breaking news
coalition government
-
AP: మానవత్వం లేదా.. ఏమిటీ కక్ష?
కాళ్లూ చేతులు లేవు.. అయినా పింఛన్ ఆపేశారు దేక్కుంటూ వస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు షేక్ మౌలాలి నెల్లూరు 25వ డివిజన్లో ఉంటున్నాడు. రెండు చేతులు లేవు. రెండు కాళ్లు సక్రమంగా లేకపోవడంతో నడవలేడు. ఎక్కడికైనా దోగాడుకుంటూనే వెళ్లాలి. ఆయనకు ఆసరాగా ఉన్న భార్య కూడా ఇటీవల మృతి చెందింది. గత ప్రభుత్వంలో ఆయనకు రూ.6 వేల పింఛన్ వచ్చింది. ఇప్పుడు రీ వెరిఫికేషన్‌లో ఆధార్ అప్డేట్ కాలేదని పింఛన్ తొలగించారు. దీంతో తానెలా బతకాలంటూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు అర్జీ అందజేశాడు. ఆయన కష్టాలు చూసిన వారంతా కళ్లు చెమర్చారు.సాక్షి నెట్వర్క్: కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే తొలగించి మా ఉసురు పోసుకుంటున్నారు..! నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా..? హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా..? రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పింఛన్లు మాత్రం ఇవ్వలేరా? మా వైకల్యాన్ని ధ్రువీకరిస్తూ గతంలో ఇదే వైద్యులిచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడెందుకూ పనికిరావా? వాటిని కాదనటం అంటే డాక్టర్లను అవమానించటం కాదా? పింఛన్నే నమ్ముకుని బతుకీడుస్తుంటే అది కూడా ఈ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది...! మాపై ఎందుకింత కక్ష..? మానవత్వం చూపాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి..? వీల్చైర్లలో, కాళ్లపై దేక్కుంటూ ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం..? రీ వెరిఫికేషన్ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్టకొట్టొద్దు. వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు పోటెత్తారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగి బైఠాయించారు. వారి ఆందోళనకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నేతలు తరలివచ్చి ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రెండేళ్లుగా తనను ప్రతి నెలా ఆదుకున్న పింఛన్ ఇకపై ఆగిపోతోందని తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడు మారూరి రామలింగారెడ్డి సోమవారం పల్నాడు జిల్లాలో చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నారీ వెరిఫికేషన్ పేరుతో మా పొట్టకొట్టిన ఈ కూటమి ప్రభుత్వం మా ఉసురు పోసుకుంటుందని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో దివ్యాంగులు భగ్గుమన్నారు. తొలగించిన పెన్షన్లు తక్షణమే పునరుద్ధరించాలని, కక్ష సాధింపు విడనాడాలని నినదించారు. రీవెరిఫికేషన్ పేరుతో కోత విధించడం నీచమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి విమర్శించారు. సంపద సృష్టించడం అంటే దివ్యాంగుల పెన్షన్‌లో కోత వేసి వారి పొట్టగొట్టడమేనా చంద్రబాబూ? అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌లో యధావిధిగా పెన్షన్లు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడలో కలెక్టరేట్ ఆఫీస్ వద్ద దివ్యాంగుల ధర్నాఅక్క, తమ్ముడి పెన్షన్ ఔట్..ఉమ్మడి ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు ఇద్దరూ దివ్యాంగులే కావడంతో గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చింది. అక్క కరుణాదేవికి 90% వైకల్యం, తమ్ముడు పోకూరు విజయకుమార్‌కు 86 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ గతంలో వైద్యులు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం పింఛన్ తొలగించడంతో కలెక్టర్‌ను కలసి తమ దుస్థితి చెప్పుకునేందుకు ముప్పు తిప్పలు పడి గ్రామస్థుల సాయంతో ఒంగోలు వచ్చారు.-పోలియో బాధితునికి కంటిచూపు బాగుందంటూ పింఛను తొలగింపు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శివరామకృష్ణ. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలికి చెందిన వ్యక్తి. ఇతనికి పుట్టుకతోనే పోలియో. కుడి కాలు చచ్చుబడిపోయింది. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్నాడు. సదరం క్యాంప్‌లో 88శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించి సర్టిఫికెట్ జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్ల రీ వెరిఫికేషన్ చేపట్టడంతో ఇతను కూడా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో పరిశీలనకు హాజరయ్యాడు. అయితే నీకు కంటిచూపు బాగానే ఉందంటూ పింఛను తొలగిస్తూ సచివాలయ ఉద్యోగులు నోటీసు జారీ చేయడంతో శివరామకృష్ణ అవాక్కయ్యాడు. తనకు పోలియో కాగా.. కంటి చూపు బాగుందని నోటీసు ఇవ్వడం ఏమిటని శివరామకృష్ణ వాపోయాడు. తనకు జరిగిన అన్యాయంపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వైకల్యం తగ్గించి ఆపేశారు.. నాకు 70 శాతం వైకల్యం ఉన్నందున రూ.6 వేలు పింఛన్ పొందుతున్నా. రీ వెరిఫికేషన్‌లో నా వైకల్యాన్ని 37 శాతంగా తగ్గించి చూపించి పింఛన్ నిలిపివేశారు.– ప్రవీణ కుమారి, ఆగడాలలంక, భీమడోలు మండలం, ఏలూరు జిల్లారెండు చేతులు లేకున్నా పింఛను ఔట్..ఈ ఫొటోలో ఉన్న డి.బాబు వయసు 40 ఏళ్లు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో నివసించే ఆయనకు రెండు చేతులు లేవు. గత 15 ఏళ్ల నుంచి దివ్యాంగుల పింఛను రూ.6 వేలు తీసుకుంటున్నాడు. గతంలో 75 శాతానికిపైగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా 40% కంటే తక్కువ ఉన్నట్లు పేర్కొంటూ పింఛను తొలగించారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం ఆయన్ను గమనించిన ప్రతి ఒక్కరూ ఇదేం దారుణమని విస్తుపోయారు. ఇతని పింఛను తొలగించడం దుర్మార్గమని అంతా వ్యాఖ్యానించారు.రెండు కాళ్లు పనిచేయవు.. పెన్షన్ కట్ఎస్.రహమత్‌బాషా 2009లో తీవ్రమైన కండరాల వ్యాధి కారణంగా రెండు కాళ్లు చచ్చుపడి మంచానికే పరిమితమయ్యాడు. మంచం నుంచి కిందికి దిగాలన్నా ఇతరుల సాయం తప్పనిసరి. ఆయనకు 81 శాతం వైకల్యం ఉన్నట్లు 2010లో వైద్యులు సదరం సర్టిఫికెట్ ఇవ్వడంతో నెలకు రూ.15 వేలు పింఛన్ వస్తోంది. గత నెలలో రీ వెరిఫికేషన్‌లో 67 శాతం మాత్రమే వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్ ఇవ్వడంతో రూ.6 వేలకు పెన్షన్ కుదించారు.85 శాతం వైకల్యం ఉన్నా..85 శాతం వైకల్యంతో, వీల్‌చైర్ లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్న తనకు పింఛన్ తగ్గించడం అన్యాయమని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన ఉగ్గిన సిద్దు కన్నీరు పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం తనకు నెలకు రూ.15 వేలు చొప్పున పింఛను ఇవ్వగా ఇప్పుడు రూ.6 వేలకు మాత్రమే అర్హుడినంటూ నోటీసు ఇచ్చారని అనకాపల్లి కలెక్టరేట్ వద్ద వాపోయాడు.రూ.6 వేలకు కోత..పూర్తి అంగకవైకల్యం కారణంగా నాకు రూ.15 వేలు పింఛను వస్తోంది. 90 శాతం ఉన్న వైకల్యాన్ని ఇప్పుడు 60 శాతానికి తగ్గించి చూపించారు. దీంతో పింఛన్ రూ.6 వేలకు కుదించారు.– బొర్రా సుధాకరమ్మ, వేంపాడు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లాపింఛన్తోపాటు ప్రాణం పోయింది..ఇన్నాళ్లూ ఆదుకున్న పింఛన్ ఇకపై ఆగిపోతోందని తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడు చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ మారూరి రామలింగారెడ్డి (48) చూపు మందగించడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. 2022 డిసెంబర్లో కంటిచూపు మందగించినట్లు వైద్యులు ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. రెండేళ్లుగా ఆయన వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. తాజాగా వెరిఫికేషన్‌లో రామలింగారెడ్డి పింఛన్ తొలగింపు జాబితాలో ఉందని సచివాలయ సిబ్బంది చెప్పడంతో నిర్ఘాంతపోయిన బాధితుడు ఎన్నెస్పీ కార్యాలయం వెనుక చెట్టుకు ఉరిపోసుకుని మరణించాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన భర్త ఇకపై పింఛన్ రాకుంటే ఎలా జీవించాలని తీవ్రంగా మథనపడ్డాడని మృతుడి భార్య రామలింగమ్మ విలపించింది.⇒ గుంటూరు జిల్లాలో వేలాది మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించటానికి నిరసనగా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోటెత్తారు. వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు బొక్కా అగస్టీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ⇒ కూటమి సర్కారు ఏడాది పాలనలో సుమారు 5 లక్షల పింఛన్లు తొలగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు నిరసనగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డితో కలసి నరసరావుపేట కలెక్టరేట్లో ఆయన వినతిపత్రం అందజేశారు.⇒ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లాలో ఏకంగా 8,300 పెన్షన్లను తొలగించడం దారుణమని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజామునెమ్మ, గోపాల్, గౌరవాధ్యక్షుడు ఎండీ ఆనంద్‌బాబు మండిపడ్డారు. ⇒ రీ వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దివ్యాంగుల సంఘం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ ధ్వజమెత్తారు. అర్హులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో బాధితులతో కలసి కలెక్టరేట్‌ను ముట్టడించారు. దివ్యాంగులకు సంఘీభావంగా వస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ను పుట్టపర్తిలోని గణేశ్ సర్కిల్ నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డగించారు. ⇒ తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఏడు వేల ఫించన్లు తొలగిస్తూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.⇒ ఎంతో కాలంగా సాఫీగా అందుతున్న పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడం సిగ్గు చేటని దివ్యాంగులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేలకు పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గమని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం మండిపడ్డారు.⇒ నంద్యాల జిల్లాలో అక్రమంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా డిమాండ్ చేశారు. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ పలు సంఘాలతో కలసి కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు.ధర్నాను భగ్నం చేయొద్దని సీఐని కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న దివ్యాంగులు ⇒ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.⇒ పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ విమర్శించారు. దివ్యాంగులకు మేలు చేయాల్సింది పోయి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులతో కలసి నిరసన చేపట్టి ట్రైనీ కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు.⇒ పింఛన్ల తొలగింపుపై అనంతపురం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం, వికలాంగుల హక్కుల పోరాట సమితి, భారతీయ భీమ్ సేన ఆధ్వర్యంలో బైఠాయించి రాస్తారోకో చేశారు. -
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టింది. ఏకపక్షంగా లక్షలాది పింఛన్లు తొలగిస్తూ పింఛన్‌దారుల కడుపు కొడుతోంది. పింఛన్ పొందడానికి పూర్తిగా అర్హత ఉన్నప్పటికీ.. అడ్డగోలుగా తొలగింపులకు పూనుకొంది. దీంతో ఇకపై ఎలా బతకాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు(45)కు రెండు కళ్లు కనిపించవు. పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. ఇటీవల పింఛన్ రీ వెరిఫికేషన్‌కు రావాలంటూ నోటీసు అందింది. అందులో ఇతనికున్న 70 శాతం వికలాంగత్వాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. దీంతో తన పింఛన్ ఆపేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతో మందికి ఇప్పటికే ఆపేశారని, తనకు కూడా ఆపేస్తే మనం ఎలా బతకాలని భార్య లలిత(42)తో చెప్పుకుని మదనపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు పడేకంటే చనిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చి శనివారం అర్ధరాత్రి దంపతులిద్దరూ పురుగు మందును ఫినాయిల్‌లో కలుపుకుని తాగారు. కొద్ది సేపటి తర్వాత తల్లిదండ్రులను గమనించిన వారి కుమార్తె దేవి (ఇంటర్ చదువుతోంది) భయపడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ విషం తాగి మృతి చెందడంతో ఆమె కూడా అక్కడే మిగిలిపోయిన అదే విషపు ద్రావణం తాగింది. ఆదివారం ఉదయం వీరి ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న బంధువులు లోపలికి వెళ్లి చూశారు. దంపతులిద్దరూ మృతి చెంది ఉండగా, దేవి ప్రాణాలతో ఉండటం గమనించి శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ కొద్దిగా కోలుకున్న ఆమె.. ఈ మేరకు జరిగిన సంఘటనను మీడియా, బంధువులకు వివరించారు.సీఐ రాకతో మారిన సీన్ శ్రీకాకుళం రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు రిమ్స్‌కు వచ్చి దేవితో మాట్లాడారు. అధికార పార్టీ నేతల సూచన మేరకు.. తన తల్లిదండ్రులిద్దరూ పింఛన్ ఆపేస్తారనే భయంతో కాకుండా కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని దేవితో చెప్పించారు. కాగా, అంత వరకూ ఎక్కడ అర్ధంతరంగా తన పింఛన్ ఆగిపోతుందేమోనని తన తండ్రి నిత్యం ఆలోచించేవారని ఆమె అక్కడ అందరికీ వివరించింది.శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్‌పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆ విద్యార్థినితో ఇలా చెప్పించడం తగదని చర్చ జరుగుతోంది.పింఛన్ రాదని గుండె ఆగింది!అన్నమయ్య జిల్లాలో టైలర్ మనోవేదనతో మృతిరాయచోటి టౌన్: వచ్చే నెల నుంచి పింఛన్ రాదని ఓ టైలర్ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలివీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెకు చెందిన టైలర్ మహబూబ్ బాషా (50)కు భార్య, నలుగురు పిల్లలు. అతని కుడి కన్నుతో ఏమీ కనపడకపోవడంతో కంటివైద్యుడి సంప్రదించాడు. పరీక్షల అనంతరం ఇక చూపురాదని డాక్టర్ తేల్చిచెప్పారు. దీంతో ఇంటివద్దే ఉంటున్నాడు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రభుత్వ పెన్షన్ వస్తోంది. ఇప్పుడిదే అతనికి ప్రధాన జీవనాధారం. ఇంతలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి పింఛన్ రాదని మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో బాషా షాక్‌కు గురయ్యాడు. ఇంటి బాడుగ చెల్లించడంతో పాటు ఇల్లు గడిచేది ఎలాగని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని రాయచోటిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరపతికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.‘అంధత్వం’ కనిపించదా? ఇద్దరు అంధుల పింఛన్లు తొలగింపు కౌతాళం: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, హనుమేష్ పింఛన్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. దీంతో వారు ఆదివారం తమ ఇంటి వద్ద అంధత్వ సరిఫికెట్లను చూపుతూ నిరసన తెలిపారు. తమకు పుట్టినప్పటి నుంచే అంధత్వం ఉందని, ఎంతో ఆసరా అయిన పింఛన్‌ను తొలగిస్తే ఎవరు అన్నం పెడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.75 నుంచి పింఛన్ అందుకుంటున్నామని, వందశాతం అంధత్వం ఉన్నా పింఛన్ తొలగిస్తే ఎలా బతకాలి అని ప్రశ్నించారు. ఇక గుళ్లు, గోపురాల వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వాపోయారు. ‘పింఛన్లను ఇప్పించే మార్గం చూడండి సారూ’ అంటూ వేడుకున్నారు. -
దోపిడీలో స్మార్ట్ రి‘కార్డు’
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కోతలు కోస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో (పీడీఎస్) ‘స్మార్ట్ కార్డుల పంపిణీ’ని ఘనకీర్తిగా ప్రచారం చేసుకుంటూ అభాసుపాలవుతోంది. వాస్తవానికి, ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులు పేరుకే స్మార్ట్.. అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ లేదు. చిన్న సైజులో కార్డులను ముద్రించి దానికి సాంకేతిక పరిభాషలోని ‘స్మార్ట్’ను జోడించి లబ్ధిదారులను మభ్యపెడుతోంది. దీని కోసం ఏకంగా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డుల పంపిణీ చేపట్టనుంది. అదనపు లబ్ధి శూన్యం! కేంద్ర ప్రభుత్వం పీడీఎస్‌ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది. వన్ నేషన్.. వన్ రేషన్ నినాదాన్ని తీసుకొచి్చంది. అంటే, వేలిముద్ర వేసి దేశంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు. కేవలం ప్రభుత్వంలోని అమాత్యులు, కొందరు అధికారులు కమీషన్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలను సృష్టించి స్మార్ట్‌గా వెనకేసుకుంటున్నట్టు వినికిడి. పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్దిదారులు ఫొటోలు ఉండేవి. స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలి పాస్‌పోర్టు సైజు ఫొటో తప్ప ఇతరులు కనిపించరు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మూడు పేర్ల వరకు బాగానే కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కవ మంది లబ్దిదారులు ఒకే కార్డులో ఉంటే వారి పేర్లు కుచించుకుపోవడం, లేదా లేకుండా ఉండటమే ఈ స్మార్టు కార్డు ప్రత్యేకత. దీనికి ఒక క్యూఆర్ కోడ్‌ను పెట్టి మిగిలిన వారి పేర్లు అందులో జోడిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి, ఈ–పోస్ మెషిన్‌కు, బియ్యం తూకం వేసే ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానం ఉండాలి. లబ్ధిదారుడి వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ కాటాలో సరైన తూకంలో బియ్యం వేస్తేనే ఈపోస్ మెషిన్ అంగీకరించి లావాదేవీని అనుమతిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు ప్రవేశపెట్టిన ప్రక్రియ. కానీ, కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ–పోస్ మెషిన్లను చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే.. ప్రభుత్వం బయట గొప్పలు చెప్పుకుంటోంది. స్మార్ట్ కోతలు.. పంపిణీలోనూ కోతలే! రేషన్ సరుకుల పంపిణీలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఒక్క బియ్యం మినహా మరే సరుకులూ ఇవ్వడం లేదు. కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం 18 రకాల నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా, అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నింటినీ ఆపేశారు. రూ.220 కోట్లకుపైగా కందిపప్పు బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాకు కూడా ముందుకు రావట్లేదు. -
ఏపీఈఆర్సీలో ఏక్ నిరంజన్!
సాక్షి, అమరావతి: స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుని పారదర్శకంగా ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థల్లో సైతం కూటమి ప్రభుత్వం రాజకీయాలను చొప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో జరుగుతున్న పరిణామాలే అందుకు తాజా నిదర్శనం. రాజకీయ, సామాజిక వర్గ సమీకరణలు తేలకపోవడంతో లీగల్ మెంబర్ భర్తీ ఫైల్ సీఎం వద్ద పెండింగ్‌లో పడింది! ఏం జరుగుతోందంటే.. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి చైర్మన్ లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లీగల్ సభ్యుడు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్చార్జ్ చైర్మన్‌గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలల తరబడి సాగదీత తరువాత ప్రభుత్వం లీగల్ సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టింది. జూన్ 18న ఈ నోటిఫికేషన్ విడుదల కాగా జూలై 9వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. తరువాత గడువు జూలై 16 వరకు పొడిగించారు. అదీ సరిపోదని జూలై 25 వరకూ మళ్లీ గడువిచ్చారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, ఇతర ఏ కార్యాలయాల్లోనూ ఉద్యోగి కాని వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అనర్హులని, ఎంపికైన అభ్యర్థి ఐదేళ్ల పాటు ఏపీఈఆర్సీ సభ్యుడిగా కొనసాగుతారని నిబంధనల్లో పేర్కొన్నారు. వచి్చన దరఖాస్తుల్లో ఐదుగురి పేర్లను ఎంపిక చేసిన ఇంధన శాఖ ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. అంతే.. ఆ తరువాత అక్కడి నుంచి ఫైలు కదలలేదు. స్వయంగా హైకోర్టు కలుగజేసుకోవడంతో.. రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు ప్రజల నుంచి వసూలు చేసే విద్యుత్ చార్జీలను నిర్ణయించే ప్రతిపాదనలపై విచారణ జరిపి ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటి కీలక బాధ్యతలను ఏపీఈఆర్సీ చైర్మన్ నిర్వర్తిస్తారు. అంత కీలకమైన పోస్టును కూటమి ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై ఇటీవల స్వయంగా హైకోర్టు కలుగజేసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే రిటైర్డ్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తులు ఏపీఈఆర్సీ చైర్మన్ స్థానంలో ఉంటే తమ ఆటలు సాగవని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిని కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలో తొలుత లీగల్ మెంబర్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఓ సీనియర్ నేత జోక్యంతో... చైర్మన్ పదవికి తాము ఎంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే లీగల్ సభ్యుడి పోస్టును కూడా ఇవ్వాలని భావించారు. అయితే అదే సమయంలో కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తించిన ఓ సీనియర్ నేత జోక్యం చేసుకుని తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే లీగల్ సభ్యుడిగా నియమించాలని సూచించడంతో ఎటూ తేలడం లేదు. చైర్మన్, మెంబర్ పోస్టులను ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తే విమర్శలు వస్తాయని ఆ సీనియర్ నేత చెబుతున్నట్లు తెలుస్తోంది. పోనీ లీగల్ మెంబర్ పోస్టును భర్తీ చేయకుండా వదిలేద్దామనుకుంటే అప్పుడు చైర్మన్ పదవిలో తప్పనిసరిగా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుంది. దీంతో ఎటూ తేల్చలేక ఏపీఈఆర్సీ సభ్యుడి భర్తీ ఫైలు రోజుల తరబడి సీఎం వద్దనుంచి కదలడం లేదు. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్‌కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్‌ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్‌ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్‌ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్‌ఎస్‌కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్‌ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్‌లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్‌ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్‌ఎస్‌కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్‌ఎస్‌కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్‌తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్‌ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
డిగ్రీ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదులో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. ఓఏఎండీసీ పోర్టల్‌లో సొంతంగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడంతోపాటుగా కళాశాలలకు నేరుగా వెళ్లి దరఖాస్తు ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించడం సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆన్లైన్లో సులభంగా ఆప్షన్ల వెసులుబాటు ఉన్నప్పుడు కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక విద్యార్థి ఆన్లైన్లో తనకు నచి్చన కళాశాల కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కళాశాలల్లో ఎన్ని కోర్సులకైనా ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యా మండలి మాత్రం వెబ్ ఆప్షన్లకు రెండు మార్గాలుగా అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ విద్యార్థి సొంతంగా ఆన్లైన్లో కాకుండా నేరుగా కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే.. ఆ కళాశాలలో సీటు రాకపోతే సదరు విద్యార్థి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. పోనీ, ఒక కళాశాలకు వెళ్లి అక్కడి కోర్సుల్లో ఆప్షన్లతోపాటు వేరే కళాశాలలోని కోర్సుల ఆప్షన్ల ఎంపిక కుదరదు. మళ్లీ ఇక్కడ విద్యార్థి ఆన్లైన్లో ఆç³్షన్ పెట్టుకోవాలి/మరో కళాశాలలకు వెళ్లి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్ల మార్పు సమయంలో ఆన్లైన్లో పెట్టిన ఆప్షన్లు ఎన్నైనా మార్చుకోవచ్చు. కానీ, కళాశాలకు వెళ్లి నమోదు చేసుకున్న ఆప్షన్‌ను మార్చడానికి వీలుపడదు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును హరించడమే. -
దివ్యాంగుల పెన్షన్ టెన్షన్
సాక్షి నెట్వర్క్: సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసింది. వారందరికీ సెప్టెంబర్ నుంచి పింఛన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ చర్యతో దివ్యాంగులంతా ఆందోళన చెందుతున్నారు. ‘దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా.. మీకు మనసెలా వచ్చింది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాలు, చేయి కూడదీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. వరుస ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఆందోళనల్లో భాగంగా అనంతపురంలో గురువారం పెట్రోల్ పోసుకుని ఉద్దీప్ సింహ అనే దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బాపట్లలో చల్లా రామయ్య అనే దివ్యాంగుడు సెల్ టవర్ ఎక్కిన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయగా.. అనంతపురంలో కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని సర్కారు తీరును ఎండగట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలో నిర్వహించగా.. సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కలెక్టరేట్‌లోకి అధికారుల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్న దివ్యాంగులు ప్రభుత్వానికి తమ ఉసురు తప్పక తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. కాగా.. పింఛన్ తొలగించారన్న మనోవేదనతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దివ్యాంగురాలు మెండు గంగాభవాని (45) గురువారం ప్రాణం విడిచిందని స్థానికులు తెలిపారు. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తతవికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సంయుక్తంగా గురువారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దివ్యాంగుల రాస్తారోకో చేపట్టడంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే హక్కుల వేదిక కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్‌తో అంటించుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లైటర్ గుంజుకుని ఉద్దీప్ సింహపై నీళ్లు పోశారు. అనంతరం దివ్యాంగులు ఎండలో రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలిపారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేల్లారా రండి.. మీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం చూడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. డీఆర్ఓ మలోల, డీఆర్డీఏ పీడీ శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దివ్యాంగులు వారితో మాట్లాడేందుకు నిరాకరించడంతో కలెక్టర్ వినోద్‌కుమార్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కార్యదర్శి రాజేష్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి దివ్యాంగులకు పింఛన్ ఎలా తొలగించారో వివరించారు. దీంతో కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ఆత్మారామ్‌ను పిలిపించారు. కళ్లెదుట వైకల్యం కనిపిస్తున్నా తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే అందరికీ మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు కాలేషా తదితరులు మద్దతు తెలిపారు. సెల్ టవర్ ఎక్కి నిరసనపెన్షన్లు తొలగించటంతో బాపట్లలో దివ్యాంగులు గురువారం కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి నిరసన చేపట్టారు. రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల సెల్ టవర్ ఎక్కి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని భీష్మించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, బాపట్ల జిల్లాలో 3,824 దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రామయ్యకు మద్దతుగా సెల్ టవర్ వద్ద నినాదాలు చేస్తున్న శరత్ అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో సెల్ టవర్ వద్ద నుంచి వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తరిమికొట్టారు. పోలీసులకు ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు దివ్యాంగుల పెన్షన్లు తొలగింపుపై అర్జీని మేరుగు నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీవో గ్లోరియాకు అందజేశారు. కాగా.. సెల్ టవర్ ఎక్కిన చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.తిరుపతిలో దివ్యాంగుల ధూంధాంతొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలంటూ దివ్యాంగులు తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి అధికారులెవరినీ వెళ్లనీయకుండా.. లోపల ఉన్న వారిని బయటకు రాకుండా గేటుకు అడ్డంగా బైఠాయించి నిర్బంధించారు. మండుటెండలో ధర్నా చేయటంతో సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లిపడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 75 శాతం నుంచి 90 శాతం ఉన్న వైకల్యం కూటమి ప్రభుత్వం వచ్చాక 40 శాతానికి ఎలా తగ్గిపోతుందని నిలదీశారు. వైద్యుల్ని దివ్యాంగుల వద్దకే పంపించి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్లో దివ్యాంగులకు హామీ ఇచ్చారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపారు.దివ్యాంగుడి పింఛన్ కోత.. నిరుపేద కుటుంబం గుండెకోత» పింఛన్ రీవెరిఫికేషన్ పేరుతో వైకల్య శాతం తగ్గింపు» ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం వైకల్య శాతాన్ని తగ్గించడంతో పింఛన్ తగ్గిపోతుందని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. విజయవాడ భవానీపురం 40వ డివిజన్‌కు చెందిన పొందుగుల చిన్నపరెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2022లో చెట్టుమీద నుంచి పడటంతో వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. వైద్యులు పరీక్షించి 90శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. చిన్నపరెడ్డి బాగోగులు చూసుకోవడమే అతని భార్యకు సరిపోతోంది. కుటుంబ పోషణ, కుమార్తె చదువు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం 2023వ సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. పెద్ద మనసుతో ఆయన ఆదుకున్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి ఈ సాయం చెక్కు అందజేశారు. సామాజిక పింఛన్ రూ.10వేలు మంజూరు చేశారు. వచ్చే పెన్షన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నపురెడ్డి పింఛన్‌ను రీ వెరిఫికేషన్ చేసి.. వైకల్యాన్ని 85 శాతంగా చూపుతూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. పింఛన్ రూ.6 వేలే వస్తుందని అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో తాము బతికేదెలా అంటూ ఆందోళన చెందుతోంది. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
ఉద్యోగుల వెతలు.. సీఎస్ కబుర్లు..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నుంచి తీపికబురు వస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత ఎన్నో ఆశలతో బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశంలో ఏ సమస్యపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రస్తావించాయి. ఒక్క అంశంపైనా తక్షణ పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా సమావేశం నుంచి వెనుదిరిగారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని... » 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి » 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేయాలి » బకాయి నాలుగు డీఏల్లో కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలి » 11వ పీఆర్సీ డీఏ బకాయిలు చెల్లించాలి » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలి » పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటెషన్, ఈఎల్ చెల్లింపులు ఇవ్వాలి » రెసిడెన్షియల్ సొసైటీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు చేయాలి ట ఈహెచ్ఎస్ కార్డుల సమస్యలు పరిష్కరించి రీయింబర్స్మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంచాలి. వీటిపై సీఎస్ ఏమన్నారంటే‘‘ఉద్యోగులకు సంబంధించి 114 అంశాలు పెండింగులో ఉన్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్థికేతర సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం’’ అని మాత్రమే సీఎస్ ‘హామీ’ ఇచ్చారు. నేతల అసంతృప్తి ఇలా...ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయి. ఒక ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్‌లో చూపించాలని మే ము డిమాండ్ చేశాం. సీఎం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఎసీ అమరావతి అధ్యక్షులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, 30 శాతం ఐఆర్, కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలని మేము కోరాం. ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడంతో 14 నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. –విద్యాసాగర్, ఎపీఎన్జీవో అధ్యక్షులు టీచర్ల సమస్యలు పరిష్కరించాలి పాఠశాల విద్యా సమస్యలు, టీచర్ల అంశాలను ప్రస్తావించాం. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మున్సిపల్ టీచర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి –జి. హృదయరాజు, ఎపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు -
పింఛన్లు కకావికలం!
పింఛన్ ఆగింది.. ప్రాణం పోయింది కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి(53) ఒంటరి మహిళ పింఛన్ పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రీ వెరిఫికేషన్‌లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని.. పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్లమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటిపర్యంతమైంది.అన్యాయంగా తనకు వైకల్య శాతం తగ్గించారని ఓ దివ్యాంగుడు తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు దిగారు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం అరుందీతయ వాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన పట్టపు వెంకటసుబ్బయ్య 2018లో చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఏడేళ్లుగా బాధితుడు మంచానికే పరిమితమయ్యాడు. 2019లో వైద్యులు పరీక్షలు చేసి 86 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతిలో నిర్వహించిన సదరం క్యాంపులోనూ దీన్ని నిర్థారించారు. తాజాగా రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 45 శాతానికి తగ్గించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ బాధితుడు ధర్నాకు దిగాడు.సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: అవ్వాతాతలు అందుకుంటున్న పింఛన్లను ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకూ వెనుకాడటం లేదు! కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది! కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దే పారదర్శకంగా వలంటీర్ల ద్వారా అందించగా.. టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లను ఎగరగొట్టింది! ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురి చేస్తున్న కూటమి సర్కారు.. తాజాగా దివ్యాంగులను టార్గెట్‌గా చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ, వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెలనెలా అందే పింఛన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కారు నిర్దయగా రోడ్డుకీడ్చేసింది! ఇన్నాళ్లూ నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్‌కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం పది రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్‌దారులు కకావికలం అవుతున్నారు! నిశ్చేషు్టలై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైనే తాజాగా పింఛను నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.అప్పీలు చేయాలంటే అగచాట్లే.. దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం) కలిగి ఉండి గత పదేళ్లకు పైగా పింఛను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎండీపీవో తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిరీ్ణత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీవో నిర్దేశించిన తేదీన, ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సెప్టెంబరు 1వతేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులు అందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకొని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు గడువు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలో ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో సగానికిపైగా శరీరం, ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా కూటమి సర్కారు నాగరాజును అనర్హుడిగా ప్రకటించి పెన్షన్ తొలగించింది. ఈ బాలుడికీ అర్హత లేదట!అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్‌లో ఉంటున్న వేలూరు ధీరజ్ వెంకట్నాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఈ నెల 14న ధీరజ్‌కు పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు రావడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంత కన్నా దారుణం మరెక్కడా ఉండదని ఆక్రోశిస్తున్నారు.పక్షవాతమున్నా పింఛన్ తొలగింపు..నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన జి.గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడుం విరిగింది. పక్షవాతం బారిన పడటంతో 72 శాతం వైకల్యం ఉందని నిర్ధారిస్తూ 2019లో నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో గులాంబాషాకు 40 శాతంలోపే వైకల్యం ఉందంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గులాంబాషా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు. ⇒ గుంటూరు జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 23,459 ఉండగా 2,489 మందిని అనర్హులుగా పేర్కొంటూ నోటీసులిచ్చారు. 472 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద రూ.15 వేలు చెల్లిస్తుండగా వాటిని దివ్యాంగ పెన్షన్లుగా మార్చి రూ.6 వేలకు కుదించారు. 388 మంది దివ్యాంగ పెన్షన్ కింద రూ.6 వేలు పొందుతుండగా ఓల్డ్ ఏజ్ కిందకు మార్చి రూ.4 వేలకు పరిమితం చేశారు. ⇒ పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి 2,83,119 మందికి పింఛన్లు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు 35,096 పింఛన్లు అందజేస్తుండగా వారిలో 3,300 మందికి వివిధ కారణాలతో తొలగించారు. రీ అసెస్మెంట్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నందున తొలగించినట్లు డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పేర్కొన్నారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 వేల దివ్యాంగ పింఛన్లు ఉండగా మరోసారి ధ్రువీకరించాలంటూ రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా 4,215 దివ్యాంగ పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా 597 హెల్త్ పింఛన్లు (మంచానికే పరిమితమైనవారు), 1,611 వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ⇒ ప్రకాశం జిల్లావ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. రీ వెరిఫికేషన్‌లో ఇప్పటివరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 9 వేల మంది దివ్యాంగులకు అనర్హులంటూ నోటీసులు అందాయి. 85 నుంచి 90 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్‌లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, పింఛన్‌కు అనర్హులని నోటీసులిచ్చారు. దీంతో సోమవారం ఒంగోలులో ‘మీ కోసం’ కార్యక్రమానికి నోటీసులతో దివ్యాంగులు పోటెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9,601 మంది దివ్యాంగులకు పింఛన్ నిలిపివేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వికలాంగులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచానికే పరిమితమైన వారిని జాబితా నుంచి తొలగించారు. కలెక్టర్, ఎంపీడీవో, సర్వజనాసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల వద్ద వికలాంగులు మంగళవారం రోజంతా పడిగాపులు కాశారు. శ్రీసత్యసాయి జిల్లా అగళి, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు, పామిడి తదితర ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు. ⇒ అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 29 వేలు ఉండగా 4 వేలకుపైగా పెన్షన్లు అనర్హుల జాబితాలో చేర్చారు. ⇒ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం దివ్యాంగ పెన్షన్లు 27,302 ఉండగా రీవెరిఫికేషన్ పేరుతో 10,205 పెన్షన్లు నిలిచిపోయాయి. ⇒ కృష్ణా జిల్లాలో 33,173 దివ్యాంగ పింఛన్లు ఉండగా వేల సంఖ్యలో నోటీసులు జారీ అయ్యాయి. అర్హులై పించన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ఎస్ నారాయణ చెప్పారు. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 3,211 మంది దివ్యాంగులకు పింఛన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ⇒ బాపట్ల జిల్లాలో 24,660 దివ్యాంగ పింఛన్లు ఉండగా రీ వెరిఫికేషన్ పేరుతో 3,829 పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ నెల 18న ధర్నా చేస్తున్న దివ్యాంగులు కూర్చోలేడు.. లేవలేడు...మాట్లాడలేడు.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన ఎన్.జయరామిరెడ్డి నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. కనీసం కాలు, చేతులు కూడా కదిలించలేడు. మాట కూడా పడిపోయింది. మలమూత్రాలకు కూడా ఎత్తుకుని వెళ్లాలి. ఇంత దీనస్థితిలో ఉన్న ఆయన దివ్యాంగ పింఛన్‌ను రీ వెరిఫికేషన్ పేరుతో రూ.15 వేల నుంచి తొలగించి రూ.6 వేలకు మార్చారు. గతంలో 90 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ జారీ కాగా ఇప్పుడు 75 శాతానికే పరిమితం చేశారు. నిరక్షరాస్యుడైన ఆయన.. చదవగలడు, రాయగలడు, బరువులు ఎత్తగలడు అని వైక్యలం సర్టిఫికెట్లో నమోదు చేయడం గమనార్హం. కోతలకే రీ వెరిఫికేషన్ వైఎస్ జగన్ పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించారు. ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 100 శాతం వైకల్యం ఉన్న వారిని సైతం రీ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు పిలిíపించి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్లలో కోత వేసేందుకే రీ వెరిఫికేషన్. నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పూర్ణకంటి బాబురావు, దివ్యాంగుడు , వేమవరం జగ్గయ్యపేటఎలా బతకాలి? నాకు యాక్సిడెంట్లో కాలు విరిగింది. డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా పింఛను అందుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. మా కుటుంబం ఎలా బతకాలి? అప్పలనాయుడు, కొవ్వలి గ్రామం, ఏలూరు జిల్లా ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 32,101 దివ్యాంగ పింఛన్లున్నాయి. వీరిలో కదలలేని స్థితిలో ఉండేవారు 16,934 మంది కాగా దృష్టి లోపం ఉన్నవారు 4,036 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3,992 మంది, మానసిక వైకల్యం ఉన్నవారు 3,751 మంది, మానసిక అనారోగ్యం బాధితులు 1,277 మంది, బహుళ వైకల్యం ఉన్నవారు 2,111 మంది ఉన్నారు. ఇప్పటివరకు సర్వేలో 24,213 మంది వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ జిల్లాలో 2,899 పింఛన్లను రద్దు చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా 13,690 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. ⇒ కాకినాడ జిల్లాలో 35 వేల మంది దివ్యాంగులు ఉండగా 24,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,300 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. డోన్, మద్దికెర, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు. 10,050 దివ్యాంగ పింఛన్లను తొలగిస్తూ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. ⇒ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 12,523 మందికి నోటీసులు జారీచేసి తొలగించడంతో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బంగారుపాళ్యం మండల కేంద్రంలో ధర్నాకు దిగి రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 18వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో వందలాది మంది దివ్యాంగులు బైఠాయించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 2.50 లక్షలకు పైగా పెన్షన్లు ఉండగా దివ్యాంగుల పింఛన్లు 40 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 7,182 మంది దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించారు. ⇒ విశాఖ జిల్లాలో మొత్తం 1,60,778 మంది పింఛన్లు పొందుతుండగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 21,306 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,178 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ పింఛన్‌దారులు 31,502 మంది ఉండగా 29,055 మందికి నోటీసులిచ్చారు. ఆగస్టులో 1,458 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ విజయనగరం జిల్లాలో 36,412 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతుండగా ప్రస్తుతం 6,770 పెన్షన్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ⇒ పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారు 16,750 మంది ఉండగా పునఃపరిశీలన తర్వాత 2,781 మంది అనర్హులని తేల్చారు. దీంతో రెండు జిల్లాల్లో బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో 30,688 మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా 3,339 మంది పెన్షన్లను తొలగించారు. 799 మంది దివ్యాంగులకు వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే జిల్లాలో 10,136 మంది వృద్ధాప్య పెన్షన్లను తొలగించింది. -
పల్లెవెలుగు బస్సులకూ వర్తించని ‘స్త్రీ శక్తి’
కడప కోటిరెడ్డి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం పల్లె వెలుగు బస్సుల్లో సైతం వర్తించకపోవడంపై మహిళలు మండిపడ్డారు. శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా ఆర్టీసీ అధికారులు కడప నుంచి వేంపల్లె మీదుగా పవిత్రమైన గండి క్షేత్రానికి రెండు బస్సులను ఏర్పాటుచేశారు. గండి ఆలయానికి ఉచితంగా వెళ్లవచ్చని భావించిన మహిళలు బస్సు ఎక్కాక డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాయచోటి నుంచి గండికి వెళ్లే బస్సుల్లో కూడా చార్జీలు వసూలు చేశారు. ఆయా బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదని స్టిక్కర్లను ఏర్పాటు చేయడంతో మహిళలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
బాబు మార్కు కనికట్టు!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధర ఎక్కువన్నారు.. పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తెస్తుంటే వద్దన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల మినహాయింపుతో విద్యుత్ తీసుకుంటా మంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు.. కానీ, అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్‌కు రూ.3.20 చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ పాలకులను ఏమనాలి? రెండు నాల్కల ధోరణి అనాలా? అవకాశవాదం అనాలా? ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లు అనాలా? అధిక ధర ముసుగులో కమీషన్లు కొట్టేసే కేటుగాళ్లు అనాలా?సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.2.49కే వస్తోందంటే నానా యాగీ చేసిన ఇదే కూటమి.. అధికారంలోకి రాగానే యూనిట్ విద్యుత్‌ను రూ.3.20 చొప్పున ప్రైవేటు సంస్థల నుంచి కొనేందుకు సిద్ధమైపోయింది. తమకొక న్యాయం.. ఎదుటి వాళ్లకు మరో న్యాయం అని నిస్సిగ్గుగా చెబుతూ బరితెగించింది. రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉంటే, వీటిలో 3 లక్షల సర్వీసులకు సరిపోయేలా కుసుమ్ పథకం కింద 3,325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల మినీ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 1,185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ ఏడాది మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. యూనిట్‌కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్ చేశారు. తాజాగా ఈ టెండర్ల ధరలను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం.. యూనిట్‌కు రూ.3.19 నుంచి రూ.3.20 మధ్య ఇవ్వనున్నారు. ఎకోరాన్ కంపెనీకి యూనిట్‌కు రూ.3.18, వృద్ధిమాన్ సంస్థకు యూనిట్‌కు రూ.3.19, భవ్య కంపెనీకి రూ.3.20 చొప్పున టెండర్లను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా అందించేందుకు గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా అమలులోనే ఉంది. దాని ప్రకారం ఇంతకంటే తక్కువ ధరకు సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దానిని కాదని, పొలాల వద్ద మినీ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి సౌర విద్యుత్ బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకే వస్తోంది. అప్పనంగా 5,983.5 ఎకరాలు ధారాదత్తంమినీ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఈ డిస్కం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 1,842 ఎకరాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా, దీని కోసం 1,086.5 ఎకరాలు గుర్తించారు. మొత్తంగా 5,983.5 ఎకరాలను సిద్ధం చేశారు. మిగులు ఉండగా కొత్తవి ఎందుకు?రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ట డిమాండ్ 13 వేల మెగావాట్లు మించి లేదు. అది కూడా వేసవి వంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే. మిగతా ఏడాదంతా 10 వేల మెగావాట్లలోపే విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. భవిష్యత్ అవసరాల కోసం, డిమాండ్ భారీగా పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకంటూ ఇప్పటికే డిస్కంలు 23 వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ప్రస్తుతం సుమారు 14 వేల మెగావాట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే డిమాండ్‌కు అవసరమైన విద్యుత్ కంటే ఎక్కువగానే విద్యుత్ అందుబాటులో ఉంది. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని అనేకసార్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి మిగులు విద్యుత్ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా, ఇంకా అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.అధికారం చేతికి రాగానే దోపిడీ⇒ చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి ఉపక్రమించారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన యూనిట్ రూ.4.60 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ 400 మెగావాట్ల పునరుత్పాదక (పవన–సౌర హైబ్రీడ్) విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి, వాటి నుంచి పాతికేళ్ల పాటు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్‌ను విక్రయించేలా ఏర్పాటు చేశారు.⇒ వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గతంలో చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని గుర్తించి, వాటిని పునఃపరిశీలించాలని భావించింది. ఆ క్రమంలోనే యాక్సిస్ పీపీఏలను పక్కన పెట్టింది. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పట్టాలెక్కించారు చంద్రబాబు. తాను సగంలో ఆపేసిన దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ, రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ⇒ భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ధరలు తగ్గుతాయని, కావున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49తో సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడం భారమని వాదించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మినీ సోలార్ ప్రాజెక్టుల పేరుతో రూ.3.20తో యూనిట్ కొనుగోలుకు సిద్ధమైపోయింది.సబ్సిడీ ఎగ్గొట్టే కుట్రమినీ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సమస్య వచ్చి, ఆ సంస్థలు ఎదురు తిరిగితే రైతులకు ఈ కేంద్రాల నుంచి విద్యుత్ లభించకపోవచ్చు. అప్పుడు వారికి విద్యుత్ ఎలా అందిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కోసం డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లు అందించింది. అదే టీడీపీ గత హయాంలో 2014–19 మధ్య ఐదేళ్లకు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. పైగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామర్థ్యాన్ని గత ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వాటి వద్దనే టీడీపీ ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టిస్తామంటోంది. ఇదంతా వ్యవసాయానికి ఇప్పుడు ఇస్తున్న దాదాపు రూ.12 వేల కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘సెకీ’ ఒప్పందంపై ఎన్నో కుట్రలు ⇒ రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవకగా.. యూనిట్ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ⇒ సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని చెప్పింది. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సైతం ఆదేశాలిచ్చింది. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) కూడా స్పష్టం చేసింది.⇒ చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఎల్లో మీడియా సెకీ ఒప్పందంపై విషం గక్కాయి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని ప్రయత్నించాయి. ⇒ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే బాబు ప్రభుత్వం అదే సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
మత్స్యకారులు వద్దు, మిట్టల్ ముద్దు!
