అప్రాధాన్య పోస్టులకు వెయిటింగ్‌ ఐఏఎస్‌లు | IAS waiting for non essential posts | Sakshi
Sakshi News home page

అప్రాధాన్య పోస్టులకు వెయిటింగ్‌ ఐఏఎస్‌లు

Apr 14 2025 5:46 AM | Updated on Apr 14 2025 5:46 AM

IAS waiting for non essential posts

రెడ్‌బుక్‌ చాప్టర్‌లో మరో కుట్ర అమలు 

ఉన్నతాధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ  

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచిన పలు­వురు ఐఏఎస్‌ అధికారులపై రెడ్‌బుక్‌ చాప్టర్‌లో మరో కుట్ర అమలైంది! పోస్టింగ్‌లు ఇవ్వకుండా దాదాపు 11 నెలల పాటు వెయిటింగ్‌లో ఉంచిన ఆ ఉన్నతాధికారులను తాజాగా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్‌ విజయానంద్‌  ఉత్తర్వు జారీ చేశారు.

మరోవైపు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ పూర్తి అదనపు బాధ్యతలను కె.భాస్కర్‌కు, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌ పూర్తి అదనపు బాధ్యతలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జి.జయలక్ష్మికి అప్పగించారు. కాగా అవసరం తీరిపోవడంతో సీనియర్‌ ఐఏఎస్‌ సిసోడి­యాపై బదిలీ వేటు పడింది. ప్రాధాన్యత లేని చేనేత, జౌళి శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఆయన్ను బదిలీ చేయడంతోపాటు ఇతర బాధ్యతల నుంచి కూడా తప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement