‘కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా?’ | YSRCP MLA Tatiparthi Chandrasekhar Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా?’

Jul 16 2026 4:12 PM | Updated on Jul 16 2026 5:01 PM

YSRCP MLA Tatiparthi Chandrasekhar Fires On Chandrababu

ప్రకాశం:  కుప్పంకి నీళ్లవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులకు మేలు చేస్తాడని అనుకోవడం మన భ్రమే అవుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. కూటిలో రాయి తియ్యలేనోడు..  ఏటిలో రాయి తీస్తాడా? అని ప్రశ్నించారు.  అన్నం పెట్టిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు చంద్రశేఖర్‌. 

కుప్పానికి నీళ్లు ఇచ్చి‌ రైతులల కళ్లలో  ఆనందం నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. మత్సకారులు గల్లంతైతే ఆ కుటుంబాలను  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పలకరిం‍చలేదని, పేదలంటే వారికి చిన్నచూపని విమర్శించారు. మహా మాయగాడు చంద్రబాబని,  భారత దేశంలోనే చెప్పింది చేయకుండా.. మోసం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో మంచి జరగదని చంద్రశేఖర్‌ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement