రెడ్‌బుక్‌ అరాచకం.. పోలీసు పైశాచికం | CPM leader Appala Raju illegally charged with PD Act | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ అరాచకం.. పోలీసు పైశాచికం

Dec 29 2025 3:42 AM | Updated on Dec 29 2025 3:42 AM

CPM leader Appala Raju illegally charged with PD Act

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు

సీపీఎం నేత అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్‌ 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు చేసిన వారికీ వేధింపులు 

థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసు మార్కు బరితెగింపు 

రప్పా రప్పా అనడమే నేరమా? అరెస్టుచేసి నడిబజారులో నడిపిస్తూ కొడతారా? 

చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైనదేనా? 

దిగజారుతున్న వ్యవస్థలకిది సంకేతం.. ఇలా చేస్తే న్యాయం బతుకుతుందా?

చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు గతంలో పచ్చమూకలు చేసిందేంటి? 

పొట్టేళ్ల తలలు నరికి ఫ్లెక్సీలకు దండలు వేయలేదా.. రక్త తర్పణం చేయలేదా? 

శాంతిభద్రతలను గాలికొదిలేసిన పోలీసుశాఖ.. దేశంలో అట్టడుగున ఏపీ పోలీస్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పచ్చ ఖాకీ’లు పేట్రేగిపోతున్నారు. రెడ్‌బుక్‌ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్లుగా బరితెగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి.. వారి భద్రతను గాలికొదిలేసినా అడిగేవారు ఉండరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. 

ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు మోపుతున్నారు. సీపీఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం రాష్ట్రప్రభుత్వ దన్నుతో ఖాకీల బరితెగింపునకు పరాకాష్ట అని విమర్శకులంటు­న్నా­రు. తాజాగా.. వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకల్లో రప్పారప్పా అన్నందుకే వారిని పోలీసులు అరెస్టు చేసి నడిరోడ్డులో నడిపిస్తూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారు.

ఇలా చేయడం దేనికి సంకేతం? పోలీసులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా? వ్యవస్థలు దిగజారుతున్నాయనడానికి ఇదే సంకేతం. ఇలాంటి చర్యలతో న్యాయం బతుకుతుందా? అని మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. జంతు బలి ఇవ్వడాన్ని సాకుగా చేసుకుని హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు.  

హింసించి నడిబజార్‌లో నడిపిస్తారా!? 
రప్పా రప్పా అన్నారని, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. వారేదో దేశద్రోహులన్నట్లుగా నడిబజారులో కొట్టుకుంటూ నడిపించడం చూసి అంతా విస్తుపోయారు. ఈ ఉదంతాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించడం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి.. ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాఢ్యాన్ని మొదలు పెట్టింది టీడీపీయే. 

గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు ఒకటీ రెండు కాదు పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్త తర్పణం చేశారు. ఆ తలలను గుచ్చి దండలా ఫ్లెక్సీలకు వేలాడదీశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఫ్లెక్సీకి రక్తాభిõÙకం చేయలేదా? ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చాలాచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిందేమిటి? ఇలాగే పొట్టేళ్ల తలలు నరికి, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేయలేదా? వాటిని ఏమంటారు?  

ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్‌.. 
యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిన్నరలోనే తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని హడలిపోతున్నారు. అయినా, దోపిడీ విధానాలను ఆయన  విడిచిపెట్టడంలేదు. అవి­నీ­తిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. 

ఇలా ఏడాదిన్నరలోనే వేలాది అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుంది. బల్క్‌డ్రగ్‌ పరిశ్రమ పేరిట రైతుల భూములను కొల్లగొట్టాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. 

బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ముసుగులో భూదోపిడీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, గాజువాకలో సిమెంట్‌ ఫ్యాక్టరీ పేరుతో భూదోపిడీపై అప్పలరాజు నిలదీస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తారు. ‘ఆయన సంగతి తేల్చండి’ అన్న ప్రభుత్వ పెద్దల హుకుంకు పోలీసులు యస్‌ బాస్‌ అన్నారు. అంతే.. ఏకంగా 2013 నుంచి పెండింగులోని కేసులను తిరగదోడి మరీ అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపింది.  

జై జగన్‌ అన్నా అక్రమ కేసులు, వేధింపులు..
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పచ్చ ఖాకీల క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. అక్రమంగా నిర్బంధించి నిబంధనలకు విరుద్ధంగా థర్డ్‌ డిగ్రీతో వేధిస్తోంది. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక వైఎస్సార్‌సీపీ శ్రేణులందరూ నీరుగారిపోతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వారు పోరుబాట పట్టారు. 

ఇలా రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కుతుండడం ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై వెయ్యికిగా పైగా అక్రమ కేసులు పెట్టినా సరే అది వారిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. అక్రమ కేసులు పెడు­తున్న కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. 

ఆ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలను తలపించాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయమని వారికి అర్ధమైంది. అంతే.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై సరికొత్త కుతంత్రానికి తెగించారు. జగన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేశారు. 

స్వయంగా సీఎం చంద్రబాబు ఆ వేడుకలపై అక్కసు వెళ్లగక్కి వారి­ని ఏం చేయాలన్న దానిపై పోలీసులకు స్పష్టమైన సంకేతాలిచ్చారన్న ఆరోపణలున్నాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి.. ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదుచేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం.  

వారికి అలా.. వీరిని ఇలా.. 
చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటివరకు 265 మంది బాలికలు, యువతులు అత్యాచారానికి గురయ్యారు. 15 మంది యువతులను అత్యాచారంచేసి హత్య చేయడం అరాచకానికి పరాకాష్ట. టీడీపీ కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులే నిందితులు. కర్నూలు జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన ఉదంతం జరిగి ఏడాది దాటినా పోలీసులు ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు.  

బెడిసికొట్టిన ప్రభుత్వ కుట్ర.. 
తాజాగా.. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అజయ్‌ దేవ కొద్దిరోజుల క్రితం ఓ గర్భిణిని కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్నీ వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అజయ్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కూడా దు్రష్పచారం చేసింది. కానీ, అజయ్‌ జనసేన కార్యకర్త అని.. అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని కుటుంబ సభ్యులే చెప్పడం, అందుకు తగిన ఆధారాలు కూడా బైటపడడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసుల కుట్ర బెడిసికొట్టింది.

ఏపీ పోలీసుకు లాస్ట్‌ ర్యాంకు..
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా దిగజారిపోతున్నా పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ పోలీసు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బీఎన్‌ఎస్, బీఎన్‌ఎన్‌ఎస్‌ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. 

ఆ చట్టాలను పటిష్టంగా అమలుచేస్తే రెడ్‌బుక్‌ వేధింపులకు ఆస్కారం ఉండదు. అందుకే ఆ చట్టాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే వెల్లడించింది.

అమిత్‌ షా అసహనం
ఏపీ పోలీసు శాఖ అసమర్థతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఆపదలో ఉన్నవారు ఫిర్యాదుచేస్తే 25.50 నిమిషాల వరకు పోలీసులు స్పందించడంలేదని ఆయన స్వ­యంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశా­రు. చండీఘడ్‌ పోలీసులు కేవలం ఐదు నిమి­షాల్లోనే స్పందిస్తుంటే.. ఏపీ పోలీసులు మా­త్రం 25.50 నిమిషాల వరకు మొద్దునిద్ర పోతున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. 

నిజానికి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హ­యా­ంలో పట్టణ ప్రాంతాల్లో అయి­తే ఐదు నిమిషాల్లోనూ, పల్లె ప్రాంతాల్లో ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు బా­ధి­తుల వద్దకు చేరుకుని రక్షణ కల్పించే­వా­రు. అందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పా­టుచేసింది. అయితే, ఏడాదిన్నర­లోనే చంద్రబాబు ప్రభు­త్వం ఏపీ పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement