మాజీ మంత్రి కాకాణితో పోలీసుల దాగుడు మూతలు | Kakani Govardhan Reddy Fires On Chandrababu Govt And Police | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కాకాణితో పోలీసుల దాగుడు మూతలు

Feb 19 2026 12:30 PM | Updated on Feb 19 2026 12:41 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu Govt And Police

సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పోలీసులు దాగుడు మూతలు ఆడుతున్నారు. మైనర్‌ మృతి కేసులో విచారించేందుకు ఇంటికి వస్తామంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు. 10 గంటల నుంచి విచారణ నిమిత్తం కాకాణి.. ఇంట్లోనే అందుబాటులో ఉన్నారు. పోలీసులు రాకపోవడంతో రాజకీయ పర్యటన కోసం కాకాణి వెళ్లిపోయారు.

కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. బాలిక మృతిపై ప్రశ్నించేందుకు నా పై కేసు పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు పెట్టారు. 14వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు.. చివరలో రావద్దన్నారు. ఇవాళ ఇంటికి వస్తామన్నారు.. ఇప్పటి వరకు రాలేదు.. మేము ఫోన్ చేసినా.. పోలీసులు స్పందించలేదు. బాలిక కుటుంబ సభ్యుల వివరాలు నేను ఎక్కడా బహిర్గతం చేయలేదు.

..గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టలేదు.. నేను మాట్లాడకపోయినా కేసు కట్టారు. పోలీసులు అక్రమార్కుల మీద నిఘా పెట్టకుండా.. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టేందుకే పోలీసులు పని చేస్తున్నారు. మా హయాంలో ఓ బాలిక మీద దాడి జరిగితే.. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించి.. కుటుంబాన్ని ఆదుకుంది’ అని కాకాణి గుర్తు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement