, ఆయన్ను కలిసినా వృథాయేనని ప్రజలకు బాగా అర్థమైంది. గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఓడిపోతాడు. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ప్రజలు మా తలుపులు తడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలు, సమస్యల గురించి ప్రజలు మాకు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు ఫిర్యాదులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని పద్ధతి మార్చుకోకపోతే, రేపు తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే మూడేళ్లు ఉంటుంది.నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు.. ఇద్దరికీ వార్నింగ్ ఇస్తున్నా.. వడ్డీతో మీరంతా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో పరిస్థితిపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని కడిగి పారేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ » చంద్రబాబు చేసే ప్రతిపని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనతో చేస్తున్నారు. నా పర్యటనల తర్వాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. » మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.21వేలు–రూ.27 వేలు పలికితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది రూ.8–11వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ మిర్చి యార్డుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా వెళ్లినందుకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాకు సెక్యూరిటీని విత్‌డ్రా చేశాడు. ఆయనకు మూడ్ వచ్చి నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు సహకరించకపోగా, మాపైనే కేసు పెట్టారు. » ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల చేతిలో హత్యకు గురైన మా పార్టీ బీసీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. హెలిప్యాడ్ దగ్గర సరైన భ్రదత లేదు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. పైలట్ల పైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యాటన తర్వాత మా పార్టీ ఇన్చార్జి తోపుదుర్తి ప్రకాశ్‌పై కూడా కేసు పెట్టారు. ఇది ధర్మమేనా? » జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలిలో ధరలేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్లాను. 40–50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు ఓ 40 మందితో 200 మంది పోలీసుల సెక్యూరిటీ ఇచ్చి రాళ్లు వేయించి, టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడికీ రైతులు చాలా సమ్యమనంతో వ్యవహరించారు. 50 వేల మంది.. చంద్రబాబు పంపిన 40 మందిపై పడి ఉంటే బతికేవాళ్లా? అయినా ఆ తర్వాత మూడు కేసులు పెట్టి, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మేము రైతులకు అండగా నిలబడితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి? ఇదీ చంద్రబాబు శాడిజం! » గత ఏడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లాను. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నా కార్యక్రమాలకు ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకోవడం.. నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం.. ఇళ్లల్లోనే నిర్బంధించేలా చెక్‌పోస్టులు పెట్టడం.. లాఠీచార్జీలు చేయించడమే చంద్రబాబు పని. అక్కడ పోలీసులు నాకు భ్రదత కల్పించడానికి లేరు.. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా చూసుకోవడానికి నిలబడ్డారు. మాపై ఐదు కేసులు పెట్టారు. చంద్రబాబు కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. పొలిటికల్ గవర్నెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరుతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న పార్టీ కూడా వైఎస్సార్సీపీనే. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్సార్సీపీనే స్పందిస్తోంది. ప్రతిపక్షంగా మేము ఏడాదిగా అదే చేస్తున్నాం. -వైఎస్ జగన్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయిన బీసీ మహిళ హారికకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గులేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను పట్టుకుని మహానటి అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మీరు తప్పు చేసి, కారు అద్దాలు పగలగొట్టి.. తిరిగి ఆమెను మహానటి అంటారా? (దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ప్రదర్శిస్తూ). ఎవరు మహా నటులు? దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా యాక్టింగ్ చేస్తున్న చంద్రబాబు కాదా! చంద్రబాబు లైవ్ యాక్టింగ్ చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలి. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను దారుణంగా కొట్టారు. - వైఎస్ జగన్ విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యం» చంద్రబాబు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధరరాని దుస్థితిని లేవనెత్తుతూ, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరిస్థితుల్లో ప్రశ్నిస్తూ, సమయానికి ఇచ్చి న ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చిన విధానాన్ని ఎండగడుతూ గత ఏడాది డిసెంబర్ 13న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలిచింది. » డిసెంబర్ 24న కరెంట్ చార్జీల బాదుడుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎన్నికలప్పుడు చార్జీలు తగ్గిస్తానన్న పెద్దమనిషి తగ్గించకపోగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది తిరగక మునుపే రూ.15 వేల కోట్లు బాదడాన్ని నిరసిస్తూ పోరుబాట నిర్వహించాం. » పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం ఆడుతూ వారికి ఇవ్వాల్సిన విద్యా, వసతి దీవెన బకాయిలు ఇవ్వకపోగా, చివరికి పిల్లల చదువులు ఆపేసి పనులకు వెళ్తున్న పరిస్థితుల మధ్య వారికి తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు చేపట్టాం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటని.. గత ఏడాదికి సంబంధించి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.36 వేలు ఎగ్గొట్టిన తీరుపై యువతకు తోడుగా పోరాటం చేశాం. » జూన్ 4న చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్, సెవన్ హామీలను ఎత్తి చూపించాం. ఏడాదిగా ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బాకీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల సంగతి ఏమిటని నిలదీస్తూ వెన్నుపోటు దినం చేశాం. » ఇప్పుడు బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తి చూపిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. చంద్రబాబు ఇచ్చిన బాండ్ల గురించి ప్రజలకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ ఏడాదిలో ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని లెక్కించి చంద్రబాబును అడిగేట్టుగా జూన్ 25న కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో జోరుగా సాగుతోంది. » జూలై 21 నుంచి గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు గతంలో అన్న మాటలు.. గతంలో ఇచ్చిన బాండ్లు.. మేనిఫెస్టో .. చంద్రబాబు చేస్తున్న మోసం.. ఏడాదిగా ఎంత బాకీ ఉన్నాడు.. అన్ని వివరాలు ఒక్కచోటే తెలుస్తాయి. తద్వారా గ్రామ స్థాయిలో చంద్రబాబును నిలదీసేట్టుగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. మేము