సాక్షి,గుంటూరు: చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏదో విధంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో జరిగిన ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏ విధంగా నన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు.