నక్కపల్లి : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 17 మత్య్సకార గ్రామాలున్నాయి. సుమారు 25 వేలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 10 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేటను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వీరు వేటాడి తెచ్చిన మత్స్య సంపద నిల్వ చేసుకోవడం, భద్రపరచుకోవడం, మార్కెటింగ్ చేసుకోడానికి సరైన సదుపాయాలు లేవు. లక్షలాది రూపాయల విలువైన మత్స్యసంపదను వేటాడి తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోలేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా సంకల్పపాదయాత్రలో మత్య్సకారుల సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని 2023లో నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు సమీపంలో మినీ జెట్టీç(ఫిష్ ల్యాండింగ్సెంటరు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. ఈ జెట్టీ నిర్మాణానికి మొత్తం రూ.24.77 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేంద్రం తన వాటా కింద రూ.14.86 కోట్లు కేటాయించగా రాష్ట్రప్రభుత్వ వాటాకింద రూ.9.90కోట్లు మంజూరు చేసింది. ఈ జెట్టీ నిర్మాణానికి అవసరమైన పదెకరాల స్థలాన్ని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక ప్రాంతాల్లో ఎంపిక చేశారు. రిజర్వ్ ఫారెస్టుకు చెందిన స్థలం కావడంతో వారికి ప్రత్యామ్నాయంగా పదెకరాలను కేటాయించి ఎంపిక చేసిన భూమిలో జెట్టీ నిర్మించాలనేది గత ప్రభుత్వ నిర్ణయం. జెట్టీ నిర్మాణానికి గుర్తించిన భూములను ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు, రాష్ట్ర, జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు సైతం పరిశీలించి అనువైన ప్రాంతంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో ఇవీ ప్రతిపాదనలు... » రూ.2.32 కోట్లు వెచ్చించి జెట్టీ ఇతర భవనాల నిర్మాణం. » రూ.33లక్షల వ్యయంతో పచ్చదనం,మొక్కల పెంపకం » రూ.34లక్షలతో వాహనాల పార్కింగ్ సదుపాయం » రూ.1.86కోట్లతో చేపలను ఎండబెట్టుకునేందుకు 2 ఫ్లాట్‌ఫారాల నిర్మాణం »రూ.15లక్షల వ్యయంతో ట్రక్ పార్కింగ్ నిర్మాణం » రూ.21లక్షల వ్యయంతో మత్య్స సంపద కోసం లోడింగ్ సెంటరు (షెడ్లు) నిర్మాణం » రూ.1.11 కోట్ల వ్యయంతో చేపల కొనుగోళ్లు, అమ్మకాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణం » రూ.5.94 లక్షలతో ఫిష్‌ల్యాండింగ్ ఫ్లాట్‌ఫారాలు » రూ.32.24లక్షలతో బీచ్ ల్యాండింగ్ ఫ్లాట్‌ఫారం »రూ.7.11కోట్ల వ్యయంతో జెట్టీ వద్ద మెకనైజ్డ్, మోటారుబోట్లు, ఇంజిజన్లు తెప్పలు పార్కింగ్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా భవనాలు, షెడ్ల నిర్మాణం » రూ.1.98 కోట్లతో జెట్టీ నిర్మించే ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం » రూ.64 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువల నిర్మాణం » రూ.1.14కోట్ల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం » రూ.9.88లక్షల వ్యయంతో వ్యర్థజలాలను శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు » రూ.46.92లక్షల వ్యయంతో వలలు, మరమ్మతులు, భద్రపరచుకునే షెడ్ల నిర్మాణం » రూ.39.42లక్షల వ్యయంతో విశ్రాంతి భవనాల నిర్మాణం » రూ.10లక్షల వ్యయంతో మరుగుదొడ్ల ఏర్పాటు » రూ.27.22లక్షల వ్యయంతో తాగునీరు, వాడుకనీరు కోసం ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం వంటి ప్రతిపాదనలు చేశారు. » జెట్టీ నిర్మించే ప్రాంతం చుట్టూ బయోఫెన్సింగ్, పటిష్టమైన రక్షణ గేటు కోసం రూ.9.16 లక్షలు కేటాయించారు. » రూ.16 లక్షలతో నీటివనరులైన బోర్లు, గొట్టపు బావులు, మోటార్లు భూస్టర్ క్లీనింగ్ సదుపాయాలు » రూ.80.85 లక్షల వ్యయంతో విద్యుత్ సదుపాయం, ట్రాన్స్ఫార్మర్లు, వీధిదీపాల సదుపాయాలు » విద్యుత్ సరఫరా, కనెక్షన్ల కోసం మరో రూ.80 లక్షలు కేటాయించారు. » ముందస్తు అధ్యయనాల కోసం రూ.20 లక్షలు, అత్యవసర పరిస్దితుల్లో ఖర్చు చేసేందుకు రూ.60 లక్షలు కేటాయించారు.అన్నీ సవ్యంగా జరిగి జెట్టీ నిర్మాణం పూర్తయితే తమ బెంగ తీరినట్లేనని గంగపుత్రులు భావించారు, భూసేకరణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్ల జెట్టీ నిర్మాణం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రికఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా జెట్టీ నిర్మాణం నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్య్సకారుల కోసం ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మిస్తామని హామీలు గుప్పించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇంతలోనే మిట్టల్ స్టీల్‌ప్లాంట్ తెరమీదకు రావడంతో జెట్టీ అంశం మరుగున పడింది. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు రాష్ట్ర పభుత్వం ఈ ఏడాది 2400 ఎకరాలు కేటాయించేసింది. ఈ భూముల్లో మిట్టల్ కంపెనీ సొంత అవసరాల కోసం కార్గో పోర్టు (కాప్టివ్పోర్టు) నిర్మించనుంది. 148 ఎకరాల్లో నిర్మించే ఈ క్యాప్టివ్ పోర్టుకు కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసింది. దీంతో జపాన్‌కు చెందిన మిట్టల్ప్రతినిధుల బృందం పోర్టు నిర్మించే ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు రావడం జరిగింది. వేటాడిన మత్య్స సంపద ఎండబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు భద్రపరచుకునేందుకు స్టోర్ రూములులేక, ఇంజిన్లు, వలలు భద్రపరచుకునేందుకు స్టోర్రూములు, మార్కెటింగ్ చేసుకునేందుకు షెడ్లు లేక మత్య్సకారులు ఇబ్బంది పడుతూంటే జెట్టీ నిర్మించాల్సిన ప్రభుత్వం మిట్టల్ కంపెనీ కార్గోపోర్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిఒ ప్రభుత్వ తీరుతో ఇక జెట్టీ విషయం మరుగున పడినట్లేనని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గంగపుత్రులను మోసం చేసిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జెట్టీ లేక శానా ఇబ్బందులు జగనన్న ప్రభుత్వం మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు సేసింది. డబ్బులు కూడా ఇడదల సేసింది. పదెకరాల భూమి కూడా సూడ్డం జరిగింది. టెండర్లు పూర్తయి జెట్టీ కడతారనుకునే సమయంలో ఎన్నికలు వచ్చేయి, జెట్టీ పని ఆగిపోయింది. ఈ పెబుత్వమైన కడతాది ఆని ఆశపడ్డాం. కానీ స్టీల్‌ప్లాంట్ ఓళ్లు పోర్టు కట్టుకునేందుకు పెబుత్వం అనుమతి ఇచ్చిందంట. ఇంక మాకు జెట్టి కడతారనే ఆశలు పోయాయి. మమ్మల్ని పెబుత్వం మోసం సేసింది. సముద్రపు ఒడ్డున సదుపాయాలు లేక సానా ఇబ్బంది పడతన్నం. జెట్టీ కడితే మేము పడే కట్టానికి పెతిపలం దక్కేది. –మైలపల్లి సూరిబాబు, మత్స్యకారుడు రాజయ్యపేట -
14 నెలలుగా పట్టలేదు.. ఒక్క ఇల్లూ కట్టలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల జీవితాలతో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. 14 నెలలుగా వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. సరికదా గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన 3,114 ఇళ్లను నిర్వాసితులకు ఇచ్చి పునరావాసం కల్పించేందుకు ప్రస్తుత సర్కారుకు మనసొప్పడంలేదు. ఇక 2024, మే నాటికి దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్న 2,279 ఇళ్లను పూర్తిచేసే దిశగా చర్యలూ చేపట్టలేదు. దీంతో.. ఆ పునరావాస కాలనీలు ముళ్లపొదలతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఆ ఇళ్లు 14 నెలలుగా వృథాగా ఉన్నాయి. ఇక నిర్వాసితుల కోసం ఇంకా 16,170 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. 14 నెలలుగా ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. నిధులు లేవేమో అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే.. కేంద్రం 14 నెలల్లో రెండు విడతలుగా అడ్వాన్సు రూపంలో రూ.5,052.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని పోలవరం పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణకు మాత్రమే వినియోగించేలా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయాలని నిర్దేశించింది. కానీ, రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ ఆ ఖాతాలో జమచేయకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. కమీషన్లు రావనే నెపంతోనే పునరావాసం కల్పనపై ముఖ్యనేత పట్టించుకోవడంలేదని నిర్వాసితులు మండిపడుతున్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వచేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు 2024, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేయాలంటే.. 121 గ్రామాల్లోని 38,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 34,360 నిర్వాసిత కుటుంబాలు పునరావాస కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని కోరగా, మిగతా 3,700 కుటుంబాలు తమకు డబ్బులిస్తే తామే కట్టుకుంటామని చెప్పాయి. 2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం..పోలవరం నిర్వాసితులకు నిర్మించాల్సిన 34,360 ఇళ్లలో 15,911 గృహాలను పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలతో సహా 2024, మే నాటికే గత ప్రభుత్వం పూర్తిచేసింది. మరో 2,279 ఇళ్లను దాదాపుగా పూర్తిచేసింది. వాటికి మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించి 2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2014, మే నాటికే పూర్తయిన ఇళ్లలో 3,114 గృహాలు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక అప్పటికే దాదాపుగా పూర్తయిన 2,279 ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 5,393 ఇళ్లను నిర్వాసితులకు కేటాయించి, పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే అవకాశం ఉంది. కానీ, 2024 ఆగస్టు నుంచి కేవలం 1,574 నిర్వాసిత కుటుంబాలకు మాత్రమే కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించి అప్పటికే పూర్తయిన పునరావాస కాలనీల్లోని ఇళ్లకు తరలించింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పటికీ పునరావాస కాలనీల్లో పూర్తయిన 3,819 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వేలేరుపాడు మండలం తాటుకూరుగొమ్ము నిర్వాసితులకు బుట్టాయిగూడెం సమీపంలోని పునరావాస కాలనీలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కమీషన్లు రావనే నెపంతోనే..ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2014–19 తరహాలోనే ముఖ్యనేత ఇప్పుడు కూడా కమీషన్లు అధికంగా వచ్చే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. పునరావాసం కల్పనపై దృష్టిసారించకపోవడమే అందుకు నిదర్శనమని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు విడతలుగా రూ.5052.71 కోట్లు విడుదల చేసింది. రెండో విడత కింద ఇందులో రూ.2704.71 కోట్లను అడ్వాన్సుగా మార్చి 11న విడుదల చేసింది. ఇందులో కేవలం రూ.569.36 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. మిగతా రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ జమచేయలేదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. దీన్నిబట్టి చూస్తే నిధులున్నప్పటికీ నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. గోదావరి వరదలకు ముంపు గ్రామాల్లోకి నీళ్లు చేరడం.. రాకపోకలకు వీల్లేకుండా పోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు నిర్వాసితులు వరదలతో సతమతమవుతున్నప్పటికీ వారికి పునరావాసం కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేధింపులు ఆపాలి ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం మండలం తెల్లవరం గ్రామానికి చెందిన మేం వింజరం గ్రామం వద్ద పాకలు నిర్మించుకుని జీవిస్తున్నాం. గ్రామంలోకి వెళ్లి వ్యవసాయం చేస్తుంటే మాపై అటవీ శాఖ అధికారులు వేధింపులకు దిగుతున్నారు. వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. ఉపాధి హామీ పనులు కల్పించాలి. –కుంజం రామారావు, నిర్వాసితుడు, తెల్లవరం భూమికి హక్కులు కల్పించాలి పోలవరం మండలం తూటిగుంట, కొండ్రుకోట, సింగనపల్లి తదితర రెవెన్యూ గ్రామాల్లో ఏజెన్సీ గిరిజన సంఘం ఉమ్మడిగా సంఘ సభ్యుల సాగును నమోదు చేసింది. దాని ప్రకారం ఆర్ అండ్ ఆర్‌లో పరిహారం, భూమికి భూమి హక్కులు కల్పించాలి. డీ ఫాం పట్టా భూములకు పరిహారం చెల్లించాలి. – మిడియం పోసిరావు, నిర్వాసితుడు, చేగొండపల్లి ఉపాధి పనులు లేవు పోలవరం ప్రాజెక్ట్ వల్ల సర్వం కోల్పోయి వేరే ప్రాంతంలో తలదాచుకుంటున్న మాకు కనీసం ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం దారుణం. తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని నిర్వాసితులకు పనులు కల్పించాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ ఇప్పించాలి. – మాడే పోశమ్మ, నిర్వాసితురాలు, తెల్లవరం లేబర్ అడ్డాలుగా కాలనీలు నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోవడంతో పునరావాస కాలనీలు తక్కువ కూలికి దొరికే లేబర్ అడ్డాలుగా మారాయి. చాలా బాధాకరం. –షేక్ బాషా, రైతు కూలీ సంఘం, ఏలూరు జిల్లా కార్యదర్శి -
పరువు కోసం పాలకుల పాకులాట!
సాక్షి, అమరావతి: హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ విషయమై అభాసుపాలైన కూటమి పాలకులు చివరకు పరువు దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను నిలబెట్టుకోవడంలో గతేడాది కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చివరివరకు విజయవాడ ఎంబార్కేషన్‌కు అనుమతి రాలేదు. ఆఖరి నిమిషంలో అనుమతి రావడంతో తామే కొత్తగా సాధించినట్టు కూటమి పాలకులు బడాయి పోయారు. అయితే ఆఖరి నిమిషం వరకు అనుమతి లేకపోవడంతో రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లాలనుకునే చాలామంది యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు నుంచి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తులను జూలై 31 నుంచి కేంద్ర హజ్ కమిటీ మరో వారం రోజులు పొడిగించడంతో అప్పటికే అభాసుపాలైన కూటమి పాలకులు మేల్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి దరఖాస్తు చేసుకునేలా హజ్ యాత్రికులను కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడ్డారు. ప్లీజ్.. విజయవాడ ఆప్షన్ పెట్టుకోండి.. రాష్ట్రప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేతల ఆదేశాల మేరకు హజ్‌కమిటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్‌ను కలిసి యాత్రను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు హైప్ తీసుకొచ్చారు. అయితే యాత్రికులకు ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామన్నా.. విజయవాడ నుంచి వెళ్లే వారిపై విమాన చార్జీల భారం పడుతుండడంతో యాత్రికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు గతంలో వెళ్లిన హాజీలకు ఇస్తామన్న రూ.లక్ష ఇవ్వకపోవడంతో ఈసారి కూడా ఇస్తారో? లేదో? అనే అనుమానాలు పెరగడం కూడా కారణం. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల ముందు హజ్ ప్రతినిధులు ఉంచడంతో పాలకులు ఆగమేఘాలపై స్పందించారు. హజ్–2025లో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుని ఇక్కడ ఎంబార్కేషన్ రద్దుతో హైదరాబాద్ నుంచి వెళ్లిన 72 మందికి కొద్ది రోజుల క్రితమే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. కొత్తగా వెళ్లేవారికి కూడా ఇస్తామని, ప్లీజ్ ఈసారి విజయవాడ ఆప్షన్ పెట్టుకోవాలని ప్రాధేయపడ్డారు. అప్పటికే హైదరాబాద్,, బెంగళూరు నుంచి దరఖాస్తు పెట్టుకున్న 1700 మందికిపైగా యాత్రికులు విజయవాడ ఆప్షన్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించారు. చివరకు ప్రభుత్వ యంత్రాంగం పడిన పాట్లతో 980 మంది విజయవాడ ఆప్షన్ పెట్టుకున్నట్టు సమాచారం. ముగిసిన గడువు..హజ్–2026 యాత్ర కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 7తో ముగిసినట్టు హజ్ కమిటీ అధికారులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,,500 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ట్రం నుంచి 2,620 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో కొంత మంది విరమించుకునే అవకాశం ఉందని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఇచ్చిన అనుమతికి అనుగుణంగానే యాత్రికులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 980 మంది విజయవాడ ఎంబార్కేషన్ ఆప్షన్ పెట్టుకున్నారు. మిగిలిన 1,640 మంది హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లనున్నారు.తొలిసారిగా 20 రోజుల యాత్ర.. హజ్ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 40 నుంచి 41రోజులపాటు యాత్ర సాగేలా అనుమతిస్తున్నారు. దేశంలో తొలిసారిగా హజ్–2026కు 20 రోజుల యాత్ర కోసం ప్రత్యేకంగా 10వేల మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఎన్ఆర్ఐలు, ఉద్యోగులతోపాటు ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి 40 రోజులపాటు యాత్రకు సెలవులు, ఇతర ఇబ్బందులు ఉండటంతో కేంద్ర హజ్ కమిటీ ప్రత్యేక అవకాశం కల్పించింది. దీంతో 20 రోజుల యాత్రకు ఏపీ నుంచి 290 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
ఫస్ట్ స్టేజ్.. టార్గెట్ లక్ష!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి విడతలో లక్ష మంది మెడికల్, దివ్యాంగ పింఛన్‌దారుల భారం తగ్గించుకునేలా కూటమి సర్కారు పన్నాగం పన్నింది. ఒకేసారి అంత మందికి పింఛన్ తొలగిస్తే అలజడి రేగుతుందని వ్యూహాత్మక ఎత్తుగడలతో కుట్ర అమలుకు ఉపక్రమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏళ్ల తరబడి నెలనెలా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల్లో అనర్హుల గుర్తింపు పేరిట ప్రత్యేక కార్యక్రమం మొదలు పెట్టింది. మొదటి విడతలో.. కదలలేని స్థితిలో లేక మంచానికే పరిమితమై ఉండే పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులకు అందజేసే మెడికల్ పింఛను లబ్ధిదారులతో పాటు దివ్యాంగుల లబ్ధిదారులు కలిపి మొత్తం 8.18 లక్షల మందికి వారి పింఛను అర్హతను నిర్ధారించేందుకు వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిసున్నారు. వీరిలో దాదాపు 7 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా 17 వేల మంది మినహా మిగతా వారికి పరీక్షలు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకుని కూడా పరీక్షలకు హాజరు దాదాపు ఆ 17 వేల మందికి ఆగస్టు 1న పింఛను డబ్బుల పంపిణీ కూడా నిలిపి వేశారు. వీరికి మరోసారి నోటీసులు ఇచ్చి, అప్పటికీ వైద్య పరీక్షలకు హాజరు కానిపక్షంలో వారి పింఛను పూర్తి స్థాయిలో తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా.. మెడికల్, దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న మొత్తం 8.18 లక్షల మందికి సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత వారిలో వికలత్వ శాతం 40 కంటే తక్కువగా చూపి.. కొంత మంది పింఛన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిసింది. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మిగతా వారిలో కూడా వికలత్వ శాతాన్ని తగ్గించి.. ఆ మేరకు పింఛన్ల కేటగిరి మార్చనున్నారని అధికార వర్గాల సమాచారం. అంటే రూ.15 వేల పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.10 వేలు.. రూ.10 వేలు తీసుకుంటున్న వారికి రూ.6 వేల పింఛన్‌కు మార్చడం అన్నమాట. ఇలా పింఛన్ లబ్ధిదారుల తొలగింపు, కేటగిరీల మార్పులు లక్ష వరకు ఉంటాయని సమాచారం. తద్వారా ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 14 నెలలుగా 5 లక్షల పింఛన్లను రద్దు చేయడమే కాకుండా, కొత్తగా అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని విషయం తెలిసిందే. -
గిరిజనుల గోడు.. వినేదెవరు?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. దీనికితోడు ఏ కార్యక్రమం అయినా కేంద్ర నిధులే దిక్కన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా సమీక్షలు.. సమావేశాలతోనే కాలయాపన చేయడంతో అడవిలో అలజడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని 1994లో ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. అధికార పీఠమే లక్ష్యంగా వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపరని మరోమారు తేటతెల్లమైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎస్టీలకు ఇచ్చిన 20 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అప్పట్లోనే 50 ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికీ పింఛన్ ఇస్తానని, ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిరి్మస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రత్యేక కమిషన్ వంటి హామీలను మరిచిన చంద్రబాబు.. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించి, అటవీ సంపదను దోపిడీదారులకు దోచి పెట్టడానికి కొమ్ముకాయడంతో గిరిజనుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లోనూ 50 ఏళ్లకే పింఛన్, సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయడం, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా వాటి అతీగతీ లేదు. వన్ ఆఫ్ సెవెంటీ, పీసా చట్టాల అమలులోనూ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. నకిలీ గిరిజన ధ్రువపత్రాలపై విచారణ, తుది తీర్పులకు కాలయాపన శాపంగా మారింది. విద్య, ఉపాధి, వైద్యం అన్నింటా ఉత్తుత్తి మాటలతో కూటమి నేతలు మోసం చేయడంపై అడవిలో ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ ఎప్పుడు? జీవో నెంబర్ 3ను పునరుద్ధరించడంపై ఏడాదికిపైగా కాలయాపనతో సరిపెడుతోంది. ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా జారీ చేసిన ఈ జీవోను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దాన్ని పునరుద్ధరిస్తామంటూ మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పటికీ మభ్య పెడుతున్నారు. దీంతో ఈ జీవోను పునరుద్ధరించి, తమకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తా త్కాలికంగా గిరిజనుల ఆందోళనను విరమించేలా చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో మాత్రం తాత్సారం చేస్తోంది. మంత్రి తొలి సంతకానికి దిక్కులేదు.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన తొలి సంతకానికి దిక్కులేకుండా పోయింది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం పార్వతీపురం కలెక్టర్ వద్ద గిరిజన విద్యార్థులు ఆందోళన నిర్వహించడం గమనార్హం. గిరిజన ఉత్పత్తులకు దక్కని ధరలు గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన కాఫీ సాగును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును విస్తరిస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాఫీ తోటలను బాగు చేసుకునేందుకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో దాన్ని తిరిగి సాధించేందుకు ఎన్డీఏ పక్షంలోని టీడీపీ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌లో స్థానిక ఐటీడీఏ, జీసీసీలు సైతం విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది అరకు కాఫీకి మంచి ధర సాధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన రైతులకు శాపంగా మారింది. చింతపండు, తేనె వంటి వాటితోపాటు ఇతర పంటలకు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంలోనూ వైఫల్యంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులకు మేలు కలుగుతోంది. గిరిజనులు అధిక ఉత్పత్తులు సాధించేలా తగిన పరికరాలు సబ్సిడీపై అందించడం, వారి ఉత్పత్తులకు సరైన ధర దక్కేవరకు నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఫలితంగా వారి బతుకు చిత్రం మారింది. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఏకంగా 3.22 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం గిరిజనులకు పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. అంతర పంటగా మిరియాలు, ఇతర పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు వంటివి అందించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఆ ఐదేళ్లు గిరిజనులు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ విషయాన్ని తలుచుకుంటూ ప్రస్తుతపరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డోలీ నిర్మూలన మాటలకే పరిమితం ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి డోలీ మోతలను నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గతేడాది డిసెంబర్లో ఏజెన్సీలో రెండు రోజులపాటు పర్యటించి, రోడ్లు వేస్తున్నట్టు శంకుస్థాపనలతో హడావుడి చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రోడ్డు వేయక పోవడంతో డోలీ కష్టాలు తీరడం లేదంటూ గత నెలలో గిరిజన యువకులు గుర్రాలపై గ్రామాల్లో తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఏజెన్సీలో మాడ్రేబు నుంచి పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో రోడ్లు వేసి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో ప్రధాన కార్యాలయాల ముట్టడికి ఛలో విద్యుత్‌సౌధ కార్యక్రమాన్ని చేపట్టిన కార్మికుల్ని నిరంకుశంగా అడ్డుకుని అణచివేసింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (యూఈసీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, నాయకులు గురువారం విజయవాడ తరలివచ్చారు. కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఉదయం 8 గంటల నుంచే అత్యుత్సాహంగా వ్యవహరించారు. రామవరప్పాడు రింగ్, విద్యుత్‌సౌధ, గుణదల వంతెన, గుణదల సెంటర్ నుంచి పడవలరేవు వరకు తనిఖీలు చేపట్టారు. కార్మికులను, నాయకులను మార్గంమధ్యలోనే అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 200 మందికిపైగా కార్మికులను అరెస్టుచేసి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో విజయవాడ గుణదలలోని విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా మా గతి మారదా? విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్కో, పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్), తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, వేతన వ్యత్యాసాలు లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. రూ.కోటి బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని.. తదితర సమస్యలపై తరబడి వినతిపత్రాలు ఇసూ్తనే ఉన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఛలో విద్యుత్‌సౌధకు కార్మిక, ఉద్యోగసంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమంగా కార్మికుల్ని, నాయకుల్ని అరెస్టు చేసి, నిర్భంధించటం, ఉక్కుపాదం మోపడం అన్యాయమని యూఈసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు జల్లెడ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు విద్యుత్‌సౌధ ఆవరణలోని ఏపీ ట్రాన్స్‌కో అడిషనల్ సెక్రెటరీ పెద్ది రోజాకు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ పోరాటం మరింత తీవ్రతరమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ నాయకులు డి.సూరిబాబు, బి.సుమన్, ఎన్.విజయరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ విద్యుత్ సౌధ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన కార్మికులు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. -
విద్యుత్ చార్జీల 'వీర బాదుడు'
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకానెల విద్యుత్ చార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా రూ.12,771 కోట్ల చార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఇదేనా బాబు సంపద సృష్టి?వెన్నుపోటు పొడవడంలో పేటెంట్ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ, తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్లను జోడించారు. ఇది చాలదన్నట్లు ఇటీవల మరో రూ.3629.36 కోట్ల చార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి... అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు. మొత్తం రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేయడం గమనార్హ. మరో రూ.842.17 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరగా, దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపినట్లైంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఇదేనా సంపద సృష్టి’’ అని ప్రజలు నిలదీస్తున్నారు.జనం సొమ్ముతో రూ.12,771 కోట్ల లోటు భర్తీఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్ల చొప్పున లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజలు తమ అభ్యంతరాలను ఆగస్టు 14వ తేదీలోగా ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం చార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ, దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండడం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ చార్జీలపై వ్యతిరేకంగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
గురువుల మధ్య సర్కారు చిచ్చు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మళ్లీ ఉపాధ్యాయుల మధ్య విభజన చిచ్చు రాజేసింది. ఎంఈవో పోస్టుల భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులను పక్కనబెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పనిచేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1గా నియమిస్తోంది. ఎంఈవో–1గా పనిచేసేందుకు సమ్మతిని తెలిపాలని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్జేడీలు ఇటీవల ఆదేశించారు. కొన్ని జోన్లలో నియామకాలు సైతం పూర్తిచేసినట్టు సమాచారం. దీనిపై స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎంఈవో–1గా ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు పనిచేస్తున్నారని, అయినా ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు. అందరికీ అవకాశమిచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం సరీ్వస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఫీడర్ కేడర్ పోస్టులుగా హెచ్ఎం/ఎంఈవో పోస్టు ఉంది. అయితే, విద్యాశాఖలోని వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేవు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఎంఈవో పోస్టులు ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే ఇస్తున్నారు. తమకూ ఎంఈవో పోస్టులు ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఈవో–2 పోస్టులను సృష్టించి, 679 మండలాల్లో జెడ్పీ హెచ్ఎంలను ఎంఈవో–2లుగా నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఎంఈవో–2 పోస్టులను రద్దు చేసేందుకు యత్నిస్తోంది. ఖాళీలను తిరిగి భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈవో–1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తోంది. గత ఏడాది చాలామంది ఎంఈవో–1లు రిటైరయ్యారు. ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయకుండా పక్క మండలాల వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ చర్యలను సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి సీనియార్టీతో భర్తీ చేయాలిఎంఈవో–1 పోస్టులను ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డిమాండ్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1గా నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై న్యాయ వివాదం కొనసాగుతున్నందున ఉమ్మడి సీనియార్టీతో మాత్రమే ఎంఈవో–1 పోస్టులను భర్తీ చేయాలని పీఆర్టీయూఏపీ కూడా కోరింది. ఎంఈవో–1 పోస్టుల భర్తీ విషయంలో జెడ్పీ స్కూళ్ల హెచ్ఎంలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో జూనియర్లయిన ఎస్ఏలను ఎంఈవోలుగా నియమించడం తగదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి.వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. -
అనేక దేశాల్లో బిచాణ ఎత్తేసిన లులు
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆప్త మిత్రుడు యూసఫ్ ఆలీకి చెందిన లులు గ్రూపు (Lulu Group) రిటైల్ వ్యాపారంలో అనేక దేశాల్లో ఇప్పటికే బిచాణ ఎత్తేసింది. మలేషియా, ఇండోనేషియాల్లో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలిగిన లులు.. మిగిలిన దేశాల్లో కూడా వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ పెట్టే బేడా సర్దుకుంటోంది. అలాంటి కంపెనీకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలిచ్చి రెడ్ కార్పెట్ పరుస్తోంది. విశాఖలో, విజయవాడలో రూ.వేల కోట్ల విలువైన స్థలాలను అప్పనంగా కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చేయడం విస్తుగొలుపుతోంది. రిటైల్ వ్యాపార పరంగా ఎక్కడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేని లులు గ్రూపు.. మలేషియాలో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు జూన్‌లో ప్రకటించింది. మలేషియా రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించి పదేళ్లు దాటినా, లాభాల బాట పట్టకపోగా, నష్టాలు కొండలా పెరిగి పోతుండటంతో పెట్టే బేడా సర్దేసుకొని గుడ్ బై చెప్పేసింది. 2016లో మలేషియా రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఐదేళ్లలో 10 హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2022 వచ్చేసరికి కేవలం ఆరు స్టోర్లను మాత్రమే ప్రారంభించగలిగింది. 2025 నాటికి ఈ షాపుల ద్వారా నష్టం రూ.2,061 కోట్లు దాటి పోవడంతో ఇప్పట్లో రిటైల్ వ్యాపారంపుంజుకునే అవకాశం లేదంటూ వైదొలిగింది. మలేషియాలో క్యాప్స్క్వేర్, జకేల్ కేఎల్, అమెరికన్ మాల్, వన్ షామెలిన్ మాల్ వంటి చోట్ల లులు తన హైపర్ మార్కెట్లు ప్రారంభించినా, స్థానిక హైపర్ మార్కెట్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక చేతులెత్తేసింది. అంతకు ముందు ఇండోనేషియా నుంచి కూడా ఇదే విధంగా లులు గ్రూపు వైదొలిగింది. ఇండోనేషియా మార్కెట్లోకి 2016లో అడుగుపెట్టింది. ఇండోనేషియాలోని బానెటెన్ క్యూబిగ్ బీఎస్‌డీ సిటీలో ఉన్న హైపర్ మార్కెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూసివేసింది. మిగిలిన హైపర్ మార్కెట్లను మూసి వేయడానికి క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్లు స్థానిక పత్రికా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. నష్టాల్లోనే కొచ్చిన్ మాల్ 2013 మార్చిలో దేశంలోనే అతిపెద్ద మాల్ కొ చ్చి న్లో ఏర్పాటు చేసిన లులు గ్రూపు.. ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేకపోయింది. కొ చ్చి న్ మాల్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు దాటినా, ఏటా భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 2023 డిసెంబర్లో కొ చ్చి న్ మాల్ రూ.205.8 కోట్లు, 2024లో రూ.130.2 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. 2024లో కొ చ్చి న్ మాల్ వ్యాపారం రూ.4,384.8 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు ఈ మాల్‌పై రూ.1,600 కోట్లు వ్యయం చేసింది. అదే విధంగా 2021లో ప్రారంభించిన బెంగళూరు, 2023లో హైదరాబాద్‌లో ప్రారంభించిన లూలు మార్కెట్లు కూడా లాభాల బాట పట్టడానికి సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. ప్రసుత్తం ఇండియాలో లులు 12 మాల్స్‌ను నిర్వహిస్తోంది.ఏపీలో పరిస్థితి ఏంటి? హైపర్ రిటైల్ వ్యాపారం చేసే లులు, డీమార్ట్, రిలయన్స్, ఇన్ ఆర్బిట్ మాల్స్ వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా సొంతంగా లేదా ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఒక్క లులుకే రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ప్రభుత్వ స్థలాలను అత్యంత కారుచౌకగా కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియాల్లో లాగా వ్యాపారం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత బిచాణా ఎత్తివేస్తే ఈ ప్రభుత్వ స్థలాల పరిస్థితి ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.ఒకసారి దీర్ఘకాలిక లీజుకు ఇ చ్చి న తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది న్యాయపరంగా చాలా సంక్లిష్టమంటున్నారు. కార్పొరేట్ సంస్థలు ఒకసారి భూమి తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగిచ్చిన దాఖలాలు లేవని.. ఇప్పుడు తొలుత లీజు పేరిట తీసుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా యాజమాన్య హక్కులను దక్కించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మాల్‌కు ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారని, ఈ కంపెనీకి నష్టం వస్తే అదే గ్రూపునకు చెందిన ఇతర కంపెనీల నుంచి నయా పైసా కూడా రాదంటున్నారు. రిలయన్స్, డీమార్ట్లకు భూములు ఇవ్వనప్పుడు, ఒక్క లులుకే ఎందుకు ఇస్తున్నారని, దీని వెనుక ఉన్న కుంభకోణం ఏమిటని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. -
చంద్రబాబూ.. మీ హామీల అమలు ఎప్పుడు?
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి దారుణంగా ఉందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీ వేయడానికి కూడా ముందుకురావడం లేదని తప్పుబట్టారు. మంగళవారం విజయనగరంలోని రెవెన్యూ హోంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రాగానే ఐఆర్, డీఏలు, మంచి పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, బకాయిల చెల్లింపు... ఇలా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల వీడియోలను ప్రదర్శించారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తమపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి సర్కారు వచ్చాక... గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిందని తెలిపారు. ఏడాది దాటినా కొత్త కమిషన్ వేయకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. అసలు పీఆర్సీ వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని బొప్పరాజు ప్రశ్నించారు. ‘‘ఆర్థిక భారం లేని పీఆర్సీ కూడా వేయలేని ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏవిధంగా సంక్షేమం చేకూరుస్తుందని భావించాలి? కమిషన్ వేశాక పీఆర్సీ నివేదిక వచ్చేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది. కూటమి ప్రభుత్వ ఉద్దేశం చూస్తుంటే ఉద్యోగులు పట్టించుకోరని భావిస్తున్నదా? ఇన్ని సంవత్సరాల జాప్యం కారణంగా ఒక్కో ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టపోతున్నారు. బకాయి ఉన్న మూడు విడతలు, తాజాగా నాలుగో విడత డీఏతో కలిపి దాదాపు 20 శాతం వేతన పెంపు జరగాల్సి ఉంది. డీఏలు, పీఎఫ్, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వివిధ బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నాయి’’ అని వివరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రాజేష్, జిల్లా కమిటీ అధ్యక్షుడు తాడి గోవింద, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. -
చదరపు అడుగు రూపాయిన్నర!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పుబెల్లాలుగా పంచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా, లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి అధికాదాయం కల్పించే వారికి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకింత–నాకింత అంటూ అడ్డుగోలు భూ దోపిడీకి తెరతీస్తోంది.ఈ పరంపరలో వేలంపాట, టెండర్లు లేకుండానే విశాఖ, విజయవాడల్లో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూపునకు అప్పగించేసింది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పేరిట అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న లులు గ్రూపునకు విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు చేస్తారు.అంటే చదరపు అడుగుకు నెలకు రూ.1.50 చొçప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో అయితే వాణిజ్య భవనాల్లో చదరపు అడుగుకు రూ.80 నుంచి 100 పలుకుతుంటే.. విశాఖలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. కానీ లులుకు కేవలం రూ.1.50కే కట్టబెడుతోంది. ప్రతీ పదేళ్లకు కేవలం 10 శాతం అద్దె పెంచుతారట! విశాఖలో రూ.1,066 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని గత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వీఎంఆర్డీఏకు అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది.విజయవాడలో 4.15 ఎకరాలు లులుకు అప్పగింత విజయవాడలో లులుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరిచింది. రూ.156 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేసింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా పిలుచుకునే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో పెట్టింది. కేవలం రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఈ షాపింగ్ మాల్‌ను లులు అభివృద్ధి చేయనుంది. ఇందుకుగాను 99 సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లులుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.ఇందుకుగాను ఏపీఎస్ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా యువరాజ్ ఆ ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ భూములను లూలుకు అప్పగించడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించినా, ప్రభుత్వం మాత్రం భూములు కట్టబెడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మల్లవల్లి మెగా ఫుడ్పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్‌ను కూడా లులుకు అప్పగించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.అలాగే ఢిల్లీకి చెందిన ఏస్ ఇంటర్నేషనల్‌కు చిత్తూరులో డెయిరీ యూనిట్ ఏర్పాటు చేయడానికి మార్కెట్ ధర ప్రకారం 73.63 ఎకరాలను కేటాయించింది. మొత్తం అయిదు దశల్లో ఏస్ ఇంటర్నేషనల్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌కు చెందిన వీఎస్ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ రూ.39.22 కోట్లతో ఏర్పాటు చేసే బ్రిక్ యూనిట్‌కు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఎకరా రూ.11.62 లక్షలు చొప్పున 22.45 ఎకరాలు కేటాయిస్తూ మరో జీవో విడుదల చేసింది.అనకాపల్లి జిల్లా రాంబిల్ల వద్ద లారస్ ల్యాబ్ రూ.5,374 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫార్మా యూనిట్‌కు ఎకరా రూ.30 లక్షలు చొప్పున 531.77 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్కు 2031 జూలై 1 తర్వాత నుంచి అమల్లోకి వచ్చే విధంగా 695.35 ఎకరాల లీజు గడువును మరో 25 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పరెల్తో పాటు ఫుట్‌వేర్, టాయ్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. -
ని'ట్టూరిజం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పడకేసింది. పర్యాటకులకు బస, ఆతిథ్య సౌకర్యాలు అందించలేక చేతులు ఎత్తేసింది. ఆదాయ ఆర్జనలో తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు వచ్చాక ఆర్భాటపు ప్రకటనలు మినహా పర్యాటకాభివృద్ధి జాడే లేకుండా పోయింది. ప్రైవేటు జపంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నిర్వీర్యమైపోతోంది. ఏపీటీడీసీ ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు కూటమి కుయుక్తులు పన్నుతోంది. దీనివల్ల ఏపీటీడీసీ 2024–25 వార్షిక రెవెన్యూలో గణనీయంగా రూ.20 కోట్లకుపైగా పతనం కనిపిస్తోంది. కరోనాతో ప్రపంచ పర్యాటకం మొత్తం కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. 2014–19తో పోలిస్తే 2022–23లో రికార్డు స్థాయిలో రూ.162 కోట్లు, 2023–24లో ఏకంగా రూ.164 కోట్లు టర్నోవర్ సాధించింది. 2021–22తో పోలిస్తే ఏకంగా 11 శాతంపైనే వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం చంద్రబాబు హయాంలో సంపద సృష్టి ఎంతగా దిగజారిందో స్పష్టం చేస్తోంది. మళ్లీ ఇప్పుడు ఏపీటీడీసీ రెవెన్యూ తిరోగమనంలోకి వెళ్లడం గమనార్హం. గత ప్రభుత్వంలో అప్‌గ్రేడ్.. ఇప్పుడు డిగ్రేడ్!గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీటీడీసీకి చెందిన హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పర్యాటకులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు సంకల్పించింది. 2023 చివరిలో రూ.80 కోట్లకుపైగా వెచ్చించి 12 హోటళ్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. వాటిని 2024 సెప్టెంబర్‌నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.70 కోట్లకుపైగా పనులు పూర్తిచేసింది. కానీ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో హోటళ్ల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టు చివరి దశలో నిలిచిపోయింది. హోటళ్లు మూతపడ్డాయి. ఫలితంగా హోటళ్ల ఆదాయానికి పూర్తిగా గండికొట్టినట్టు అయ్యింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని యాత్రీ నివాస్ ఏడాదికిపైగా మూతపడటంతో రూ.4కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయింది. హార్సిలీహిల్స్, నెల్లూరు, సూర్యలంక, శ్రీశైలం, టైడా, అనంతగిరి, యాత్రీనివాస్, బెరంపార్క్, భవానీ ఐలాండ్, దిండి, ద్వారకా తిరుమలలోని హరిత హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. వరదలతో దెబ్బతిన్న భవానీ ఐలాండ్‌లో ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. దీంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గిపోయింది. తద్వారా బోటింగ్ ఆదాయమూ పడిపోయింది. ప్రైవేటుపరానికి కుయుక్తులుఆదాయం పడిపోవడాన్ని కారణంగా చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీటీడీసీ హోటళ్లు, ఆస్తులను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. దీనికోసం అధికారం చేపట్టిన కొత్తల్లోనే దొంగచాటున ‘స్టెర్లింగ్’ సంస్థకు చెందిన హోటల్ ప్రతినిధులు ఏపీటీడీసీ ఆస్తులను లెక్కేసుకోవడానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరచడం విశేషం. తాజాగా కొద్ది రోజుల కింద స్టెర్లింగ్ ప్రతినిధులు, యోగా గురువు బాబారాందేవ్ వంటి ప్రముఖులు సీఎంను కలిశారు. అంతకు ముందే ఏపీటీడీసీకి చెందిన హోటళ్లను పరిశీలించి ఎవరికి ఎక్కడ ఏం కావాలో కర్చీఫ్ వేసుకున్నట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఏపీటీడీసీకి చెందిన 30 ఆస్తులను ఓఅండ్ఎంగా ప్రభుత్వం ఇచ్చేస్తోంది. అయితే, వీటిని కూడా ముందుగానే ఎవరికి ఇవ్వాలో ఫైల్ సిద్ధమైనట్టు సమాచారం. పేరుకు మాత్రమే టెండర్లు పిలిచి మమ అనిపించడమే తరువాయిగా తెలుస్తోంది. కేంద్ర నిధుల దారి మళ్లింపు..కూటమి ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థకు నిధులు కేటాయించకపోగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌లో భాగంగా గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులనూ దారి మళ్లించేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.170కోట్లకు గాను రూ.100 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పనులూ ప్రారంభించకుండానే కేటాయించింది. ఈ నిధులు రాష్ట్ర ట్రెజరీ నుంచి ఏపీటీడీసీ ఖాతాలకు జమ కాలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆర్థిక శాఖ అధికారులు తేరుకుని నిధులు ఏపీటీడీసీకి ఇచ్చేశారు. దీనికి తోడు ఏటా బడ్జెట్లో ఏపీటీడీసీకి రూ.2.40 కోట్లకుపైగా కేటాయింపులు చేస్తుండంగా ఈసారి కూటమి ప్రభుత్వం రూ.60లక్షలకే కుదించడం ఏపీటీడీసీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. దీనికి పూర్తి విరుద్ధంగా పర్యాటకంలో పండగల పేరుతో ఏపీ పర్యాటక అథారిటీకి రూ.150 కోట్లు కేటాయించింది. అంటే ఏపీటీడీసీ వార్షిక ఆదాయానికి సరిసమానమైన మొత్తాన్ని కేవలం పండగల పేరుతో నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు చూపిస్తున్న శ్రద్ధ ఏపీటీడీసీని బలంగా నిలబెట్టడంలో చూపించట్లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ దర్శనానికి మంగళంపర్యాటకాభివృద్ధి సంస్థతోపాటు ఏపీఎస్ఆర్టీసీ, వివిధ రాష్ట్రాల్లోని సుమారు 8 కార్పొరేషన్లకు గతంలో టీటీడీ నెలకు 5400 తిరుమల దర్శన (రూ.300)టికెట్లు అందించేది. దీని ద్వారా ఏపీటీడీసీ హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్ల(బస్సులు)ను నడపడంతోపాటు హైదరాబాద్, ముంబై నుంచి విమాన టూర్ ప్యాకేజీలతో భక్తులకు తిరుమల వేంటేశ్వరస్వామి దర్శన భాగ్యాన్ని కల్పించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టికెట్ల కేటాయింపును రద్దు చేసింది. దీంతో ఏపీటీడీసీ ఆదాయానికి భారీ దెబ్బతగిలింది. వీటితో పాటు గతంలో దేవదాయ శాఖతో సంయుక్తంగా నిర్వహించిన ఆధ్యాత్మిక సర్క్యూట్ టూర్ ప్యాకేజీలను కూడా సర్కారు పక్కన పడేసింది. ఫలితంగా ఏపీటీడీసీకి చెందిన ట్రాన్స్‌పోర్టు విభాగం నిర్వీర్యమైంది. లీజు వసూళ్లలో గ్యారంటీ ఎంత?ఇదిలా ఉంటే రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉండే హరిత హోటల్‌ను గతంలోనే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. దాని నుంచి రూ.10 కోట్ల వరకు లీజు రెంటు ప్రభుత్వానికి బకాయిపడింది.ఇలా రాష్ట్రంలో సుమారు రూ.40 కోట్ల వరకు ప్రభుత్వానికి లీజు రెంట్లు రూపంలో ఆదాయం రావాల్సి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రభుత్వ హరిత హోటళ్లపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. సౌకర్యాల లేమితో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. అధికమొత్తాలు చెల్లించుకుంటున్నారు. -
రూ.3,000 కోట్ల దోపిడీ
ఏ రంగమైనా సరే.. ఏ ప్రాజెక్టు అయినా సరే.. ‘నీకింత–నాకింత’ సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాజధానిలో భూ పందేరాలు, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే పెద్దల దృష్టి విశాఖపై పడింది. ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఐటీ పార్కులంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టి పక్కా కమర్షియల్ సంస్థలకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడంపై అధికార వర్గాలు నివ్వెర పోతున్నాయి. ఈ 60 ఎకరాల మీదే ఆయా సంస్థలకు ఏటా రూ.1,000 కోట్ల మేర అద్దెలు వస్తాయంటే ఎవరి వాటా ఎంతుంటుందోనని చర్చించుకుంటున్నారు. సాక్షి, అమరావతి: సత్వా, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్.. ఎంత ఖరీదైన భూములనైనా కొనడానికి వెనుకాడని రియల్ ఎస్టేట్ సంస్థలు. బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ కంపెనీలు భారీగా లగ్జరీ గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మించి కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాయి. వేలం పాటలో అధిక ధరలకు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ముసుగులో ఖరీదైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ విశాఖలో అసలుసిసలైన ‘రియల్’ దందాకు తెరలేపింది. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూములను ఆ సంస్థలకు కట్టబెట్టడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి వేలం లేకుండానే వేల కోట్లు విలువ చేసే భూములను పరిశ్రమల ఆకర్షణ పేరుతో ప్రభుత్వం ధారాదత్తం చేసింది. బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు, తెలుగు రాష్ట్రాలో చిట్ ఫండ్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ వంటి సంస్థలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పప్పు బెల్లాల్లా అతి తక్కువ ధరకే పంచి పెట్టింది. ఈ ప్రాజెక్టుల్లో ఎటువంటి ప్రభుత్వ వాటా లేకుండా భూములను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. సత్వా, కపిల్ రియల్ ఎస్టేట్ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెలా అద్దెల రూపంలో రూ.80 కోట్లు.. ఏటా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం పొందుతాయని అంచనా. ఇప్పటికే ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు కట్టబెట్టి విమర్శల పాలైనప్పటికీ భూ కేటాయింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. భవనాలు నిర్మించి కోట్లల్లో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారుచౌకగా భూములు కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సంస్థకు మాత్రం అధిక ధర⇒ ఇదే కొండపై ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి ఎకరా రూ.4.5 కోట్లు చొప్పున కేటాయించడం గమనార్హం. ఐటీ కంపెనీకి అధిక ధరకు కేటాయించి,రియల్ ఎస్టేట్ సంస్థకు చౌకగా కేటాయించడం భూ కేటాయింపుల్లో ‘రియల్’ మోసాలను బహిర్గతం చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ⇒ సత్వా గ్రూపునకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో భూమిని కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ మినహాయింపు తదితర అనేక అదనపు రాయితీలను కూడా ఇవ్వనుంది. సత్వా డెవలపర్స్ ఎటువంటి ఐటీ కంపెనీలను పెట్టదని.. కేవలం ఐటీ పార్కును అభివృద్ధి చేసి ఇతర ఐటీ కంపెనీలకు లీజుకు ఇస్తుందని, అలాంటప్పుడు ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ కింద రాయితీలను ఎలా ఇస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ⇒ సత్వా డెవలపర్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారని, వాస్తవానికి ఇక్కడ సత్వా డెవలపర్స్ ఎవరికీ నేరుగా ఉపాధి కల్పించదని, ఈ వెంచర్లో ఏర్పాటు చేసే ఇతర ఐటీ కంపెనీలు మాత్రమే ఉపాధి కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ⇒ ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన పేరుతో భారీగా రాయితీలను సత్వాకు దోచి పెట్టారని ఇట్టే తెలుస్తోంది. సత్వాకు రాయితీలు ఇచ్చి, ఇప్పుడు అందులో పెట్టే ఐటీ కంపెనీలకు కూడా రాయితీలు ఇస్తే ఒకే ప్రాజెక్టుపై రెండుసార్లు రాయితీలు ఏ విధంగా ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.అప్పనంగా విలువైన భూములు⇒ తెలుగు రాష్ట్రాల్లో చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించి ఉన్న కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని పనోరమ హిల్స్ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. అంటే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్ఎంటీవీ వంటి మీడియా సంస్థలు కలిగిన కపిల్ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే 30 ఎకరాలను కేటాయించింది. కపిల్ గ్రూపు విశాఖలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ అలాగే వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు సేకరించి ఐటీ పార్కులు.. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబుల్టీ సెంటర్స్ (జీసీసీ)ను ఆకర్షించే బెంగళూరుకు చెందిన ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు మధురవాడ ఐటి హిల్ నెంబర్ 3పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాలు.. హిల్ నంబర్ 4పై ప్లాట్ నంబర్ యూడీఎల్ 6 వద్ద 7.79 ఎకరాల (మొత్తం 10.29 ఎకరాలు) భూమిని కారుచౌకగా కేటాయించింది. ఏఎన్ఎస్ఆర్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. ⇒ ఐటీ పార్క్‌ల అభివృద్ధికి ఏపీఐఐసీ ఉండగా, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించడం ఏమిటని అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం ఐటీ ముసుగులో రియల్ కంపెనీలకు కారు చౌకగా భూములను ఎలా ఇస్తుందని, అదీ వేలం వేయకుండా ఇవ్వడం దారుణం అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.1,500 కోట్ల భూమి సత్వాకు రూ.45 కోట్లకే ⇒ సత్వా గ్రూపు.. రెండు దశాబ్ధాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. పుణే, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. బ్లాక్ స్టోన్ వంటి పీఈ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తోంది. 2017లో సత్వా గ్రూపు హైటెక్ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ⇒ ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థను జూలైలో బెంగళూరు పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కలిశారు. గంటల వ్యవధిలో విశాఖలో పెట్టుబడుల ఒప్పందానికి సత్వాను ఒప్పించినట్లు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. జూలై 8న నారా లోకేశ్ కలవడం.. గంటలోనే విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించినట్లు ప్రకటించుకోవడం.. జూలై 23న ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్)లో ఆమోదం పొందడం, ఆ మర్నాడే (జూలై 24) విశాఖలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్‌కు ఇలా అప్పగించేశారు. ⇒ విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4 పై ప్లాట్ నంబర్లు యూడీఎల్ 1, యూడీఎల్ 2, యూడీఎల్ 3 వద్ద 30 ఎకరాల భూమిని సబ్సిడీ ధరగా ఎకరా రూ.1.5 కోట్లకే కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. -
ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడానికీ మనసు రావడం లేదు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో.. కనీసం ఒక డీఏ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూసినా నిరాశే మిగిలిందని ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీలు పక్కన పెట్టినా రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలనూ ఇవ్వడం లేదని విమర్శించారు.వివిధ కార్యక్రమాలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలపై ఇంత నిర్లక్ష్యంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. 2019లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్లోనే ఆమోదించి 2019 జులై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫేస్టోలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాటి గురించి అసలు మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగులకుబకాయిలు రూ.21,800 కోట్లు గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,800 కోట్లు అని, ఇందులో డీఏ, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బిల్లులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జీపీఎఫ్ బిల్లులు 2024 మార్చి వరకు గత ప్రభుత్వంలో చెల్లించారని వివరించారు. కూటమి సర్కారు వచ్చాక బకాయిలేమీ చెల్లించలేదన్నారు. పాత బకాయిలలో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆరి్థక మంత్రి చెప్పినా ఇప్పటివరకు ఒక్క సరండర్ లీవ్ బిల్లు మాత్రమే చెల్లించారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. -
చదువు‘కొనలేం’
ఫీజు రీయింబర్స్మెంట్...! ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన గొప్ప పథకం..! మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కాలేజీకి వెళ్లి ఏకాగ్రతతో పాఠాలు విని తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఎందరో..? అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటి గొప్ప పథకానికి తూట్లు పడుతున్నాయి. మొండి బకాయిలతో.. యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోంది. ఒకటీ, అర కాదు.. ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కనపెట్టింది.. చివరకు విద్యార్థులు విసుగెత్తి చదువు మానేసేలా చేస్తోంది..సాక్షి, అమరావతి: ఏడాదికి పైగా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం.. అంటూ ఊరించి ఉసూరుమనిపించడం తప్ప కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు..! కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల విడుదల ఊసే లేదు..! ప్రభుత్వం కనీస కనికరం చూపకుండా.. తమ జీవితాలతో చెలగాటం ఆడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యకు భరోసా దక్కక దిగులు చెందుతున్నారు. దీంతో అర్థంతరంగా చదువులు మానేస్తున్నారు. ఇదంతాచూసి విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదేనా? ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి..?? అని నిలదీస్తున్నారు. ⇒ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా అగిపోయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క త్రైమాసికం (క్వార్టర్) కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్ మెయింటినెన్స్ (వసతి దీవెన) కింద మరో రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. వాస్తవానికి గత నెలలోనే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ సమావేశంలో, ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ స్పందన కొరవడింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చదువులతో పాటు హాస్టల్ వసతి దీవెన (మెయింటెనెన్స్) కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.1100 కోట్లు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు బకాయి పెట్టింది. నెలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లలో 70 శాతం భర్తీ చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. అంటే, కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ, ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కారు తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు రూ.6–10 కోట్లు, పెద్ద కళాశాలలకు రూ.40–60 కోట్ల వరకు పెండింగ్ కనిపిస్తున్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ⇒ ప్రైవేటు యాజమాన్యాల్లోని 20–30 శాతం కళాశాలలు మినహా.. మిగిలినవి ఏ పూటకు ఆ పూటే అన్న చందాన నిధుల కొరత ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు రూ.50 లక్షలు నుంచి పెద్ద కళాశాలలు రూ.3 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతోపాటు కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చూస్తే యాజమాన్యాల గుండె బరువెక్కుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుండడం ఆర్థికంగా భారం అవుతోంది. సర్కారు నుంచి మొండిచేయి ఎదురవుతుండడంతో నిర్వహణ కుంటుపడుతోంది. బాబ్బాబు కాస్త సర్దుకోరూ...! ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్మెంట్ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో 2–3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కాలేజీలైతే నెల జీతంలో కొంత మొత్తం చెల్లిస్తూ సర్దుకోండి అంటూ ఉద్యోగులను బతిమలాడుకునే పరిస్థితి. ఆర్థికంగా పరపతి ఉన్న కళాశాలలు అప్పు తెచ్చి ఉద్యోగులకు జీతాలిస్తున్నాయి. ⇒ కాలేజీలు ఇలా అప్పుల్లో నెట్టుకొస్తున్న తరుణంలో మారుతున్న సాంకేతిక అవసరాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయన్నది ప్రశ్న. మార్కెట్‌కు అనుగుణంగా బోధన అందించకుంటే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తద్వారా ఒక తరం వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటంటే.. జరగదంట? పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు, కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. ⇒ గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమన్యాలకు జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోవడం గమనార్హం. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ఇదీ మా గోడు... ‘‘ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలువిడుదల కావట్లేదు. కళాశాలల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా? నాణ్యమైన బోధనా సామర్థ్యాలను సమకూర్చుకుని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడినుంచి తెస్తాం...? ఇంజనీరింగ్ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్లో రేట్లు లేవు. తాకట్టు పెట్టి తెద్దామంటే రూ.2–5 వరకు వడ్డీలు అవుతున్నాయి. ఇంకేం చేయాలి...?’’ అని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాని వాపోయారు. ఇక్కడ ఒక్క ఇంజినీరింగ్ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. తమ పరిస్థితి ఇలా ఉండగా... ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అనుభవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు చెల్లింపులుఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ⇒ 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 వరకు నాటి టీడీపీ సర్కారు 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిపెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు ప్రతి త్రైమాసికానికి క్రమంతప్పకుండా చెల్లించి... ఏ లోటు లేకుండా కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా ప్రోత్సహించింది. ⇒ ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. -
ఇంటింటా నిజం.. తల్లికి మోసం
ఈమె పేరు కొండేటి మరియమ్మ. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు. ఈమె కుమారుడు అవినాష్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం రూ.8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆమె చెబుతోంది. అందరితోపాటు తనకూ సమానంగా డబ్బులు పడ్డాయంటోంది. ఇప్పుడు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా చేశారేమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి : ‘అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్‌ను అమలు చేసి పేదరికాన్ని పారదోలుతాం.. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం..’ అని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి సర్కారు ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రధానంగా తల్లికి వందనం పథకం గురించి చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు ఊరూరా, ఇంటింటా ఊదరగొట్టాయి. అధికారం చేపట్టాక తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడం ఒక ఎత్తు అయితే.. రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తూ.. చాలా గొప్పగా అమలు చేశామని డప్పు కొట్టు కోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి.. అమలు దశకు వచ్చే సరికి రూ.13 వేలే అన్నారు. వివిధ సాకులు చూపి ఏకంగా 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. తీరా మిగిలిన లబ్ధిదారుల్లో కొంత మందికి కేవలం రూ.8–9 వేలు మాత్రమే ఖాతాల్లో వేసి.. అంతా ఇచ్చేశామంటున్నారు. ఇదొక్కటే కాదు.. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశామని, ఇక వీటి గురించి ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయిస్తూ మాట్లాడారు. ‘తల్లికి వందనం’ అమలుతో చంద్రబాబు చేస్తున్న దగాపై ఊరూరా మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. కొన్ని ఊళ్లలో అయితే ఏకంగా స్కూలు మొత్తం మీద ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుపేదలకు సైతం ఎగనామం పెట్టేశారు. చెప్పిందేమిటి.. చేసిందేమిటి.. అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్మాస్టర్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకెందుకు డబ్బులు పడలేదంటూ నిలదీస్తున్నారు. ‘మేమేం చేయలేం. అలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు’ అంటూ వారు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇస్తామన్న రూ.13 వేలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతుంటే సమాధానం చెప్పేవారే లేరు. నష్టపోయిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. నగదు జమ కాకుండానే మెసేజ్‌లు రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు యూడైజ్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మంది ఉంటే తొలి ఏడాది అందరికీ తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది లబ్ధిదారుల్లో 30 లక్షల మందిని తప్పించింది. మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పినా.. ఆ తర్వాత రూ.13 వేలే అంది. తర్వాత సాకు దొరికిన చోటల్లా నిధుల్లో కోతపెట్టింది. కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.8,800 చొప్పున ఇచ్చి, మిగిలిన డబ్బును ఎగవేసింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల్లో కొందరికి నగదు జమ కాగా, ఇంకొందరికి నగదు జమ కాకుండానే నిధులు జమ చేశామని వారి ఫోన్లకు సంక్షిప్త (ఎస్ఎంఎస్) సందేశాలను పంపిస్తోంది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పథకం ఎగవేతకు అనేక సాకులుగతంలోనూ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఎగ్గొట్టిన టీడీపీ ప్రభత్వం.. ఇప్పుడు కూటమి సర్కారులోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6 హామీలు అమలు చేయకుండానే అన్నీ చేసేసినట్టు ప్రచారం చేసుకుంటోంది. తల్లికి వందనం పథకం అమలులో ప్రతి దశలోనూ ప్రజలను దగా చేస్తోంది. అర్హుల ఎంపికలోనూ, నిధుల మంజూరులోనూ కోతలు పెట్టింది. దీనికి వీలైనన్ని కారణాలను వెతుకుతూ విద్యార్థుల సంఖ్యను నానాటికీ తగ్గించేస్తోంది. ఇంకా తల్లికి వందనం పడని విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది దీన్ని మరింత కుదించేందుకు ఇప్పటి నుంచే పథకం రూపొందించారు. ముగ్గురికీ డబ్బులు పడలేదు మా పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవిలు ముగ్గురూ తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్లైన్లో వచ్చింది. అందరికీ పడినట్లే మాకు ముగ్గురు పిల్లలకూ కలిపి రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్టుమెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. – నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం అర్హులను తగ్గించేందుకు తంటాలు ఈ ఏడాది రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే పిల్లలు యూడైజ్‌లో 87.42 లక్షల మంది నమోదై ఉంటే 67,27,164 మందికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఆ తర్వాత 54,94,703 మందికే పథకం ఇస్తున్నట్టు జీఓ విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో భారీగా కోత పెట్టింది. ఏటా విద్యుత్ బిల్లు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని సగటున నెలకు 300 యూనిట్లు లోపు వినియోగించే వారికి మాత్రమే పథకం ఇస్తామని మెలిక పెట్టింది. కానీ ఆరు నెలల కాలాన్ని సగటున పరిగణనలోకి తీసుకోకుండా చాలా మందికి అన్యాయం చేసింది. తొలుత మున్సిపల్ కారి్మకులకూ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన సర్కారు.. తర్వాత కేవలం శానిటేషన్ వర్కర్లకు మాత్రమే పరిమితం చేసింది. వారిలోనూ సగం మందికి డేటా సరిగా లేదని ఎగనామం పెట్టింది. పచ్చి మోసం.. దగా.. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. ఎలిజిబుల్ జాబితాల్లో మాత్రం పెయిడ్ అని చూపిస్తోందని, అకౌంట్లో మాత్రం డబ్బులు జమ కాలేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంగళవారం విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. డబ్బులు రాకపోయినా వచ్చాయంటూ మెసేజ్‌లు పంపించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై ఇటు అధికారులు, అటు బ్యాంకర్లు, హెడ్మాస్టర్లు అక్కచెల్లెమ్మలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ సహా అన్ని హామీలూ నెరవేర్చామని కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి నాలుకే మందం అంటూ హూంకరిస్తున్నారు. కూటమి సర్కారు తీరు చూస్తుంటే.. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్లుందని మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. ఇంత పచ్చిగా మోసం చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాగునీరూ ‘తాకట్టు’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణం కోసం అప్పు రూపంలో రూ.10 వేల కోట్ల సమీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఈ రుణం తీసుకునేందుకు ‘ఆంధ్రప్రదేశ్ జల జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ జీవో ఎంఎస్ నం.72 జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. తీసుకునే రుణం చెల్లింపునకు ‘బల్క్‌గా నీటి అమ్మకం వంటి చర్యల’ ద్వారా డబ్బును తిరిగి రాబట్టుకునే సమగ్ర ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలని గ్రామీణ మంచి నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఈఎన్సీకి ప్రభుత్వం సూచించింది. మరోవైపు ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమల తాగునీటి అవసరాలకు బల్క్‌గా నీటిని అందించే ప్రధాన సంస్థగా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ జీవో సారాంశం చూస్తే .. సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ద్వారా శుద్ధి చేసే తాగునీటిని జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నిర్ణీత ధరకు పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమలకు అమ్ముతుంది. తాము పెట్టిన ఖర్చును స్థానిక సంస్థలు... నీటిని వాడుకునే ప్రజల నుంచే వసూలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుతో పాటు రానున్న కాలంలో దానిపై వడ్డీ భారం మొత్తం ప్రజల నెత్తి పైనే పడనుందని స్పష్టమవుతోంది.రూ.25 లక్షల పెయిడ్ ఆప్ క్యాపిటల్‌తో కార్పొరేషన్కంపెనీల చట్టం నిబంధనల మేరకు స్వయంప్రతిపత్తితో కూడిన జల జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్‌ను రూ.కోటి మూల ధనంతో (పది లక్షల షేర్లు ఒక్కోటి రూ.10 ముఖ విలువ)తో ఏర్పాటు చేస్తారు. ఇందులో 2.50 లక్షల షేర్లకు రూ.25 లక్షలను ప్రభుత్వం పెయిడ్ అప్ క్యాపిటల్‌గా సమకూర్చుతుంది. కార్పొరేషన్ చైర్మన్‌గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన 9 మంది అధికారులు వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఒక చీఫ్ ఇంజనీరు, ఇద్దరు ఈఈలు, ఏడుగురు డీఈఈలతో కలిపి 23 మందిని కార్పొరేషన్‌కు కేటాయించారు. విజయవాడ సమీపంలో గొల్లపూడిలో కార్యాలయం ఏర్పాటుతో పాటు సంస్థకు పూర్తి స్థాయి ఎండీని నియమించే వరకు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీనే ఎండీగా కొనసాగుతారు. ప్రారంభ స్థాయిలో కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు రూ.15 కోట్లను ప్రభుత్వం సమకూర్చుతుంది.కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీటి సరఫరాకు రూ.26,826.94 కోట్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఇంకా 24.98 లక్షల కుటుంబాలకు కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నాటికే రూ.23,130.19 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం వ్యయంలో కేంద్రం రూ.10,647.71 కోట్లు సమకూర్చనుంది. రాష్ట్ర వాటా రూ.12,482.48 కోట్లు. ఇందులో రూ.10 వేల కోట్లను కార్పొరేషన్ ద్వారా అప్పుగా సమకూర్చుకుంటోంది. మిగతా రూ.2,500 కోట్లను 2025–26 నుంచి 2027–28 మధ్య బడ్జెట్లలో కేటాయింపులు చేయనుంది. 2014–19 మధ్య సైతం ఇలానే..బ్యాంకుల నుంచి రూ.వంద కోట్ల అప్పుఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే పథకాలకు ఖర్చు గతంలోనే నిర్మించిన మంచి నీటి పథకాలు ష్యూరిటీ 2014–19 మధ్య సైతం చంద్రబాబు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయిలు అప్పు తీసుకుంది. వీటికోసం అంతకుముందే ప్రభుత్వ నిధులతో వేల గ్రామాల్లో నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ రక్షిత మంచి నీటి పథకాలను ష్యూరిటీగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం రెండు ఉత్తర్వులు కూడా జారీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆ నిధులను మంచినీటి పథకాల కోసం కాకుండా ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలున్నాయి.అప్పు చేయకుండానే వైఎస్ జగన్ ప్రభుత్వంలో నీటి పథకాలుఉద్దానం వంటి అత్యంత కీలక పథకాలు పూర్తిమంచినీటి పథకాల కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పునకు నానా ఎత్తులు వేస్తోంది. కానీ, ఏ అప్పు చేయకుండానే ఉద్దానం వంటి కీలక పథకాలు పూర్తిచేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. రూ.26,181 కోట్ల జలజీవన మిషన్ కార్య్రMý మంలో ఉద్దానం, పులివెందుల, డోన్‌తో పాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో రూ.10,137 కోట్లతో 9 భారీ ప్రాజెక్టులు చేపట్టింది. రూ.12,984 కోట్లతో అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు, రూ.3060 కోట్లతో కొత్తగా ఏర్పాటైన జగనన్న కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని తలపెట్టింది.ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దానం ప్రాంత భారీ సమగ్ర రక్షిత నీటి పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. పులివెందుల, డోన్ భారీ సమగ్ర రక్షిత పథకాల నిర్మాణం సగంపైనే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లు ఉండగా, ఈ పథకం ప్రారంభం నాటికే 30 లక్షల ఇళ్లకు కొళాయిలు ఉన్నాయి. మిగతా 65 లక్షల ఇళ్లకు గాను 39 లక్షల ఇళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కొళాయిల ఏర్పాటు పూర్తయినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 6 ప్రాజెక్టులకు సైతం 2022 తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తయింది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. కృష్ణా మినహా మిగిలిన జిల్లాల్లో రక్షిత పథకాలకు తిరిగి టెండర్లు పూర్తి చేసింది. రూ.1,290 కోట్లతో ప్రకాశం జిల్లా భారీ సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన వాటాలకు కచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. కేంద్రం బడ్జెట్ నుంచి కేంద్ర ప్రయోజిత పథకాల కు జల జీవన్ మిషన్ నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నిధులకు బదులుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అప్పులు చేసి ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు. దీనిని బడ్జెట్ పరిధిలోకి వచ్చే అప్పుగా పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ అప్పు.. ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్భీఎం) పరిధిలోకి రాకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. -
మామిడి రైతుల నోట్లో మట్టి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మామిడిలో కేవలం 25 శాతానికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద ఆర్థిక మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులోని వివరాలు.. ‘2025–26 మార్కెటింగ్ సీజన్‌కు ఎంఐఎస్ కింద తోతాపురి మామిడి ధర లోటు చెల్లింపునకు గరిష్ట పరిమితిని 1,62,500 టన్నులు(మొత్తం ఉత్పత్తిలో 25 శాతం)గా నిర్ధారించాం. క్వింటాకు కనీస మద్దతు ధరను రూ.1,490.73గా నిర్ణయించాం. తోతాపురి మామిడి రోజు వారీ అమ్మకం ధరను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ/హార్టీకల్చర్/ సహకార విభాగాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం గరిష్టంగా 25 శాతం ఎంఐపీ(క్వింటాకు రూ.372.68) ఉంటుంది. ఈ భారాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో పంచుకోవాలి. లోటు ధర చెల్లింపు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఉత్పత్తి చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లతో ఏపీఎంసీలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, ర్యాంప్‌లలో విక్రయించాలి. వీటిని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్ చట్టం–1966 ప్రకారం ప్రకటిస్తారు’ అని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోనే మేలు..రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కాగా.. ఇందులో 1.62 లక్షల టన్నుల కొనుగోలుకే ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో కూడా కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెరి సగం భరించాలని స్పష్టంగా పేర్కొంది. అంటే క్వింటాకు రూ.372.68ల్లో కేంద్రం రూ.186.34 మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనం. తమ రాష్ట్ర మామిడి రైతులను ఆదుకోవాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి లేఖ రాయగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి.. ఎలాంటి ఆంక్షలు లేకుండా క్వింటా మామిడికి రూ.1,616 ధర నిర్ణయించారు. అలాగే కర్ణాటకలో 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలుకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం.. ఏపీలో కేవలం 1.62 లక్షల టన్నులకే అనుమతి ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా సీజన్ ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకే వర్తింపు..‘రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యాపారులకే విక్రయించాలి. విక్రయం జరిగిన ప్రామాణికతను నోటిఫైడ్ మార్కెట్, మండీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద నమోదు చేయాలి. వ్యాపారి పేరు కేంద్రం, రాష్ట్రం నోటిఫై చేసిన జాబితాలో ఉండాలి. వీటిని సంబంధిత జిల్లా కలెక్టర్ ధ్రువీకరించాలి. ఉద్యాన శాఖ అధికారుల వద్ద రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి’ అని నిబంధనలు విధించారు. అంటే రైతు మార్కెట్లో విక్రయించడమే కాదు.. సరైన వ్యాపారి ద్వారా, సరైన కేంద్రంలో అమ్మాలి. లేదంటే పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఈ నెల 21 నుంచి నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అయినకాడికి తెగనమ్ముకొని తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక వందలాది మంది రైతులు గిటు్టబాటు ధర లేక వేలాది టన్నుల కాయలను రోడ్లపై పారబోశారు. మరికొందరు చెట్లకే కాయల్ని వదిలేయగా.. ఇంకొందరైతే చంద్రబాబు ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి ఏకంగా తోటలనే నరికేశారు. -
మహిళా వీవోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గత శనివారం తెల్లవారు జామున అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనను ఏడాది కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్యపదజాలంతో అశ్లీల సూచనలు చేస్తూ తనను ఒంటరిగా ఇంటి వద్ద కలవాలని మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మాది, నీ ఉద్యోగం ఉండాలంటే నాతో ఇంటి వద్ద రాత్రి ఒంటరిగా కలవాలని, నేను చెప్పినట్లు వినాలి’ అని బెదిరించినట్టు వివరించారు. ఆరు నెలల క్రితమే విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ మధ్య సుబ్బారావు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా నరకం అనుభవించానని, గత్యంతరం లేక ఆత్మహత్యా యత్నం చేశానని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం పక్కదారి పట్టించే యత్నం.. అసలు విషయం పక్కదారి పట్టించేందుకు సుబ్బారావు పలువురు డ్వాక్రా సభ్యులను ఆటోల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్త్రీ నిధి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా నిధులు స్వాహా చేసిందని బాధితురాలి మీద ఆరోపణలు చేయించారు. సుబ్బారావు తమ తరఫున ఉన్నందున ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డ్వాక్రా సభ్యులు పదేపదే ఆయనకు అండగా నిలిచే యత్నం చేశారు. శనివారం తెల్లవారు జామున బాధితురాలు నిద్రమాత్రలు మింగిన విషయం తెలుసుకున్న వీరు సోమవారం ఉదయం నగదు స్వాహా చేసిందని వెలుగు కార్యాలయంలో అధికారులకు డ్వాక్రా సభ్యులతో చెప్పించే యత్నం చేయడం గమనార్హం. స్త్రీ నిధి నగదు కొంత తన వద్ద ఉన్న మాట వాస్తవమే అని, వాటిని తిరిగి సంస్థకు జమ చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. తన వ్యక్తిగత సమస్యకు డ్వాక్రా నిధులకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‘వైఎస్సార్సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కట్టుకథల కుట్ర సర్కార్!