చేసే ప్రతి పనిలో విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయించడమే మా బాధ్యత. మాట వినకుంటే వేధింపులే » మా ప్రభుత్వ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో తలెత్తుకుని సేవలందించారు. మా సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది. స్పందన కార్యక్రమం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తల సమస్యల కంటే పోలీసులు, కలెక్టర్లు టీడీపీ వారి సమస్యలనే ఎక్కువగా పరిష్కరించే వారు. వివక్ష చూపించకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసింగ్ అనేది పరిష్కరించడంలో ముందుండేది. ఈ రోజు అలాంటి అధికారులు చంద్రబాబు మాట వినకుంటే.. వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. » డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను సైతం వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్‌లను దళిత ఆఫీసర్లు అని కూడా చూడలేదు. బీసీ ఆఫీసర్ ఐజీ కాంతిరాణా టాటాను, ఎస్సీ అధికారి, డీఐజీ విశాల్ గున్నీపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణల పేరుతో వేధిస్తున్నారు. » నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయిస్తున్నారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. 80–100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట విననివారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. డీఐజీ ఓ మాఫియా డాన్ » చంద్రబాబు తన మోచేతి నీళ్లు తాగే అధికారులను పెట్టుకుని, వాళ్లను అవినీతిలో భాగస్వాములను చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే.. డీఐజీ అనే వ్యక్తి ఓ మాఫియా డాన్. ఆ జోన్లో ఆయన కింద సీఐలు, ఓ డీఎస్పీ ఉంటారు. అదే ఆయన ఆర్మీ. సదరు నియోజకవర్గంలో ఇసుక, మద్యం, బెల్టుషాపుల అనుమతులు, పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లు, పేకాట క్లబ్బులు నడిపే విషయంలో డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేయడమే పని. » ఇక్కడ పోలీసులు వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇవ్వడం విచిత్రం. సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మిగిలిన సగ భాగం పైన ఉన్న పెద్దబాబు, చిన్నబాబుకు తీసుకెళ్తున్నారు. ఇలా వసూళ్ల దందాను డీఐజీలతో నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి భరించలేక కొంత మంది ఐపీఎస్ అధికారులు.. సిద్ధార్థ కౌశల్ యంగ్‌స్టర్ రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఢిల్లీకి పోవడానికి చంద్రబాబు రిలీవ్ చేయడు.. ఇక్కడే ఉండి వేధింపులు ఎందుకని రాజీనామాలు చేస్తున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీకి మౌలిక హక్కులు తెలియవా? » చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీలో రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో తెలీదా? ఈ పెద్ద మనిషి ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశాడు? మీటింగులు పెట్టుకోవడం, ప్రజల దగ్గరకు వెళ్లడం.. వాళ్లను చైతన్య వంతులు చేయడం.. ఇవన్నీ రాజకీయ పార్టీల హక్కులు కావా? ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, నష్టం జరిగినా, ప్రభుత్వం మోసం చేసినా, ఆ ప్రభుత్వాన్నిప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటన కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. » గుడివాడలో అక్కడి స్థానిక (గుడ్లవల్లేరు) జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? దుర్భాషలాడుతూ.. నోటికొచ్చి నట్టు ఎందుకు తిట్టారు? చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే తప్పేముంది? కారులో వెళ్తుంటే దారి మధ్యలో అడ్డగించారు. సాయంత్రం 5 గంటలకు దాడి మొదలైంది. 6.30 గంటల వరకు హారికను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ.. కొడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతున్నా, వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. » ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్టు స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంటే ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అరెస్టు చేశారు? పై నుంచి ఫోన్లు చేసి దాడికి పంపించారు. 8న పేర్ని నాని ఓ డైలాగ్ గురించి మాట్లాడితే.. 11న మూడు రోజుల తర్వాత గుడివాడ ప్రోగ్రాంకు వెళ్తుంటే పథకం పన్ని, దారికాచి దాడి చేశారు. కళ్లముందు కనిపిస్తున్న ఈ వీడియోను పక్కనపెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన తన కారుతో గుద్దారని కేసు. హారిక, రాము ముందర సీటులో కాదు.. వెనుక సీటులో కూర్చున్నారు. హారిక జెడ్పీ చైర్పర్సన్.. అది ప్రభుత్వ కారు. డ్రైవర్‌ను ప్రభుత్వం ఇచ్చి ంది. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాతారు? సిగ్గుండాలి. ఎక్కడైనా దూకిచావాలి వీళ్లంతా? » మరుసటి రోజు పేర్నినాని, కైలే అనిల్ కుమార్.. పెడనలో సభ పెట్టిన వారందరిపై మరో కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను క్యాడర్ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ .. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కనపెడితే పోలీసుల సమక్షంలోనే చేస్తున్న దాడులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు దగ్గరుండి పోలీసులే బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా? » సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపారు. నీకు అ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులు, మంచి పాటలు సహజంగానే పాపులర్ అవుతాయి. మంచి పాట పాడితే తప్పు అంటావ్.. మంచి డైలాగు పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పంటావ్.. సినిమా వాళ్లు చేసే హావభావాలు చేస్తే తప్పంటావ్.. బయట ఎవరైనా సరే.. ఇలా అన్నా తప్పే.. అలా అన్నా తప్పే.. అంటే ఎలా? అలాంటప్పుడు సినిమాలను ఆపేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? ఆలోచన చేసుకోవాలి. » ఎవరో ఏదో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పోస్టర్లు ప్రదర్శించిన మాత్రాన మీకొచ్చే నష్టమేమిటి? గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.. 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగులు పోస్టర్లు పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపించారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వాళ్లను పిలిపించుకోవడం.. రోజంతా కూర్చోబెట్టుకోవడం.. వేధించడం చేస్తున్నారు. చార్జిషీట్లు చూస్తే ‘అండ్ అదర్స్’ అని ఖాళీగా పెట్టి.. వాళ్లు టార్గెట్ చేసిన వాళ్లను ఇన్స్టాల్మెంట్ బేస్‌లో చేరుస్తున్నారు. » స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘అండ్ అదర్స్’లో అందర్నీ చేర్చి ఎత్తి లోపలేయడం.. ఎందుకింత కుట్రలో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొనేలా పాలన చేయాలి. అదీ సత్తా. అంతే కానీ ఓ పక్క అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఇట్టా అన్నాడు.. అట్టా అన్నాడంటూ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? పోలీసుల దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కొడుకును కోల్పోయిన ఆ పెద్దాయనను పరామర్శించేందుకు నేను వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి మా పార్టీకి చెందిన సర్పంచ్. పోలీసుల వేధింపులు వల్ల ఆయన చనిపోతే బెట్టింగ్ వలన చనిపోయాడంటూ దొంగ కేసులు పెట్టడం దుర్మార్గం.రైతులు రౌడీషీటర్లా? » మరొక వైపు ధరల్లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే.. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో ఇదే తోతాపురి మామిడి ధర కిలో రూ.25–29 ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.2–3కు పడిపోయింది. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ, 3వ వారమైనా తెరవలేదు. ఫ్యాక్టరీలు నెల ఆలస్యంగా తెరవడం, ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం, సప్లయి ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. ఇది మానవ తప్పిదం కాదా? » చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు.. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వంటి వాటికి మేలు చేసేందుకే ఇదంతా చేశారు. మీరు ప్రకటించిన ధర ప్రకారం ఎంత మంది రైతులకు కిలోకు రూ.12 వచ్చి ంది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని ధర. పొరుగునున్న కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే కిలో రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తోంది. నువ్వు మాత్రం ఇక్కడ కిలో రూ.12కు కొనిపిస్తానని చెబుతున్నావు. » 2.20 లక్షల ఎకరాల్లో 6.50 లక్షల టన్నుల పంట అమ్ముకునే దారి లేక 76 వేల రైతు కుటుంబాలు చంద్రబాబు పుణ్యమా అని అల్లాడిపోతున్నాయి. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను అక్కడకు వెళ్తే.. తప్పా? నేను వెళ్లడం ఏమైనా నేరమా? బంగారుపాళ్యం పర్యటనలో రైతులు పాలుపంచుకోవడం తప్పా? ఈ పర్యటనలో వందల మందిని నిర్బంధించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 2 వేల మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. » ముగ్గురు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, ప్రతి గ్రామానికి, ప్రతి సందుకు చెక్ పోస్టులు పెట్టారు. వీళ్లంతా నాకు సెక్యురిటీ కోసం కాదు.. నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. బైకులకు పెట్రోల్ పోయకూడదని చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా సరే కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం, దేశం దృష్టికి సమస్య వెళ్లాలని మామిడి కాయలను రోడ్లపై పారబోసి నాతో కలిసి వచ్చారు. ఈ పర్యటనపై ఐదు కేసులు పెట్టారు. 20 మందిని అరెస్ట్ చేశారు.ఈనాడు.. అదీ ఒక పేపరేనా? » రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన కార్యక్రమం అది. ఇదేదో నేరమన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈనాడు.. అదీ ఒక పేపరేనా? ఈనాడు పేపరు చూస్తుంటే ‘టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ’ అన్నట్టుగా ఉంది. ఏమిటా రాతలు? ఓ పక్క ధర లేక రైతులు రోడ్డు మీదకు వస్తుంటే రైతులందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నారు. » మామిడి పండ్లను రోడ్లపై వేసినందుకు వాళ్లపై కేసులు పెట్టారు. తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు. రోడ్డెక్కి నిలదీయకూడదన్నట్టుగా ఉంది చంద్రబాబు పాలన తీరు. ఎన్నికల్లో ఇచ్చి న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో సహా 143 హామీలన్నీ నెరవేర్చేశామని ప్రజలంతా భావించాలట! వారంతా ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టుగా భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. కాదు.. కుదరదు అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం. పాలకుడని చెప్పుకునేందుకు చంద్రబాబుకు, మీడియా అని చెప్పుకునేందుకు ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. ఇది పైశాకత్వం కాదా?» రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పాలంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆయన ఎప్పుడు అక్కడకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఐ ఏకంగా గన్ చూపిస్తున్నాడు. (వీడియో చూపిస్తూ).. అసలు బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు, పచ్చ శాడిస్ట్లు పోలీసుల సమక్షంలోనే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేసిన ఘటన చేశాం. » ప్రసన్న నిజంగా ఇంట్లో ఉండి ఉంటే చంపేసి ఉండేవారు. (పోలీస్ సైరన్ మోగుతూ వాహనం ఇంటి బయటే ఉండగానే ఇంట్లోకి చొరబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ). అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఇంట్లో ఉండి ఉంటే మనిషే లేకుండా చేసే వారు. దాడి చేయించిన, ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై కానీ, వాళ్ల మనుషులపై కానీ ఎలాంటి చర్యలు.. కేసులుండవు. ఎలాంటి అరెస్ట్‌లు చేయరు. తిరిగి ప్రసన్నపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కుట్రలతో రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చి , దాన్ని కొనసాగిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా » ఒక కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్లే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళితో సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీరితో పాటు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి వంటి జీవితంలో మచ్చలేని రిటైర్డ్ అధికారులపై.. ఇలా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా. తమకు కావాల్సినట్టుగా వాంగ్మూలాలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇష్టమొచ్చి నట్టు అరెస్టులు చేయడం. » ఇదే మోడస్ ఆపరండాతో దేశంలో ఎవరినైనా, ఎక్కడైనా.. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు చూపిస్తున్నాడు. ప్రధాని మోదీ, అమిత్‌షాలను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎలాంటి మినహాయింపు లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడైన నాతో పాటు మా పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, చివరికి సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా ఇదే మోడస్ ఆపరండాతో తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు. » ఇదే సంప్రదాయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తే.. దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నా. మీరు ప్రారంభించిన ఈ తప్పుడు సంప్రదాయం విష వృక్షంగా మారుతుంది. ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఈరోజు పైన మీరు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత మేము పైకి వస్తాం. మీరు కిందకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. -
నల్లపరెడ్డి ఇంటిపై దాడి వైఎస్ జగన్ రియాక్షన్
-
YS Jagan: మేం అధికారం లోకి వస్తే.. నేను చేప్పినా సరే మా వాళ్ళు మాత్రం
-
Margani Bharat: నాలుగు సంవత్సరాల తరువాత పరిస్థితి మీ ఊహకే వదిలేస్తున్నా...
-
డ్రైవర్ చెల్లి కన్నీటి పర్యంతం
-
అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి
-
సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
-
గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
-
YSRCPపై కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలు
-
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్‌బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్‌మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ అయిన వారికి రిమాండ్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్ఎస్ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్‌పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్‌కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్‌బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఈ రెడ్‌బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్‌కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్ రెడ్‌బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్‌బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్‌బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్లాన్ ప్రకారమే ప్రసన్న ఇంటిపై దాడి.. డైవర్షన్‌తో చిత్తూరుపై కుట్రలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో దాడి జరగడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి.ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని అన్నారు. .@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025 -
రెడ్ బుక్ రాజ్యాంగంపై కన్నెర్ర చేసిన ఏపీ హైకోర్టు
-
రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్‌కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్‌ను అర్ధ నగ్నంగా లాకప్‌లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్‌బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్‌కుమార్‌పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్‌ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్‌పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.పోసానిపై రెడ్‌బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ను హైదరాబాద్‌లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్‌కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్‌కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
Tammineni: మీకు నచ్చిన కేసులు పెట్టుకోండి ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు
-
రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌తో రక్తమోడుతోన్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
నా భార్య YSRCP MPTC.. అందుకే నాపై దాడి..
-
ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం
-
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై
-
వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్
-
జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
-
సుపరిపాలన కాదు..‘సూపర్’ మోసపు పాలన
చంద్రబాబు సర్కారు ఏడాది పాలన అంతా కక్షపూరిత చర్యలు, సూపర్ సిక్స్ సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది.. హామీలిచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను వంచించారు.. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. పిల్లలకు ఫీజులు లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు భృతి లేదు.. ఇదా సుపరిపాలన?ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు... ఇది సుపరిపాలనా?ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతోపాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు.. పేదలు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అందక అప్పుల పాలవుతున్నారు.. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు..పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు... ఇదా సుపరిపాలన?గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, వలంటీర్ వ్యవస్థలు కూటమి సర్కారు కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి.. ఇది సుపరిపాలనా?సాక్షి, అమరావతిరాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగా, కుట్రలతోనే సాగిందని.. కూటమి ఎమ్మెల్యేలు ఏ మొఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. మద్యం దుకాణాలను పచ్చ ముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ డైవర్షన్ నాటకం మొదలుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయకపోగా అధఃపాతాళానికి వేల అడుగులు వేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.‘సూపర్’ మోసాలు.. హామీలు బుట్టదాఖలుఅధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్ సిక్స్ హామీలంటూ నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కింద రూ.15 వేలను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూమంత్రంగా విదిలించి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సిలిండర్ ఇచ్చి సూపర్ సిక్స్‌ను సమాధి చేశారు. ‘సంపద సృష్టించాక సంక్షేమం అమలు చేస్తాం’’ అని ఒకసారి.. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి...’ అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా మౌనముద్ర దాల్చారు. నిర్వీర్యమైన విద్య, వైద్యం, వ్యవసాయంవైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి తొలి ఏడాది ఐదు చోట్ల 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేటీకరణ పేరుతో తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు అడుగులు వేస్తోంది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను ఎగరగొట్టి అన్నదాతలను నడిరోడ్డు మీద నిలబెట్టింది. రెండు నెలలుగా కనీసం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఈ సర్కారుపై మండిపడుతూ రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యువతకు వెన్నుపోటు..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి 6.38 లక్షల ఉద్యోగాలను, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్–2 పోస్టులను గ్రూప్–1లో కలపడం, డీఎస్సీలో 50 శాతం అర్హత మార్కుల నిబంధనతో 3 లక్షల మంది అభ్యర్థులకు అవకాశాలను దూరం చేశారు. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు.రెడ్ బుక్‌తో టెర్రర్.. దిగజారిన శాంతి భద్రతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్ష పూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుల్లో సరికొత్త రికార్డు..ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా మారుస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్ పరిధిలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తేగా బడ్జెట్ బయట రూ.50 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు.మాఫియా ముఠాలతో సహజ వనరుల లూటీవైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శక ఇసుక విధానం ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం జమ చేయగా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల జేబులు నింపుతూ రూ.వేల కోట్ల ఇసుకను దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్ సహా అన్ని గనులను వ్యవస్థీకృతంగా దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని లులూ సంస్థకు, రూ.3 వేల కోట్ల భూమిని ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఈ సంస్థలు చంద్రబాబు సన్నిహితులవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీతో రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.డైవర్షన్ పాలిటిక్స్... మభ్యపెట్టే కుతంత్రంచంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదం, ప్రకాశం బ్యారేజ్‌పై కుట్ర, తిరుమల లడ్డూ వివాదం లాంటి అంశాలతో వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సీజ్ ది షిప్ నాటకాలతో ఈ డైవర్షన్‌కు ఊతమిస్తున్నారు.రద్దుల రాజ్యం... కమీషన్ల పర్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు 2.60 లక్షల మందిని రోడ్డున పడేసింది. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పి మొత్తంగా ఆ వ్యవస్థనే ఎత్తివేసింది. ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,280 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోయారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థలను రద్దు చేసి టెండర్లను సన్నిహితులకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానంతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది. -
ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్‌బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్‌ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్‌ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్‌ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
కూటమి పాలనలో రెడ్ బుక్ పాలన సాగుతోంది : సీదిరి అప్పలరాజు
-
రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం
-
ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర!
సింగయ్యను పచ్చ బ్యాచ్ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిలువరించడానికే కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్, పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటికి వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం... అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తోంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్రెడ్డిని ఏదో రకంగా కేసులో ఇరికించడమే వారి కుట్ర కాబట్టి.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో, చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మారంగా వ్యవహరించింది. వైఎస్ జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని.. పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచి్చన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ2గా, ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజినిలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు, ఎల్లో మీడియా చెబుతున్న, చూపిస్తున్న వీడియో విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 4 టన్నుల బరువున్న వాహనం ఎక్కితే కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతాడా?మామూలు ఫార్చూనర్ వాహనం రెండు వేల కిలోలు ఉంటుంది. అదే బుల్లెట్‌ప్రూఫ్ వాహనమైతే 3.5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళితే స్పాట్లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతాడు. అలాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని చెబుతున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలుమీద కాలేసుకుని పడుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేటు వాహనంలో అతడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలే కనపడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైరు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతన్ని బయటకు తీసిన వీడియో ఎందుకు బయటకు రాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించినట్లు స్పష్టం అవుతోంది. చిన్న గాయాలకే చనిపోయాడా? మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడి వైపు, కుడి మోచేయి వెనుక నుంచి అరచేయి వెనుక భాగం వరకు, మోకాళ్ల వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి, హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఇది కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. దుర్మార్గానికి పరాకాష్టపోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్‌ను కారులో ఉన్న జగన్మోహన్రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా రాశారు. అసలు వీఐపీ వెహికల్లో ఉన్న వారు డోర్ గ్లాస్లు వేసిన కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? సంఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఫుట్ రెస్ట్ ప్లేట్‌పై నిలబడి బయటి ప్రజలకు అభివాదం చేస్తుండటం ఆ ఫేక్ వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనపడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే.. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినప్పటికీ.. వాహనం పోనివ్వమని చెప్పారంటూ ఎఫ్ఐఆర్లో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. -
'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన
చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్. ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదురాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్ పాలన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది.చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యంచంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్ కాన్ఫరెన్స్‌లోని మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారికి కూడా నా అభినందనలు. జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్ కూడా ఇప్పించారు. ఆ బాండ్‌పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి⇒ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. ⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.అందమైన అబద్ధంతో దగా– కురసాల కన్నబాబు, మాజీ మంత్రిక్యూఆర్ కోడ్, ఆ స్కానింగ్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు. -
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన డ్రైవర్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బీఎన్ఎస్ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్‌తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్ ప్లస్ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్‌పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి (ఏఆర్ కానిస్టేబుల్)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్‌కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్‌తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైనట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్ 18 : వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్‌లోని వాహనం కాదు. ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు గొట్టిపాటి హరీశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్ 22 : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్ఎస్ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్‌పై ఒత్తిడి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్‌గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్‌గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. -
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి కక్ష సాధింపు చర్యలు
-
కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..
సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. ⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమీనుద్దీన్ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్‌మెన్ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ⇒ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్ ర్యాలీలు చేశారని వైఎస్సార్ సీపీ నేత గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బారికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్‌తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారని... టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్ టీడీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు. ⇒ వైఎస్ జగన్ పర్యటనలో అభిమానులు గజ్జల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇబ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూర్‌బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ ఆపమన్నందుకు గుర్తుతెలియని నలుగురు తనౖపె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్‌బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్‌కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్‌న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోంది
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరుచేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందిన పండరబోయిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దివ్యాంగుడినైన తనపై రెడ్‌బుక్ పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డజను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు ఈ రెడ్‌బుక్ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్లో వివరించారు.ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే, మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్టుచేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. సోషల్ మీడియా తాను పెట్టిన ఒకేఒక్క పోస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదుచేసి, దివ్యాంగుడినైన తనను ఇష్టమొచ్చినట్లు తిప్పుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి..ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడంలేదని తిరుమల కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసిన బహుళ ఎఫ్ఐఆర్లలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన హైకోర్టును కోరారు. తనపై కర్నూలు వన్‌టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి, మిగిలిన కేసులన్నింటినీ కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరుచేయడంలేదన్నారు. పోలీసుల వేధింపులు, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లయింట్స్ అథారిటీలను ఏర్పాటుచేయలేదన్నారు. రెడ్‌బుక్ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరుల్లో తాను కూడా ఒకడినన్నారు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. -
YSRCP పార్టీలో ఎందుకున్నావు అంటూ DSP హనుమంతు రావుపై జగన్ ఫైర్
-
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
Sake Sailajanath: మేము నమ్ముకున్నది రాజ్యాంగం మాత్రమే
-
పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్‌లతో కలిసి బీభత్సం
-
AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి
నాణేనికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి.. ‘సాక్షి’పై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి.. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదూడపై ఆవురావురుమంటూ విరుచుకుపడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చమూకలు విరుచుకుపడ్డాయి.. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి, బోర్డులను విరగ్గొట్టి, పేపర్లను తగులబెట్టి వికృతానాందాన్ని ఆస్వాదించాయి. ప్రజల వాణిగా.. వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా.. నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్ల పైకెక్కడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.. వాటిని సాక్షికి ఆపాదించవద్దని కోరింది. అయినా దీనిని ఓ అవకాశంగా మార్చుకోవాలన్న దుగ్ధతో, రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగించిన ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్ సిక్స్ హామీలను ఏడాదైనా ఒక్కటీ నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది. తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద నేమ్ బోర్డులను పెకిలించేశారు. ‘సాక్షి’ పత్రిక ప్రతులతో పాటు, ‘సాక్షి’ నేమ్ బోర్డులను తగులబెట్టారు. బయటి వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధంలేదని ‘సాక్షి’ చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ, ‘సాక్షి’ సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. విజయవాడలో ‘సాక్షి’ ఏపీ ప్రధాన కార్యాలయంపై దాడిఈ దాడుల్లో భాగంగా.. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైనా పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు భార్య అనురాధ, ఆయన కొడుకు గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, అల్లరిమూకలు ఉ.11 గంటలకు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని గేటు ముందు బైఠాయించారు. ‘సాక్షి’ పత్రికకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా, కొందరు అత్యుత్సాహంతో కార్యాలయం గేటుపైకెక్కి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం చేయాలని శతధా ప్రయత్నించారు. అది సాధ్యంకాక గుడ్లు, రాళ్లు తెచ్చి కార్యాలయంపైకి విసిరారు. దీంతో అక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవి తగిలాయి. మహిళా పోలీసులపై కోడిగుడ్లు పడ్డాయి. అప్పటికీ శాంతించని కూటమి నేతలు ‘సాక్షి’ నేమ్ బోర్డును తొలగించి, కొంత భాగాన్ని మురుగుకాలువలో పడేశారు. మిగతా భాగాన్ని గేటు ముందుకు తెచ్చి కాళ్లతో తొక్కారు. పత్రిక ప్రతులతో పాటు నేమ్ బోర్డుకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. ఆ సమయంలో విధుల్లోకి వెళ్లాల్సిన ‘సాక్షి’ సిబ్బంది రోడ్డుపైనే మండుటెండలో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. కూటమి నేతల దుశ్చర్యలకు ఆటోనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో టీడీపీ నాయకులు సోమవారం పోలీస్ చట్టం సెక్షన్–30ని ఉల్లంఘించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎల్లోగ్యాంగ్ అరాచకం ఇలా..» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ‘సాక్షి’ కార్యాలయం ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు బావ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు సుమారు మూడు గంటలపాటు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కార్యాలయం నేమ్ బోర్డును పీకేసి తగలబెట్టారు. కార్యాలయంలోకి, ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి కార్యాలయం లోపల గలాటా సృష్టించారు. గేటుకున్న తాళాన్ని సైతం పీకేశారు. కార్యాలయం ఎదుట రెండు టెంట్లు వేసి ధర్నా చేశారు. » విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించారు. » ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు యత్నించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రభస సృష్టించారు. » గుంటూరు జిల్లా ఆత్మకూరులోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ పేరుతో అమరావతి రైతులు, మహిళలు ధర్నా చేశారు. పలుమార్లు సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేట్లు ఎక్కి రాళ్లు రువ్వారు. రాజధాని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్, తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీచైర్మన్, టీడీపీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, తాడేపల్లి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు అన్నె కుసుమ, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట సాక్షి కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. » నెల్లూరు, కర్నూలు, కడప, రేణిగుంటలోని సాక్షి యూనిట్ కార్యాలయాలపైనా టీడీపీ మూకలు కొందరు రౌడీలతో కలిసి దాడికి తెగబడ్డాయి. -
చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్‌కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్‌కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. -
‘కొమ్మినేని అరెస్ట్.. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికా?’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్‌ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జూపూడి ప్రభాకర్‌రావు ఖండించారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సరికాదన్నారు.👉సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని తప్పుబట్టారు. అధికారం ఇచ్చింది అక్రమ కేసులు పెట్టడానికా?. దీనిపై మూడు రోజులుగా టీడీపీ, ఎల్లో మీడియా రాద్ధాంతం దారుణం. విశ్లేషకుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని ఆపేశారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని.. అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షిలో కేఎస్ఆర్ న్యూట్రల్‌గా డిబేట్లు నిర్వహిస్తారు. ఆయన పొరపాటున కూడా అసభ్యకరంగా మాట్లాడరు. చంద్రబాబు పాలనలో అరాచకమే ఉంది. సంక్షేమం లేదు.👉భూమన కరుణాకర్ రెడ్ది స్పందిస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కొమ్మినేని అరెస్ట్. ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ, జనసేనలు నిరసనలు. కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి ఖండించింది. మహిళలను టీడీపీ, జనసేన పార్టీలు రెచ్చగొడుతున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. సాక్షిపై దాడి.. ప్రజల గొంతుకలపై ఉక్కుపాదం. టీడీపీ గూండాలే దాడికి పాల్పడుతున్నారు.👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. 👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది. సాక్షి, హైదరాబాద్: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమరావతిలో మహిళలను కించపరిచారంటూ ఆయనపై ఏపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చేరుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్‌ను పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉 జర్నలిస్ట్ తిలక్ స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. 👉 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. లైవ్ డిబెట్లో ఎవరో మాట్లాడిన మాటలకు కేఎస్ఆర్కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉 హైకోర్టు లాయర్ వెంకటేశ్ శర్మ స్పందిస్తూ.. కొమ్మినేని ఎప్పుడూ పరిధి దాటరు. కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేనిపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. కేఎస్ఆర్ చర్చల్లో ప్రజల వాణి వినిపిస్తుంది. 👉 వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. కొమ్మినేని అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ప్రజా గొంతుక వినిపించడంలో కొమ్మినేని ముందుంటారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాటలను ఎవరూ సమర్థించరు. వైఎస్సార్సీపీ, సాక్షి పత్రిక కృష్ణం రాజు వ్యాఖ్యలను ఖండించింది. సాక్షికి సంబంధంలేని మాటలను పట్టుకుని కొమ్మినేని ఎలా అరెస్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా భయపడుతున్నారు. ప్రజల గొంతుక, జర్నలిస్టుల గొంతులు నొక్కడమే కూటమి ప్రభుత్వం పని. -
కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం
సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్‌బుక్ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలుసాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.ఒకప్పటి చంబల్ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంబాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వంరాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోమ్ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితిటీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్ సెట్‌కు నిదర్శనం. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.14 మంది రేప్ చేస్తే కేసు కట్టరా?చీమ కుట్టినట్టుగా కూడా లేదా?హోం మంత్రి ఎక్కడ?ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్.సురేశ్, హెచ్.హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు? కళ్లెదుటే ఎన్నో ఘటనలు..⇒ అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. ⇒ 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.⇒ వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిని విఘ్నేష్ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.⇒ తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్ చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.⇒ దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్ సాయి తన స్నేహితుల రూమ్‌కు తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ⇒ అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. -
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025 -
Red Book: కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ సాయి దాడి
-
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్‌లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్‌లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్‌లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పడగ విప్పిన పచ్చ మాఫియా
ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం పచ్చజెండా ఊపుతోంది.మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేసిన టీడీపీ కూటమి సర్కారు.. బాలికలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల పట్ల చోద్యం చూస్తోంది.కూటమి ఎమ్మెల్యేలతో ఊరూరా పేకాట క్లబ్బుల దందాకు తెరతీసిన బాబు ప్రభుత్వం... పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులు ఆత్మహత్యకు పాల్పడేంత తీవ్రస్థాయిలో అక్రమ కేసులతో వేధిస్తోంది....గురువారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మూడు సంఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని స్పష్టం చేశాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చిచెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ముకాస్తోందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పేకాట క్లబ్బుల దందాతో ఎందరో జీవితాలను రోడ్డు పాల్జేస్తోందని నిర్ధారించాయి. అరాచక, అసాంఘిక కార్యక్రమాలతో యావత్ రాష్ట్రం బెంబేలెత్తుతోందని కుండబద్దలు కొట్టాయి.