కుట్రలు తప్ప తెలియనివాడికీ, వంచనతప్ప మరేదీ చేతగానివాడికీ మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించటం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో నిరుడు గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలనూ, గూండాలనూ ప్రోత్సహించి హత్యలకూ, దౌర్జన్యాలకూ తెగబడటంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. రెడ్ బుక్‌లో సరికొత్త అంకం లిక్కర్ స్కాం! ఆ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను జైలుపాలు చేసిన ప్రభుత్వం, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చే సింది. విద్యార్థి రాజకీయాల నాటినుంచీ తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవటానికే ఆయన కుమారుడు మిథున్‌రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకూ, సన్నిహితులకూ నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవటానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేనిచోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ‘ఆత్రగాడికి బుద్ధి మట్టు’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ఎదుటివారిపై బురద చల్లి ఏదోరకంగా వారికి అవినీతి మకిలి అంటి ద్దామని తండ్రీ కొడుకులు పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన మద్యం విధానంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి అనుమతినిచ్చిన వైనం లేదు. సరిగదా... అంతకుముందు టీడీపీ ఏలుబడిలో చెలరేగిన మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి, మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మద్యం విక్రయ వేళల్ని కుదించారు. బాబు హయాంలో తామర తంపరగా పెరిగిపోయి, ఊరూవాడా జనం మూల్గులు పీల్చిన బెల్ట్ షాపుల జాడే లేకుండా చేశారు. పర్మిట్ రూమ్‌ల దందా అడ్డుకున్నారు. ఆ విధానం కారణంగా తమ అక్రమ సంపాదన నిలిచిపోగా లబోదిబోమని అప్పట్లో గగ్గోలు పెట్టింది తెలుగు దేశీయులే. మద్యపాన ప్రియుల్ని తగ్గించటానికి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందట! అందులో భారీమొత్తం డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్‌కి తరలిపోయిందట!! ఇంగితజ్ఞానం వున్నవారెవరికైనా ఇందులోని కపట నాటకం అర్థమవుతుంది. బురద చల్లటానికి వీళ్లకంటూ ఒక పద్ధతుంటుంది. ముందు ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు వండివార్చుతారు. ఏదో జరిగిపోయిందంటూ ఆ మీడియా పెడబొబ్బలు పెడుతుంది. వాటిని ఆధారం చేసుకుని కేసులు రూపొందుతాయి. వాటిపై దర్యాప్తుకంటూ సీఐడీ ఆధ్వర్యాన సిట్ ఏర్పాటవుతుంది. ఏం చేయడానికీ పాలుబోని సిట్... ఎల్లోమీడియా తప్పుడు కథనాలనే రీసైక్లింగ్ చేసి చార్జిషీట్లుగా రూపొందిస్తుంది. అవి న్యాయస్థానం మెట్లెక్కకుండానే ఎల్లోమీడియాకు చేరతాయి. తమకు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఆ మీడియా పతాక శీర్షికలతో పండగ చేసుకుంటుంది. ఇంతకూ జనంలో ఇసుమంతైనా విశ్వసనీయత లేని ఈ మీడియాకు ‘విశ్వసనీయంగా’ చెప్పేవారెవరు? ఇంకెవరు... తండ్రీకొడుకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వీర విధేయ అధికారులూ! తమ కథనాలే చార్జిషీట్లుగా అవతారమెత్తాయని, అవే న్యాయస్థానాల పరిశీలనకు పోతున్నాయని తెలియనట్టు, కొత్తగా ఆ రోజే బయట పడినట్టు ఎల్లోమీడియా వికృత విన్యాసాలకు తెగబడుతుంది. 13 వేల ఫోన్‌కాల్స్‌ట, వందలాది వాట్సాప్ చాటింగ్‌లట. దుబాయ్‌లో జల్సాలట. జనం నవ్విపోతారన్న వెరపే లేదు. వారిపట్ల జవాబుదారీతనం అసలే లేదు.జనానికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాదికాలం మాయమాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కారు ప్రజల దృష్టి మళ్లించటానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం దీని ఆంతర్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అంతేవాసులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణ కాదు. సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విప్పిచెప్పిన లోగుట్టు. గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా సంతకాలు చేసిన బాబు నిర్వాకం కారణంగా ఖజానాకు 2015–19 మధ్య రూ. 5,200 కోట్ల మేర గండి పడిందని ఆ సంస్థ బయటపెట్టింది. ఇదిగాక ఎంఆర్పీ కన్నా 20 శాతం అధిక ధరలకు విక్రయించి మరో రూ. 20,000 కోట్లు కొల్లగొట్టారని బయటపడటంతో 2023లో కేసు నమోదైన కారణంగా బాబు, ఆయన అనుచరగణం బెయిల్ కూడా తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకొచ్చాక ఈ దోపిడీ మరింత విశృంఖలంగా పెరిగింది.తమ మద్యం కుంభకోణాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా కేసులుపెట్టి నడిబజారులో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే తాజా కేసు. జగన్ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫిర్యాదుచేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలూ జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా వున్నదని సీసీఐ తేల్చిచెప్పింది. ఒకసారి ఛీకొట్టించుకున్నా బుద్ధిరాని పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెర లేపింది. ఈ ప్రహసనాన్ని జనం నిస్సందేహంగా తిప్పికొడతారు. -
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్
సాక్షి, అమరావతి : కూటమి ప్రభుత్వ అసమర్థ, రెడ్‌బుక్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. సంపద పెరగకపోగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన సంపదను కూడా కూటమి సర్కారు ఆవిరి చేసేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం అమ్మకం పన్ను రాబడులు తగ్గిపోవడమే. దీంతోపాటు రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో తగ్గిపోయాయి. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర సంపద తిరోగమనంలోనే పయనిస్తోంది. అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇందుకు కాగ్ గణాంకాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) బడ్జెట్ గణాంకాలను కాగ్ వెల్లడించింది.» సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక సంపద సృష్టించడం దేవుడెరుగు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన సంపద కూడా రాకుండా ఆవిరి చేసేస్తున్నారు. అప్పులను మాత్రం భారీగా పెంచేశారు. అయినా, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు.» 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.9,873 కోట్లు (21.41 శాతం) తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే... వైఎస్ జగన్ పాలనలో 2023–24 తొలి త్రైమాసికంలో వచ్చినంత కూడా రాకపోగా ఇంకా తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా రెవెన్యూ రాబడులు ఎంతో కొంత పెరగాలి గానీ అంతకుముందు సంవత్సరాల కంటే తగ్గకూడదు. ఒకవేళ తగ్గాయి అంటే రాష్ట్ర సంపద తిరోగమనంలో ఉన్నట్టే.» అమ్మకం పన్ను రాబడి కుడా తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో అమ్మకం పన్ను రాబడి రూ.369 కోట్లు తగ్గిపోవడంతో వృద్ధి 7.78 శాతం తిరోగమనంలోకి వెళ్లింది. అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతున్నదంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్లు అర్థం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని లేదంటే రాబడి తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.» కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్లు కుడా గణనీయంగా తగ్గడం గమనార్హం. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏకంగా రూ.14,230 కోట్లు తగ్గిపోయాయి. 90.95 శాతం మేర కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినట్లు తేలుతోంది.» బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి పన్నేతర ఆదాయంలో తరుగుదలే తప్ప పెరగడం లేదు. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో పన్నేతర ఆదాయం రూ.111 కోట్లు తగ్గిపోయింది. వృద్ధి 8.06 శాతం తగ్గింది.» మరోవైపు సామాజిక రంగ వ్యయం (విద్య వైద్యం, సంక్షేమ రంగాలకు చేసేది) గతం కన్నా సాధారణంగా పెరగాలి. కానీ, వైఎస్ జగన్ సర్కారుతో పోల్చితే బాబు ప్రభుత్వంలో తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రూ.7,495 కోట్లు (15.28 శాతం) తగ్గింది.» ఈ ఆర్థిక ఏడాది మూడు నెలల్లో బాబు సర్కారు ఏకంగా రూ.36,384 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మూలధన వ్యయం రూ.6,053 కోట్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఇదే 2023–24 తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.12,669 కోట్లు ఉండడం విశేషం. సాధారణంగా అమ్మకం పన్నులో ఎంతో కొంత వృద్ధి ఉండాలి. అలాంటిది 2023–24 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన అమ్మకం పన్ను రాబడి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రాలేదంటే ఆందోళన కలిగించే విషయమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. » సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంపదను కూడా రాబట్టలేక ఉన్నదానిని ఆవిరి చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపుతున్నారు. -
వైద్యానికి నిర్లక్ష్య 'రోగం'
మే 13న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి దాక రాష్ట్రంలో 108 సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం డయల్ చేసినా కలవలేదు. 5 గంటలకు పైగానే అంతరాయం ఏర్పడింది. గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైనవారు వైద్యసేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. సకాలంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు విడిచారు. మే 29న విజయవాడ కనకదుర్గ వారధిపై గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన వృద్ధురాలు గుడిపూడి భవానీని బస్సు ఢీకొట్టగా రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్... బాధితురాలికి వైద్యం అందించాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. భవానీకి తీవ్ర రక్తస్రావం అవుతుండగా... అరుణ్ పలుసార్లు 108కు కాల్ చేసినా సమాధానం లేదు. సమయానికి ప్రైవేట్ అంబులెన్స్ అటుగా రావడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు కలెక్టరేట్ సమీపంలో ఓ గృహిణి స్పృహ తప్పి పడిపోగా కుటుంబ సభ్యులు 108కు కాల్ చేశారు. కాల్ సెంటర్ సిబ్బంది వివరాలు తీసుకున్నాక అంబులెన్స్ సిబ్బంది లైన్లోకి వచ్చి ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కాల్ కట్ చేశారు. దీంతో ప్రైవేట్ వాహనంలో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి, లైఫ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల విజయవాడ కరెన్సీ నగర్లో రోడ్డుపై ఇసుక మేటను తప్పించబోయి స్కూటీ మీద నుంచి వృద్ధుడు పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. అక్కడివారు 108కు ఫోన్ చేస్తే అరగంటైనా రాలేదు. బాధితుడి కుటుంబ సభ్యులే వృద్ధుడిని తీసుకెళ్లారు. అనారోగ్యంగా ఉండి 108ని పిలిస్తే రాదు... ఒంట్లో శక్తి లేకున్నా ఓపిక చేసుకుని సొంతంగానే ఆస్పత్రికి వెళ్తే కనీసం మందులుండవు... గాయాలైతే దూది కూడా బాధితులే కొనుక్కోవాలి... ఒకవేళ ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అవసరమైతే ఇక ప్రాణాలు గాల్లో దీపమే...! మధుమేహ బాధితులైనా... తీవ్ర వ్యాధుల పీడితులైనా అంతే...! వైద్యం దైవాధీనమే..! చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఏలుబడిలో ఇదీ పరిస్థితి..! నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయి..!సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేసేశాం. ఎక్కడా కొరత లేదు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. విలేజ్ క్లినిక్స్ నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ కొరత వేధిస్తోంది. అన్ని బోధనాస్పత్రులను బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటీబయోటిక్స్ కొరత వేధిస్తోంది. విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ, ఏ ఆస్పత్రిని పరిశీలించినా ఈ మందులేవీ లేవు. జ్వరం, గ్యాస్, బీపీ, నొప్పుల వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చేవారినీ బయట కొనుక్కోమంటూ సిబ్బంది చిట్టీలు రాస్తున్నారు. సర్జికల్స్‌లో.. క్షతగాత్రులే గాయాల శుభ్రం, కట్టు కోసం దూది, డ్రెస్సింగ్ మెటీరియల్ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మధుమేహ బాధితుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ అన్ని ఆస్పత్రుల్లో కొరత ఉందని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు. ఔట్ పేషంట్లకు (ఓపీ) నెలకు 3, 4 అవసరం ఉంటే.. ఒకటి, రెండే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, వైఎస్సార్, సీఎం సొంత జిల్లా చిత్తూరుతో పాటు మిగిలిన చోట్ల ఇదే పద్ధతి కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో సర్జరీకి వచ్చిన రోగులనే సూదులు, సూచర్, ఇతర మెటీరియల్స్ కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పారాసిటమాల్, బీపీ మందులు, బీ కాంప్లెక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇన్సులిన్ కొరత నెలకొంది.మంత్రి చేతిలో మాత్ర..వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా కాని మందులను స్థానికంగా పీఎంబీజేకే కార్యక్రమం కింద కొనాలని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఓ మంత్రితో డీల్ కుదుర్చుకున్న సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు ఎంవోయూ చేసుకున్నాయి. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినా ఆ సంస్థ మందులను సరఫరా చేయడం లేదని సూపరింటెండెంట్లు వాపోతున్నారు. ఏ మందులు సరఫరా చేయలేరో చెబితే... ప్రత్యామ్నాయం చూసుకుంటామని కోరుతున్నా అది కూడా చేయడం లేదు. సమయానికి మందులు సరఫరా చేయకపోతే జరిమానాలు విధించడం, ఇదే తంతు కొనసాగితే సంస్థను బ్లాక్ లిస్టింగ్ చేస్తారు. కానీ, తమకు వచ్చిన బిజినెస్‌పై కమీషన్ ముట్టజెప్పేలా మంత్రితో సరఫరాదారులు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారిపై జరిమానాలు విధించడానికి వీల్లేకుండా పోతోందని అధికారులు చెబుతున్నారు.చంద్రబాబు ‘బీమా’లో ఆరోగ్యశ్రీ చిక్కి శల్యంపేదల సంజీవని ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అంపశయ్య పైకి ఎక్కించింది. బీమా రూపంలో... ప్రజారోగ్యాన్ని దళారుల చేతిలో పెడుతూ గద్దెనెక్కిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రణాళికబద్ధంగా పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్‌తో సరిపెట్టుకోవాలని స్వయంగా టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లు చెల్లింపులు సక్రమంగా చేయడం లేదు. ప్రస్తుతం రూ.3,500 కోట్లు బకాయి పడింది. దీంతో చికిత్సలు అందించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చిట్టచివరి నిరుపేద, మధ్య తరగతి పౌరుడికి సేవలందేలా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. 2019కి ముందు చంద్రబాబు పాలనలో 919 నెట్వర్క్ ఆస్పత్రుల్లో మొక్కుబడిగా అమల వుతున్న ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్ ఏకంగా 2,371కు తీసుకుని వెళ్లారు. వీటిలో 200పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి.వీలైనన్ని ఎక్కువ ఆస్పత్రులకు అనుమతులివ్వడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చేశారు. సేవలకు ముందుకు వచ్చిన ఆస్పత్రుల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులిచ్చారు. ప్రతి వారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపానెల్ కమిటీ భేటీ అయి దరఖాస్తుల పరిశీలన, ఆమోదం వంటి కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. 140కు పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుమతి కోసం చేసిన అభ్యర్థనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. కొత్తగా ఏర్పాటైన ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ అనుమతులు కావాలంటూ ట్రస్ట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం లేకపోతోంది.2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. వీటిని చెల్లిండమే కాక ఏడాది తిరగకుండానే అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదారు. తెల్ల కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేశారు. దీంతో 1.40 కోట్లపైగా కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. 1,059 ప్రొసీజర్లను ఏడాదిలోనే 2059కు, ఐదేళ్లలో 3,257కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్‌ను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చిన పాపాన పోలేదు. పైగా గత ప్రభుత్వంలో చికిత్స తర్వాత రోగులకు నెలకు రూ.5 వేల మేర అందించిన ఆరోగ్య ఆసరాను.. నిరుడే నిలివేశారు. ఏడాదికి రూ.400 కోట్ల మేర ఈ సాయం అందించాల్సి ఉంది. 5 వేల కాల్స్‌కు నో రెస్పాన్స్గతంలో కాల్ సెంటర్‌కు వివిధ ప్రమాద, అనారోగ్య బాధితులకు సాయం కోసం రోజుకు 12 వేల నుంచి 13 వేల కాల్స్ వచ్చేవి. ప్రస్తుతం 8 వేల కాల్స్ మాత్రమే వస్తున్నాయి. అన్ని సందర్భాల్లో 108 వాహనాలు బాధితులకు అండగా నిలవడం లేదు. జూన్‌లో ఏకంగా 4500–5,000 ఉదంతాల్లో బాధితులకు సాయం అందలేదు. మరోవైపు కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి మెరుగైన వైద్యానికి పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను పట్టించుకోవడమే లేదు.ప్రతిసారీ మందులు బయటే కొంటున్నా... నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. అయినా కాళ్ల నొప్పులు తగ్గడం లేదు. ప్రతి నెల విజయవాడ జీజీహెచ్‌కు చికిత్స కోసం వస్తుంటా. స్టాక్ లేదు.. మందులు బయట కొనమని సిబ్బంది చీటీ రాస్తున్నారు. రూ.500 ఖర్చవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకుని మందులు కొనే స్తోమత లేకనే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటికి రాస్తున్నారు. – శ్రీనివాసరావు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు విజయవాడ ప్రాణం పోతున్నా రాని 108ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసిన నిమిషాల్లోనే కుయ్ కుయ్‌మంటూ వచ్చిన అంబులెన్సులు నేడు ప్రాణాలు పోతున్నా రావడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి నిర్వహణ సంస్థను వెళ్లగొట్టి అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటివరకు ఉన్న నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించింది. దీంతో అత్యవసర వైద్యసేవల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎలాగూ వెళ్లగొట్టేస్తున్నారని నిశ్చయించుకుని పాత సంస్థ వాహనాల నిర్వహణను వదిలేసింది. 100 నుంచి 200 మేర వాహనాలు అధ్వాన స్థితికి చేరాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉండగా 731 ఆన్‌రోడ్ సేవలు అందించాలి. మిగతావి బ్యాకప్. కానీ, ఏ రోజూ 731 వాహనాలు ఆన్‌రోడ్ సేవల్లో ఉండడం లేదు. మరమ్మతుల పేరుతో నిత్యం 100 వాహనాలు షెడ్లకు చేరుతున్నాయి. ఉన్న అరకొర వాహనాలు సమయానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదు. మే నెల సగటు రెస్పాన్స్ సమయాన్ని గమనిస్తే.. పట్టణాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వెళ్లాల్సి ఉండగా 10 నిమిషాల మేర ఆలస్యంగా వెళ్లాయి. గ్రామాల్లో 20 నిమిషాలకు గాను 28 నుంచి 30 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 5 నుంచి 10 నిమిషాలకు పైగా ఆలస్యంగా చేరుకున్నాయి. గత నెల నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ భవ్య నిర్వహణ చేపట్టింది. కొత్త కాంట్రాక్ట్ ప్రమాణాల్లో గోల్డెన్ అవర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చిన గంటలో అంబులెన్స్ ప్రమాద స్థలి నుంచి రోగిని ఆస్పత్రికి చేర్చాలి. అయినా నిర్దేశిత సమయంలోపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందడం లేదు.108... వైఎస్ జగన్ తొలి ఏడాది పాలనకు నేటికీ ఎంత తేడా?చంద్రబాబు ‘108’లను ఏడాదిలోనే అస్తవ్యస్తంగా మార్చగా, గతంలో ఏడాది లోనే వైఎస్ జగన్ వాటిని బలోపేతం చేశారు. 2019కి ముందు ఈ అంబులెన్స్ సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈ క్రమంలో ఏడాది కూడా తిరగకుండానే వైఎస్ జగన్ సర్కారు 412 అంబులెన్స్‌ల కొనుగోలు చేసింది. వీటిని 2020 జూలై 1న ప్రారంభించారు. 26 నవజాత శిశు అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. రూ.4.76 కోట్లతో 2022 అక్టోబరులో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీంతో 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్సులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అండగా నిలిచారు. -
ఎమ్మెల్యే వేధింపులు తాళలేను.. ఆత్మహత్య చేసుకుంటున్నా
తిరువూరు: సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పచ్చనాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిన చందంగా.. ఉద్యోగుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు దళిత ఉద్యోగినైన తనను వేధింపులకు గురి చేశారని, భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దళితుడైన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.కిషోర్ శుక్రవారం సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖ రాశారు. తనను తిరువూరు నుంచి గౌరవరం ఎన్ఎస్సీ సెక్షన్‌కు బదిలీ చేసిన అధికారులు రిలీవ్ చేయలేదని, దీనిపై ఎమ్మెల్యేను పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడ స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగయ్య, కంచికచర్ల స్పెషల్ సబ్ డివిజన్ డీఈఈ ఉమాశంకర్ కలిసి తనకు రాజకీయ రంగు పులిమి ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్యాంప్రసాద్‌కు తిరువూరు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి తన బదిలీని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిలీవ్ చేయవద్దన్నారని స్వయంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారులు, తిరువూరు ఎమ్మెల్యే కలిసి ఆడిన రాజకీయ నాటకంలో తాను బలైపోయానని, తన చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఏ ఉద్యోగీ తనలా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలని లేఖలో కోరారు. ఇరిగేషన్ అధికారుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. -
'కుంకీ' కుట్ర!
సాక్షి, అమరావతి: గ్రామాలపై ఏనుగుల దాడిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని మేపలేక అక్కడి ప్రభుత్వం ‘గజ’కర్ణ విద్యను ప్రదర్శించి ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది. అడవి ఏనుగుల కట్టడి కోసం తెచ్చి.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిశా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు తరచూ ఊళ్లపై పడి పొలాల్ని ధ్వంసం చేయడం, మనుషులపై దాడి చేస్తుండటంతో వాటిని నియంత్రించే కుంకీ ఏనుగులను తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. దీనిలోభాగంగా ఆయన రెండుసార్లు కర్ణాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. గత మే నెలలో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు కుంకీ ఏనుగుల్ని వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన రంజన్ (26), దేవ (39), అభిమన్యు (14), కృష్ణ (15) అనే ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని, ఆయన వల్లే కుంకీ ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు. మరో రెండు ఏనుగుల్ని త్వరలో ఇస్తామని కూడా పేర్కొన్నారు. రెండు నెలలైనా ఒక్క కుంకీ ఆపరేషన్ లేదు తీసుకొచ్చిన ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌లో అటవీ అధికారులు ఉంచారు. అవి వచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. ఎందుకని ఆరా తీయగా వాటికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని తేలింది. వాటిని పోషించడమూ దండగేనని అటవీ శాఖాధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అందులో దేవ అనే ఏనుగు గుడ్డిదని సమాచారం. అది ఒక కంటితో మాత్రమే చూడగలదని అధికారులు గుర్తించారు. మరో ఏనుగు రంజన్ పిచ్చిదని, దాన్ని అదుపు చేయడం మావటివల్ల కూడా కావడం లేదని తెలుస్తోంది. మిగతా రెండు ఏనుగులకూ కుంకీ ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని, అవి ఎందుకూ పనికిరావని అధికారులు తేల్చేశారు. దీంతో అటవీశాఖ కక్కలేక మింగలేక నీళ్లు నములుతోంది. ఈ ఏనుగుల పోషణకు ఒక్కో దానికి ఏడాదికి రూ.25లక్షలు ఖర్చవుతుందని అంచనా. నాలుగు ఏనుగులకు ఏడాదికి రూ.కోటి వెచ్చించాలి. మరో 25 ఏళ్లపాటు ఈ భారాన్ని మోయక తప్పదని, పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగులను తీసుకొచ్చిన ఏపీ సర్కారు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మార్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీక మదనపడుతున్నట్టు సమాచారం. -
బాబూ.. జవాబియ్యండి..!
‘‘విజయవాడ నగరంలో ఓ రేషన్ దుకాణంలో 600 కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా అధికారులు ఆ కార్డులకు సరిపడా బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న అసలు కార్డుదారులకు బియ్యం సరిపోవడం లేదు. వాస్తవానికి ప్రతి దుకాణానికి 10 శాతం కోటా అదనంగా ఇవ్వాలి. కానీ, కూటమి సర్కారు వచ్చాక ఇండెంట్ పెట్టినా పంపని దుస్థితి. ’’.సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నోటిదగ్గర కూడు లాగేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆహార భద్రత చట్టం లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. ఫలితంగా చౌక దుకాణాల్లో నిత్యావసరాలు దొరక్క.. పేదలు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల్లో ఏడాదిగా సబ్సిడీ కందిపప్పు, ఫోరి్టఫైడ్ గోధుమపిండి పంపిణీ ఆగిపోయింది. చిరుధాన్యాలు, పంచదార సరఫరా నామ మాత్రమే. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నే కూటమి ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తోంది. ఎన్నికల ముందు చౌక దుకాణాల ద్వారా 18 రకాల సరుకులు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన సరుకుల పంపిణీకి కూడా మంగళం పాడడంతో పేదల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అదనంగా బియ్యం ఇవ్వం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలు)పై కక్షగట్టి రద్దు చేసింది. ఈ క్రమంలో ఆర్భాటంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా ప్రారంభించింది. ఒకటో తేదీ వచ్చిందంటే పేదలు రేషన్ కోసం క్యూలైన్లలో కుస్తీలు పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చాలా మంది కూటమి నాయకుల సిఫారసులతో డీలర్షిప్ దక్కించుకున్న డీలర్లు పంపిణీలో అక్రమాలకు పాల్పడడంతో పీడీఎస్ వ్యవస్థ గాడి తప్పుతోంది. దుకాణాలు సరిగా తెరవడం లేదు. రోజుల తరబడి షాపుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. చాలా మంది దుకాణాల చుట్టూ తిరిగి విసిగివేసారి సరుకులు తీసుకోకుండా ఉండిపోతున్నారు. దీంతో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంత నిల్వలను సరఫరా చేయనట్టు చూపిస్తున్నారు. దీనిని సాకుగా చూపి ప్రభుత్వం అదనంగా సరఫరా చేయాల్సిన పదిశాతం బియ్యం ఇవ్వబోమని చెబుతోంది. కందిపప్పు ఎగ్గొట్టి.. కందిపప్పు సరఫరాకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. వాస్తవానికి చౌక దుకాణాల్లో సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కు ఇవ్వాల్సి ఉంది. కానీ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయని, రేట్లు పెరిగినప్పుడు మాత్రమే సబ్సిడీపై కందిపప్పు ఇస్తామని చెబుతోంది. వాస్తవానికి ఇప్పుడు మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది. దీనిని సబ్సిడీపై చౌకదుకాణాల్లో ఇస్తే లబ్దిదారులపై సగానికి సగం ఆర్థికభారం తగ్గుతోంది. ఈ దిశగా సర్కారు ఆలోచించడం లేదు. మొత్తం కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, ఏడాదిగా అడపాదడపా కేవలం 38వేల టన్నుల కందిపప్పు మాత్రమే కూటమి సర్కారు సరఫరా చేసింది.బేరం కుదర్లేదని టాక్.. సుమారు రూ.500 కోట్ల బకాయిలు సర్కారు చెల్లించకపోవడంతో కందిపప్పు పంపిణీదారులు చౌకదుకాణాలకు సరుకు సరఫరాకు ముందుకు రావడం లేదు. వచ్చినవాళ్లు కాస్త బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ ధర కంటే ఎక్కువకు కోట్ చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ కచ్చితంగా అమాత్యులకు కప్పం కట్టాలనే నిబంధన పెట్టడంతోనే పంపిణీదారులు అధిక ధర కోట్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి విరుగుడుగా అమాత్యులే కొంత మంది వ్యాపారులను ప్రోత్సహించి టెండర్లు వేయించినట్టు సమాచారం. అయితే ఈసారి కప్పం రెట్టింపు ఇవ్వాలని తెగేసిచెప్పడంతో ఖంగుతిన్న సదరు కాంట్రాక్టర్లు మాకెందుకులే ఈ బాధ అని వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఫలితంగా పౌరసరఫరాల సంస్థలో కందిపప్పు కొనుగోళ్లు కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్లకే పరిమితమైందని సమాచారం.ఎమ్మెల్యేను దుమ్ముదులిపిన మహిళ‘‘రేషన్ చూస్తే బియ్యం సరిగారావు. డీలరు బియ్యం లేవు.. కోటా లేదు..అయిపోయిందంటాడు. కందిపప్పు ఇయ్యడు. ఇంకెట్లా సార్..? మాకు బతుకు దెరువు ఎలా..? మాకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటే మేము ఎట్టా బతికేది? నేను రోజంతా కూలి చేస్తే రూ.200 ఇస్తారు. కందిపప్పే కిలో రూ.150 పలుకుతోంది. ఇదేంది సారూ!! జవాబియ్యండి’’ అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని గోవిందమ్మ అనే మహిళా కూలి దుమ్ముదులిపేసింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే ఎదుట ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్‌లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్‌కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్‌కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్‌ను అర్ధ నగ్నంగా లాకప్‌లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్‌బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్‌కుమార్‌పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్‌ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్‌పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.పోసానిపై రెడ్‌బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ను హైదరాబాద్‌లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్‌కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్‌కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజధాని అప్పుల్లో రూ.991.06 కోట్లు మళ్లింపు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు. ‘పోలవరం’ నిధులు కూడా.. ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. ఇది తెలిసి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు. అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌తో రక్తమోడుతోన్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా?
ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే పదాలు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు. బీఆర్ఎస్ నాయకులపై జుగుప్సాకరమైన థంబ్‌నైల్స్ పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ఖండనార్హమే. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కచ్చితంగా ఖండించాల్సిందే. ఇదే సమయంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలు కొందరు ప్రత్యేకమైన జర్నలిస్టులకు, సెలక్టివ్ మీడియా గ్రూపులకు మాత్రమే ఉంటాయా? ఇంకెవరికీ ఉండవా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి.మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛోటోమోటా నాయకులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించి దాడిని తీవ్రాతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థలపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. సరిగ్గా ఇక్కడే సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నారు. ఈ దాడి జరగడానికి మూడు వారాల ముందు ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను, చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్‌కూ, ‘సాక్షి’ యాజమాన్యానికీ ముడి పెట్టి ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేసినప్పుడు ఇది మీడియాపై దాడి అని రామోజీరావు అంటే... ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు స్వరం కలపడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏకంగా యాంకర్‌గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఈ సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని ‘సాక్షి’ పత్రిక ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి దాడులకు పూనుకున్నారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ సంఘటన ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడిలా ఎవరికీ కనిపించకపోవడం విచిత్రం. ఏకంగా పదికి పైగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్క కేసు లేదు, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అదే తెలంగాణకు వచ్చే సరికి... బీఆర్ఎస్ నాయకులపైనా, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా జుగుప్సాకరంగా పెట్టిన థంబ్‌నైల్స్‌పై ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సదరు టీవీ యాజమాన్యానికి సుద్దులు చెప్పడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా టీవీ ఛానల్‌కు అండగా నిలబడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. సాక్షిపై దాడి విషయంలో సమర్థింపు మాటలు మాట్లాడిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇప్పుడు మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు అర్థంకాక సామాన్య ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి రాజకీయ పార్టీలు సొంతగా మీడియా సంస్థలు కలిగి ఉండటం తగదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కలిగి ఉండటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ సొంతగా నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎన్నో దశాబ్దాలుగా నడుపుతోంది. వామపక్షాలు సైతం ప్రతి రాష్ట్రంలో ఎప్పటి నుంచో సొంత పత్రికలు నడుపుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీలు ఒకరిద్దరికి మీడియా సామ్రాజ్యాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా సంస్థ అయ్యింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఎప్పటి నుంచో వార్తా పత్రికలు ఉన్నాయి. విశాలాంధ్ర పేరుతో సీపీఐ, ప్రజాశక్తి పేరుతో సీపీఎం పార్టీలు దశాబ్దాలుగా పత్రికలు నడుపుతున్నాయి. అలాగే 10 టీవీ పేరుతో సీపీఎం, 99 టీవీ పేరుతో సీపీఐలు చెరో శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఛానళ్ళ యాజమాన్యాలు మారినప్పటికీ అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీల అనుబంధ సభ్యులే. ‘ఈనాడు’ రామోజీరావు స్వయంగా తాను కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకినని న్యాయస్ధానాల్లో చెప్పుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రి వర్గ కూర్పు, తనకు నచ్చని మంత్రులను క్యాబినేట్ నుంచి తీసివేయించే వరకూ ‘ఈనాడు’ ఎంత కీలకంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ చర్విత చరణమే. ఇక ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ టీడీపీ కోసం ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ సహాయంతో టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేయించుకున్న నాయకులెందరో లెక్కలేదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలు అవ్వగానే సాంబశివరావు అనే జర్నలిస్ట్ టీవీ 5 తెరమీదకు వచ్చి ఏడెనిమిది నిమిషాల పాటు ధర్మోపన్యాసం చేస్తూ జగన్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడటం నిత్యకృత్యం అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. సాంబశివరావు అటు వెళ్లిన వెంటనే ఇటు మూర్తి అనే మరో జర్నలిస్టు రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చే ప్రవచనాలు వర్ణనాతీతం. ఈ ఇద్దరి మధ్యలో రాత్రి 8 గంటలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ అనే ఛానల్లో వెంకట కృష్ణ సూక్తిముక్తావళి ఉంటుంది. దీని సారంశం కూడా జగన్‌ను ఆడిపోసుకోవడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం! వీరందరి మధ్యలో మహా టీవీ వంశీ తనదైన శైలిలో న్యూస్ రూమ్‌లో కూర్చుని దర్బార్లు నడిపిస్తాడు. టీడీపీ సహజీవనం చేసే ఈ మీడియా సంస్థలు అన్నీ ఇప్పుడు ముసుగులు వేసుకుని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే నమ్మే పరిస్థితుల్లో తెలుగు సమాజం లేదన్న విషయం అందరూ గుర్తించాలి. – రుద్రుడు ‘ తెలుగు పాఠకుడు -
సుపరిపాలన కాదు..‘సూపర్’ మోసపు పాలన
చంద్రబాబు సర్కారు ఏడాది పాలన అంతా కక్షపూరిత చర్యలు, సూపర్ సిక్స్ సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది.. హామీలిచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను వంచించారు.. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. పిల్లలకు ఫీజులు లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు భృతి లేదు.. ఇదా సుపరిపాలన?ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు... ఇది సుపరిపాలనా?ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతోపాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు.. పేదలు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అందక అప్పుల పాలవుతున్నారు.. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు..పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు... ఇదా సుపరిపాలన?గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, వలంటీర్ వ్యవస్థలు కూటమి సర్కారు కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి.. ఇది సుపరిపాలనా?సాక్షి, అమరావతిరాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగా, కుట్రలతోనే సాగిందని.. కూటమి ఎమ్మెల్యేలు ఏ మొఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. మద్యం దుకాణాలను పచ్చ ముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ డైవర్షన్ నాటకం మొదలుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయకపోగా అధఃపాతాళానికి వేల అడుగులు వేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.‘సూపర్’ మోసాలు.. హామీలు బుట్టదాఖలుఅధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్ సిక్స్ హామీలంటూ నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కింద రూ.15 వేలను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూమంత్రంగా విదిలించి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సిలిండర్ ఇచ్చి సూపర్ సిక్స్‌ను సమాధి చేశారు. ‘సంపద సృష్టించాక సంక్షేమం అమలు చేస్తాం’’ అని ఒకసారి.. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి...’ అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా మౌనముద్ర దాల్చారు. నిర్వీర్యమైన విద్య, వైద్యం, వ్యవసాయంవైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి తొలి ఏడాది ఐదు చోట్ల 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేటీకరణ పేరుతో తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు అడుగులు వేస్తోంది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను ఎగరగొట్టి అన్నదాతలను నడిరోడ్డు మీద నిలబెట్టింది. రెండు నెలలుగా కనీసం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఈ సర్కారుపై మండిపడుతూ రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యువతకు వెన్నుపోటు..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి 6.38 లక్షల ఉద్యోగాలను, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్–2 పోస్టులను గ్రూప్–1లో కలపడం, డీఎస్సీలో 50 శాతం అర్హత మార్కుల నిబంధనతో 3 లక్షల మంది అభ్యర్థులకు అవకాశాలను దూరం చేశారు. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు.రెడ్ బుక్‌తో టెర్రర్.. దిగజారిన శాంతి భద్రతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్ష పూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుల్లో సరికొత్త రికార్డు..ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా మారుస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్ పరిధిలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తేగా బడ్జెట్ బయట రూ.50 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు.మాఫియా ముఠాలతో సహజ వనరుల లూటీవైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శక ఇసుక విధానం ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం జమ చేయగా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల జేబులు నింపుతూ రూ.వేల కోట్ల ఇసుకను దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్ సహా అన్ని గనులను వ్యవస్థీకృతంగా దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని లులూ సంస్థకు, రూ.3 వేల కోట్ల భూమిని ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఈ సంస్థలు చంద్రబాబు సన్నిహితులవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీతో రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.డైవర్షన్ పాలిటిక్స్... మభ్యపెట్టే కుతంత్రంచంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదం, ప్రకాశం బ్యారేజ్‌పై కుట్ర, తిరుమల లడ్డూ వివాదం లాంటి అంశాలతో వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సీజ్ ది షిప్ నాటకాలతో ఈ డైవర్షన్‌కు ఊతమిస్తున్నారు.రద్దుల రాజ్యం... కమీషన్ల పర్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు 2.60 లక్షల మందిని రోడ్డున పడేసింది. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పి మొత్తంగా ఆ వ్యవస్థనే ఎత్తివేసింది. ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,280 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోయారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థలను రద్దు చేసి టెండర్లను సన్నిహితులకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానంతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది. -
దమ్ మారో దమ్.. కోరలు చాపిన గంజాయి మాఫియా
రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్ మారో దమ్.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్‌కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్‌గా.. యావత్ దక్షిణాదిని హోల్‌సేల్ మార్కెట్‌గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్‌వర్క్‌ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఊరూ వాడా రిటైల్ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్‌సేల్‌గా భారీగా స్మగ్లింగ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. ఏవోబీలో తలుపులు బార్లా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్‌కు గేట్వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్‌కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది.జవసత్వాలు లేని ఈగల్⇒ గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెబ్‌ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్‌కు పూర్తి స్థాయి చీఫ్‌గా నిబద్దుడైన వినీత్ బ్రిజ్‌లాల్‌ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్ చీఫ్‌గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్‌బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ⇒ ఈగల్ చీఫ్‌గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్ ఇన్చార్జ్గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్ అనే కానిస్టేబుల్‌పై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ మదన్ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.డీ అడిక్షన్ కేంద్రాలకు గ్రహణంగంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ కేంద్రాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.మూడు రూట్లు.. ఆరు లారీలు...టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్ఆర్ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని యావత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్వర్క్అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్‌గా చేసుకున్నారు. అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు.. ఇలా పలువురిని తమ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులురాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్‌ను కాపాడేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.⇒ మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.⇒ మొక్కల లోడ్ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. ⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
బాలికల విద్య భ్రష్టు!
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్‌లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్ జగన్‌పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్‌ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్‌లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్‌ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్‌లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్‌లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్‌లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్‌లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్–హ్యాకథాన్ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్ బైక్‌ల ఊబరైజేషన్ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్ మాస్ ఇమేజ్ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్లు లంచాలివ్వలేక లాకౌట్లు ప్రకటించాయి. నవీన్ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్ ప్రక టించుకుంటున్నది. జగన్మోహన్రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్ లీడర్. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్మోహన్రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్ వీడియోను సృష్టించి జగన్ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్మోహన్రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్మోహన్రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్ భద్రతపై కూటమి సర్కార్ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘మత్స్య’ విద్య ఎదురీత
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు చేసిన ఫిషరీ యూనివర్సిటీ వసతుల్లేక సతమతమవుతోంది. మత్స్య విద్య ఏటికేడు ఎదురీదుతోంది. దీనికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో ఫిషరీ యూనివర్సిటీ. యూనివర్సిటీ క్యాంపస్ కోసం నరసాపురం పక్కనే 40 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనేతొలుత ఏడాది కాలానికి నరసాపురంలోని తుపాను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా 66 సీట్లతో 2023 జూన్‌లో నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును ప్రారంభించారు. 2024 నాటికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహించాలన్న లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి నాటికే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు చేరుకోగా, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల పునాదులు పూర్తయ్యాయి.దాదాపు రూ.35 కోట్ల విలువైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను అటకెక్కించింది. నిధులివ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుంచి తాత్కాలిక భవనంలోనే తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌బీకేనే తర‘గతి’..! రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి వస్తున్న వీరంతా రైతులు కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీ ఫిషరీ యూనివర్సిటీ విద్యార్థులు వీరు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కళాశాల నిర్వహిస్తున్న తాత్కాలిక భవనంలో సెకండ్ బ్యాచ్ విద్యార్థులకు గదుల్లేవు. ఫలితంగా పక్కనే ఉన్న ఆబీకే భవనంలోని చాలీచాలని హాల్లోనే వీరికి తరగతులు నిర్వహించారు. ఆర్బీకే భవనంలో సెకండ్ బ్యాచ్ప్రస్తుత తాత్కాలిక భవనంలోని 12 గదులు 66 మంది స్టూడెంట్స్ కలిగిన ఒక బ్యాచ్‌కు మాత్రమే తరగతులు, ల్యాబ్ నిర్వహణకు సరిపోతున్నాయి. 2024 జూలై నుంచి మరో 66 మందితో సెకండ్ బ్యాచ్ మొదలు కావడంతో పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని హాల్‌ను తరగతి గదిగా, స్టాఫ్ రూమ్‌ను కంప్యూటర్ ల్యాబ్‌గా వినియోగిస్తుండటం గమనార్హం. ప్రైవేటు మెస్‌లు, అద్దె గదులే గతి!క్యాంపస్ హాస్టల్ లేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు మెస్‌లు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. గదులను బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతోంది. విద్యార్థినులు భద్రతాపరంగా ఆందోళన చెందుతున్నారు. కళాశాలకు వచ్చే వెళ్లే దారిలో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కళాశాల వద్ద క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సెక్యూరిటీ లేదు క్యాంపస్ హాస్టల్ సదుపాయం లేక బయట అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. భద్రతాపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆకతాయిల బెడద ఉంటోంది. – సి.ధరణి, కర్నూలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థినిహాస్టల్ వసతి కల్పించాలిఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. క్యాంపస్ హాస్టల్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. యూనివర్సిటీ భవనాలు వేగంగా పూర్తిచేయాలి. క్రీడా మైదానం, ల్యాబ్ వసతులు కల్పించాలి. – దేవీ ప్రసాద్‌దొర, పార్వతీపురం, మొదటి సంవత్సరం విద్యార్థికొత్త బ్యాచ్ పరిస్థితి ఏమిటి?సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 132 మంది ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి జూలై నుంచి 66 మందితో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీ జరగనుంది. కొత్త బ్యాచ్‌కు అక్టోబరులో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వీరికి క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ప్రైవేట్ విద్యాసంస్థలో తరగతుల నిర్వహణకు యత్నాలు జరుగుతున్నట్టు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. -
‘చినబాబు సర్వీసు’ కమిషన్!
నారా చంద్రబాబునాయుడు..! వైఎస్ జగన్మోహన్రెడ్డి..! వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!! సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేనివిధంగా కమిషన్‌లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్‌గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్ సభ్యుడిని తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?2023 గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం స్పోర్ట్స్ కేటగిరీలో 42 మందిని, జనరల్ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరుగుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపోతుందని ఆక్రోశిస్తున్నారు.మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్.. కమిషన్‌లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో సీనియర్‌ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్‌గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..వారం క్రితం గ్రూప్–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్‌లో ఫైల్ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘాలపై కొత్త సభ్యుడిని నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమవారం రోజు బోర్డులో ఉన్న సీనియర్ సభ్యుడిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్‌ను అప్పటికప్పుడు నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.సీనియర్ సభ్యులను పక్కనపెట్టి..టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తికాలం కొనసాగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్టీయూ వైస్ చాన్సలర్‌గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా గత ప్రభుత్వంనియమించింది. అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రూప్–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తలరాతలు తారుమారు...టీడీపీ హయాంలో సర్వీస్ కమిషన్ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్‌భాస్కర్ చైర్మన్‌గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2018 గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు, ఒక సబ్జెక్టు నిపుణుడు (యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. -
మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.అత్యధిక వడ్డీ భారం మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్మెంట్ లోన్ (ఎస్డీఎల్) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.⇒ గతంలో ఏపీ సీఆర్డీఏ (ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ), ఏపీ ఎస్‌బీసీఎల్ (ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. ⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్ లోన్‌తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. హైకోర్టులో కేసున్నా...ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్‌మ్యాప్‌పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కీలక ప్రశ్నలు–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?–డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా? -
అంతులేని యోగ సంపద!
‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్‌గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్ బుక్‌లో చోటు దొరికింది. రామ్ సింగ్ అనే జైపూర్ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్ కాదు కదా! అందుకే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్‌కు రెండు లభించాయి. ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్‌గా పెట్టుకుంటే, అటెండెన్స్ మూడు లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్‌ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్ కల్యాణ్ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! దాని ముందు గిన్నిస్ రికార్డులు, పిన్నిస్ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్‌సైజుల్లో చాలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్ పీరియడ్లలో నేర్పించినవే. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్ టీచర్లు, స్పోర్ట్స్ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దివంగతులైన రోజు జూన్ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్‌కు, క్యాన్సర్‌కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ సందేశాలు విని, పునర్ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్ చేసే పద్ధతి గిన్నిస్ బుక్ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పాఠాలెందుకు, సీబీఎస్ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! ‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్
సాక్షి, అమరావతి:‘చంద్రబాబునాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ ఇదీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతకంతో ఆ పార్టీ జారీ చేసిన ష్యూరిటీ బాండ్. ఇందులో పథకాలను 2024 జూన్ (ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల) నుంచే అమలు చేస్తామని కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ బాండ్ పేపర్లతో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ క్యాడర్... ఆ ఇంటిలో మొత్తం ఎందరు ఉన్నారు...? మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు, వారి పేర్లు తీసుకుని... వీరికి ఏ పథకం కింద ఎంతెంత వస్తుంది..? అని లెక్కలేసి మరీ చెప్పారు. బాండ్ పేపర్లను మొబైల్ ఫోన్లకూ పంపారు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ, సూపర్ సిక్స్ సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్లు మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు మాత్రం ‘‘సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసేశా.. ఎవరైనా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిõÜ్త వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ’’ ముందుగానే బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని... వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్ జగన్ కంటే ఎంత ఎక్కువ ఇస్తాం అనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచీ నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్ జగన్ ప్రజలను హెచ్చరించారు. కానీ.. చంద్రబాబు మాటలు, పవన్ కళ్యాణ్ గ్యారంటీలు.. ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.. సూపర్ సిక్స్ అతీగతీ లేదు.. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా’ అంటూ దబాయిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మెహరాజ్ బేగం షేక్‌కు ఐదేళ్లలో జరగబోయే లబ్ధికి సంబంధించి ఇచ్చిన హామీ ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు.. సూపర్ సిక్స్, ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురుచూస్తోంది.మహానాడు నుంచే మహా మోసానికి నాంది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే.. అంటే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి, తద్వారా ఒక కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు అనంతరం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబసభ్యుల పేర్లు ఆరా తీసి, ‘‘టీడీపీ మేనిఫెస్టో.కామ్’’ వెబ్సైట్లో ఆ వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి... ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనం ఎంతనో వివరించారు. తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌కు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. బాండ్లను కుటుంబ సభ్యుల ఎదుటే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని బాండ్లలో తేల్చిచెప్పారు.ఇది కాదా మోసం..? 2024 జూన్ నుంచే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు... కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేశారు. కానీ, ఇందులో 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతిని అనుసంధానం చేశానని... 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. చంద్రబాబు మాటల్లోనే సూపర్ సిక్స్ సూపర్ మోసంగా మారిందని స్పష్టమవుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాల గ్రామానికి చెందిన పసాది సాలమ్మకు జరగబోయే లబ్ధికి సంబంధించి కూటమి నేతలు ఇచ్చిన బాండ్ ఆ బాండ్లు... మోసాలకు సాక్ష్యాలు ఏడాదిలో రూ.81,397.83 కోట్లు ఎగవేత ⇒ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ బాండ్లలో గ్యారంటీ ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ‘మోసపోయాం’ అంటూ ప్రతి ఇంట ప్రజలు నిట్టూర్చుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లు.. ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న బాండ్లను తీసుకుని.. ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాల కింద తమ కుటుంబానికి ఎంతమేరకు ప్రభుత్వం ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ⇒ సూపర్ సిక్స్‌లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు బాకీ పడ్డారు. ⇒ పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ, తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ సూపర్ సిక్స్‌లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18ృ59 ఏళ్ల మధ్య వయసు వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. మహిళలకు రూ.32,400 కోట్లు బాకీపడ్డారు. ⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రకారం రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది మరో హామీ. దీనికోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది ఈ హామీ అమలు చేయలేదు. అంటే... ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ 50 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పింఛను ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పింఛనుగా ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఇది ఇవ్వలేదు. రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమందికి రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని బాబు వాగ్దానం చేశారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల చొప్పున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ పంటల బీమా పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలోని 53 లక్షల మంది రైతులకు టోపీ పెట్టిన మొత్తం రూ.1,385 కోట్లు. ఇక మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఎగ్గొట్టిన మొత్తం రూ.265 కోట్లు. ఇలా ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.81,397.83 కోట్లు బకాయి పడిందని ప్రజలు లెక్కలు వేస్తున్నారు. బాకీపడిన ఈ మొత్తంతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.బాబూ... ఇదిగో మీరిచ్చిన బాండు..! ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల నిలదీతకు ప్రజలు సిద్ధం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలును 2024 జూన్ నుంచే ప్రారంభిస్తామంటూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రతి ఇంటా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ఇంటింటా ఆగ్రహం పెల్లుబుకుతోంది. బాండ్లు చూపి చంద్రబాబును నిలదీయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుపై ఇప్పుడు ప్రతి ఇంట చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇచ్చిన బాండు ప్రకారం తమ ఇంటికి గత ఏడాది కాలంలో రావాల్సిన మొత్తంపై లెక్క వేసుకుని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తమ ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకులకు ఎసరు
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉనికి ప్రమాదంలో పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని సైతం తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బందిని రెన్యువల్ చేయడం ఆనవాయితీ. కానీ, కూటమి ప్రభుత్వం ఈసారి రెన్యువల్ చేయకుండా ఇంటర్వూ్యలకు హాజరుకావాలంటూ హుకుం జారీ చేసింది. తమకు నచ్చినవారిని వర్సిటీల్లో కూర్చోబెట్టేందుకు కాంట్రాక్టు ఉద్యోగులకు ఎసరు పెట్టింది. – సాక్షి, అమరావతిఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమే..రాష్ట్రంలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 2,500 మంది అకడమిక్ కన్సల్టెంట్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 2వేల మందికి పైగా పీహెచ్‌డీలు చేసి.. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వర్సిటీల్లో 700 నుంచి 800 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. ఏటా 50 నుంచి 100 మంది వరకు రిటైర్ అవుతున్నారు. ఈ తరుణంలో శాశ్వత నియామకాలు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం.. కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల మెడపై కత్తి పెట్టింది. వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. ఇది చాలదన్నట్టు.. కాంట్రాక్టు ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా మార్చేసి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఏదైనా సమస్య వస్తే కోర్టును ఆశ్రయించడానికి వీల్లేకుండా నిబంధనలు తెచ్చింది. ఇది పూర్తిగా హక్కులను కాలరాయడమేనని విద్యావేత్తలు మండిపడుతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి ఏ క్షణమైనా తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. జేఎన్టీయూ(అనంతపురం)లో రెండు రోజుల కిందట కొత్త నిబంధనలను తీసుకొచ్చి.. సంతకాలు పెట్టాలంటూ కాంట్రాక్టు అధ్యాపకులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఎత్తివేత..చంద్రబాబు హయాంలో వర్సిటీల్లో ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాల ఊసే వినిపించదు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. కోర్టుల్లో కేసులు వేయించి.. వాటిని ఆపించిన చరిత్ర చంద్రబాబుది. 2017లోనూ ఇదే విధంగా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ వర్సిటీల బలోపేతానికి కృషి చేశారు. 2023లో కోర్టు కేసులను పరిష్కరించి 3,220 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో మళ్లీ కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అయినా శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు అధ్యాపకుడికి సర్వీసు ప్రకారం ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను వెయిటేజ్ కింద ప్రకటించింది. ఇంటర్వ్యూ మార్కుల్లోనూ వెసులుబాటు కల్పించింది. కానీ, కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును రెగ్యులర్ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
తిరోగమన‘మే’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెల వరకు కాగ్ వెల్లడించిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జీఎస్టీతోపాటు ఆమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.22,505 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోందనడానికి బలమైన సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు వచ్చిన జీఎస్టీ ఆదాయం కన్నా.. ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన ఆదాయం రూ.350 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను కూడా రూ.136 కోట్లు పడిపోయింది. పన్నేతర ఆదాయమూ రూ.49 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులూ ఏకంగా రూ.1300 కోట్లు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నా.. గ్రాంట్లను తీసుకురావడంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల.. ఇక్కడ తగ్గుదల సాధారణంగా జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో ఏటా ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకున్నా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు తెచ్చినా.. మూలధన వ్యయం మే నెల వరకు రూ.2,242 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమనే వాదన వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మేనెల వరకు విద్య, వైద్య, సంక్షేమం తదితర సామాజిక రంగాలపై చేసిన వ్యయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.6,184 కోట్లు తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయమూ సాధారణంగా గతం కన్నా పెరగాలి. అయితే అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు. ఈ ఆర్థిక సంవత్సరమూ రెండు నెలల్లోనే భారీగా అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కాగ్ గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి. -
రేషన్ కోసం 13 కిలోమీటర్ల నడక
రావికమతం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ విధానానికి కూటమి సర్కారు మంగళం పాడటంతో అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తలపై సరుకుల మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. రావికమతం మండలం కళ్యాణలోవ గ్రామానికి దగ్గరలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) డిపో ఉంది. ఈ డిపో నుంచి నీడబంద గ్రామానికి 13 కిలోమీటర్ల దూరం. అజయ్పురం, బంగారు బందలు, కడగడ్డ గంగాదేవిపేట, రొచ్చిపనుకు, రాయిపాడు, పెదగరువు, తాటిపర్తి గ్రామాల వారికి సైతం ఇంచుమించు అదే దూరంలో ఈ జీసీసీ డిపో ఉంటుంది. ఇన్నాళ్లూ తమ గ్రామానికో.. రోడ్డు సదుపాయం ఉన్న సమీప గ్రామానికో రేషన్ బండి వస్తే హాయిగా సరుకులు తెచ్చుకున్న గిరిజనులు ఇప్పుడు అంత దూరం కాలినడకన డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనైనా ఎండీయూ వాహనాలు నడపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం సమీపంలోని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల జెడ్.జోగింపేటలో సబ్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 300 రేషన్ కార్డులున్నాయి. సెల్ టవర్లున్నా సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఆఫ్‌లైన్‌లో బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. బియ్యం ఉచితంగా ఇస్తున్నా ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, రోడ్డు సదుపాయం లేని గ్రామాల వారు నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి నరక యాతన అనుభవిస్తున్నారని, తమ కష్టాలు తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
పేరుకు వందనం.. భారీ కోతలతో బంధనం
ఏ నెలా 100 యూనిట్లు దాటలేదు నేను, నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎనిమిది, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తల్లికి వందనం డబ్బులొస్తే ఫీజుల అవసరం తీరుతుందనుకున్నా. నాకు డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్తే 300 యూనిట్లు దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు. మాకు ఎప్పుడూ కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు. అలాంటిది 300 యూనిట్లని ఎలా చెప్పారంటూ సచివాలయ సిబ్బందిని అడిగాం. తామేమీ చేయలేమంటున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి తీసుకున్నాను. – ఆరుగుల అరుణ, భీమవరపుకోట, కాకినాడ జిల్లా‘తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు.. మేము అలా కాదు.. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ అండ్ కో ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు అమలు చేయలేక అంకెల గారడీ చేస్తున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కనికట్టు చేస్తున్నారు. నిజంగా అందరికీ ఇచ్చి ఉంటే ఊరూరా మహిళలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నట్లు? స్కూళ్ల చుట్టూ, సచివాలయాల చుట్టూ, విద్యుత్ ఆఫీసుల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నట్లు? సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో కనికట్టు చేస్తోంది. కొంత మందిని మాత్రమే అర్హుల జాబితాలో ప్రకటించి.. మిగతా తల్లులందరికీ పంగనామాలు పెట్టింది. అర్హుల జాబితాతోనే 30 లక్షల మందికి పైగా ఎగ్టొట్టిన సర్కారు.. తను చెప్పుకుంటున్నట్లు 54 లక్షల మందిలో సగానికి సగం తెగ్గోయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కరెంట్ బిల్లును, ఇతర నిబంధనలను ఆయుధంగా ఎంచుకుంది. నెలలో 300 యూనిట్లకు మించి వాడారంటూ ఏకపక్షంగా నిర్ణయించి అనర్హత వేటు వేసింది. ప్రతి నెలా సగటున 300 యూనిట్లకు మించి వినియోగించక పోయినా, వినియోగించినట్లు నెపం మోపి పథకాన్ని కట్ చేసింది. పలు జిల్లాల్లో ఏకంగా స్కూళ్లకు స్కూళ్లనే జాబితా నుంచి ఎత్తేసింది. రోజుకు రూ.233 వేతనంతో పని చేసే అంగన్వాడీ ఆయాల పట్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులంటూ కనికరం లేకుండా వ్యవహరించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమంటున్నారు. ఏడాది విద్యుత్ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ సోమవారం విద్యుత్ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అవాస్తవ కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన సంఖ్యను కుదించేందుకే ఇలా.. కొందరి పేరున అసలు విద్యుత్ మీటర్లే లేవు. మరికొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూపి తల్లికి వందనం లేకుండా చేశారని పలువురు తల్లులు విద్యుత్ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఎలా ఉంటాయని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతరం, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల వద్ద తల్లులు స్టేట్మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. అయితే ఏడాది స్టేట్మెంట్ కావాలని అధికారులు కోరుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం ఆరు నెలల స్టేట్మెంట్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర స్కూళ్లపై కోపమా?తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో సైతం సెంట్రల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యారికీ తల్లికి వందనం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోను బీజేపీ నేతలు పట్టుకోలేదని ఇలా కక్ష సాధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా తిక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 310 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం నగదు బదిలీ కాలేదు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు ఉన్నారు. అర్హుల జాబితాలో ఒక్కరి పేరు కూడా లేదు. పిఠాపురం సబ్ స్టేషన్ వద్ద స్టేట్మెంట్ల కోసం గుమిగూడిన ప్రజలు అన్ని జిల్లాల్లోనూ ఇదే తీరు⇒ తమకు తల్లికి వందనం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులందరూ స్థానికులేనని, ఒక్కరికీ కూడా పథకం వర్తింప చేయలేదని కలెక్టర్ కి విన్నవించారు. ⇒ నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 355 మందిలో ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వందనం వర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం విక్టర్ ఇమ్మానియల్ను నిలదీశారు. తమకు తెయదని, పైనుండి జాబితాలు వచ్చాయన్నారు. ⇒ చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ ఆయమ్మకు రూ.7 వేలు, కార్యకర్తకు రూ.11,500 జీతం చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి టీడీపీ కూటమికి సిగ్గులేదా అని అంగన్వాడీ సంఘం జిల్లా నేతలు లలిత, షకీలా ప్రశ్నించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ⇒ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపేయాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓకు అందజేశారు. ⇒ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అప్కాస్ ఉద్యోగులందరికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సుమన్‌లతో కలిసి సోమవారం తిరుపతి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 వేలు కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రకటించారని, అయితే నేడు చిరుద్యోగులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. ⇒ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ మండల కో–ఆర్డినేటర్ల పిల్లలకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వర్తింపజేయక పోవడం తగదని యూనియన్ నాయకుడు చల్లా కామేశ్వరరావు అన్నారు. పథకం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. తమకు కటింగ్స్ పోను రూ.11,342 మాత్రమే వేతనం ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలలకు చెల్లిస్తున్నారని చెప్పారు. ⇒ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు కూడా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.ఇద్దరు పిల్లలైతే.. 66 మందిగా నమోదు.. ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన దాసరి శోభకు ఇద్దరు పిల్లలు. వీరికి తల్లికి వందనం కింద రూ.26 వేలు జమ కావాల్సి ఉంది. అయితే ఆమెకు 66 మంది పిల్లలు ఉన్నట్లు జాబితాలో నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంతో శోభకు తల్లికి వందనం వర్తించలేదు. దీంతో కంగుతిన్న ఆమె గత రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. శోభ తన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం తీసుకుని సోమవారం ఎంఈఓ కార్యాలయం, స్టేట్ బ్యాంకు అధికారులను సంప్రదించింది. వివరాలను పరిశీలించిన ఎంఈవో వెంకటేశ్ నాయక్.. జరిగిన పొరపాటును సరిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం మోసం చేసింది మా పిల్లలు ముగ్గురు స్థానిక జెడ్పీ పాఠశాలలో చదువుతున్నారు. మాకు ఎలాంటి పొలాలు లేవు. కరెంటు బిల్లు చాలా తక్కువ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జాబితాలో మా పిల్లల పేర్లు చూపడం లేదు. సిబ్బందిని అడిగితే ఏమీ తెలియదంటున్నారు. కూటమి ప్రభుత్వం తల్లితండ్రులను మోసం చేస్తోంది. ఎన్నికలప్పుడు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి. – సాల్మన్, గడివేముల, నంద్యాల జిల్లాఒక్క నెలలో 300 యూనిట్లొస్తే ఆపేస్తారా? తాపీ మే్రస్తిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇల్లు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. మా కుమార్తె మాధవి అనంత భార్గవి 7, కుమారుడు జశ్వీర్ 5 తరగతులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు. తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు చెబితే సంతోషించాం. మే నెల కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం తీసేశారు. ఇలా ఒక్క నెలనే పరిగణనలోకి తీసుకుంటే ఎలా? – నున్న ఉమావాణి శ్రీదేవి, భీమశంకరం, కరప, కాకినాడ జిల్లాకావాలనే ఇలా చేశారు మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్‌కుమార్ నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మీరు ఇన్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. మాకు మెట్ట భూమి పది ఎకరాల్లోపే ఉన్నప్పటికీ అదే సాకుతో పథకం ఆపేశారు. ఎందుకిలా కావాలనే చేశారో అర్థం కావడం లేదు. – ఉలిగమ్మ, బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా ఈ నెల బిల్లు 68 యూనిట్లు వచ్చింది మే నెలకు సంబంధించి మాకు కరెంట్ బిల్లు 68 యూనిట్లు వచ్చింది. వేడి మండిపోయే మే నెలలోనే 68 యూనిట్లు వస్తే తక్కిన సమయంలో ఎన్ని యూనిట్లు వస్తాయి? అటువంటిది 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం పథకంలో అనర్హులుగా పేర్కొనడం అన్యాయం కాదా? మాలాంటి వారికి కూడా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఎలా? – వేల్పుల మరియమ్మ, సీఎం కాలనీ, కుక్కునూరు, ఏలూరు జిల్లాఇల్లే లేదు.. ఏడు కనెక్షన్లట మాకు 10, 8 తరగతులు చదివే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నగదు అందింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అర్హులం కాదని చెప్పారు. ఎందుకో తెలుసుకోవడానికి సచివాలయంలో వెళ్లి అడిగాము. నా పేరుతో ఏడు విద్యుత్ కనెక్షన్లు నమోదై ఉన్నాయని సిబ్బంది తెలిపారు. సొంత ఇల్లే లేని నాకు ఏడు విద్యుత్ కనెక్షన్లు ఎక్కడివని ప్రశ్నించగా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సిబ్బంది చెప్పారు. – బైసాని సత్యనారాయణ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఇడ్లీ పిండి అమ్ముకునే మాకూ ఎగ్గొట్టారు..మా అమ్మాయి లేఖన ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. గతంలో అమ్మ ఒడి డబ్బులు సక్రమంగా పడ్డాయి. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు ఆ డబ్బులు జమ కాలేదు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే అద్దె ఇంటిలో ఉంటూ ఇడ్లీ పిండి అమ్ముకుంటూ జీవనం సాగించే మాకు ఏడు కరెంటు మీటర్లు ఉన్నాయని చెప్పారు. ఇలా అసంబద్ధమైన కారణాలు చూపి అనర్హులమనడం సరికాదు. – దాసిరెడ్డి నాగజ్యోతి, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్‌కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు. పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం ‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు. -
ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్!
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లోనూ దారుణంగా ఫెయిలైంది. వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌గా చూపి సీనియర్లను కూడా మోడల్ స్కూల్ ప్రైమరీ హెచ్ఎంలుగా పంపింది. అయితే, వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో రిలీవర్లు లేక ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 9,600 మంది పీఎస్ హెచ్‌ఎంల్లో దాదాపు 90 శాతం మంది తిరిగి బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేసి, పాత స్కూళ్లల్లోనే స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. మరోపక్క ఆయా స్కూళ్లలో పలు అంశాలపై విద్యాశాఖ అడిగే సమాచారాన్ని అందించాలి. వాటి పర్యవేక్షణ పూర్తిగా ప్రాధానోపాధ్యాయులు మాత్రమే చూడాలి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన స్టేషన్ పాయింట్లతో ప్రస్తుత బదిలీల్లో కేటగిరీ 1, 2 స్కూళ్లకు (పట్టణ, మండల కేంద్రాలు) బదిలీ అయ్యారు. అయితే, వారు పనిచేస్తున్న పోస్టుల్లో కొత్తవారు లేకపోవడంతో పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తోందని వాపోతున్నారు.ఎంపీఎస్లపై దృష్టి పెట్టి హైస్కూళ్లు నిర్లక్ష్యంఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా మోడల్ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వీటిలో పీఎస్ హెచ్ఎంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అందుకు తగ్గట్టుగా 9,600 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వీటిలో తప్పనిసరిగా హెచ్ఎం పోస్టు ఉండాలని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను మిగులు (సర్ప్లస్) చూపించి వారినే నియమించింది. అలాగే, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ, ఎస్ఏ ఖాళీలు భారీగా ఉంటే అరకొరగా ఎస్జీటీలకు పదోన్నతులిచ్చింది. దాంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కరవయ్యారు. ఇప్పుడు చేసేది లేక పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్లను కొత్త పోస్టులో చేరాక.. తిరిగి పాత పోస్టుల్లోనే కొనసాగాలని ఆదేశించింది. ఇలా ఎంత కాలం పనిచేయాల్సి వస్తుందో తెలియదని, హెచ్ఎంగా వెళ్లామన్న సంతృప్తి లేకుండా పోయిందని బదిలీ అయిన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక కేటగిరీ–3, 4 పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీపై కేటగిరీ 1, 2 స్కూళ్లకు వచ్చినా తిరిగి మారుమూల పాత స్కూళ్లలోనే ఉండిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 90 శాతం మంది పాత పోస్టుల్లోనే..పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత బదిలీల్లో దాదాపు 40 వేల మంది టీచర్లను బదిలీ చేసింది. వీరిలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు ఉన్నారు. 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 4,706 పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. మిగిలిన చోట గతంలో పదోన్నతిపై వచ్చిన ఎస్జీటీలను హెచ్ఎంలుగా నియమించారు. అయితే, ప్రస్తుతం ఎస్ఏల పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమించాల్సి ఉన్నా.. చాలా తక్కువ మందికే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంతో లెక్కతప్పి హైస్కూళ్లల్లో సిబ్బంది తగ్గిపోయారు. దీంతో పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లిన వారు జిల్లాను బట్టి 70 నుంచి దాదాపు 90 శాతం మంది పాత పోస్టులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లాలో మిగులుగా గుర్తించిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎంలుగా పంపించారు. వందల్లో ఖాళీ అయిన పోస్టుల్లో పదుల సంఖ్యలో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేశారు. సోషల్ సబ్జెక్టులో 135 పోస్టుల్లో కేవలం 15 పోస్టులనే ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన 120 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. అలాగే, ఫిజికల్ సైన్స్‌లో 89 ఖాళీల్లో 9 మాత్రమే భర్తీ చేశారు, మ్యాథ్స్‌లో 126 ఖాళీలకు గాను 12, బయాలజీలో 136 పోస్టులు చూపి 16 పోస్టులను మాత్రమే ఎస్జీటీలను పదోన్నతిపై భర్తీ చేశారు. మిగిలిన పోస్టుల్లోని ఎస్ఏలు బదిలీ అయినా రిలీవర్లు లేక ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వీరు ఇలా ఎంత కాలం అదే పోస్టులో కొనసాగాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఏడాది పాలన.. మహిళలకు వంచన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనలో అన్ని రంగాల్లో మహిళలు వంచనకు గురయ్యారని వివిధ రంగాలకు చెందిన మహిళా నేతలు నిప్పులు చెరిగారు. కూటమి ఏడాది పాలనంతా ఆరాచక.. విధ్వంసక.. వినాశక పాలనగా సాగిందని మండిపడ్డారు. మహిళల భద్రతకు ఏవిధంగానూ భరోసా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన.. మహిళలకు వంచన’ అనే అంశంపై విజయవాడ రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్ సెంటర్లో శనివారం చర్చావేదిక నిర్వహించారు. మహిళా న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, డ్వాక్రా సంఘాల నేతలు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, మహిళా నేతలు పెద్దఎత్తున హాజరై తమ గళం వినిపించారు. మహిళల జీవితాలు తల్లకిందులయ్యాయివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అవినీతి పాలన అప్పుల ఆంధ్రాగా మారింది. ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. కానీ.. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. తొలి ఏడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా? సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, సూపర్ సిక్స్ అమలు చేసేశాను.. ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్టే అని సీఎం చెబుతున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే.. ఎగ్గొట్టిన వారిని ఏమనాలి? ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి? గతంలో అమ్మఒడిపై విమర్శలు చేశారు. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు.. కానీ జగన్ చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు’ అని మండిపడ్డారు..మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచనే లేదు మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వైఎస్ జగన్ దిశ యాప్ తెస్తే దానిపై ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. అమ్మఒడి పథకంలో పాఠశాలల నిర్వహణకు కొంత తీసుకుంటే లోకేశ్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేశ్ రూ.2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. రాష్ట్రం రావణకాష్టంలా మారింది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు కనిపించడం లేదా. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని నిలదీశారు. బడులకు దగ్గరే మద్యం షాపులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండాపోయింది. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డు మీదకు లాగేశారు. బడులకు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అమలుకాని హామీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, న్యాయవాదులు లలిత, సౌమ్య, విశ్రాంత ఉపాధ్యాయిని రజనీ, కార్పొరేటర్ శశికళ, సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, ఇంటూరి సృజన తదితరులు మాట్లాడారు. -
నవ్విపోదురు గాక..!
‘‘ఆరు సూపర్ సిక్స్ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్ మీట్‌ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్ ఇయర్ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్ సిక్స్‌లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్ అనే పథకంతో లింక్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్ షిప్‌గా పెట్టుకున్న సూపర్ సిక్స్‌లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్షిప్ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్‌బుక్ నోరు తెరుస్తుంది. రెడ్ బుక్ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా నేను, స్టేట్ బ్యూరో చీఫ్‌గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్ తొలగించి రిమాండ్‌కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్‌ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్ నవ్వు, ఇన్‌స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్‌ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్‌లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. వైఎస్సార్ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం. ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్‌ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్‌తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!– తలకోల రాహుల్ రెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనలిస్ట్ -
చదువు చతికిల బడింది
విజయనగరంలోని నారాయణ స్కూల్లో గత ఏడాది 3వ తరగతికి స్కూల్ ఫీజు రూ.48 వేలు, పుస్తకాలకు రూ.7,500, రిజర్వ్ నగదు రూ.1,000 (మొత్తం రూ.56,500) వసూలు చేశారు. ఈ ఏడాది స్కూల్ ఫీజును రూ.55 వేలు చేశారు. పుస్తకాలకు రూ.8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు రూ.వెయ్యితో కలిపి రూ.64,500 వసూలు చేస్తున్నారు. ఇదే స్కూల్లో నిరుడు 4వ తరగతికి స్కూల్ ఫీజు రూ.50 వేలు, పుస్తకాలకు రూ.8,500,(రిజర్వ్ నగదు రూ.1,500) మొత్తం రూ.60 వేలు తీసుకున్నారు. నేడు స్కూల్ ఫీజును రూ.60 వేలకు పెంచారు. పుస్తకాలకు రూ.9,500 తీసుకున్నారు.ఏడాదిలోనే ఎంత తేడా...? అప్పుడు అంతా ప్రగతి బాట.. ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తం..! నాడు సంస్కరణల పథం.. నేడు నిర్వీర్యం..! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక విప్లవంలా విద్యారంగాన్ని ముందుకుతీసుకెళ్లగా... టీడీపీ కూటమి సర్కారు అంతా కుప్పకూల్చింది..! పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తపించగా.. ప్రైవేటుమయం చేయాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి.. సర్కారీ చదువులు చట్టుబండలవుతున్నాయి..! అమ్మ ఒడికి వీడ్కోలు పలికారు...ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడారు... డిజిటల్ క్లాస్‌రూమ్‌కు బైబై అన్నారు... టోఫెల్ క్లాసులకు టాటా చెప్పారు...సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేశారు... గోరుముద్దను ఘోరంగా మార్చారు... ఆసాంతం విద్యా వ్యవస్థను నీరుగార్చారు... ఫలితం... ఫలితాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు. ⇒ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో... వైఎస్ జగన్ పాలనలో సమూల విద్యా సంస్కరణలు ఉద్యమంలా సాగాయి. నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విలసిల్లాయి. సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టేంత వరకు వెళ్లాయి. కానీ, కూటమి పాలనలో సంస్కరణలు నిలిచిపోయి.. సంక్షేమ పథకాలు అమలు కాక.. పరిస్థితులు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి : సంవత్సరం క్రితం వరకు ఎంతో గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో మనబడి నాడు–నేడు పనులతో సకల సదుపాయాలతో వెలుగొందిన బడులు ఇప్పుడు జీవం కోల్పోయాయి. రికార్డు వ్యవధిలో ఫలితాలు అంటూ.. ఘనంగా చెప్పుకొన్న పదో తరగతి ఫలితాల్లోనే కూటమి సర్కారు డొల్లతనం బయటపడింది. మోడల్ స్కూళ్ల పేరుతో వందల ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంతోనే పనితీరు తేటతెల్లమైంది. సర్కారీ బడుల్లో ప్రమాణాలు పెంచే పనులను పక్కనపెట్టడంతోనే.. చంద్రబాబు ప్రభుత్వానిది ప్రైవేటు మోజు అని స్పష్టమైంది. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది ఫీజులను భారీగా పెంచేశాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. సగటున ఒక్కో స్కూల్లో 10 నుంచి 30 శాతంపైగా ఫీజులు పెంచేశాయి. వీటికి పుస్తకాలు, యూనిపారం ఖర్చులు అదనం. ప్రైవేటులో ఫీజులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నది లేదు. పిల్లల చదువులు భారంగా మారడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. –2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఈ ఏడాది అధిక శాతం ప్రైవేటు విద్యార్థులే ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ‘షైనింగ్ స్టార్’ అవార్డులు వారికే దక్కాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో అమలు నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్ జగన్ పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు విద్యార్థుల యూనిఫాం సైతం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి ఎంపిక నేడు నిలిచిపోయిన సంస్కరణలు.. అమలు కాని పథకాలు వైఎస్సార్సీపీ పాలనకు, ఇప్పటికీ పూర్తి భిన్నంగా పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలే మేలంటూ.. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కూటమి వచ్చిందే తడవుగా.. అప్పటిదాకా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను నిలిపివేసింది. పథకాలకు పేర్లు మార్చింది. విద్యా కానుక తప్ప ఇతర అన్నింటినీ రద్దు చేసింది. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు అందజేసిన ‘జగనన్న గోరుముద్ద’ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చిందేగాని నాణ్యతను గాలికి వదిలేసింది. దీంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. ⇒ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్ల ఖర్చుతో ప్రయోగాలు చేసిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. ⇒ ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఏడాదిగా ఎగ్గొట్టింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. 20 వేల పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి, 4 వేల స్కూళ్లలో పూర్తిచేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది. ⇒ గత ఏడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి ప్రాథమికోన్నత స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా సంవత్సరంలో దాదాపు 9 నెలలపాటు ఉపాధ్యాయుల సర్దు బాటు తోనే కాలంవెళ్లదీసి బోధనను బలహీనం చేసింది. ⇒ ప్రమాణాల మెరుగు కోసం 3–5 తరగతుల విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన సబ్జెక్టు టీచర్ చదువులను సైతం కూటమి సర్కారు రద్దు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను కూటమి వచ్చాక ఎత్తివేశారు. ⇒ పేద విద్యార్థుల కోసం తెచ్చిన టోఫెల్, అంతర్జాతీయ ఐబీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. డిజిటల్ క్లాస్రూమ్ కాన్సెప్‌్టను పక్కనపెట్టింది.టెన్త్ పరీక్షల్లో ఘోరంగా ‘ఫెయిల్’పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం... ఆపై ఫలితాల వెల్లడిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర వైఫల్యం..! ఇదీ 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు... ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిలైందో చెప్పేందుకు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనిది... కూటమి ప్రభుత్వంలో ప్రశ్నపత్రం లీక్ కావడం ఒకప్పటి టీడీపీ పాలనను గుర్తు చేసింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, రికార్డు కక్కుర్తిలో తక్కువ రోజుల్లోనే ఫలితాల ప్రకటనతో తప్పిదాలు జరిగాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఏకంగా 66 వేల దరఖాస్తులు అందాయి. పునః పరిశీలనలోనూ మళ్లీ తప్పులు జరిగాయి.నాడు నో వేకెన్సీ బోర్డులు.. నేడు సర్కారు బడికి రాంరాంచక్కగా సాగుతున్న సంస్కరణలను పక్కకుపెట్టి... సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కూటమి.. ప్రభుత్వ విద్యలో ప్రయోగాలు చేస్తూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ప్రజలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా ఇదే మేలంటూ పాఠశాల విద్యను అంధకారంలోకి నెట్టేసింది. గత ఏడాది ప్రభుత్వ చర్యలతో ఏకంగా 4 లక్షల మందిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని ముఖ్యమంత్రికే జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని.. ఇదే విధానాలు కొనసాగితే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్సీపీ పాలనలోని పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. నాడు చేపట్టిన విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. విద్యార్థులతో కిటకిటలాడాయని పేర్కొంటున్నారు. ‘‘మా పాఠశాలలో సీట్లు లేవు’’ అంటూ గేట్లకు నో వేకెన్సీ బోర్డులు కూడా పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల యూనిఫాంను స్వయంగా పరిశీలించి ఎంపిక చేసిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.విద్యార్థుల ప్రైవేటు బాట... ఫీజుల బాదుడు బాధకూటమి ప్రభుత్వ విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. దొరికిందే చాన్సుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచేశాయి. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతినిచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. వ్యవసాయ కుటుంబాలు, మధ్య తరగతి వర్గాల పిల్లలను చదివించే సెమీ కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతికి రూ.25 వేల నుంచి రూ.38 వేలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతున్నాయి. పిల్లల చదువులతో ఆర్థిక కష్టాలు ఎలక్ట్రీషియన్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 5వ తరగతికి వచ్చారు. ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నా. ఏడాదికి రూ.50 వేలు ఖర్చవుతున్నాయి. పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫాం, బ్యాగ్‌లు, బూట్లు, సాక్సులు వంటి సామగ్రి కొనుగోలు భారంగా మారింది. ఫీజులను ఇష్టారాజ్యం పెంచుకుంటూ పోతున్నారు. –షేక్ బాజీ, గుంటూరుచదువు భారంగా మారుతోంది నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్దబ్బాయి హాలహర్విలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి రూ.20 వేలు ఫీజు చెల్లించాలి. ఫీజుతోపాటు బుక్స్, యూనిఫాం, షూకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. మాకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లల చదువుకు, వ్యవసాయానికి ఏటా రూ.50వేలు అప్పు చేయాల్సిన దుస్థితి. – గాదిలింగప్ప, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా -
కార్మికులపై సవరణ కత్తి
సాక్షి, అమరావతి: శ్రమ దోపిడీకి ఆస్కారం ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు కూటమి సర్కారు కుట్రపన్నుతోంది. ఇప్పటికే పని వేళలను పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కర్కశ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సంస్థల్లో పనిచేసే చిరుజీవుల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. చిన్న వాణిజ్య సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, వాచ్మెన్లు, ఇతర చిరుద్యోగుల హక్కులు కాపాడే ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధమైంది. 20 మందిలోపు సిబ్బంది ఉండే సంస్థలపై కార్మిక శాఖ జోక్యం లేకుండా చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. ఇవి వచ్చే కేబినెట్ భేటీలో మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యజమానే డిక్లరేషన్ ఇస్తే చాలటరాష్ట్రంలో ఒకటి నుంచి 20 మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు 3.50 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిల్లో 30 లక్షల మంది కార్మికులు, చిరుద్యోగులు పనిచేస్తుంటారు. ఈ సంస్థలు ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–1988 మార్గదర్శకాలు పాటించాలి. ఈ చట్టం ప్రకారం.. ఎప్పటికప్పుడు కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై కేసుల నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే 20 మంది లోపు సిబ్బందితో నడిచే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిప్రకారం.. అన్ని నిబంధనలూ సక్రమంగా పాటిస్తున్నామని యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు.. ఆ సంస్థలలో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు. దాదాపు 12 గంటలు పనిచేయిస్తున్న సంస్థలు ఇప్పటికే చిన్న సంస్థల యజమానులు శ్రామికుల చేత 12 గంటలకుపైగా పనిచేయిస్తున్నారు. ఉదయం పది గంటలకు దుకాణానికి వెళితే రాత్రి పదిగంటల తర్వాత కూడా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. కార్మిక శాఖ ఏడాది పొడవునా ఈ దుకాణాలను తనిఖీ చేసి నియంత్రిస్తున్నా.. యజమానులు లెక్కచేయని దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే కార్మిక శాఖ పరిధి నుంచి వాటిని మినహాయిస్తే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎంత భయానకంగా ఉంటుందోనని శ్రామికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పని గంటలు పెంపుఓ వైపు పని వేళలు తగ్గించాలని కార్మిక వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంటే దీనికి భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణను సాకుగా చూపి పని వేళలను గరిష్టంగా 9 నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్రైమాసిక కాలానికి ఓవర్ టైమ్ 75 గంటల నుంచి 144 గంటలకు పెరిగాయి. ఈ పెంపు వల్ల ఎక్కువ సంపాదించవచ్చని సర్కారు వక్రభాష్యం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస వేతనాలే అమలు కావడం లేదన్న సత్యాన్ని ఉద్దేశపూర్వంగా విస్మరిస్తోంది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్– 1988 చట్టం ఏం చెబుతోందంటే..» ఒక వర్కర్‌ను సంస్థలో చేర్చుకునేప్పుడు నియామక పత్రం ఇవ్వాలి.» ఉద్యోగి అటెండెన్స్ రిజిçష్ట్టర్ను నిర్వహించాలి. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతనం చెల్లించాలి.» ఏటా 12 రోజులు క్యాజువల్ లీవ్స్, 9 పండుగ సెలవులు ఇవ్వాలి. వీక్లీ ఆఫ్ అమలు చేయాలి. » వర్కర్‌కు మధ్యలో డబ్బు అవసరం అయితే ఇవ్వడానికి వీలుగా అడ్వాన్స్ రిజిస్టర్ పెట్టాలి.» ఉద్యోగంలో నుంచి తీసి వేయడానికి నెల ముందు నోటీస్ ఇవ్వాలి.» 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్టయితే నెల వేతనం ఏటా బోనస్ కింద ఇవ్వాలి. కనీస వేతనాల చట్టం అమలు, స్త్రీ, పురుషులకు సమాన వేతనం పాటించాలి. » కార్మిక శాఖ సాధారణ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయడానికి వీలుంటుంది. కనీస వేతనాలు ఇవ్వలేదని తేలితే యజమాని నుంచి రికవరీ చేయచ్చు.చట్ట సవరణ చేస్తే.. » చట్ట సవరణ అయితే ఎవరైనా శ్రామికుడు ఫిర్యాదు చేస్తే తప్ప కార్మిక శాఖ చిన్న సంస్థలపై జోక్యం చేసుకోరాదు. దీనివల్ల ఇప్పుడు ఉన్న హక్కులన్నింటినీ కార్మికుడు కోల్పోయే ప్రమాదం ఉంది. యజమాని సెల్ఫ్ డిక్లరేషన్‌లో అసత్యాలు పేర్కొనే ఆస్కారమూ ఉంది. -
యాంత్రీకరణ విఫలం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఘోరంగా విఫలమైంది. అవసరం లేని పరికరాలను బలవంతంగా అంటగట్టాలని చూడటంతో ఈ పథకం కింద పరికరాలు తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా ఆ పరికరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే బహిరంగ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండడం, జీఎస్టీతో పాటు రవాణా భారంగా మారడం, రాయితీ తక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రాలేదు. దీంతో అర్ధాంతరంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అంతన్నారు.. ఇంతన్నారుకూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు చేయబోతున్నామని గొప్పగా ప్రకటించారు. కేంద్ర పథకమైన స్మామ్ (సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీపై 42,864 పరికరాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.75.80 కోట్లు కేటాయించింది.మార్కెట్ ధరలకు మించి ఉండటంతో..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు కమిటీలు తాము కోరుకున్న పరికరాన్ని కోరుకున్న కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. పైగా బేరమాడుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్దేశించింది. ఈ ధరలకు అదనంగా ప్రతి పరికరంపై 12% నుంచి 18% జీఎస్టీతో పాటు.. 2% ఆగ్రోస్ సేవా చార్జీలు చెల్లించాలని నిర్దేశించారు. అంటే దాదాపు పరికరంపై ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 14% నుంచి 20% వరకు అదనపు భారం పడుతోంది. అంటే ఓ పరికరం ధర రూ.25 వేలు అయితే.. కనీస జీఎస్టీ, ఆగ్రోస్ రుసుం కలిపి 14% చొప్పున లెక్కేసినా రూ.3,500, అదే రూ.లక్ష విలువైన పరికరమైతే రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే రైతు నేరుగా కొనుక్కుంటే డీలర్ల వద్ద బేరమాడుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది. తైవాన్ స్ప్రేయర్ బహిరంగ మార్కెట్లో రూ.18 వేల నుంచి రూ.20 వేలకు లభిస్తుండగా, యాంత్రీకరణ పథకంలో రూ.26 వేలుగా నిర్ణయించి, అందులో రూ.10 వేల రాయితీ ప్రకటించారు. దీనిపై జీఎస్టీ, వ్యవసాయ ఆగ్రోస్ సేవా చార్జీలు అదనం. ట్రాక్టర్ ఆధారిత యంత్ర పరికరాలు కూడా రైతులు సొంతంగా కొనుక్కుంటేనే తక్కువకు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కూడా రైతులకు ప్రతిబంధకంగా మారాయి.కవీుషన్లకు కక్కుర్తిపడి రైతులకు అవసరం లేని, డిమాండ్ లేని, పనికి రాని పరికరాలను అంటగట్టాలని చూడటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా వ్యక్తిగత పరికరాలు సబ్సిడీపై ఇస్తామంటే రైతులెవరైనా ఎగబడతారు. అలాంటిది రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ యాంత్రీకరణ పథకం ఏడాదిలోనే అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో చాలావరకు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టినట్టు విమర్శలు వచ్చాయి. దీంతో పథకాన్ని 2024–25 ఏడాదికి అర్థంతరంగా నిలిపివేశారు. -
కొండపై విష‘నాగులు’
నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్‌ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్ఫోర్స్గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టార్‌కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్‌ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్ లేటరైట్..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ (ఉన్నత శ్రేణి) లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్ అనేది ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్‌కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్‌ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్‌ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్‌లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్‌ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్‌ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. -
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది.కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరుగత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు ఏలూరు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తగ్గిన కొనుగోలు శక్తి మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అప్పులతో ఇబ్బందులు గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి , గృహిణి అవస్థలు పడుతున్నాం కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం. – పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. – కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలంపథకాలన్నీ ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి. – నల్గొండ నాంచారమ్మ, మండవల్లి -
బాబు 'సూపర్ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలను అందజేశారు. ‘సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్‌బుక్‌తో టెర్రర్ సృష్టిస్తున్నావు.. ఇక చాలు మీ నిర్వాకం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల డ్రైవర్లు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. ఆ పిలుపే ప్రభంజనమై.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగన్ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహించిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయడానికి కుట్రలు చేసింది. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్ బుక్‌తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. గుంతకల్లు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉసిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు. -
డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి ప్రకటించిన డీఎస్సీ పరీక్షలు ఉపాధ్యాయ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తిగాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది నమ్మి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులను షాక్‌కు గురిచేస్తూ మరుసటి రోజే మెయిన్స్ నిర్వహించారు. దీంతో వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కూటమి సర్కారు డీఎస్సీ పరీక్షలకూ అనుసరించింది. దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది సిలబస్ పూర్తిగాక, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన 6100 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మెగా డీఎస్సీ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు హామీ ఇచ్చింది. అలాగే సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్‌పై చేశారు. అంతేగాక, వెంటనే నోటిఫకేషన్ ఇచ్చి డిసెంబర్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపై వాయిదాలతో సుమారు ఏడాదిదాకా సాగదీశారు. అంధకారంలోకి అభ్యర్థుల జీవితాలు ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. ప్రధానంగా 50 శాతం అర్హత మార్కుల నిబంధన విధించి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను నిర్దయగా కోల్పోయేలా చేసింది. 50 శాతం మార్కుల అర్హత పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు.టెట్ అర్హత మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే వరుసలో ఉన్న జనరల్ అభ్యర్థుల అర్హత కనీసం మార్కులను మాత్రం 50 శాతం అలాగే ఉంచారు. వాస్తవానికి టెట్‌కు జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆమేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌ను, ఆశలను అంధకారంలోకి ప్రభుత్వం నెట్టేసింది.గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలకు ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డీఎస్సీ–2025లోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపుర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. టెట్ రాసేటప్పుడే ఈ నిబంధన విధించి ఉంటే సమస్య ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్‌ను నాశనం చేసిందని వాపోతున్నారు. ప్రణాళికాబద్ధంగా మోసంప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేస్తామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ నెలలో ప్రకటించింది. అనంతరం అదే సమయంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని జూలై నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రచారం చేశారు. దీనిప్రకారం ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ రావాలి. తర్వాత టెట్‌కు, డీఎస్సీకి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన టెట్ ను అక్టోబరులో జరిపిన ఫలితాలను ప్రకటించారు. టెట్ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి. కానీ తొలుత నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తర్వాత 6వ తేదీన నోటిఫికేషన్ అన్నారు. ఆరు నెలలుగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. నోటిఫికేషన్ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. -
కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం 'కాపులు కరివేపాకులా'?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కక్ష సాధింపులో వారినీ టార్గెట్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నరీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తమను కూరలో కరివేపాకులా తీసిపారేయడం మాత్రమే కాదు.. ఏకంగా అక్రమ కేసులు పెట్టి వేధించే కుట్రకు తెగబడటంపై ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టివేసినా సరే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాటిని తిరగదోడాలని నిర్ణయించడం.. పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించడం కాపు సామాజికవర్గాన్ని షాక్‌కు గురి చేసింది. ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రస్తుతం అధికారంలోకి రాగానే తన అసలు నైజాన్ని చూపించారని కాపు సామాజికవర్గం దుయ్యబడుతోంది. కక్ష సాధింపు కోసం చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిన ఈ దుష్ట సంప్రదాయం రాష్ట్ర రాజకీయాలను మరింత కలుషితం చేయడమే కాకుండా రాష్ట్రంలో వర్గ వైషమ్యాలు రేకెత్తించే ప్రమాదం ఉందని కూడా పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరోసారి గురయ్యామని కాపు సామాజికవర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేపడితే 2016లో అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కేసులను న్యాయస్థానాలే తోసిపుచ్చడంతో కాపులకు ఊరట లభించింది. కాగా 2024 ఎన్నికల్లో మరోసారి కాపులను మాయమాటలతో చంద్రబాబు కనికట్టు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 2016 నాటి కేసును తిరగదోడి కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం తెగబడటం గమనార్హం. గతంలో చేసిన మోసానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించామని, ఈసారి చేస్తున్న మోసానికి కూడా అదే రీతిలో శిక్షిస్తామని కాపు సామాజికవర్గం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడతామని... తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు మరోసారి రుచి చూపిస్తామని చెబుతోంది. హామీని నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం 2014 టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమను ఓబీసీల్లో చేర్చాలంటూ కాపులందరూ కూడా 2016 జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా, తునిలో ‘కాపు గర్జన’ పేరుతో సభను ఏర్పాటు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమంలో వేల మంది కాపులు పాల్గొన్నారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొందరు గుర్తు తెలియని విద్రోహులు అందులో చేరి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులు ఆందోళనకారులపై 329 కేసులు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో కాపులపై కేసులు పెట్టారు. అయితే కాపులు కేసులకు భయపడకుండా ఆ తరువాత కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కాపు ఉద్యమకారులపై గతంలో పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులను ఉపసంహరించుకున్నారు. కొన్ని కేసుల్లో విజయవాడ కోర్టు 2023లో ఉద్యమకారులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.కాపు సామాజికవర్గమే లక్ష్యంగా కుట్రఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వంరాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కాపులు 2016లో చేపట్టిన ఆందోళనకారులపై అప్పట్లో కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి ఆ ఉద్యమకారులను జైలు పాల్జేయడానికి కంకణం కట్టుకుంది. కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టినందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కేసులు నమోదు చేసింది. మొత్తం 329 కేసులు పెట్టింది. ఇందులో పలు కేసులను ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించింది. మరికొన్ని కేసులపై విచారణ జరిపిన విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభంతోపాటు 41 మందిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఆ మేర 2023 మే 1న తీర్పు వెలువరించింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ కేసులను తిరగదోడుతోంది. కాపు ఉద్యమకారులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కి అనుమతినిచ్చింది. విజయవాడ రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం జీవో 852 జారీ చేశారు. చంద్రబాబు కాపు వ్యతిరేకిసీఎం చంద్రబాబు కాపు వ్యతిరేకి. కాపులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కోర్టు కొట్టేసిన కేసుపై పునర్విచారణకు వెళ్లాలని చూస్తున్నారు. అన్యాయంగా కాపు జాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు. తగిన గుణపాఠం చెబుతాం.– చినమిల్లి వెంకటరాయుడు, కాపునాడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుకాపులను ఇబ్బంది పెడితే సహించం..గత ప్రభుత్వంలో రైలు దగ్థం కేసులో కాపులపై పెట్టిన కేసులు కొట్టేస్తే.. ఈ ప్రభుత్వం వాటిని తిరగదోడి కాపులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపులపై కేసులు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే సీట్లు తగ్గించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం కాపులపై వివక్ష చూపడం సమంజసం కాదు. – సంకటి లక్ష్మణరావు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులుకేసు తిరగదోడటం మంచి పద్ధతి కాదు..కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణిస్తున్నాం. రైలు ప్రమాద ఘటన అనేది ముగిసిన అధ్యాయం. తిరిగి ఆ కేసును రీ ఓపెన్ చేయడం బాధాకరం. కాపులమంతా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇది కాపు జాతి మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తాం. – బండి శ్రీనివాసరావు, కాపు సామాజికవర్గ ఐక్యవేదిక నాయకుడు, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా కాపుల జోలికొస్తే సర్కారు పతనమే..తుని కేసును పునర్విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపుల కారణంగానే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. అది మరిచిపోయి కాపు జాతిపై కక్ష సాధింపునకు పాల్పడితే చంద్రబాబు సర్కారుకు పతనమే.– తోట రాజీవ్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్రంగా కేసును ముందు పునర్విచారణ చేయాలి..గతంలో కాపులను టీడీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధించింది. కాపులను అణచివేసే ప్రయత్నం చేసింది. అక్రమ కేసులు బనాయించింది. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేసింది. కాపులే లక్ష్యంగా ఆ కేసును పునర్విచారించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. కాపులను వేధింపులకు గురిచేస్తే సహించేదిలేదు. పాత కేసులు పునర్విచారణ చేయించాలనుకుంటే ముందుగా వంగవీటి మోహన్‌రంగా హత్య కేసును పునర్విచారణ జరపాలి.– యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘంఇలాగైతే బలిజలు కూటమిలో ఇమడలేరు..రెండేళ్ల క్రితం తుని ఘటనపై సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కొట్టేసిన కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావాల్సిన అవసరంలేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. బలిజలంతా కూటమిలో ఇమడలేని పరిస్థితులు తలెత్తుతాయి. – రామమూర్తి, కాపు జేఏసీ రాష్ట్ర సహ కార్యదర్శి, బీజేపీ చిత్తూరు జిల్లా నాయకుడు, చిత్తూరు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతల ఆర్తనాదాలు
-
తోతాపురి.. కొనేవారేరి..?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఏడాది మామిడి రైతుల పాలిట శాపంగా మారింది. ప్రత్యేకించి తోతాపురికి మార్కెట్లో ధర లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మామిడి 9.97 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది 45 లక్షల టన్నుల దిగుబడులొస్తాయన్నది తొలి అంచనా. అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో కనీసం 30 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తోతాపురి 1.60 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది 4 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయన్నది అంచనా. ఇందులో చిత్తూరు, తిరుపతి జిల్లా వాటానే దాదాపు 90 శాతం. ఈ జిల్లాల్లో ఈ రకం దిగుబడులు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, కొనుగోళ్లే దారుణంగా ఉన్నాయి. జూన్ ప్రారంభమైనా, ఈ రెండు జిల్లాల్లో గుజ్జు పరిశ్రమలు తోతాపురి కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే గతేడాది గుజ్జు నేటికీ అమ్ముడుపోలేదంటున్నారు. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో దాదాపు 2.74 లక్షల టన్నుల గుజ్జు నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి. అయితే ఇందులో కొంతభాగం వివిధ రూపాల్లో నష్టాలకు పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ గుజ్జు నిల్వలు 1.50 లక్షల టన్నులకు చేరాయి. ఈ నిల్వలు పూర్తిగా ఎగుమతి అయితే తప్ప కొత్తగా కొనుగోలు చేయడం, గుజ్జు రూపంలో మార్చడం చేయలేమని కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీనికితోడు గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేశారు.భవిష్యత్తుపై భయం..2023–24 సీజన్లో టన్ను రూ.25–30 వేల మధ్య పలికిన టేబుల్ (నాణ్యత) రకం తోతాపురికి గతేడాది రూ.20 వేలు పలుకగా, ఈసారి రూ.12 వేలకు మించి చెల్లించడం లేదు. కాయల సైజు, నాణ్యతను బట్టి సాధారణ కాయల ధర రూ.5 వేలకు సైతం పడిపోతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతి రకాలకూ దిక్కులేదు..ఎగుమతి రకాలకు సైతం ఈసారి ధర లేని పరిస్థితి నెలకొంది. రాయలసీమ జిల్లాల్లో తోతాపురి తర్వాత ఎక్కువగా సాగయ్యే బేనిషా రకానికి నాణ్యత ప్రాతిపదికన రూ.7 నుంచి రూ.20 వేలు, అల్ఫోన్సో, కాలేపాడు మల్లిక రకాలకు టన్నుకు రూ.20 నుంచి రూ. 30 వేల ధర పలుకుతోంది. గతంలో టన్ను రూ.లక్షకుపైగా పలికిన ఇమామ్ పసంద్‌కు సైతం ఈసారి రూ.40 వేలకు మించి ధరలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సాగులో ఉన్న బంగినపల్లి రకాల విషయంలో 2023–24లో టన్ను గరిష్టంగా రూ.50–60 వేల ధర పలికింది. గతేడాది రూ.30–35 వేలు పలుకగా, ఈసారి కేవలం రూ.15–20 వేలకు మించి పలకడం లేదు.అడిగే వారు లేరు..కొనేవారు లేరు..మాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. పులేరా (చందూర) టన్నుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు రేటు ఉంది. ఇలా ఉంటే రైతు లకు గిట్టుబాటు కాదు. తోతాపురి అడిగే వారు లేరు. చెట్లల్లో కాయలు రాలిపోయే పరిస్థితి. – కరుణాకర్ రెడ్డి, మామిడి రైతు, చిత్తూరు జిల్లాగిట్టుబాటు ధర కల్పించాలి..జిల్లా ప్రస్తుతం మామిడిపైనే ఆధారపడి ఉంది. తోతాపురికి కనీస ధర టన్నుకు రూ.15 వేలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే... మాకు ఆందోళన బాట తప్పదు. – హరిబాబు చౌదరి, రైతు నాయకుడు, చిత్తూరు జిల్లా -
కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం
సాక్షి, అమరావతి : కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంతో పాటు, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ డ్యాష్ బోర్డు ప్రకారం గతనెల 26న రాష్ట్రంలో కేవలం నాలుగు యాక్టివ్ కేసులు ఉండేవి. కానీ, ఇప్పుడు విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆదివారం నాటికి ఆ సంఖ్య 23కు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. పాజిటివ్ కేసుల్లో ఏపీ దేశంలో 12వ స్థానంలో ఉంది. అయితే, రాష్ట్రంలోనూ వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటోంది. పైగా.. నివారణ చర్యలను పూర్తిగా గాలికొదిలేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలూ నమోదవుతున్నా సర్కారులో ఎక్కడా చలనంలేదు. రాష్ట్రంలోనూ కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, ఇతర హైరిస్క్ వర్గాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నా బాబు సర్కారు ఏమీ పట్టనట్లు ఉంటోంది. వైరస్‌ను నిర్ధారించే ఆర్టిపీసీఆర్ కిట్లూ ఎక్కడా అందుబాటులో లేవు. ర్యాపిడ్ టెస్టులకు దిక్కులేదు.. ప్రాథమిక దశలోనే వైరస్ నిర్ధారణ అన్నది అత్యంత కీలకమైంది. ఇందులో భాగంగా.. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీ, యూపీహెచ్సీల స్థాయిలోనే వైరస్ లక్షణాలున్న హైరిస్క్ వర్గాల వారికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇవి నిర్వహించడంలేదు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే విజయవాడలో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలున్న హైరిస్క్ వ్యక్తులు యూపీహెచ్‌సీలను సంప్రదిస్తునా. ఒక్కరికి కూడా కోవిడ్ పరీక్షలు చేయడంలేదు. బాధితులే కరోనా టెస్ట్ చేయమని అడిగితే టెస్టింగ్ కిట్లు లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పనిసరి అయితేశ్యాంపిల్స్ తీసి సిద్ధార్థ వైద్య కళాశాలలోని ల్యాబ్‌కు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సైతం ఇదే దుస్థితి. మరోవైపు.. శ్యాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపితే ఫలితాలు రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది. అంచనా వేసే ఆలోచనేది.. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల ప్రజలు ఆ రెండు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ, విజయవాడ విమానాల్లో వివిధ రాష్ట్రాల ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం కోసమైనా.. హైరిస్క్ వర్గాల వారికి ప్రభుత్వం ర్యాండమ్‌గా పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడంలేదు. అలాగే, వైరస్ వ్యాప్తి మొదలైన నేపథ్యంలో.. రాష్ట్రంలో వైద్యశాఖ సన్నద్ధత, వనరులపై సీఎం చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలోనే వైద్యశాఖ నిమగ్నమైంది. నాటి ముందుచూపు ఇప్పుడు ఏదీ? నిజానికి.. 2020 నుంచి దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. నాటినుంచి వివిధ రూపాల్లో వ్యాప్తి కొనసాగుతునే ఉంది. అయితే, 2019 వరకు చంద్రబాబు పాలనలో ధ్వంసమైన ఆరోగ్య రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ పక్క గాడిలో పెడుతూనే మరోపక్క కోవిడ్ వైరస్ నియంత్రణకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంది. అత్యధిక స్థాయిలో కోవిడ్ పరీక్షల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కోవిడ్ కేసులు వస్తే విలేజ్ క్లినిక్స్, సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే వైద్యసేవలు అందించేలా వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. ఎప్పుడు వైరస్ వ్యాప్తి ప్రారంభమైనా వెంటనే ఫీవర్ సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, ఐసోలేషన్ చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టారు. బాధితులు తీవ్ర అనారోగ్యం పాలుకాకుండా కాపాడారు. 365 రోజులూ సచివాలయాల్లో హోం ఐసోలేషన్ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచి వైరస్ వ్యాప్తి మొదలైతే వెంటనే చర్యలు తీసుకునేలా ముందుచూపుతో వ్యవహరించారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్టడంలేదు. ఇందుకు నిదర్శనమే కోవిడ్ నివారణకు ఉద్దేశించిన నిబంధనలు ఉపసంహరించడమని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనావళి మహానాడుకు ఇబ్బందిగా మారుతుందని రోజుల వ్యవధిలోనే దానిని ఉపసంహరించడం ప్రజారోగ్యంపట్ల సర్కారు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. పరీక్షల కోసం ఎక్కడికెళ్లాలో తెలీని దుస్థితి.. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ వ్యాధుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.వైఎస్సార్సీపీ హయాంలో గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో సైతం వైరస్ ప్రాథమిక నిర్థారణ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక కిట్ల పంపిణీ చేపట్టనే లేదు. మెజారిటీ శాతం క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో కిట్లు లేవు. ముప్పు ఎక్కువగా (హైరిస్క్) ఉండే వర్గాల వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయకుండా మాత్రలు ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారు ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు. -
ఆగిన రేషన్ బండి.. నడిరోడ్డుపైకి బతుకు బండి
ప్రాణం తీసిన రేషన్రేషన్ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ మొదలైన తొలిరోజే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక అనంతపురంలో ఆదివారం లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కొద్ది రోజులు మాత్రమే బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణం వద్దకు చేరుకున్న బాధితురాలు ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలింది. సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలు, అనాలోచిత∙నిర్ణయాలు లక్షలాది మంది పేదలను మళ్లీ రోడ్డుకీడ్చాయి! ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తూ తీసుకున్న రేషన్ వాహనాల రద్దు నిర్ణయం సర్కారు అమానవీయ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వంలో పేదలు ఇంటివద్దే ఆత్మగౌరవంతో అందుకున్న రేషన్ సరుకులను డీలర్ల చేతికి అప్పగించి పంపిణీ వ్యవస్థను చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తంగా మార్చేసింది. పుట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్లపై నిరీక్షించాల్సిన దుస్థితి కల్పించింది. తమ నోటికాడ ముద్దను లాక్కోవడం మతిలేని నిర్ణయమని బియ్యం కార్డుదారులు మండిపడుతున్నారు. తిరోగమన విధానాలతో కూటమి సర్కారు అమానుషంగా వ్యవహరిస్తోందని ఆక్రోశిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను నీరుగార్చి చంద్రబాబు సర్కారు తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమటలు కక్కుతూ గంటల తరబడి క్యూలలో నిలబడ్డ రేషన్ కార్డుదారులు..! ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలుతున్న వృద్ధులు..! చిన్న పిల్లలను ఎత్తుకుని వచ్చి రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్న మహిళలు..! కిలోమీటర్ల తరబడి రేషన్ సరుకులను మోసుకుంటూ గూడేలకు వెళుతున్న గిరిజనులు..! నెత్తిపై బియ్యం మూటలతో వృద్ధుల అవస్థలు...! పనులు మానుకుని వచ్చినా సర్వర్లు పనిచేయక, సరుకుల అందక ఉసూరుమంటూ వెనుతిరుగుతున్న లబ్ధిదారులు..! మొదటి రోజే మూతపడ్డ రేషన్ షాపులు..! నానా తిప్పలు పడి దుకాణాల వద్దకు చేరుకున్న వారితో వేలి ముద్ర వేయించుకుని ఇచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపోవాలని గదమాయిస్తున్న డీలర్లు..! ఇదీ తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద కనిపించిన దుస్థితి! తూకం యంత్రాలతో పనిలేదు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో రేషన్ కోసం మండుటెండలో క్యూ కట్టిన వృద్ధులు ఈ–పోస్ మిషన్ల అనుసంధానం అసలే లేదు. ఏ రేషన్ షాపును పరిశీలించినా ఇదే దందా కనిపించింది. గత ఐదేళ్లూ పారదర్శకంగా ఇంటివద్దే అందిన సరుకుల పంపిణీని కూటమి సర్కారు రేషన్ మాఫియా చేతుల్లో పెట్టేసింది. రాజకీయ కక్షతో పేదల పొట్టగొట్టి నడిరోడ్డుకీడ్చేసింది. ఇంటివద్దే కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులను అందిస్తూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తే.. దీన్ని కాదని పచ్చ నేతల జేబులు నింపేందుకు మళ్లీ రేషన్ షాపుల ద్వారా సరఫరాను తెరపైకి తెచ్చింది. ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థ తిరోగమనంలోకి జారిపోయింది. తొలిరోజే కూటమి సర్కారు అసమర్థత, దోపిడీ విధానం బహిర్గతమయ్యాయి. పేదలకు బియ్యం అందించటానికి బదులు ‘డీబీటీ ’(డీలర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అమలు చేస్తూ ప్రజాధనాన్ని కాజేసే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో బియ్యం బస్తాలు మోసుకుని వెళ్తున్న మహిళలు పొద్దున్నే పడిగాపులు..రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టడంతో పలుచోట్ల కిక్కిరిసిపోయాయి. ఎండలో రోడ్లపై, అరుగులపై గంటల కొద్దీ నిలబడి బియ్యం కోసం అగచాట్లు పడ్డారు. ఇరుకు గదుల్లోని రేషన్ దుకాణాల వద్ద చమటలు కక్కుతూ నిరీక్షించారు. బియ్యం మూటలను నెత్తిపై మోసుకుంటూ వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం తిరిగి పనులకు వెళ్లాల్సి ఉన్నందున కార్మికులు భారీగా రేషన్ షాపుల దగ్గరకు చేరుకున్నారు. వయసు మళ్లిన వారు బియ్యాన్ని మోసుకెళ్లే శక్తి లేక, సాయం అందించే వారు కానరాక డీలర్ ఇచ్చినంత తీసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగారు.తూకానికి తూట్లు..కేంద్ర ప్రభుత్వం కార్డుదారుల్లో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కచ్చితత్వంతో కూడిన తూకం, నాణ్యమైన సరఫరా విధానం కోసం తూకం యంత్రాలు, ఈ–పోస్ మిషన్లను అనుసంధానం చేసి పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని పాటిస్తూ కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించారు. ఈ–పోస్ మిషన్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయగానే పంపిణీ చేయాల్సిన బియ్యం పరిమాణం కనిపించేది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వెంకటాపురం గ్రామంలో రేషన్ షాపు వద్ద గంటల తరబడి లబ్ధిదారుల నిరీక్షణ తూకం మిషన్‌లో సరైన పరిమాణంలో బియ్యాన్ని తూచినప్పుడే ఈ–పోస్ మిషన్ నుంచి బిల్లు జారీ అయ్యేది. తూకం మిషన్‌పై తక్కువ/ఎక్కువ పరిమాణం వేస్తే ట్రాన్సాక్షన్ నిలిచిపోయేలా చర్యలు తీసుకున్నారు. రేషన్ వాహనాల ద్వారా ఇంత పారదర్శకంగా జరిగిన సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన తొలిరోజే తూకం యంత్రాలతో పని లేకుండా మాన్యువల్‌గా ఈ–పోస్ మిషన్లలో పరిమాణాన్ని నమోదు చేయడం ద్వారా అక్రమాలకు పచ్చజెండా ఊపింది. డీలర్ ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులు నోరెత్తకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది.పది రోజుల్లో ఫినిష్..!కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలు ప్రజలకు శాపాలుగా మారాయి. రేషన్ కోసం రోడ్లపైకి రావడం పెద్ద ప్రహసనం కాగా, అది కూడా కొద్ది గంటలకే పరిమితం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోపు వస్తేనే బియ్యం దక్కే పరిస్థితి నెలకొంది. నిల్వలు అయిపోతే ఇక ఆ నెల ఖాళీ సంచితో వెనుదిరగాల్సిందే. ఇవన్నీ తొలిరోజు రేషన్ షాపులకు వెళ్లిన లబ్ధిదారులకు డీలర్లు చెప్పిన మాటలే! అంటే ప్రభుత్వం ఆయా డీలర్ల పరిధిలోని కార్డులకు తగినంత నిల్వలు సరఫరా చేయదా? లేదంటే ఐదు రోజుల ముందుగానే పంపిణీని ముగించి గుట్టు చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలించుకునే ఎత్తుగడ వేస్తున్నారా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ హయాంలో అనుభవాలను పరిశీలిస్తే వీటికి బలం చేకూరుతోంది. 2019కి ముందు రేషన్ షాపుల్లో 10వ తేదీకే బియ్యం పంపిణీ ముగిసేది. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా ఆలకించే నాథుడు ఉండేవారు కాదు. ఇప్పుడు మళ్లీ అలాంటి అరాచక పరిస్థితి పునరావృతమవుతోంది.‘‘శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల పరిధిలోని ఓ రేషన్ దుకాణంలో లబ్ధిదారులను వరుసగా కూర్చోబెట్టి వేలిముద్రలు తీసుకుని బియ్యానికి బదులు నగదు ఇచ్చి పంపించేశారు. వీరిలో అధిక శాతం వృద్ధులే. మరికొందరు మోసుకెళ్లే ఓపిక లేక డీలర్ దగ్గరే వదిలేసి ఇచ్చినంత తీసుకుని ఇంటి ముఖం పట్టారు’’ బడుగు, బలహీన వర్గాల ఉపాధికి గండి..కూటమి సర్కారు వివక్షతో రేషన్ వాహనాలను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల జీవనోపాధిని దెబ్బ తీసింది. 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ప్రభుత్వ సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం వారిని సొంతూరిలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తోడ్పాటు అందించింది. వీటిపై ఆధారపడి మరో 10 వేల మంది వరకు హెల్పర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా రేషన్ వాహనాలను రద్దు చేసి వారి జీవనోపాధికి గండి కొట్టింది.రేషన్ క్యూలో వృద్ధురాలి మృతి‘అనంత’లో విషాదం..అనంతపురం: ఇంటికే రేషన్ రద్దు నిర్ణయం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది! అనంతపురంలో రేషన్ దుకాణం వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడటంతో నీరసించిపోయిన మందల లక్ష్మీదేవి (70) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. ఆదివారం అనంతపురం హెచ్చెల్సీ కాలువ సమీపంలోని నిర్మలానంద నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. లక్ష్మీదేవి రేషన్ బియ్యం కోసం ఉదయం ఎనిమిది గంటలకు రేషన్ షాపు వద్దకు చేరుకుంది. కుమార్తె ఈశ్వరమ్మతో కలసి క్యూలైన్లో నిల్చుంది. ఎనిమిది గంటలకు ఇవ్వాల్సిన రేషన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో క్యూలో ఉన్న లక్ష్మీదేవి నీరసించి ఉదయం 9:45 గంటలకు కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పరీక్షించి చూడగా చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఇద్దరు కుమారులు గతంలో కాలువలో పడి చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటోంది. రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తారనే ఆందోళనతో క్యూలో నిలబడ్డారని, మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటలకొద్దీ నిలబడటంతో కుప్పకూలి చనిపోయారని స్థానికులు తెలిపారు.జగన్ హయాంలో నిశ్చింతగా..2014-19 మధ్య టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చే బియ్యం తినడానికి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. పురుగులు పట్టి, ముక్కిపోయి, రంగు మారి, చెత్త, రాళ్లతో అధ్వాన్నంగా ఉన్న బియ్యాన్ని పేదలు వండుకోలేక, బయట మార్కెట్లో కొనలేక నరకం అనుభవించారు. ఈ దుస్థితిని తప్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ప్రవేశపెట్టింది. అది కూడా రేషన్ వాహనాల్లో ఇంటి వద్దకే చేరవేయడంతో పేదల కష్టాలు తీరిపోయి నిశ్చింతగా వండుకున్నారు. ఫలితంగా 90 శాతానికిపైగా పంపిణీ పెరిగింది. ఇలా కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.41 చొప్పున వెచ్చించింది. అలాంటిది ఇప్పుడు డీలర్లు రూ.10 లబ్ధిదారుల చేతుల్లో పెడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నా కూటమి సర్కారు కళ్లు మూసుకుని కూర్చుంది. -
ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్‌లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్‌పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్‌లో 81, గణితంలో 86, సైన్స్‌లో 97, సోషల్‌లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు
మహారాణిపేట (విశాఖ): ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యంపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖలోని రెవెన్యూ గెస్టుహౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎంను అపాయింట్మెంటు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ కొన్నాళ్లుగా అధికారులు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. తాము పెద్దపెద్ద కోరికలు కోరట్లేదని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 వేల కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని.. అయినా ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. పీఆర్సీ, ఐఆర్, పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజు హెచ్చరించారు.పీఆర్సీకి మీనమేషాలు ఎందుకు?ఇక ఉద్యోగుల బకాయిల్లో కేవలం 10 శాతం మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వం ఇంకా నాలుగు డీఏలు బకాయిపడిందన్నారు. పీఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్లి డీఏ బకాయిలు సాధించుకున్నారని, ప్రభుత్వం మీద గౌరవంతో తాము కోర్టులకు వెళ్లడంలేదన్నారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకే ప్రభుత్వం రూ.ఆరేడు వేల కోట్లు బకాయిలు ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు మొత్తంగా రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉందని.. ఉద్యోగ ఆరోగ్య స్కీం స్కాంగా మారిందని.. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చుచేస్తే రూ.90 వేల బిల్లు మంజూరు చేశారని ఆయన అవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగా విశాఖ వచ్చినట్లు బొప్పరాజు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి కూడా వెనుకాడబోమన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి, ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎన్ రావు, అప్పలరావు, డి. వెంకట్రావు, కిరణ్‌కుమార్, రాజేష్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో(Manipur Politics) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటునకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి తోక్చోమ్ రాధేశ్యామ్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రాధేశ్యామ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు ప్రజాభీష్టం మేరకు మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసేందుకు 10 మంది ఇక్కడికి వచ్చాం. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంది’’ అని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరిందా? అనే ప్రశ్నకు రాధేశ్యామ్ సమాధానం దాటవేశారు.2023 మేలో మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలతో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 20 నెలలపాటు అవి కొనసాగాయి. ఈ అల్లర్లలో 250 మంది మరణించగా.. వేల మంది మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే.. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గుచూపింది. దీంతో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు నెగ్గింది. మొత్తం 60 సీట్లకుగానూ బార్డర్ మెజారిటీ దక్కించుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. అయితే హింస కారణంగా సీఎం రాజీనామాతో.. రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.ఇదీ చదవండి: డీఎంకే రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్ -
పప్పు బెల్లాల్లా మెడికల్ కాలేజీలు 'అమ్మబడును'!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్ జగన్ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో రూ.500 కోట్లతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చంద్రబాబు సర్కారు దీన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారుచౌకగా ఎకరం ఏడాదికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్ రేటు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.4,700 చొప్పున ప్రభుత్వం లీజుకు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేట్‌కు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ రూ.వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది! ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటుంది! కానీ కేవలం రూ.ఐదు వేలు.. పది వేల కోసం ఓ మెడికల్ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా పది కాలేజీలు!! చంద్రబాబు సర్కారు మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరం రూ.వందకే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం.. మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారు. ఈ స్కామ్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో సీఎం చంద్రబాబు తెర చాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపుగా పూరై్తన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కి అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు.. వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటినీ నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి భారీగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్లు పిలవనున్నారు.ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం..రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించనుంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. తొలి దశలో నాలుగు కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు గతేడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరకొర పనులూ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించనుంది. తొలుత 33 ఏళ్లు తర్వాత 33 ఏళ్ల పాటుఆటో రెన్యువల్ అయ్యేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం.సేవలకు డబ్బులు వసూలు..ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్–పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించారు. సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచి్చంది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేశ్ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు.తెల్ల కోటు కల ఛిద్రం..!ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెడుతూ మన విద్యార్థుల తెల్లకోటు కలను చంద్రబాబు చిదిమేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుçపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కారు కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు. -
పగడపు దిబ్బలకు ముప్పు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు తెరతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సంపద సృష్టి కోసం.. పర్యాటకం పేరుతో.. పర్యావరణంపై వేటు వేస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్లాటిపస్ ఎన్జీవో సంస్థ సముద్ర గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తోంది. మరో పదేళ్ల పాటు వాటిని సంరక్షిస్తే.. మరింత విస్తరించి.. సాగరతీర స్వచ్ఛతతో పాటు.. కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్‌స్పోర్ట్స్‌కు టెండర్లు ఆహ్వానించి విధ్వంస రచనకు సంతకం చేస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగడపుదిబ్బల రక్షణ కోసం పోరాటం కొనసాగించేందుకు ప్లాటిపస్ సంస్థ ప్రతినిధులు నడుంబిగించారు. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవని గతంలో అనేక సర్వేలు చెప్పినప్పటికీ, ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ వాదనను తప్పని నిరూపించాయి. విశాఖ సాగరతీరంలో విభిన్న రకాల కోరల్స్ (పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మంగమారిపేట ప్రాంతంలో సాగరగర్భంలో విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు అన్వేషణలో తేలింది. దీని వెనుక ప్లాటిపస్ ఫౌండేషన్ కృషి ఎంతో ఉంది. తిమ్మాపురం, రుషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగరగర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తోంది. సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటివరకు 2 లక్షల 60 వేల కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బలను సంరక్షిస్తూ వాటి అభివృద్ధి కోసం స్కూబా డైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనా ఎస్పీ, లిథోఫిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి. జీవవైవిధ్యానికి ప్రతిరూపాలుఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజాలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా వృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి.సముద్రంలోని చేపలతో పాటు 25 శాతం జీవులకు సముద్ర వర్షారణ్యాలు అని పిలిచే పగడపు దిబ్బలే ఆవాసాలు. రంగురంగుల చేపల నుంచి గంభీరమైన సముద్ర తాబేళ్ల వరకు లెక్కలేనన్ని జాతులకు ఇవి కీలకమైన ఆశ్రయం, సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారి ఆహార వనరులను అందిస్తాయి. చేపలు, మొలస్కా, ఇతర జీవజాతులు, క్రస్టేసియన్లు, స్పాంజ్లు మొదలైన సముద్ర జాతుల ఉత్పత్తి పెరిగేందుకు ఇవి అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. ‘కూటమి’కాసుల కక్కుర్తికి బలి.! తీరప్రాంత నిర్మాణాలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఇప్పటికే 33 శాతం పగడాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులు, విధ్వంసకర మానవ చర్యల వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. తీరప్రాంతాన్ని రక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్లాటిపస్ సంస్థ ఈ పగడపు దిబ్బలను సంరక్షిస్తోంది. అయితే ఇలాంటి అరుదైన ప్రాంతంపై ఇప్పుడు కొందరు కూటమి నేతల కన్ను పడింది. సంపద సృష్టి పేరుతో తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు ఆక్వా స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. వాస్తవానికి ఈ ప్రాంతం వాటర్‌స్పోర్ట్స్‌కు అనువుగా లేకపోయినా కేవలం కొన్ని సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే పర్యాటక శాఖ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం మంత్రి అండదండలున్న ఒక సంస్థ కోసం పగడపు దిబ్బలను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పగడపు దిబ్బలను సంరక్షించేందుకు ప్లాటిపస్ ఫౌండేషన్ సంస్థ పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ వద్దని, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని వారు అధికారులను కోరుతున్నారు. పదేళ్లపాటు సంరక్షించుకోవాలి కొన్ని తీర ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి ఆక్వా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కానీ అత్యంత అరుదైన, జీవవైవిధ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం మాత్రం తగదు. గత కొన్నేళ్లుగా మంగమారిపేట ప్రాంతంలో కోరల్ రీఫ్స్‌ను పెంచుతూ వస్తున్నాం. వీటిని మరో పదేళ్లపాటు సంరక్షించుకుంటే ఈ ప్రాంత సముద్ర తీరం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాం. – సుభాష్ చంద్రన్, ప్లాటిపస్ ఫౌండేషన్ ప్రతినిధి -
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ పాలన రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్ చేయించడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు.. అరెస్టులు.. వేధింపులతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రెడ్‌బుక్ కుట్రలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి తరలి వస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. ఆ మైన్‌లో క్వార్ట్జ్, పల్స్పర్, మిక్స్డ్ మైకా 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని, అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే, కూటమి పెద్దలు కాకాణిని టార్గెట్ చేసి, అక్రమంగా మైనింగ్ జరిగిందంటూ బాలాజీ నాయక్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా ఆ మైన్‌లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇచ్చిన వారిలో ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ కూడా ఉండడం విశేషం. అధికార దుర్వినియోగం జరిగిందనేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా? -
హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : హరికృష్ణకు పోలీసుల వేధింపులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు సర్కారును ఎక్స్ వేదికగా ఎండగట్టారు.‘పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు?’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని… pic.twitter.com/Zx02eOB3fz— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2025థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా?.స్వయంగా టీడీపీ నేత కారులో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు?. ఎవరి ఆదేశాలతో,ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు?. ఇది రాజ్య హింస కాదా?. ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది?. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా?. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా?. చంద్రబాబు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
సొమ్ము సర్కారుది.. సోకు కాంట్రాక్టరుది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి బరితెగించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట పర్యాటక ప్రాంతంలో 3.94 ఎకరాల్లో రూ.5.04 కోట్లతో ‘టెంట్ సిటీ’ నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే, టీడీపీ కూటమి పెద్దలకు చెందిన అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చేందుకు టెండర్ పద్ధతినే మార్చేసింది. పైకి నీతి ఆయోగ్ నమూనాను అనుసరిస్తున్నామనే రీతిలో బిల్డప్ ఇస్తూ లోపాయికారిగా నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో సదరు కాంట్రాక్టరు పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణాలు చేసుకుని వచ్చిన ఆదాయాన్ని అనుభవించేలా నిబంధనలుండటం కొసమెరుపు!ఎక్కడాలేని రీతిలో టెండర్..ఏపీటీడీసీ టెంట్ సిటీ నిర్మాణానికి పిలిచిన టెండర్లను పరిశీలిస్తే లోగుట్టు ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులతో నిర్మాణాలు చేస్తే వాటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద గుర్తిస్తారు. ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, డిజైన్లకు లోబడి నిర్మాణాలుంటే కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది. మరో పద్ధతిలో.. అప్పటికే ఉన్న ఆస్తుల నిర్వహణకు లీజు ప్రాతిపదికపైన ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కిందకి వస్తుంది. కానీ, టెంట్ సిటీకి కోసం ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో మాత్రం భూమి ప్రభుత్వానిది.. నిర్మాణ పెట్టుబడీ ప్రభుత్వానిదే.. కట్టేది కాంట్రాక్టరు. పైగా.. 33 ఏళ్ల పాటు దీనిని అనుభవించేది కూడా సదరు కాంట్రాక్టరే! దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీటీడీసీ తీసుకొచ్చిన కొత్త తరహా టెండర్ ఇది! స్థానిక టీడీపీ కూటమి ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ రంగంలోని వ్యక్తులకు ఈ టెంట్ సిటీని కట్టబెట్టేందుకు అనుభవంతో పనిలేకుండా తెలివిగా నిబంధనలు రూపొందించారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఈ టెంట్ సిటీ నిర్వహణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాతే లీజు రెంట్ పెంపు నిర్ణయం కొసమెరుపు. -
రాజ్యాంగ రక్షణలేని ‘స్థానికత’!
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తివిద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటి వరకు అమలవుతున్న 15శాతం అన్ రిజర్వ్డ్ (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి నాన్‌లోకల్ కోటా ఉండదని, 100శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్)ను సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే ఇక్కడ 15 శాతం నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. -సాక్షి, అమరావతికూటమి ప్రభుత్వ కాలయాపన..భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటానికి, ముఖ్యంగా ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో 85 శాతం సీట్లు లోకల్, 15శాతం సీట్లు అన్రిజర్వ్డ్(నాన్‌లోకల్) విద్యార్థులతో భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీ వెంకటేశ్వర(ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. ఉస్మానియా పరిధిలో నాన్ లోకల్ కింద 15శాతం ఏయూ, ఎస్వీయూ విద్యార్థులకు, ఏయూ, ఎస్వీయూ పరిధిలో 15శాతం తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దీనిని పదేళ్లు పొడిగించారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిపాటు ఐఏఎస్ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేసింది. తీరా ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు చట్టం ముందు నిలవలేని జీవోలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో అందులోని అంశాలన్నీ ఆటోమెటిక్‌గా సీజ్ అవుతాయని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీలో సవరణ చేయకుండా స్థానికత మార్పునకు చట్టంలో ఎటువంటి విలువ ఉండదని విద్యావేత్తలు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణతోనే స్థానికతకు రక్షణ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.కొన్ని కోర్సులకేనా స్థానికత..కూటమి ప్రభుత్వం స్థానికత అంశం ఉన్నత విద్యకు, అందులోనూ కొన్ని కోర్సులకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం సంప్రదాయ, సాంకేతిక వర్సిటీల్లో వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మాత్రమే నాన్‌లోకల్ కోటాను మార్పు చేస్తూ జీవోలు ఇచ్చింది. మిగిలిన ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలతో పాటు ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా రూపాంతరం చెందిన పద్మావతి, ద్రవిడియన్, ఆర్కిటెక్చర్, కస్లర్, ఉర్దూ, ఆర్జీయూకేటీ, వేదిక్ వంటి వాటిల్లో ప్రవేశాలకు నాన్‌లోకల్ కోటాను ఎలా సర్దుబాటు చేస్తారనేది వెల్లడించలేదు. దీంతో ఆయా వర్సిటీల అధికారులు అడ్మిషన్ల నిర్వహణకు తలలు పట్టుకుంటున్నారు. వీటితోపాటు విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నాన్‌లోకల్ కోటా నిర్ణయించకుండా ప్రవేశాలు చేపట్టడం అసాధ్యమని నిపుణులు చెబతున్నారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో ప్రవేశాలు జాప్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా -
కరెంటుకు కటకట్‌లే!
సాక్షి, అమరావతి: ప్రజలేమైపోయినా ప్రభుత్వానికి అక్కర్లేదు. విద్యుత్ అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులను అప్రమత్తం చేయాల్సిన మంత్రికి కనీస అవగాహన లేక ఆ పనే చేయడం లేదు. మే నెలలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లు ఉంటుందని తెలిసినా.. ఆ మేరకు విద్యుత్ సమకూర్చుకునే ప్రయత్నాలు జరగడం లేదు. విద్యుత్ లోటు ఏర్పడితే పరిస్థితి ఏమిటనే ఆలోచన చేయడం లేదు. ఫలితంగా విద్యుత్ కోతలు మొదలుపెట్టి.. దానికి ‘మెయింటెనెన్స్’ అనే పేరు తగిలించి తప్పించుకుంటున్నారు. వ్యవసాయ అవసరాలకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందిపోయి.. 7 గంటలు మించి ఇవ్వలేమంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. మరోపక్క ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు విద్యుత్ డిమాండ్ భారీగా ఉంటుందని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) హెచ్చరించడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పుడే విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేక కోతలు విధిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుత మే, వచ్చే జూన్ నెలల్లో ఇంకెంతగా బాధిస్తుందోననే ఆందోళన మొదలైంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.ఇప్పటికైనా మేలుకోండి ఈ ఏడాది మే నుంచి జూన్ మధ్య రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ఎన్ఎల్డీసీ అన్ని రాష్ట్రాలను తాజాగా హెచ్చరించింది. ఈ ఏడాది మార్చిలోనే తొలిసారిగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పుడు కూడా మన పాలకులు, అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. మే, జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా 15 గిగావాట్ల నుంచి 20 గిగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, సౌర విద్యుత్ అందుబాటులో లేని ఉదయం, రాత్రి వేళ(పీక్ అవర్స్)ల్లో అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని వెల్లడించింది. పీక్ డిమాండ్ రోజుకి 270 గిగావాట్లుగా నమోదవుతుందని ఎన్ఎల్డీసీ అంచనా వేసింది. ఇది గతేడాది 240 గిగావాట్లు మాత్రమే. అంటే 30 గిగావాట్లు ఈ ఏడాది పెరగడమనేది భారీ మార్పే. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందుబాటులో బొగ్గు, ఇతర ముడిసరుకు అందుబాటులో లేకుండాపోతుందని తెలిపింది.రాష్ట్రంలో వేధిస్తున్న విద్యుత్ కోతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించడంపై దృష్టి సారించలేదు. వేసవి ప్రారంభం నుంచీ అనధికార విద్యుత్ కోతలు మొదలుపెట్టారు. రైతులకు 9 గంటలు విద్యుత్ అందించడం లేదు. కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేమని బహిరంగంగానే చెబుతున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సబ్స్టేషన్ల వార్షిక మరమ్మతులు, విద్యుత్ లైన్ల తనిఖీలు చేపడుతున్నామంటూ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. లైన్ల మరమ్మతుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంల వారీగా నిత్యం పగలు 3 గంటలు, రాత్రి 2 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్వహణ అని చెబితే ఇక ఆ రోజంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు.బొగ్గు ఏదీ?!థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఆ మేరకు నిల్వలు ఉండటం లేదు. వీటీపీఎస్‌కు రోజుకి 41,500 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయగలం. కానీ.. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 4,13,707 మెట్రిక్ టన్నులతో 9 రోజులకు మించి విద్యుత్ ఉత్పత్తి చేయలేం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 35,760 మెట్రిక్ టన్నులు ఒక్క రోజుకు మాత్రమే సరిపోతాయి. కృష్ణపట్నంలో 1,65,181 మెట్రిక్ టన్నులతో 5 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయగలం. ఈ నిల్వలను ఇప్పటికే పెంచుకుని ఉండాల్సింది. వేసవికి ముందే ఆ పని చేయకపోవడం వల్ల ఇంకా బొగ్గు కొరత వస్తే ఈ మాత్రం నిల్వలు కూడా ఉండవు. అప్పుడు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాలి. అధిక ధర చెల్లించి విద్యుత్ కొనాలి. అందుకోసం కూడా ముందుగానే షార్ట్‌టెర్మ్ టెండర్లు దాఖలు చేయాలి. ఆ భారం తిరిగి ప్రజలపైనే చార్జీల రూపంలో పడుతుంది.ఇంకా పెరిగితే కష్టమేరాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 239.228 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన 224.509 మిలియన్ యూనిట్లతో పోల్చితే 6.56 శాతం ఎక్కువ. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను సరిపెట్టడానికి ఏపీ జెన్కో థర్మల్ నుంచి 86.275 మిలియన్ యూనిట్లను సమకూరుస్తోంది. జెన్కో హైడల్ నుంచి కేవలం 5.361 మిలియన్ యూనిట్లే వస్తోంది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు 34.174 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ ప్లాంట్లు 18.610 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ కేంద్రాలు 23.850 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు 41.069 మిలియన్ యూనిట్లు, ఇతరులు 4.279 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నారు. అయినప్పటికీ సరిపోకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి 25.610 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు డిమాండ్‌ను ఎదుర్కోవడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పీత కూడా... ప్రైవేటే!