సాక్షి, అమరావతి; ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్‌గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగుచూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా అప్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్‌ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్‌ను సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్‌ను చిన్నచిన్న ప్యాకెట్లుగా వెండార్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండార్స్ గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. విద్యాసంస్థలే టార్గెట్డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండార్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిసు్తన్నారు. విజయవాడలోని ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం.డ్రగ్స్‌పై చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారురాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో సమర్థంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. ఏపీ–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. ఇందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలతో అక్రమ రవాణాను అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులు కూటమి రాకతో..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్‌పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్‌ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది.రాష్ట్రంలో ఏరులై పారుతున్నమద్యంఇంటింటికీ డెలివరీ చేస్తున్న బెల్ట్ షాప్లుపోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్న వైనంపైనుంచి కిందివరకు చేతులు మారుతున్న లంచాలుకూటమి ప్రభుత్వం పాలనలో డ్రగ్స్ దందాకు తోడు మద్యం ఏరులై పారుతోంది. వసూ్తనే ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తెచ్చిన చంద్రబాబు సర్కారు.. పోలీసులను పెట్టించి మరీ దగ్గరుండి అమ్మకాలు సాగిస్తోంది. బార్లకు తోడు పర్మిట్ రూమ్‌లనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు బెల్టు షాపులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఒక్కో ఊరిలో రెండు, మూడు బెల్టుషాపులు వెలిశాయి. ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నాయి. ఇక మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు–ఘోరాలకు అంతే ఉండడం లేదు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ అయినవారిపైనే దాడులకు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కాగా, మద్యం దందాలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు భారీఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయి.అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంమహిళలు, బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు, హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. చంబల్ లోయను తలపిస్తున్న రీతిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతుండడంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకూ భద్రత కరువుచంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా సాగుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట... ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు ఏమాత్రం భద్రత లేకపోవడం తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దారుణపర్వంలో మరో దుర్ఘటన అనంతపురం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 13 మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటకు పొక్కింది. నిందితులు అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.బెజవాడలో డ్రగ్స్ రాకెట్పటమట (విజయవాడ తూర్పు): డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా కనిపించారు. వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, మరో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనాల డిక్కీల్లో ఉన్న తెలుపు రంగు క్రిస్టల్ ఎండీఎంఏ (మిథలిన్ డయాక్సి మిథపేటావిున్) డ్రగ్ రెండు ప్యాకెట్లు, ఊదా రంగు క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్, ఎరుపు రంగు ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్ లభించాయి. సుమారు 33 గ్రాములు గల ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని తీసుకొస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్‌నగర్ రామాలయం వీధికి చెందిన తిరుమలశెట్టి జీవన్‌కుమార్ (29), పటమట ఫన్‌టైం క్లబ్ రోడ్డులో నివాసం ఉండే బొంతు నితీష్‌కుమార్ (28), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు ఇందిరానగర్–1కు చెందిన తులిమిల్లి తరుణ్‌ప్రసాద్(20)ను అరెస్ట్ చేశారు.ఢిల్లీ నుంచి నూజివీడుకు..ప్రమాదకరమైన ఈ డ్రగ్స్‌ను ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ట్రాక్ఆన్, డీటీడీసీ కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్‌కు సరఫరా చేశారని డీసీపీ చెప్పారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు విజయవాడకు తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు జీవన్‌కుమార్, మనోహర్ ఇంటర్ క్లాస్మేట్స్. వీరికి యూపీలో ఉంటున్న మనోహర్‌కుమార్ మేనమామ ద్వారా ఢిల్లీకి చెందిన రింకూ పరిచయమయ్యారని డీసీపీ వివరించారు. విజయవాడ సరఫరా అయిన డ్రగ్స్‌ను నగర శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తారని చెప్పారు. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన రింకూ, నూజివీడుకు చెందిన మనోహర్‌కుమార్, యూపీలో ఉండే మనోహర్ మేనమామ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 2 స్కూటర్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పటమట సీఐ పవన్‌కిషోర్, ఎస్సై దుర్గాదేవీలను డీసీపీ అభినందించారు. డీసీపీ వెంట ఏసీపీ దామోదర్ ఉన్నారు.ఉసురు తీస్తున్న రెడ్‌బుక్ వేధింపులుపేకాట దందా కూటమి ఎమ్మెల్యేలది.. బలయ్యేది ప్రజలుఆత్మహత్య చేసుకునేంతగా తీవ్ర స్థాయి వేధింపులుచంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు అధికారిక గూండాల మాదిరిగా బరితెగిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేలా అక్రమ కేసులతో వేధించడం దీనికి నిదర్శనం. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పుప్పగిరిదారిలో ఉన్న సబ్‌స్టేషన్ మెయిన్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో పేకాట క్లబ్బులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధించింది. కానీ, పేకాట మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసింది. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చింది. కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జూదరులు వచ్చి పేకాడేలా అతిపెద్ద కాసినోలు నడుపుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎంపిక చేసిన అపార్టుమెంట్లు, రిసార్టులు, లాడ్జిలు, మూసివేసిన సినిమా థియేటర్లు... ఇలా అన్నీ కూడా పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ కూటమి ఎమ్మెల్యేలు భారీగా కమీషన్లు తీసుకుంటూ రోజుకు రూ.వందల కోట్లలో పేకాట దందా సాగిస్తున్నారు. కానీ, అసలు పేకాటతో నిమిత్తం లేని అమాయకులను ఇరికించి.. ఆత్మహత్యకు పాల్పడేలా అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. ఇదీ చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం.