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పీతల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ప్రైవేట్ హేచరీలు నాసిరకం వనామీ రొయ్యల సీడ్ అందించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పీతల హేచరీని అటకెక్కించి... ప్రైవేట్ హేచరీకి ఇటీవల కేబినేట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాకినాడ, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో రైతులు 2వేల ఎకరాల్లో పచ్చపీత (మండపీత– సిల్లా సెరాట) సాగు చేస్తున్నారు. ఈ పీతలకు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌లో డిమాండ్ అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పీత సైజు, బరువును బట్టి కేజీ రూ.1,100 నుంచి రూ.1,500 వరకు ఉంటోంది. స్థానికంగా రూ.600 నుంచి రూ.900 వరకు ఉంది. పచ్చ పీత సీడ్ స్థానికంగా అందుబాటులో లేదు. చెన్నైలో ఉన్న దేశంలోని ఒకే ఒక్క హేచరీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఒక్కో పీత పిల్ల ధర రూ.12 వరకు ఉండగా, రవాణా, ఎగుమతి ఖర్చులు అదనం. బుక్ చేసిన ఆరు నెలలకు పీత పిల్లలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హేచరీ ఏర్పాటుకు చర్యలుపచ్చపీత సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా కాట్రేనికోన మండలం చిర్రయానాంలో రాష్ట్రంలోనే తొలి (దేశంలో రెండోది) హేచరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో ఐదు ఎకరాల్లో పీతల హేచరీ నిర్మాణం కోసం ఎన్ఎస్డీబీ నిధులు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. పర్యావరణం, అటవీ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించింది. అప్పట్లో మూడు నుంచి ఆరు నెలల్లో పీతల హేచరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పిల్లలను స్థానిక రైతులతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. ఈ హేచరీలో ఏడాదికి 1.5 మిలియన్ పిల్లల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. కూటమి రాగానే ప్రైవేట్ దిశగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి.డోలాశంకర్ ఇటీవల జిల్లా మత్స్యశాఖ జేడీ ఎన్.శ్రీనివాస్‌తో కలిసి చిర్రయానంలో పర్యటించి పచ్చపీతల హేచరీకి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు, యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి ప్రోగ్రామ్ ప్రతినిధి డాక్టర్ సుదీప్ (ఢిల్లీ), బీఎస్ ప్రాజెక్టు స్టేట్ మేనేజర్ ఎన్.ఉషా కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రభుత్వ హేచరీ ఏర్పాటు చేస్తారని, తమ కష్టాలు తీరతాయని పీతల సాగుదారులు ఆశించారు. కానీ, గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ సేకరించిన ఐదు ఎకరాల భూమిని ఫ్లూటస్ ఆక్వా సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. పెద్దాపురానికి చెందిన ఒక టీడీపీ నేత ఒత్తిడితో ఆ స్థలంలో పీతల హేచరీ ఏర్పాటుకు ఫ్లూటస్ ఆక్వా సంస్థకు అనుతిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హేచరీ వల్ల వనామీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమకు కూడా తప్పవని పీతల సాగుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
మద్యం విధానంతో సంబంధమే లేదు
సాక్షి, అమరావతి: మద్యం విధానం రూపకల్పనలో గానీ, అమలుతో గానీ తమకు ఏమాత్రం సంబంధం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి విస్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిని విడివిడిగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు విచారించారు. చెరో 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి దీటుగా సమాధానం ఇస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చిచెప్పారు. మద్యం విధానం రూపొందించడం, అమలుతో తమకు ఏమాత్రం సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. డిస్టిలరీలతో వ్యవహారాలన్నీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులు కొందరు మీ పేర్లు చెప్పారని సిట్ అధికారులు పేర్కొనగా, తాము కూడా ఏమాత్రం సంబంధం లేనివారి పేర్లను చెబితే వారినీ నిందితులుగా చేరుస్తారా అని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించడంతో సిట్ అధికారులు మౌనం దాల్చారు. రాజ్ కేసిరెడ్డితో గానీ డిస్టిలరీల ప్రతినిధులతో గానీ తాము ఎలాంటి అధికారిక, అనధికారిక వ్యవహారాలు నిర్వహించలేదని అన్నారు. తమపై నమోదు చేసింది పూర్తిగా అక్రమ కేసని న్యాయ పోరాటం ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను గురువారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు కోరారు. -
మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎవరి కోసం ఈ ఒప్పందం?
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్: 98859 83526 -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్ కాలపరిమితి ముగిసినా రిలీవ్ చేయలేదు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిరెడ్‌బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్ కేసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. వికాట్ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్ చేసిన వికాట్.. భారతీ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్ పాడుతోంది. వైఎస్ జగన్ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్ జగన్ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్ జగన్ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్ ప్రాజెక్టులు, మీడియా, రియల్ ఎస్టేట్ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది. -
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్ఆర్) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు ‘ 98481 20105 -
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు
సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం. -
గ్రామీణ వైద్యానికి గ్రహణం
తాళం వేసి ఉన్న ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని సోమవారప్పాడు విలేజ్ క్లినిక్ ఇది. సుమారు 6 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందించేది. 340 మంది బీపీ బాధితులు, 420 మంది షుగర్ పీడితులు, మంచానికే పరిమితం అయిన ఆరుగురు రోగులు ఈ గ్రామంలో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో నిత్యం 20 మంది ఈ క్లినిక్‌కు వస్తుంటారు. కొన్నాళ్లుగా మూతబడటంతో జ్వరం, దగ్గు, బీపీ, షుగర్ సమస్యలకు మాత్రల కోసం వచ్చిన వారంతా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) గత నెలలో మొరాయించడంతో పీహెచ్సీలో పార్కింగ్‌కే పరిమితం అయింది. షెడ్యూల్ ప్రకారం అది రోజూ ఒక గ్రామానికి వెళ్లాలి. పీహెచ్సీ వైద్యుడు రోజంతా గ్రామంలోనే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందించాలి. వైద్యుడు వెళ్లేందుకు వాహనం లేకపోవడంతో పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిలిచిపోయింది. సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య రంగాన్ని అస్తవ్యస్తం చేసి పేదలకు సేవలను దూరం చేస్తోంది. ‘పీపీపీ’ పేరుతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీని బీమా విధానం అంటూ దళారుల చేతిలో పెట్టడం దాకా ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో పేదలకు వైద్య చికిత్సలు పొందడం పెనుభారంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఠంఛన్‌గా పీహెచ్సీ వైద్యులతో గ్రామాలకు వెళ్లిన 104 ఎంఎంయూలు మూలనపడ్డాయి. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నీరుగారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విలేజ్ క్లినిక్స్‌కు తాళాలు వేసి ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మొక్కుబడిగా ఫ్యామిలీ డాక్టర్.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా డాక్టర్లు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కారు ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని మొక్కుబడి తంతులా నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి 104 వాహనాల నిర్వహణను గాలికి వదిలేసింది. మందుల సరఫరా నిలిపేసింది. వాస్తవానికి పీహెచ్సీ పరిధిలోని అన్ని విలేజ్ క్లినిక్‌లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించాలి. రోజంతా గ్రామంలోనే అందుబాటులో ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీలు చూసి, మధ్యాహ్నం నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగులు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్యంపై వాకబు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారం వారం సమీక్షలు నిర్వహించేవారు ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బీపీ పరిశీలించే దిక్కులేదు.. ఒకవైపు పీహెచ్సీ వైద్యులు గ్రామాలకు రాకపోవడం.. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌లో ఉండే వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పల్లెల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విలేజ్ క్లినిక్స్‌లో సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా నియమితులైన ఈ వైద్యులు కొద్ది వారాలుగా సమ్మె బాట పట్టడంతో బీపీ, షుగర్ బాధితులు 5–10 కి.మీ. దూరంలో ఉండే పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నా సర్కారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మందులు నిల్.. జబ్బులపై ఆరా లేదు బీపీ, షుగర్, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. లేదంటే గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సచివాలయాలవారీగా బీపీ, షుగర్, ఇతర జబ్బుల బాధితుల వివరాలను నమోదు చేసి ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వైద్యుడు గ్రామానికి వెళ్లగానే యాప్‌లోని వివరాల ఆధారంగా వాకబు చేసేవారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యను గుర్తిస్తే వెంటనే పెద్దాసుపత్రికి రెఫర్ చేసి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం అస్తవ్యస్తంగా మారడంతో జబ్బుల గురించి వాకబు చేసే దిక్కు లేకుండా పోయింది. బీపీ, షుగర్, గుండె, మెదడు సంబంధిత కాంబినేషన్ మందులు 104లో అందుబాటులో ఉండటం లేదు. చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు దగ్గు, జలుబు, జ్వరం సిరప్లు ఎంఎంయూల్లో లభించడం లేదు. గత ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి విలేజ్ క్లినిక్స్‌కు 105 రకాల మందులు, 14 రకాల టెస్టింగ్ కిట్స్‌ను సరఫరా చేసింది. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులే గ్రామాలు, వార్డు స్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు పాలనలో స్పెషలిస్ట్ వైద్య సేవల ఊసే లేకుండా పోయింది. భరోసా కరువు...గత ప్రభుత్వం ‘ఆరోగ్య సురక్ష’లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాలవారీగా ఆన్లైన్లో పొందుపరిచింది. దాని ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని వైద్యులు ప్రతి నెలా క్యాన్సర్, గుండె, మెదడు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు అవసరమయ్యే ఖరీదైన మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఏపీఎంఎస్ఐడీసీ వాటిని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్శిళ్లను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి ఎలా వాడాలో వివరించేవారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మందులను గ్రామాలకు పంపడం లేదు. దీంతో వ్యాధిగ్రస్తులకు భరోసా కరువైంది. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు ఖరీదైన మందులు కొనాలంటే ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. పేద కుటుంబాలకు ఇది పెనుభారమే. మోతాదు ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడకుంటే జబ్బు ముదిరి, తిరగబెట్టి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.తాళం వేశారు.. నాకు బీపీ, షుగర్ సమస్యలున్నాయి. ఇంటి పక్కనే ఆస్పత్రి (విలేజ్ క్లినిక్) ఉండటంతో క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని మందులు వాడే దాన్ని. ఇప్పుడు విలేజ్ క్లినిక్‌కు తాళం వేశారు. – సావిత్రి, వృద్ధురాలు, సోమవారప్పాడు, ఏలూరు జిల్లాఇప్పుడే చూస్తున్నాం.. మా వీధిలో ఉండే విలేజ్ క్లినిక్‌కు తాళం వేయడంతో బీపీ చెక్ చేయించుకోవాలన్నా పీహెచ్సీ వరకూ వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఎప్పుడూ విలేజ్ క్లినిక్‌కు తాళం వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడే చూస్తున్నాం. –వెంకాయమ్మ, సోమవారప్పాడు, ఏలూరు జిల్లాఆ పద్ధతి బాగుంది... గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇంటివద్దకే వచ్చి మంచం నుంచి లేవలేని వాళ్లకు పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు. ఆ పద్ధతి బాగుంది. ఇప్పుడు ఆ విధానం సరిగా నడవడం లేదు. 104లో మందులు ఉండటం లేదు. ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. డెంగీ, మలేరియా, విష జ్వరాలు సోకుతున్నా పట్టించుకోవడం లేదు. – పెద్దన్న, కోటపాడు, నంద్యాల జిల్లా -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది. -
‘సాక్షి’పై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. -
రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యమే
సాక్షి, అమరావతి: అప్పులు మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది! ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది. తాజాగా ఏపీఎండీసీ ద్వారా జారీ చేస్తున్న ఎన్సీడీ బాండ్ల వ్యవహారంలో ఒకపక్క దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదని పేర్కొంటున్నారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కారు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతా రహస్యమే..ఎన్సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది.అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి, వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చి క్విడ్‌ప్రోకో ద్వారా లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక.కీలక సమాచారాన్ని తొక్కిపెట్టి..దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా లెక్క చేయకుండా బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈమేరకు బాండ్ల జారీ ప్రక్రియను ఏపీఎండీసీ గురువారం ప్రారంభించనుంది. ఇందుకోసం ఇటీవలే సెబీలోని ఇబీపీ (ఎలక్ట్రానిక్ బుక్ ప్రొవైడర్) ప్లాట్ఫామ్లో ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. ఈ బాండ్ల జారీలో నిబంధనలు, షరతుల గురించి తెలిపే జీఐడీ (జనరల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్), కేఐడీ (కీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్) పత్రాలను ఆ పోర్టల్‌లో పెట్టింది. అయితే బాండ్లు కొన్న వారికి ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఉంటాయనే కీలకమైన సమాచారాన్ని ఆ డాక్యుమెంట్లలో పొందుపరచలేదు.చివరి నిమిషంలో..బుధవారం సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కుల విషయాన్ని ఈబీపీ ప్లాట్ఫామ్లో పొందుపరిచారు. అదే ఈ విషయం ముందే తెలిసి ఉంటే పెద్ద ఇన్వెస్టర్లు చాలామంది ఈ బాండ్ల కోసం పోటీ పడేవారు. ఎందుకంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా తాము పెట్టిన సొమ్ముకు కచ్చితమైన భరోసా ఉంటుంది కాబట్టి. ఇది ఏ ప్రభుత్వమూ ఇవ్వని బంపర్ ఆఫర్ లాంటిది. ఏ ప్రభుత్వమైనా సరే, ఎంత అప్పు చేసినా దానికోసం ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పించదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడమే ధ్యేయంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సిద్ధమైంది. అయితే ఆ సమాచారం ఇన్వెస్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి కేవలం తమకు అనుకూలమైన వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా వ్యూహం రూపొందించింది. అంటే వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసి సెకండరీ మార్కెట్లో వాటిని ఎక్కువ వడ్డీకి అమ్ముకునే అవకాశం కల్పించింది. తద్వారా ఏపీఎండీసీ నుంచి నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తులు లాభపడతారు.సమయం ఇవ్వకుండా..నిజానికి ఈ ప్రయోజనం ప్రభుత్వానికి దక్కాలి. కానీ కుట్రపూరితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ విషయాన్ని కేవలం తమ అనుయాయులకు మాత్రమే లీక్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు తెలియనివ్వలేదు. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు వీటిని సాధారణ బాండ్లుగానే పరిగణించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ విషయం తెలిసి ఉంటే చాలామంది బిడ్డింగ్‌లో పాల్గొనేవారని నిపుణులు చెబుతున్నారు.కానీ ఇతరులు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఆ విషయాన్ని జీఐడీ, కేఐడీ డాక్యుమెంట్లలో కావాలనే పొందుపరచలేదు. ఏపీఎండీసీ ఎండీ జారీ చేసిన డాక్యుమెంట్లలో అత్యంత కీలకమైన ఈ విషయం గురించి వెల్లడించకపోవడం తెలిసి చేసిన తప్పిదంగానే కనిపిస్తోంది. ఆఖరి నిమిషాల్లో ఈ విషయాన్ని బయటపెట్టడంతో అర్హత ఉన్న ఇన్వెసర్లు బాండ్లు కొనేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇన్వెస్టర్లు బాండ్లు కొనాలంటే తమ ఇన్వెస్ట్మెంట్ కమిటీల నుంచి అనుమతి తీసుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా చివరి నిమిషంలో అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా కుట్ర పన్నారు. -
మెగా పేరుతో ఎందుకీ దగా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవానికి జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ–2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూచనలు చేసింది. ఎన్సీటీఈ 2019 నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 15లో 2007 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదన్న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇచ్చిన సవరణ జీవో నంబర్ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్లయింది. దీనిపై జనరల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్రభుత్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రే(హీ)టెక్కిన 'కరెంట్ కుంభకోణం'
సాక్షి, అమరావతి: అసలే చీకటి ఒప్పందం.. ఆపై అడ్డగోలు సమర్థన! విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కారు ఆమోద ముద్ర!! యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ నుంచి కారుచౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రూ.లక్ష కోట్ల భారమంటూ కూటమి నేతలు, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కొనేందుకు సిద్ధమై అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన–సౌర హైబ్రీడ్ ప్రాజెక్టు నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా, నాడు ఏపీఈఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపచేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల బాదుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాభేరి కార్యక్రమంలో సంతకాలను సేకరించారు. తక్కువ ధరకే రిలయన్స్ ‘బీబీబీ’.. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమరి్ధంచుకునేందుకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయతి్నంచారు. అది హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు అని.. బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ (బీబీబీ) విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ.3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకొచి్చంది. ఇదే బీబీబీ విధానంలో రోజూ నాలుగు గంటల పాటు పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్‌ను కాదని యూనిట్ రూ.4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ మీడియా దు్రష్పచారం.. రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కారుచౌకగా యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచే వచి్చంది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పిచింది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు దు్రష్పచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నిటినీ ఏపీఈఆర్సీ పటాపంచలు చేసింది. సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది. ఇప్పుడు యాక్సిస్‌కు భారీ ధర చెల్లిస్తూ టీడీపీ కూటమి సర్కారు చేసుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా కిమ్మనకపోవడం గమనార్హం. -
కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్‌మార్కు డైవర్షన్ కుట్రకు మరింత పదును పెడుతుండగా... అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్ర కథను రక్తి కట్టించేందుకు యతి్నస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ.. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లోమీడియా ద్వారా దు్రష్పచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్‌లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచి్చనప్పటి నుంచి దీన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయతి్నస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సీఐడీకి అప్పగించిన చంద్రబాబు సర్కారు.. మూడు నెలలు విచారణ అనంతరం సీఐడీ చేతులెత్తేయడంతో సిట్ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సిట్ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్ రిపోర్టుల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయాలను చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులివ్వడం సిట్ బరితెగింపునకు పరాకాష్ట. ఏది నిజం ?ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి.. తమవారికే దుకాణాలు కట్టబెట్టి.. బెల్టు షాపులకు గేట్లెత్తి.. ఇలా మద్యంలో అన్నివిధాల అడ్డగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ.. మరోవైపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వీరంగం వేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికోసం వీర విధేయ అధికారులతో సిట్ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. రిమాండ్ రిపోర్టుల పేరుతో కట్టు కథలు అల్లుతోంది.మద్యం దందాకు మార్గాలుగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బెల్ట్ దుకాణాలు తొలగించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టిలరీకి, మద్యం బ్రాండ్లకు అనుమతినివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే. మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీ మద్యం నియంత్రణ విధానాన్నిసమర్థంగా అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మరి మద్యం అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు ఎందుకు ఇస్తారు... ఇవ్వరు కదా అన్నది ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానమే. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. అందుకే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రభుత్వ మద్యం విధానాలపై సహేతుక విశ్లేషణ ఇదీ...కుంభకోణం కాదు ఇదీ అసలు కోణం ఎవరి పాలనలో ఏం జరిగిందో నిగ్గు తేల్చేదే ఈ కథనంసిండికేటు కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా?2014–19 మధ్యన, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్ నెలకొంది. తమ పార్టీ నేతలకే దుకాణాల లైసెన్సులు కేటాయించారు. మద్యంలో లంచాలు తీసుకోవాలి అని అనుకుంటేనే ప్రైవేటు దుకాణాలు కేటాయిస్తారు. ఇక అప్పుడూ ఇప్పుడూ భారీగా అమ్మకాల టార్గెట్ ఉండనే ఉంది. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజును తగ్గించారు. ఈ సమయంలో ప్రభుత్వ హయాంలో 4,380 ప్రైవేటు దుకాణాలు, వీటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లు ఉండేవి. నాడు 43 వేల బెల్ట్ దుకాణాలు కూడా నడిచాయి. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటు మద్యం సిండికేట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ కూటమి నేతలకే 3,394 దుకాణాలను కేటాయించింది. 55 వేల నుంచి 60 వేల బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2,934 దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించింది. నిర్దిష్ట వేళలతో అమ్మకాలను కూడా కట్టడి చేసింది. పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. బెల్టు షాపులు అనే మాటే లేకుండా చేసి దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేసింది.రూ.120ది నాసిరకమా? రూ.99 నాసిరకమావైఎస్సార్‌సీపీ ప్రభుత్వలో క్వార్టర్ బాటిల్‌కు రూ.120 కనీస ధరగా ఉంటేనే నాసిరకం మద్యం అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. అందుకోసం చెన్నైకు చెందిన ఓ ల్యాబ్ పేరుతో తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. కానీ, అలాంటి నివేదికను తాము ఇవ్వలేదని ఆ ల్యాబ్ ఖండించింది. ఇక ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయిస్తున్నారు.క్వార్టర్ రూ.99కే వచ్చేది నాసిరకం మద్యమా? రూ.120కి అమ్మేది నాసిరకం మద్యమా??వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపితే స్కాం అంటున్నారు..? మరి నాడు, నేడు రాష్ట్రమంతా టీడీపీ నాయకులు సిండికేటు కట్టి దుకాణాలు నడిపిస్తున్నారు. టీడీపీ నేతలకు దుకాణాలు, బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌ల తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు పాలనలో స్కాంలకు అవకాశం ఉందా? ఇవేవీ లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుంభకోణానికి ఆస్కారం ఉందా?అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా??మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే అంతగా కమీషన్లు వస్తాయి. అదే టీడీపీ విధానంగానూ మారింది. అందుకనే 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించింది. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించింది. దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరిచింది.మరి ఎవరి హయాంలో స్కాంలకు అవకాశం ఉంటుంది. లావాదేవీలు పెరిగి.. డబ్బు చేతులు మారే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా?పాపాల పుట్టలు డిస్టిలరీలు పుట్టింది ఎవరి పాలనలో...?మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల మసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతినిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవులు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు.కాగా, డిస్టిలరీలకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి.. బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లు ఎంప్యానెల్ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే.డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే అయితే అవినీతికి పాల్పడిందీ వారే అవుతారు కదా..? మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసే కదా??బెల్టు షాపులు లేకుండా చేస్తే స్కాం ఎలా?అసలు డిస్టిలరీలు ఎప్పుడు కమీషన్లు ఇస్తాయన్నది కీలకం. మద్యం అమ్మకాలు పెరిగినకొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి విక్రయాలు పెంచితే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీగా సాగగా... అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ పెద్దలకే అన్నది సుస్పష్టం.ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు?మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.తమవారికి దోచించి ఎవరు?2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.సగంపైగా మద్యం కొనుగోలు జరిగిన చంద్రబాబు జమానాలో అవినీతి ఉంటుందా..? అందరికీ ఆర్డర్లు వచ్చేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుంటుందా??‘ప్రివిలేజ్’గా సిండికేట్‌తో ఖజానాకు గండి కొట్టింది ఎవరు?మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టింది ఎవరు? తమవారికి అడ్డగోలుగా దోచిపెట్టింది ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేయాలి??నాడు... కుంభకోణం బహిర్గతంనేడు.. లేని కుంభకోణం ఉన్నట్టు చూపే కుతంత్రం2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ దుకాణాలు, ప్రివిలేజ్ ఫీజు మాఫీ.. ఇలా అన్నీ అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా దీనిని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సీఐడీ పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు ముఠాపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .చట్టాన్ని సిట్ ఉల్లంఘిస్తోంది!?డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేశారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్నా డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్ అధికారులు కిడ్నాప్ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసు శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్ర బయటపడింది. రెడ్‌బుక్ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.విచారణ పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ, బలవంతంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, వయో వృద్ధులమైన తాము శారీరకంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టులో మొర పెట్టుకున్నారు. వీరి పిటిషన్లపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. సిట్ అధికారులకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. డిస్టిలరీల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నివాసాలలోనే విచారించాలని ఆదేశించింది.నిజంగా స్కాం జరిగితే బెదిరింపులు ఎందుకు?బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీల ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో సిట్ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ఇతర నిందితులు, సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు సిట్ అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.అసలు జరగని మద్యం కుంభకోణంలో.. పొలిటికల్ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా సిట్ పనిచేస్తోందా? నిజంగానే స్కాం జరిగితే ఈ వేధింపులు ఎందుకు? అంటే కేసులో బలం లేదు కాబట్టే టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచార కుట్రలకు పాల్పడుతోంది.ఏది స్కాం..? ఎందుకిస్తారు లంచాలు?⇒ మద్యం అమ్మకాలు కోట్ల కేసుల కొద్దీ పెరిగింది టీడీపీ హయాంలోనే..! –మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మించినందుకు వారికే కదా లంచాలు రావాల్సింది? వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు పడిపోయాయి (పట్టిక చూడండి). మరి విక్రయాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?⇒ టీడీపీ గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ..అవి కూడా టీడీపీవారికి సంబంధించినవే. బెల్టు షాపులూ ఊరూరా వెలిశాయి.⇒ మరి..ప్రైవేటుగా మద్యం విక్రయిస్తే స్కాంకు అవకాశం ఉంటుందా..? లేక నేరుగా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే స్కాం జరుగుతుందా?⇒ తెల్లవారుతూనే తూగేలా చేస్తూ.. అర్ధరాత్రి దాకా ఎక్కువ సమయం అమ్మకాలు సాగించేలా చూస్తే లంచాలు ఇస్తారా?⇒ విక్రయ వేళలను కుదించేసి, అమ్మకాలను పరిమితం చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలను పెంచితే లంచాలకు అవకాశం ఉంటుందా? వాటికి తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా..? మరి దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?.. బెల్టు షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఎంపిక చేసుకున్న 4–5 డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లలో 53 శాతం వరకు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యంపై తక్కువ ట్సాక్స్‌తో ఎక్కువ అమ్మకాలు చేసేలా మేలు చేస్తే లంచాలు వస్తాయా?⇒ మరి..అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? ట్యాక్స్‌లు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక శాతం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ⇒ లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు ఇస్తారా..?మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుంది?..ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతోనే! ..అమ్మకాల్లో ఎప్పుడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుంది?..తమవారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటేనే!అందులోనూ నిలువు దోపిడీ ఎలా చోటుచేసుకుంటుంది?...ఊరూరా బెల్టు షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేస్తేనే!ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకొనేందుకు ఎలా వీలు కలుగుతుంది?...సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగిస్తేనే!మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో..? చంద్రబాబు ప్రభుత్వంలోనా.. వైఎస్సార్సీపీ హయాంలోనా? -
‘యాక్సిస్’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్'
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పవన–సౌర హైబ్రీడ్) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్లైన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్ జగన్ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్ జగన్ పెంచారు. విద్యుత్ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్ 108 ప్రకారం.. యాక్సిస్ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? -
అరకు అందాలకు గ్రహణం
అల్లూరి జిల్లాకు ప్రాణప్రదమైనది పర్యాటక రంగం. సుందర ప్రకృతి దృశ్యాలతో దేశ విదేశీ టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశాలు మన్యంలో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలను, అక్కడికి వెళ్లే రహదారులను అభివృద్ధి చేస్తేనే కదా.. అవి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే.. నిధులు విడుదలైనా పనులు మధ్యలో నిలిపివేస్తే .. ఇక ప్రగతి ఎలా సాధ్యం?అరకులోయ టౌన్: అందాల అరకులోయ ఎన్నో ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి, మిగతా అభివృద్ధి పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. పనులు కొంత వరకు పూర్తయ్యాయి. ప్రస్తుత కూటమి సర్కారు వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌కు వెళ్లే 3.75 కిలోమీటర్ల రహదారి, మురుగు కాలువలు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి మంజూరైన రూ.11 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ శరవేగంగా పనులు చేసుకొచ్చారు. అయితే చేసిన పనులకు సంబంధించి రూ.1.8 కోట్ల బిల్లును కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిపివేశారు. అటవీ అనుమతులు లేక 600 మీటర్ల రహదారి నిలిపివేత విశాఖ–అరకు రూట్లో బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వరకు రహదారి నిర్మాణం తలపెట్టారు. సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద వేస్తున్న రహదారిలో 600 మీటర్ల మేర ఫారెస్టు పరిధిలో ఉందని అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో రహదారి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అరకులోయ మండలంలోని మాడగడ, బస్కీ పంచాయతీలతోపాటు, హుకుంపేట మండలం భూర్జ, అనంతగిరి మండలం పైనంపాడు ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. మిషన్ కనెక్ట్‌లో భాగంగా పాడేరుకు చాలా సులువుగా అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశ విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంత అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కష్టాలు తీరుతాయి. కూటమి ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులతోపాటు పర్యాటకులు కోరుతున్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ రహదారి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే రూ.1.8 కోట్ల బిల్లులు చెల్లించారు. ఆ తరువాత చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 10 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది. బస్కీ రోడ్డు పనులు పూర్తి చేయరూ.. అరకులోయ మండలం మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్ నుంచి బస్కీ గ్రామం వరకు 11 కిలోమీటర్ల రహదారి మరమ్మతు, సీసీ రోడ్లు నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. రహదారి మెటల్ పరిచి విడిచిపెట్టారు. దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చేసిన పనులకు కేవలం రూ.60 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లు చెల్లించాల్సి ఉంది. రహదారి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రముఖ సందర్శిత ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పెద్ద పీట వేశారు. మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కు, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ వరకు రహదారి నిర్మాణానికి రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. రోడ్డుపై మెటల్‌తో.. ప్రమాదం నందివలస–బస్కీ రహదారి నిర్మాణ పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. రోడ్డుపై మెటల్ వేసి విడిచిపెట్టడంతో వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. నందివలస జంక్షన్ నుంచి బస్కీ పంచాయతీ కేంద్రం వరకు రహదారి మరమ్మతు పనులు, ఇతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కిల్లో రామన్న, వైస్ ఎంపీపీ, అరకులోయబిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తాం మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.1.80 కోట్ల బిల్లులు బకాయి ఉంది. దీంతో పనులు నిలిపివేశారు. సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద సుమారు 600 మీటర్ల మేర అనుమతులు లేక అటవీ అధికారులు పనులు నిలిపి వేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే పనులు మళ్లీ ప్రారంభిస్తాం. – రామమ్, డీఈఈ, పీఆర్ ఇంజినీరింగ్ శాఖ, అరకులోయ -
‘మద్దతు ధర’ ఎక్కడ బాబూ?
ధాన్యం నుంచి టమాటా వరకు.. మిరప నుంచి పత్తి వరకు.. పొగాకు మొదలు బత్తాయి వరకు.. కోకో మొదలు కూరగాయల వరకు.. ఏ పంట చూసినా మద్దతు ధర కరువు. పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, పొగాకు.. ఇలా అన్ని పంటల రైతులదీ దయనీయ పరిస్థితి. తుదకు పూలు, కూరగాయలకు కూడా మంచి ధర లేని దుస్థితి. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయం పనికిరానిదైపోయింది. అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలతో గోడు చాటుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. మొద్దు నిద్ర వీడలేదు.సాక్షి, అమరావతి : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. «మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంట చూసినా ధర లేక రైతులు నష్టపోతుంటే అండగా నిలిచేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. ఓ వైపు కరువు, మరో వైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పంటలు ముందెన్నడూ లేని రీతిలో తెగుళ్లు, చీడపీడల బారిన పడి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకు మద్దతు ధర దక్కక రైతులు విలవిల్లాడి పోతున్నారు. కూలీల ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేక కొంత మంది రైతులు తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తే.. మరికొంత మంది రైతులు కల్లాల్లోనే దున్నేస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో పంటల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసిందే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏకోశానా ఉన్నట్టు కన్పించలేదు. కేంద్రానికి లేఖలు పేరిట మిరప రైతును మోసగించినట్టే పొగాకు రైతులను అడ్డగోలుగా మోసగించింది. ఖరీఫ్ పంట చివరి దశకు వచ్చిన తర్వాత కందులు, పెసలు, శనగ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కొద్ది మొత్తంలో కందులు, పెసలు, శనగలు సేకరించారు. ఇందుకోసం ఖర్చు చేసిన నిధులన్నీ కేంద్రానివే. గత సీజన్లో క్వింటా 27 వేలకు పైగా పలికిన తేజా రకం మిరప సైతం ఈసారి రూ.8 వేలకు మించి పలకడం లేదని గగ్గోలు పెడుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన బాట పట్టినా మద్దతు ధర అంటూ హంగామా చేసిన కూటమి ప్రభుత్వం తుదకు చేతులెత్తేసింది. ఆ ఐదేళ్లూ అన్నదాతకు పండగవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. తద్వారా ఆయా పంటల ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది.చివరికి 2023–24 రబీ సీజన్లో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే మార్కెట్లో జోక్యం చేసుకొని రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి భరోసా కల్పించింది. మరో వైపు 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించి వరి రైతులకు అండగా నిలిచింది. ప్రతి రైతుకు జీఏల్టీ (గన్ని, లేబర్, ట్రాన్స్‌పోర్టు) భారాన్ని సైతం నాటి ప్రభుత్వమే భరించింది.పెట్టుబడిలో సగం కూడా దక్కలేదు రెండెకరాల్లో టమాటా పంట వేశాను. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి అయ్యింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి 25 కిలోల బాక్స్ రూ.100 నుంచి రూ.150కి మించి పలకలేదు. 2 ఎకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.20 వేలు కూడా రాలేదు. ఇంత అధ్వాన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టాలపాలైనా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. – కృష్ణమూర్తి, అయినగల్, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నాం నాకున్న కొద్దిపాటి కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నా. గత ఏడాది కిలో రూ.800–1200 వరకు ధర పలికింది. కానీ ఈ ఏడాది రూ.550కి మించి కొనడం లేదు. సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం కిలో రూ.900కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా కంపెనీలను ఒప్పించాలి. – తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లాఎకరాకు రూ.50 వేలు నష్టపోయా 18 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశాను. గతేడాది ఎకరాకు 17–18 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 11–12 క్వింటాళ్లకు మించి రాలేదు. గతేడాది నాణ్యమైన పొగాకు క్వింటాకు రూ.16–18 వేలు ధర పలుకగా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే క్వింటాకు రూ.14–15 వేల వరకు దక్కింది. కానీ ఈ ఏడాది తేమ శాతం సాకుతో క్వింటాకు రూ.2500 నుంచి రూ.3 వేలకు మించి ఇవ్వడం లేదు. గతేడాది ఎకరాకు రూ.లక్షకుపైగా మిగిలితే ఈ ఏడాది ఎకరాకు రూ.50 వేలకుపైగా నష్టపోవాల్సి వచ్చిoది. – నర్సెట్టి శ్రీనివాసరావు, ఇనగొల్లు, బాపట్ల జిల్లా ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలం రాష్ట్రంలో ధాన్యం సహా మిరప, పత్తి, పొగాకు, మినుము, పెసర, శనగ, కంది తదితర పంట ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఈ సీజన్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైంది. – జీ.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
పింఛను కట్..
టెక్కలి, శావల్యాపురం: పింఛనో రామచంద్రా అంటూ రాష్ట్రంలో లబ్ధిదారులు వేడుకుంటున్నారు.. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం కట్ చేసేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడ్డాక నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, పల్నాడు జిల్లా శావల్యాపురంలో నిరసనలకు దిగారు.మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపేశారు. బాధితులు స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా మంజూరు చేయలేదు. గురువారం మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులు బాధితులకు అండగా నిలిచి అధికారులను నిలదీశారు. గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తే అందరికీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఏ కారణాలు లేకుండా ఆపేసిన 8 మందికి.. పింఛను తొలగిస్తున్నట్లుగా నోటీసులిచ్చి, మిగతావారికి ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. చివరకు సచివాలయ సిబ్బంది విషయాన్ని ఈవోపీఆర్డీ ఆనందరావు దృష్టికి తీసుకువెళ్లి వెనుదిరిగారు. గ్రామస్థులు, బాధితులు.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఈవోపీఆర్డీ చాంబర్లో బైఠాయించారు. ఆయన డీఆర్డీఏ అధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. కాగా, రెండు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, ఇప్పుడు మూడో నెల పింఛన్ కూడా ఇవ్వకపోతే శాశ్వతంగా పింఛన్లకు దూరమవుతారంటూ లబ్ధిదారులు వాపోయారు. కాగా, పింఛన్ల వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి కోటబొమ్మాళి ఎంపీడీవో ఫణీంద్రకుమార్, ఇన్చార్జిగా వ్యవహరించిన సంతబొమ్మాళి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం గమనార్హం. సంతబొమ్మాళి మండలం కోటపాడులో లింగూడు ఏకాశి అనే వృద్ధురాలికి పింఛను కట్ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పింఛను నిలిచిపోయింది.రెండు గ్రామాల్లో 31 మందికి పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెం గ్రామంలో 9 మందికి పింఛను కోత పెట్టారు. దీంతో లబ్ధిదారులు గురువారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేశారు. పొట్లూరు, పిచికలపాలెంలో పింఛనుదారుల నుంచి ఫిర్యాదు అందిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని శావల్యాపురం ఎంపీడీవో మీనా సీతారామయ్య తెలిపారు.ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి పింఛనే ఆధారంరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. మూడు ఆపరేషన్లు చేశారు. ఎలాంటి పనులు చేయలేను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నెలవారీగా వచ్చే రూ.6 వేల పింఛనుతోనే కుటుంబ పోషణ ఆధారపడి ఉంది. అధికారులు స్పందించి పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నా. – అమృతపూడి అలెగ్జాండర్ (పిచికలపాలెం, పింఛనుదారుడు) -
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్సీ, లైన్ల మరమ్మతులు, సబ్ స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్ కోసం..భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్ డిమాండ్ ప్రధాన సూచికగా భావిస్తుంటారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్ మహమ్మద్ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
మూసివేత దిశగా ఫైబర్‌నెట్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలిగించి.. వారి జీవితాలను రోడ్డున పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో.. వారంతా ఏప్రిల్ 1నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్లి సరిదిద్దడానికి వినియోగించే ఆటోలకు 8 నెలలుగా చార్జీలు చెల్లించకపోవడంతో వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కనీసం ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించలేని పరిస్థితి. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలతో విసుగు చెందిన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గడిచిన 11 నెలల్లోనే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో సమాధానం చెప్పలేక లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ముగ్గురు ఎండీలు మార్పు.. చైర్మన్ రాజీనామాకూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయాన్ని సుమారు 3 నెలలపాటు సీజ్ చేశారు. 10 నెలల్లోనే ముగ్గురు ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్నెట్మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసి మరీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో టెరాసాఫ్ట్‌లో పనిచేసిన వారందరినీ ఉద్యోగంలోకి తీసుకుంది. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా గత ప్రభుత్వం నియామకాలంటూ 800 మందికిపైగా ఉద్యోగాల నుంచి తొలగించింది. సెటాప్ బాక్స్ పాడైపోతే కొత్త బాక్సులు ఇవ్వకపోవడం, ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించకపోతుండంటంతో వినియోగదారులు ఫైబర్ నెట్ సేవలకు దండంపెట్టి ప్రైవేటు సంస్థల కనెక్షన్లకు తరలిపోతున్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆపరేటర్లు లబోదిబోమంటున్నారునేటినుంచి విజయవాడలో ధర్నారాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైబర్‌నెట్ ఆపరేటర్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్‌లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని తీర్మానించుకున్నారు. తక్షణం సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు కొత్త బాక్సులు అందించడం, ఈఎంఐ చార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేట్లర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే టెక్నికల్ సిబ్బందికి జీతాలు అందజేసి తిరిగి విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చేవరకు విజయవాడను వదిలి వేళ్లే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేస్తోంది. -
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్ఆర్ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ (డెబిట్ సర్వీస్ రిజర్వ్ ఎకౌంట్) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్ లోపల.. బడ్జెట్ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్ ఇచ్చింది. అంటే.. డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ), వేజ్ అండ్ మీన్స్ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్ అధికారి అయిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్ కుమార్ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్ బాస్ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్‌పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
‘పది’పోయిన ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబరు వరకు సాగదీత.. అప్పర్ ప్రైమరీ (యూపీ) పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపు.. ఇలా పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. పదో తరగతి ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు.⇒ ఈ ఏడాది పరీక్షలకు 6,19,286 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,14,459 మంది హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది (81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో బాలికలు 2,53,278 మంది (84.09 శాతం), బాలురు 2,45,307 మంది (78.31 శాతం) ఉన్నారు. ⇒ ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు.⇒ ఇంగ్లిష్ మీడియంలో రాసిన 5,60,864 మందిలో 4,66,586 మంది (83.19 శాతం), తెలుగు మీడియంలో 49,519 మందికి గాను 29,012 మంది (58.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ⇒ మొత్తం విద్యార్థుల్లో 65.36 శాతం ప్రథమ, 10.69 శాతం ద్వితీయ, 5.09 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణి సాధించారు. టాప్‌లో మన్యం.. చివరిలో అల్లూరి జిల్లాలుపదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో టాప్‌లో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను అందుకుంది. ⇒ 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ మొత్తం 11,819 ఉన్నత పాఠశాలల (4,879 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యంలోనివి) నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. 19 ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. నేటి నుంచి రీ కౌంటింగ్‌కు అవకాశంపరీక్షలు తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో వారివారి స్కూల్ లాగిన్‌లో గురువారం నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. త్వరలోనే టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు గడువు ఇచ్చింది.కనిపించని మెరుపులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. రెండేళ్ల పాటు కోవిడ్–19తో సరిగా తరగతులు జరగక, పరీక్షలు నిర్వహించకపోయినా, 2022–23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు జీరో ఫలితాలు సాధించినవి 17కి తగ్గాయి.⇒ తాజాగా 2024–25 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 1,680కి తగ్గిపోగా, జీరో ఫలితాల స్కూళ్ల సంఖ్య 19కి పెరిగింది.సివిల్స్ సాధిస్తా పది ఫలితాల్లో 600 మార్కులు సాధించిన నేహాంజనిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదిలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి గంగాభవానీ గృహిణిగా ఉన్నారు. తమ విద్యార్థిని వై.నేహాంజని స్టేట్ టాపర్‌గా నిలిచిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు విడుదలఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 10,119 మంది (37.93 శాతం) ఉత్తీర్ణులవగా, ఇంటర్మీడియట్లో 63,668 మందికి గాను 33,819 మంది (53.12 శాతం) విజయం సాధించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ మే–2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు. -
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
ఇదేం ధ‘రొయ్యో’..!
రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.సాగు సమ్మె బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయిన 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన, కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి, అమరావతిపశ్చిమగోదావరిలో నిరసన గళం వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందుపర్రు గ్రామాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఆక్వా సాగు ఇక చేయలేమని, క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రాష్ట్రంలో ఈ–ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేçస్తున్నారు. అత్యధికంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.కౌంట్ల పేరిట.. అడ్డగోలు దోపిడీప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్‌కు చేరాలంటే కిలోకు రూ.330–350 వరకు, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. కానీ ప్రస్తుతం 100 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.325, 30 కౌంట్ రూ.425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి. ఈ ధరల్లోనూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులతోపాటు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షెడ్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. కిలోకు రూ.పది నుంచి రూ.30 వరకు కోత పెడుతున్నారు. 1–3 టన్నుల్లోపైతే 100 కౌంట్‌కు రూ.220, 50 కౌంట్‌కు రూ.310, 30 కౌంట్‌కు రూ.400 చెల్లిస్తున్నారు. అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు. 100 కౌంట్‌కు కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంటే, కంపెనీలు రూ.230 ధరగా ప్రకటించాయి. అది కూడా 3 టన్నుల పైబడి అమ్మితేనే ఈ ధర. 3 టన్నులలోపు అయితే వ్యాపారులు అడ్డగోలుగా కోత కోస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందువల్లే సాగు సమ్మెకు దిగాల్సి వచి్చంది. – మామిడిశెట్టి గిరిధర్ తూర్పుతాళ్లు, పశ్చిమగోదావరి జిల్లారూ.13 లక్షలు నష్టపోయాను ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ఈ సీజన్లో ఎకరాకు 1.50 లక్షల రొయ్య పిల్లలు వేశాను. ఆరెకరాలకు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టా. 70 కౌంట్ వచి్చంది. వ్యాపారులు ధర బాగా తగ్గించారు. కిలో రూ.280 చొప్పున ఇచ్చారు. రూ.17లక్షల రాగా, రూ.13 లక్షలు నష్టపోయా. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. – ఈమన రామాంజనేయులు పోడూరు, పశ్చిమగోదావరి జిల్లా -
ఆదు‘కొనలేం’
రైతులను కూటమి ప్రభుత్వం నిండా ముంచింది. వరి కోతలు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. అప్పుడే ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, ఇక కొనడం కుదరదని చెప్పేసింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇళ్లకు తరలించలేక కర్షకులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్కారు కరుణిస్తుందేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు.– సాక్షి, రాజమహేంద్రవరంతప్పుడు లెక్కలు తూర్పుగోదావరి జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం రబీలో 60,042 హెక్టార్లు. ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు 216 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుల వ్యవధిలోనే 1.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, 65 వేల మెట్రిక్ టన్నులు సేకరించి కేంద్రాలు మూసివేస్తామని పేర్కొంటున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 50శాతం కోతలు కూడా పూర్తికాలేదని, పండించిన ధాన్యం మొత్తం తమ వద్దే ఉందని, అలాంటప్పుడు లక్ష్యం ఎలా పూర్తవుతుందని ప్రశి్నస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.దళారుల దందా ఈ నేపథ్యంలో దళారులు దందా సాగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఆసరాగా తీసుకుని రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని ఎగరేసుకుపోతున్నారు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.1,725 ఉండగా దళారులు రూ.1,300 నుంచి రూ.1,500కు కొంటున్నారు. గత్యంతరం లేని స్థితిలో అన్నదాతలు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పండిన ప్రతి గింజా కొనుగోలుగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉన్నా.. రైతులకు ఎంలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏప్రిల్ 1వ తేదీ నాటికి రైతు భరోసా కేంద్రాల్లో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే నాటి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పండిన ప్రతి గింజా కొన్నది. మరో 15 రోజుల్లో 75శాతం కోతలు పూర్తి జిల్లావ్యాప్తంగా రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం నాటికి 28,287 హెక్టార్లలో (48.3 శాతం) పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో 75 శాతానికిపైగా పూర్తవనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇంకా కోతలు పూర్తవకుండానే అధికారులు ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది.ధాన్యం తీసుకోవడం లేదురైతు సేవా కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకెళుతుంటే లక్ష్యం పూర్తయిందంటున్నారు. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు నిరీక్షించాలని చెబుతున్నారు. అప్పటి వరకూ ధాన్యం పెట్టుకుని ఉండాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భయమేస్తోంది. ధాన్యం అమ్మినా చెల్లింపులు జరగడం లేదు. రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. – గారపాటి వెంకట సుబ్బారావు, రైతు సంఘం నేత, చాగల్లు -
మెగా డీఎస్సీలో మెలిక!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో కూటమి సర్కారు మెలిక పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యా రంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు.. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్‌ను పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. హడావుడి చేసినంత కూడా లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ అగ్ర నాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్‌కు, డీఎస్సీకి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యా శాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా, కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులపై వేటు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిర పడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శాతం 40–45 ఉంటుంది. ప్రస్తుత డీఎస్సీ–2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం, పీజీటీకి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జీటీ/ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన అందిస్తున్న టీచర్లు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పని చేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్ స్కూళ్లలో మరో 2 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుత డీఎస్సీలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. -
పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహణం
పంచాయతీలలో అభివృద్ధి పడకేసింది.. మండల పరిషత్‌లలో ప్రగతి మందగించింది.. జిల్లా పరిషత్‌లలో సమస్యలు ముసురుకుంటున్నాయి.. ఏదైనా పని చేద్దామంటే పైసల్లేకుండా పోయాయి..! రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇస్తుందా అనే ఎదురుచూపులతో నాలుగు నెలలు గడిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా రాష్ట్ర ఖజానా నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు స్థానిక సంస్థలకు ఇవ్వకపోయినా పర్లేదు.. అసలు ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని అంటే మాత్రం అనుమానమే అని తెలుస్తోంది.సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121.20 కోట్లను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాలుగు నెలలుగా తొక్కిపెట్టింది. ఖజానాలో ఉంచుకుని అవసరాలకు వాడేసుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం గ్రామీణ స్థానిక సంస్థల కోసం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల పాలక వర్గాలు అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వీలుంటుంది. స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించుకునేలా, రాష్ట్ర ఖజానా ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలులో ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా ఈ విధానం అమలులోకి వచ్చింది.» 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలకు విడుదల చేసే నిధులు రాష్ట్ర ఖజానాలో జమయిన పది పని దినాల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. » గత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. తొలి విడత సెప్టెంబర్‌లో, రెండో విడతగా డిసెంబర్లో రూ.1,121.20 కోట్లు ఇచ్చింది. (డిసెంబరు 16న రూ.446.48 కోట్లు, డిసెంబరు మూడో వారంలో రూ.674.72 కోట్లను విడుదల చేసింది)» ఈ నిధులను 70–20–10 నిష్పత్తిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు వాటి బ్యాంకు ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి పది పని దినాలు నిర్దేశించింది. అయితే, శనివారం వరకు (ఏప్రిల్ 19) కూటమి ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది అనే చర్చ అధికార వర్గాలో సాగుతోంది.» నిబంధనల ప్రకారం వెళ్తే ఆ నిధులను వినియోగించుకునే అవకాశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ కారణంగానే నిధుల జమ విషయంలో కాలయాపన చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.» నిధుల కొరత కారణంగా స్థానిక సంస్థలు తాగునీరు, పారిశుధ్యం సంబంధిత పనులను చేపట్టడం లేదు. పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.11 నెలల్లోనే మూడోసారి..కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 11 నెలల కాలంలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచుకోవడం ఇది మూడోసారి. గతంలో విమర్శలు వచ్చిన తరువాత తప్పనిసరై స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను గత సెప్టెంబర్ లో విడుదల చేయగా, దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో జమ చేసింది. » 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.998 కోట్లనూ ఆలస్యంగా విడుదల చేసింది. రెండో విడతగా గత ఏడాది మార్చి నెలాఖరున కేంద్రం ఇచ్చింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం జూన్ 12న బాధ్యతలు చేపట్టినా ఆగస్టు దాకా స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. » ఈ అంశంపై ఆగస్టు 13న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. -
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. -
అప్రాధాన్య పోస్టులకు వెయిటింగ్ ఐఏఎస్‌లు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిన పలువురు ఐఏఎస్ అధికారులపై రెడ్‌బుక్ చాప్టర్లో మరో కుట్ర అమలైంది! పోస్టింగ్‌లు ఇవ్వకుండా దాదాపు 11 నెలల పాటు వెయిటింగ్లో ఉంచిన ఆ ఉన్నతాధికారులను తాజాగా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వు జారీ చేశారు.మరోవైపు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ పూర్తి అదనపు బాధ్యతలను కె.భాస్కర్‌కు, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ పూర్తి అదనపు బాధ్యతలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి అప్పగించారు. కాగా అవసరం తీరిపోవడంతో సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై బదిలీ వేటు పడింది. ప్రాధాన్యత లేని చేనేత, జౌళి శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఆయన్ను బదిలీ చేయడంతోపాటు ఇతర బాధ్యతల నుంచి కూడా తప్పించారు. -
ఫీజు చెల్లిస్తేనే.. పై తరగతికి
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన పేద విద్యార్థులను పై తరగతులకు పంపేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. తాము నిర్ణయించిన ఫీజు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్లు కొనసాగిస్తామని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక జిల్లా విద్యా శాఖ అధికారులను ఆశ్రయిస్తే ‘సెటిల్ చేసుకోవాలి’ అంటూ సలహా ఇస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఆర్టీఈ చట్టం కింద పేద పిల్లలకు కేటాయించారు. విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గత మూడు విద్యా సంవత్సరాల్లో 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. వీరిలో చాలా మంది నిరుపేదలు కావడంతో ఫీజులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ఫీజులపై ఏడాది క్రితమే హైకోర్టు ఇచ్చిన తీర్పును యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తల్లిదండ్రులపై భారం పెరిగిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుపేదల చదువు కోసం అమలు చేసిన ఆర్టీఈ చట్టం ప్రవేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మొత్తం ఫీజు కోసం యాజమాన్యాల ఒత్తిడి ఆర్టీఈ చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం జీవో నంబర్ 24 ప్రకారం ఫీజులను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణ ప్రాంతాల్లో రూ.8,500 స్కూలు ఫీజుగా నిర్ణయించి 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం తీసుకున్న తల్లిదండ్రులు ఈ ఫీజు మొత్తాన్ని చెల్లించాలని, మిగిలిన వారికి ప్రభుత్వమే ఆయా స్కూళ్లకు చెల్లించేలా నిబంధన విధించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువగా ఉందని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు ముగిసే నాటికి రెండు విద్యా సంవత్సరాలు పూర్తయి మూడో ఏడాది ప్రారంభమైంది. అనంతరం జీవో నంబర్ 24లో ఉన్న ఫీజులు సరిగా లేవని, కొత్తగా ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని పిల్లల తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచాయి. ఆయా స్కూళ్లు నిర్ణయించిన వార్షిక ఫీజు మొత్తం (స్కూలును బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేలు) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అమ్మఒడి తీసుకున్న వారు స్కూళ్లకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించారు. ఈ విద్యా సంవత్సరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వక పోవడంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం మరింత పెరిగిపోయింది.ఫీజు అంచనాపై తీరిగ్గా ఇప్పుడు కమిటీ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం–2009 (ఆర్టీఈ) కింద ఏటా పేద పిల్లలకు అందిస్తున్న ఉచిత విద్యలో భాగంగా ఇటీవల ఫీజులు నిర్ణయించేందుకు పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గా సమగ్ర శిక్ష ఎస్పీడీ కనీ్వనర్‌గా మరో తొమ్మిది మంది అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. జీవో నంబర్ 24పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ కమిటీని ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందే ప్రభుత్వం నియమిస్తుంది. మూడు నెలల్లో నివేదికను ఇస్తుంది. డిసెంబర్లో సమావేశమై విద్యార్థుల ఫీజులను నిర్ణయిస్తుంది. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి రెండు వారాల క్రితం కమిటీ వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కమిటీని త్వరగా వేసి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
గతంలో బస్తా ఫీడ్ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయిపోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్ ఆక్వా జోన్ ప్రాంతం. యూనిట్ రూ.4 చొప్పున కరెంట్ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్ ఆక్వా జోన్ పరిధిలో యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్ వన్ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా కోసం ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్ సంక్షోభ సమయంలో సీనియర్ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్లో ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్ పెంపు వాయిదా పడ్డా కౌంట్ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు -
‘దయా’లసిస్ ఏదయా?
కాశీబుగ్గ: ఉద్దానానికి పెనుశాపంగా మారిన కిడ్నీ వ్యాధి.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై మళ్లీ తిరగబెడుతోంది. దీంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ క్రమంలో టెక్కలి మండలం సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి (45) గురువారం మృతి చెందాడు. వేలమందికి ఆశాదీపంగా నిలవాల్సిన పలాస కిడ్నీ ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు సమస్యతో డయాలసిస్ యూనిట్లు పనిచేయలేదు. నెఫ్రో ప్లస్ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనిట్లో 20 బెడ్లు ఉండగా.. శుక్రవారమంతా విద్యుత్తు సరఫరా ఇబ్బంది పెడుతూనే ఉంది. పొద్దున వచ్చిన రోగులు రాత్రి వరకు వేచి చూడాల్సి వచ్చిoది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదని, మరమ్మతులు చేసినా పలుసార్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా చూస్తామని బదులిచ్చారు. తల్లడిల్లిన ఢిల్లమ్మ కుటుంబం పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ కోసం వెళ్తే జాప్యం చేస్తున్నారని, ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని సోంపేటకు చెందిన మురపాల ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు వాపోయారు. ఢిల్లమ్మను వారం క్రితం అత్యవసర సేవల విభాగంలో చేర్పించామని, శుక్రవారం ఆపరేషన్ చేస్తానని చెప్పారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మూడు వారాలయ్యాక చేస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే ‘నేను చేయను. మీకు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోండి..’ అని ఓ వైద్యుడు అన్నారని పేర్కొన్నారు. కాగా, వైద్యుడి తీరుపై ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు ఫిర్యాదు చేశారు. ఆమె పిలిపించి మాట్లాడారు. వచ్చే వారానికి ఆపరేషన్ చేస్తామని సముదాయించి పంపించారు. నాడు ఆదుకున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో పరిశోధన కేంద్రం ప్రారంభించారు. బాధితుల కష్టాలు తెలుసుకుని నెలకు రూ.10 వేలు పింఛన్ ఇచ్చారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారను ఉద్దానం వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు పరిశోధన కేంద్రంలో సమస్యలు ముసురుకొన్నాయి. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులకు ఒడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు ఎన్.వీరస్వామి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌బాబు, ఇతర టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించడం.. వెనువెంటనే రాత్రికి రాత్రే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంతా పక్కా పన్నాగంతో చకచకా సాగిపోయింది. దీంతో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డితోపాటు ఇదే పత్రికకు చెందిన ఆరుగురు పాత్రికేయులపై బీఎన్ఎస్ సెక్షన్లు 196(1), 352, 353,(2), 61(1) రెడ్‌విత్ 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పింఛన్ కోసం వస్తే కడతేర్చారన్నది వాస్తవంపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ గుండాలకు భయపడి కుటుంబంతో సహా పొరుగున తెలంగాణలోని నల్కొండ జిల్లా కనగల్‌లో పది నెలలుగా తల దాచుకుంటున్నారు. ప్రతి నెల పింఛన్ తీసుకునేందుకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ వర్గీయులు పక్కా పన్నాగంతో ఆయన్ను హత్య చేశారు. ఏప్రిల్ నెల ఫించన్ తీసుకునేందుకు ఈ నెల 3న రాష్ట్ర సరిహద్దుల్లోని నాగార్జునసాగర్ హిల్ కాలనీ వద్దకు వచ్చి.. తమ గ్రామం పశువేములకు చెందిన ఒకరికి ఫోన్ చేశారు. సామాజిక పింఛన్లు ఇస్తున్నారా.. లేదా.. అని అడిగారు. అతను ఆ విషయాన్ని టీడీపీ వర్గీయులకు చేరవేశాడు. వెంటనే టీడీపీ గూండాలు వచ్చి హిల్ కాలనీలో ఉన్న హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై దాడి చేసి, హత్య చేసి.. మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలోనే పడేశారు. హరిశ్చంద్ర భార్య నిర్మల తన భర్తను కిడ్నాప్ చేశారని తెలంగాణలోని విజయపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పశువేములలో దారుణ హత్యకు గురైన హరిశ్చంద్ర మృతదేహాన్ని ఈనెల 4న గుర్తించారు. కర్రలతో కొట్టి.. గొంతుకోసి.. ముఖంపై యాసిడ్ పోసి మరీ దారుణంగా హత మార్చినట్టు నాగార్జున సాగర్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హిల్ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి పుటేజీ సేకరించారు. హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి.పూర్తి అవగాహనతోనే వార్త ప్రచురితంహరిశ్చంద్ర హత్య సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమపై టీడీపీ గూండాలు కక్ష కట్టిన తీరును హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి వివరించారు. ఇది టీడీపీ గూండాల పనేనని కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు క్షణ్ణంగా తెలుసుకుని పూర్తి వివరాలతో సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. తెలంగాణలోని విజయపురి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలతోపాటు మృతుని కుటుంబ సభ్యుల ఆవేదన, పశువేములలోని నెలకొన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా వివరించింది. కాగా, తెలంగాణలో పాత్రికేయులు కేవలం అక్కడి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వార్తగా ఇచ్చారు. హరిశ్చంద్రను సమీప బంధువులే హత్య చేశారని సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లోనూ, తెలంగాణ ఎడిషన్‌లోనూ ప్రచురించింది. కాగా, ఆ సమీప బంధువులు టీడీపీ గూండాలేనన్నది ఏపీలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం, అవగాహన ఉంది కాబట్టి మరింత సమగ్రంగా వార్తను ప్రచురించారు. అంతేతప్ప సాక్షి పత్రిక ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన వార్తలోని అంశాల మధ్య వ్యత్యాసం లేదు. ఈ హత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏ ఎండకాగొడుకు పచ్చ ముఠా నిర్వాకమే ప్రజల్ని మోసగించేందుకు పరస్పర విరుద్ధ వాదనలు, కథనాలు, పత్రికా ప్రకటనలు ఇవ్వడం పచ్చ ముఠా పన్నాగం. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో పరస్పర విరుద్ధంగా ఈనాడుతోపాటు ఎల్లో మీడియా లెక్కకు మించి కథనాలు ప్రచురించిన విషయాన్ని పాత్రికేయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. టీడీపీ.. ప్రజల్ని మోసగించేందుకు ఏపీలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా పత్రికా ప్రకటనలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడుతోపాటు ఇతరత్రా ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనం. ‘కలల రాజధాని అమరావతి’అని విజయవాడ ఎడిషన్‌లో ప్రకటనలు ఇచ్చిన టీడీపీ.. అదే రోజు విశాఖపట్నం ఎడిషన్‌లో మాత్రం ‘ఆంధ్రప్రదేశ్ వికాసానికి గ్యారంటీ’ అని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. టీడీపీ, ఎల్లో మీడియా కుయుక్తులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. -
ఉన్నత విద్యలో ఉలికిపాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగం ఖ్యాతి దిగజారుతోంది. విద్యార్థుల శ్రేయస్సును గాలికొదిలేసి అధికారమే పరమావధిగా పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పది నెలల కాలంలో ఉన్నత విద్యలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టకపోగా ఉన్నవాటికి మంగళం పాడేశారు. తాజాగా ఉన్నత విద్యా మండలిని సైతం నిర్వీర్యం చేసి ఆ స్థానంలో ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు ప్రతిపాదన మండలికి, ఉన్నత విద్యా శాఖకు మధ్య చిచ్చురాజేస్తోంది. ఉన్నత విద్య శాఖకు, ఉన్నత విద్యా మండలికి నిత్యం పొసగట్లేదు. ఉన్నత విద్య శాఖ కార్యదర్శి పదేపదే ఉన్నత విద్యా మండలి అధికారాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమైంది. పైగా మండలి చైర్మన్‌కు తెలియకుండా నియామకాలు చేస్తుండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఉన్నత విద్యా మండలిలో ప్రత్యేక అధికారిగా ముఖ్య నేత సామాజిక వర్గానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నియమించేలా ఏర్పాట్లు పూర్తయినట్టు, అవి కూడా చైర్మన్‌కు తెలియకుండానే, చెప్పకుండానే చేసేస్తున్నట్టు వినికిడి. ఆర్థిక అంశాలపై పట్టుకోసమే ఇదంతా! ప్రభుత్వాలు తలపెట్టిన విద్యా సంస్కరణల అమలులో దశాబ్దాలుగా ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషిస్తోంది. వర్సిటీలను సమన్వయం చేసుకుంటూ సమగ్ర విద్య విధానానికి బాటలు వేస్తుంది. ఆయా ప్రభుత్వాలు విద్యా రంగంలో నిపుణులను చైర్మన్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కూటమి పాలనలో.. ఉన్నత విద్యా మండలి అధికారాలను కాలరాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కుట్రలో భాగంగానే కౌన్సిల్ అధికారాలను పరిమితం చేసి అత్యంత ముఖ్యమైన ఆరి్థక వ్యవహారాలతో ముడిపడిన అంశాలను తమ చేతుల్లో పెట్టుకునేందుకు యంత్రాంగం పావులు కదుపుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. చైర్మన్ ఉన్నట్టా..లేనట్టా! ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ కీలకం. ఆయనకే సర్వాధికారాలు దక్కుతాయి. కూటమి పాలనలో చైర్మన్ పదవికి సరైన గౌరవం దక్కట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంస్కరణల్లో కీలకంగా వ్యవహరించే కౌన్సిల్‌కు తెలియకుండానే, కౌన్సిల్ చైర్మన్‌ను పిలవకుండానే విద్యా సంబంధిత ఒప్పందాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. పైగా ఉన్నత విద్య కార్యదర్శి కాకుండా కేవలం కళాశాల విద్య డైరెక్టర్ సంతకం చేయడం విద్యాభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వం, అధికారులు కావాలనే కౌన్సిల్ చైర్మన్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నత విద్యపై అప్పడప్పుడూ చేసే సమీక్షలకు సైతం కౌన్సిల్ చైర్మన్‌కు సమాచారం ఉండట్లేదు. చైర్మన్ అధికారాలను కూడా చేతుల్లోకి తీసుకునేలా ఉన్నత విద్య కార్యదర్శి వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్నత విద్య కార్యదర్శి తన కంటే హోదాలో పెద్దవారైన చైర్మన్‌కు తెలియకుండానే కాకినాడ జేఎన్టీయూకు చెందిన ఎ.కరుణను డెప్యూటేషన్‌పై కౌన్సిల్లో సహాయ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ మెమో జారీ చేయడంపై రగడ మొదలైంది. ఏదైనా ఉంటే లేఖ రూపంలో తెలపాలని, అసలు కౌన్సిల్లో సహాయ ప్రత్యేకాధికారి పోస్టు ఏదీ లేదని మండలి అధికారులు ఉన్నత విద్య కార్యదర్శికి జవాబు ఇచి్చనప్పటికీ, ‘ఆన్ డ్యూటీ’ విధానంలో తాను చెప్పినవారిని నియమించాలని ఉన్నత విద్య కార్యదర్శి నుంచి మరో మెమో రావడంతో కౌన్సిల్ అధికారులు విస్తుపోతున్నారు. పైగా రూసా నిధులకుసంబంధించి చెక్ పవర్‌ను ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ నుంచి తొలగించిన ఉన్నత విద్య కార్యదర్శి.. దానిని కళాశాల విద్య అధికారులకు ఇవ్వడం గమనార్హం. అధికారానికై తాపత్రయం.. కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తు కంటే అధికారాన్ని అనుభవించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. ప్రభుత్వం వచ్చీరాగానే వర్సిటీల వీసీలను బలవంతంగా రాజీనామా చేయించింది. తీరా పది నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో వీసీలను నియమించలేని దుస్థితి. దీనికితోడు ప్రపంచ స్థాయి వర్సిటీలు అందించే వివిధ రకాల కోర్సులను (వరి్టకల్స్) పేదింటి బిడ్డలకు అందించే తపనతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎడెక్స్‌ను తీసుకొస్తే దానినీ నిర్లక్ష్యం చేశారు. వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందికి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిoది. వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లోనూ తాత్సారం చేస్తుండడంతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉన్నత విద్య శాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య అంతరాలతో విద్యావ్యవస్థ దెబ్బతింటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్వర్క్ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య ప్రదాత..ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బకాయిలు చెల్లించి భరోసా 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్ జగన్ ఊపిరిలూదారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. -
ఇంటింటా మద్యం.. ఇదే బాబు విధానం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారని స్పష్టమవుతోంది. మద్యం షాపుల కోసం ఇతరులెవ్వరూ దరఖాస్తు చేసుకోనివ్వకుండా ఎక్కడికక్కడ బెదిరించారు. ఒకవేళ లాటరీలో ఇతరులెవరికైనా దక్కినా బలవంతంగా లాగేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ షాపులకు అనుబంధంగా సగటున ఒక్కో దుకాణానికి 10–15 బెల్ట్ షాపులను అనుచరులతో ఏర్పాటు చేయించారు. వాటి కోసం పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించారు. ఇలా ఒక్కో బెల్ట్ షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట 20 లక్షల వరకు దండుకున్నారు. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పి కంటే అదనంగా రూ.20 నుంచి 30 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.వెరసి వేళాపాళా లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పేదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిపోయింది. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా.. ‘తాగండి.. తూగండి’ అంటూ ఇంటింటా మద్యం వరద పారించడమే తమ విధానం అన్నట్లు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు.అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన చెందడంతో జనవరి 29న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన మహబూబ్ బాషా (32) మితిమీరి మద్యం తాగి.. స్పృహ కోల్పోయి గత అక్టోబర్ 17న మరణించాడు. ఇతడి మృతితో అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. ఇలాంటి దీన గాధలు ఊరూరా కనిపిస్తున్నాయి.పర్మిట్ రూమ్‌లతో పని లేకుండానే బార్లను తలపించేలా సిట్టింగ్, చికెన్ చీకులు, సోడాలు, ఆమ్లెట్లు, సిగిరెట్ల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా అడ్రస్ పెట్టి డబ్బులు ఆన్లైన్లో చెల్లిస్తే ప్రత్యేకంగా డోర్ డెలివరీ సౌకర్యం కూడా కల్పించారు.ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని మద్యం షాపుల్లో థాయ్‌లాండ్, శ్రీలంక, బ్యాంకాక్, మారిషస్ టూర్లు.. అంటూ లక్కీ డిప్ పెడుతుండటం శోచనీయం.ఇది నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో మద్యం దుకాణం. వైన్ షాపు పక్కనే కూల్‌డ్రింక్స్ షాపు పేరుతో బెల్టు దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడ ఎనీటైం మద్యం అందుబాటులో ఉంచారు. బెల్టు దుకాణంలో మాత్రం బాటిల్‌పై అదనంగా రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. కానీ.. అధికారులకు మాత్రం కన్పించదు.సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్వర్క్: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఊరూ.. వాడా.. మద్యం ఏరులై పారుతోంది. ఆదాయమే తప్ప సామాజిక బాధ్యతను పట్టించుకోని ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్ లిక్కర్ ఇస్తానని హామీలు గుప్పించారు. అ«ధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలతో ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పాటయ్యాయి. దుకాణాలకు దరఖాస్తు చేయడం మొదలు బెల్ట్ షాపుల ఏర్పాటు వరకు అడ్డగోలుగా అక్రమార్జనకు తెరతీశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకింత.. నా కింత అంటూ దండుకుంటున్నారు. ఇందులో భాగంగా దుకాణాల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్రలకు పాల్పడింది. అడిగిన మేరకు కమీషన్ లేదా ఉచిత వాటా ఇస్తారా.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు బరితెగించి బెదిరింపులకు దిగారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తే వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. దారికిరాని వారిపై దాడులు కూడా చేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. కొన్ని చోట్లయితే ఖర్చులు చెల్లించి బలవంతంగా దుకాణాలను చేజిక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకే సామాన్య వ్యాపారులు భయపడ్డారు. మొత్తం 3,396 మద్యం దుకాణాల్లో ఏకంగా 80 శాతం షాపులు టీడీపీ సిండికేట్లు దక్కించుకోగా, మరో 20 శాతం వేరే వాళ్లకు లైసెన్స్‌లు వచ్చినప్పటికీ వారిని బెదిరించి మరీ సిండికేట్‌లో విలీనం చేయించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్‌లు కట్టబెట్టడంలోనూ మరోస్కామ్‌కు పాల్పడ్డారు. టెండర్లలో శాతం మార్జిన్ పెట్టి, అవన్నీ ఖరారై ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 14 శాతం మార్జిన్ పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. రూ.99 చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా మద్యం షాపుల్లో విక్రయించే ప్రతి బాటిల్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు ప్రాంతాన్ని బట్టి ‘ముఖ్య’ నేతకు కమీషన్ ఇచ్చేలా వ్యవహారం సాగింది. ఇలా ప్రతి నెలా కమీషన్‌తోపాటు ధరల పెంపుతో ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్లు దక్కాయని సమాచారం. ఈ అక్రమ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వ కీలక నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడి, బడి.. ఎక్కడపడితే అక్కడ బెల్ట్షాపులుగత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి, బడి లేదు.. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటయ్యాయని ఇటీవల తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో టిఫిన్, జ్యూస్ సెంటర్లు, పాన్‌షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. అది కూడా ఒక్కో బెల్ట్ షాపునకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ప్రాంతాన్నిబట్టి రూ.20 లక్షల వరకు వేలం పాట ద్వారా రాబట్టుకున్నారు. దీంతో సమీపంలోని లైసెన్స్ మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల నిర్వాహకులు రోజువారీగా మద్యం తెచ్చుకుని క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 మేర అధిక ధరలకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.50 కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. లైసెన్స్ మద్యం దుకాణాలకు సమయాలు నిర్దేశించినప్పటికీ ఎక్కడా వేళాపాళా లేకుండా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ముందు గేటు మూసివేసి, వెనుక నుంచి.. కిటికీ లోంచి విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి వేళ మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇక బెల్ట్షాపులైతే 24 గంటలూ అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో యథేచ్చగా మద్యం మాఫియా రాజ్యమేలుతోందనడానికి ఇదే నిదర్శనం. కర్నూలు జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం పరిధిలోని బెల్టు దుకాణాల్లో కర్ణాటక మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు సమీపంలోని కర్ణాటక నుంచి మద్యం తెప్పించి బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో బెల్టుషాపులో మద్యం అమ్మకాల జోరు, తిరుపతి జిల్లా చిట్టమూరులో ఫోన్లో ఆర్డర్ తీసుకుని వాహనంలో డోర్ డెలివరీ చేస్తున్న మద్యం పెరిగిపోతున్న గొడవలు, అరాచకాలురాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుగ్రామంలో సైతం మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా మంది రోజూ తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తాగిన మైకంలో బాలికలు, మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పేద కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య గొడవలు పెరిగిపోయాయి. కొద్ది నెలలుగా నిత్యం పోలీస్స్టేషన్లకు పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం.వైఎస్ జగన్ అలా.. చంద్రబాబు ఇలా..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సారా డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. తొలి నుంచి మద్యం పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మద్య నిషేధాన్ని అటకెక్కించిన చంద్రబాబు.. తన పార్టీ నేతలు, బడాబాబుల నేతృత్వంలో మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మద్యంను తన వాళ్లకు ఆదాయ వనరుగా మార్చేశారు. చంద్రబాబు విధానాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, మహిళల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేశారు. మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరచడం, మద్యపానంపై నియంత్రణ పాటించడమే ప్రధాన లక్ష్యంగా పాలసీని రూపొందించారు. వేళపాళా లేకుండా అధిక ధరలకు అమ్మే సిండికేట్ వ్యవస్థకు చెక్ పెట్టారు. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించారు. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు జరిపించారు. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 33 శాతం షాపులను తీసేశారు. షాపులకు అనుబంధంగాఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. రాష్ట్రంలోని 43,000 బెల్టుషాపులను ఎత్తివేశారు. మద్యం విక్రయించే వేళలను కూడా పరిమితం చేశారు. ప్రతి ఊరికీ ఒక మహిళా పోలీసును పెట్టారు. ఎక్సైజ్‌కు సంబంధించి నేరాలకు పాల్పడితే అంగీకరించే ప్రశ్నే లేదని కఠినంగా వ్యవహరించిన విషయం విదితమే. లిక్కర్ టెస్టింగ్ కోసం కొత్త ల్యాబులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీల్లో 14 సంస్థలకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు ఇవ్వగా, మిగిలిన వాటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా మద్యం విక్రయాలు తగ్గాయి.జగన్ హయాంలో సెబ్ ద్వారా ఉక్కుపాదంమద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. సెబ్ సిబ్బంది ప్రత్యేక చెక్ పోస్టులుపెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. భారీ ఎత్తున దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు, మద్యం, సారా అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించి, క్షేత్ర స్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహించింది. సెబ్ దూకుడుగా వ్యవహరించినిందితులను పట్టుకుని వేలాది కేసులు నమోదు చేసింది. నవోదయం–పరివర్తన పేరిట సారా తయారీ కేంద్రాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్‌లు ఇచ్చి వారు ఆ వృత్తిని వదిలేసేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలేవీ కనిపించడంలేదు.మహిళలపై పెరుగుతున్న దాడులుగత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 4, 5 బెల్టు షాపులను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలకు తీరని నష్టం కలుగుతోంది. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. నూతన మద్యం పాలసీ అంటే ఇదేనా? – కంచర్ల పద్మావతి, పరిటాల, ఎన్టీఆర్ జిల్లాఇంతలో ఎంత తేడా?రాష్ట్రంలో 1990 దశకంలో మద్యానికి వ్యతిరేకంగా మహిళా ఉద్యమం పెల్లుబికి 1995లో ఎన్టీఆర్ సీఎంగా మొదటి సంతకం మద్య నిషేధంపై చేశారు. రెండేళ్లు అమలులో ఉంది. ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన అల్లుడు చంద్రబాబు నిషేధం ఎత్తేశాడు. వైఎస్ జగన్ వచ్చాక మాత్రమే చిత్తశుద్ధితో కూడిన దశల వారీగా మద్య నియంత్రణ సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఇంతలో ఎంత తేడా? – ఈదర గోపీచంద్, సోషల్ యాక్టివిస్టు, నరసరావుపేటగిరిజనులు బానిసలు అవుతున్నారుజిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అనేక దుకాణాల్లో కూల్ డ్రింక్‌ల మాదిరిగా మద్యం బాటిళ్లను అమ్మడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగి, గిరిజనులు మద్యానికి బానిసలవుతున్నారు. గిరిజన కుటుంబాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోంది. – వి.వి.జయ, అరకులోయ, అల్లూరి జిల్లామద్యం షాపులను ప్రభుత్వమే నడపాలిరాష్ట్రంలో మద్యం ఏరులై పారించి ప్రభుత్వ ఖజానాకు దండిగా కాసులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీధివీధిలో బెల్టుషాపులు తెరిపించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. నాణ్యమైన మద్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే ఈ మద్యం ఎంత తాగినా ప్రమాదం కాదా? తాగి తాగి రోగాల పాలైతే ఎవరు జవాబుదారీ? కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించి అమ్మకాలు పరిమితం చేయాలి. – సావిత్రి, అనంతపురంపచ్చని పల్లెల్లో చిచ్చుపచ్చని పల్లె సీమల్లో మద్యం భూతం బెల్టు రూపంలో చిచ్చు పెడుతోంది. పేదలు సంపాదనను తాగుడుకు తగలేస్తున్నారు. దీని వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మద్యానికి బానిసలైతే పనులు చేయలేరు. అప్పుడు తినే తిండికి కూడా కష్టం అవుతుంది. వెంటనే మద్యం కట్టడి చేయాలి.– జ్యోతి, యానాది కాలనీ, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పది నెలలుగా రొయ్యల ధరలు తగ్గడమే గానీ పెరిగిన దాఖలాలే లేవు. అంతకు ముందు అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నా సరే కనీసం 15 రోజులు పాటు ఒకే ధర కొనసాగేది. ఒకసారి నిర్దేశించిన ధర 15 రోజుల్లో పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండేది కాదు. అయితే గత పది నెలల్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై సుంకాల పెంపు వ్యవహారం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది.అమెరికా టాక్స్ సాకుతో రొయ్యలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి.. కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడం పట్ల ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాకు 35 శాతం ఎగుమతులుజాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదు కాగా, 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్... దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది. దేశం నుంచి 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నులు ఎగుమతి అయితే, దాంట్లో దాదాపు 35 శాతం (రూ.20 వేల కోట్లు) ఉత్పత్తులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు జాతీయ స్థాయిలో ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తుల్లో మూడో వంతు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఏపీలో రొయ్యల దిగుబడులు 10 లక్షల టన్నులు ఉంటే.. అందులో 3.27 లక్షల టన్నులు (2023–24) అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.20–50 కౌంట్ రొయ్యల కొనుగోళ్లు నిలిపివేత అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్‌కు రూ.20 నుంచి రూ.40 చొప్పున తగ్గించేశాయి. మరొక పక్క అమెరికాకు ఎగుమతి అయ్యే 20–50 కౌంట్ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) రొయ్యల కొనుగోలును నిలిపి వేశాయి. కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి తెరతీయగా, మరికొన్ని కంపెనీలు విభేదిస్తున్నాయి.. ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించడం సరికాదని, రానున్న వారం పది రోజుల వరకు ఈ నెల 1వ తేదీన నిర్ణయించిన ధరలనే కొనసాగించాలని సూచిస్తునాయి. పైగా ఈ దిగుమతి సుంకం భారాన్ని అమెరికాలోని బయ్యర్లు భరించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నాయి. దేశీయంగా ధరలు తగ్గిస్తే ఆక్వా రైతులు మరింత సంక్షోభంలో కూరుకు పోతారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంపెనీల తీరుపై రైతుల మండిపాటుఅమెరికా ట్యాక్స్ విధానంలో మార్పు రాగానే ఆగమేఘాల మీద రొయ్యల ధరలు తగ్గించేస్తున్న కంపెనీలు.. తొమ్మిది నెలల క్రితం హరిత విప్లవం పేరిట రొయ్య మేతలో కలిపే ఉత్పత్తులపై ట్యాక్స్‌లు భారీగా తగ్గించినప్పటికీ దేశీయంగా ఒక్క రూపాయి కూడా మేత ధర తగ్గించలేదు. ఈ విషయమై ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల క్రితం సోయా రేటు కిలో రూ.85 ఉన్నప్పుడు టన్ను మేత ధర రూ.15 వేలకు పెంచారు. కానీ అదే సోయా రేటు ధర నేడు కిలో రూ.23కే అందుబాటులో ఉన్నప్పటికీ మేత «ధర పైసా కూడా తగ్గించిన పాపాన పోలేదు. అమెరికాకు 20–50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అలాంటప్పుడు 50–100 కౌంట్ ధరలు తగ్గించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.నాడు వైఎస్ జగన్ సర్కారు భరోసా అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావంతో మన దేశంలో ఎగుమతులు ఏమాత్రం మందగించినా రాష్ట్రంలోని ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తునారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని అండగా నిలిచింది. మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసి అప్సడా ద్వారా ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు రైతులకు దక్కేలా కృషి చేసింది.కరోనా సమయంలో కూడా ఇదే రీతిలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేసిన సందర్భంలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మద్దతు ధర దక్కేలా కృషి చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ నేడు ఈ సంక్షోభ సమయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.క్రాప్ హాలిడే ఒక్కటే దిక్కుఅమెరికా ట్యాక్స్ విధానం వల్ల కంపెనీలు సిండికేట్‌గా మారి దోపిడీకి గురిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత పది నెలల్లో రైతులతో పాటు ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతాల వారీగా పంట విరామం ప్రకటించడం తప్ప మాకు వేరే మార్గం కనిపించడం లేదు. – నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారు -
7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈనెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెలకు రూ.300 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు గత్యంతరంలేని స్థితిలో ఈ నిర్ణయానికి వచ్చాయి. 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.3,500 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితిని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు గురువారం మీడియాకు వివరించారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)లను ఈనెల 7 నుంచి పూర్తిగా నిలిపేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో తమ ఆస్పత్రులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు అందడంలేదన్నారు. దీంతో పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో మందులు, ఇతర సామగ్రిని సరఫరాచేసే వారికి బిల్లులు చెల్లించలేని గడ్డు పరిస్థితుల్లో ఆస్పత్రుల యాజమాన్యాలు ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేగానీ వీటిని అందించలేమని సరఫరా సంస్థలు ఇప్పటికే నోటీసులిచ్చాయన్నారు. అలాగే, ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో ఏ బ్యాంకు కూడా అప్పులిచ్చే పరిస్థితిలేదన్నారు. ఇక ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి యాజమాన్యాలు కనీసం రెండునెలల వేతనాలు బకాయిలు ఉన్నట్లు వివరించారు. ఈ పరిస్థితుల్లో సేవలు నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇదే అంశంపై గతనెల ఏడునే ప్రభుత్వానికి లేఖ రాశామని.. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే, గతేడాది జూలై నుంచి బకాయిలు, ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని విజయ్‌కుమార్ గుర్తుచేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో నగదు రహిత ఈహెచ్ఎస్ సేవలను ఆపేశామన్నారు.రూ.4వేల కోట్ల బడ్జెట్లో.. రూ.3,500 కోట్ల బకాయిలు..ఇక 2025–26 సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఇందులో బకాయిలే రూ.3,500 కోట్లున్నాయని ఆయన చెప్పారు. ఈ బకాయిల్లో కనీసం రూ.1,500 కోట్లు చెల్లిస్తేగానీ సేవలను కొనసాగించలేమని తేల్చిచెప్పారు. బీమా విధానంలోకి ప్రభుత్వం వెళ్తున్న క్రమంలో ప్యాకేజీల పెంపు, బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) పెరుగుతోందేగానీ, నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించే ప్యాకేజీలు మాత్రం పెరగడంలేదని చెప్పారు. ప్యాకేజీలు పెంచకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యంకాదన్నారు. ఈ క్రమంలో కిమ్స్, మెడికవర్, తదితర కార్పొరేట్ ఆస్పత్రులు ఏడో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తాయని ఆయన స్పష్టంచేశారు.ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ దొరకడంలేదు..ఆశా కార్యదర్శి డాక్టర్ అవినాశ్ మాట్లాడుతూ.. బకాయిలు చెల్లింపుపై కార్యాచరణ ప్రకటిస్తామని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదన్నారు. తమ సమస్యలపై చర్చల కోసం ప్రభుత్వ పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటే అపాయింట్మెంట్లు దొరకడంలేదన్నారు. డాక్టర్ యార్లగడ్డ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్ భారత్‌తో పథకాన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్ భారత్‌లోని 1,500 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఇంటిగ్రేట్ చేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టం అవుతుందన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 600 నెట్వర్క్ ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి వైదొలిగాయని రమేశ్‌బాబు చెప్పారు. -
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
నరసరావుపేట/మంగళగిరి/సాక్షి, అమరావతి: బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్‌ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనుషులకు ఆ వ్యాధి సోకడంతో పాటు ఒక మరణం సంభవించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా పచ్చి చికెన్ తినడం వల్లే ఆ బాలికకు బర్డ్ ఫ్లూ వచ్చిందని ప్రకటించింది. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. కొద్ది నెలలుగా రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. దానిని అరికట్టడంలో, వైరస్ ప్రబలకుండా చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింది. ఈ క్రమంలోనే నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య మృత్యువాత పడింది. జలుబు, తుమ్ములు, తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఈ చిన్నారి మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గత నెల 15న మృతి చెందగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘రెండేళ్ల బాలిక జ్వరం, శ్వాసకోశ సమస్యతో మార్చి 4వ తేదీన పిడియాట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరింది. ఆ బాలికకు లెప్టోసిరోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాసోఫారింజియల్ స్వాబ్ పరీక్ష ద్వారా ఇన్ఫ్లూయింజా ఏ పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. దీంతో మరో నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపాం. వారు ఏవియన్ ఇన్ఫ్లూయింజా (హెచ్5ఎన్1)గా నిర్ధారించారు. అయితే అంతలోనే పాప ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 15వ తేదీన మృతి చెందింది. ఎవరైనా సరే జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని ఎయిమ్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంత స్పష్టంగా ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించగా, ప్రభుత్వం మాత్రం లేనే లేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. రంజాన్ రోజు సాయంత్రం స్థానిక డీఎంహెచ్‌వోకు ఈ విషయం తెలియడంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం నుంచి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లీశ్వరి మంగళవారం నరసరావుపేటకు వచ్చి చిన్నారి కుటుంబాన్ని విచారించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేశారు. జాగ్రత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వ్యాధి జాడ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ.దామోదర నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇదే తొలి కేసురాష్ట్రంలో గతంలో చాలాసార్లు కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కొద్ది నెలల కింద కూడా బర్డ్‌ఫ్లూ వైరస్ పెద్ద ఎత్తున విజృంభించింది. ఇలాంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ డ్రామా నడిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం ప్రకటనలతో సరిపెట్టింది. నరసరావుపేటలో మరణించిన చిన్నారి ఫిబ్రవరిలో పచ్చి కోడి మాంసం తినడం వల్లే వ్యాధిబారిన పడిందని వైద్య శాఖ చెబుతుండగా.. తామసలు రెండు నెలలుగా చికెన్ తినడం లేదని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే వైరస్‌ను పూర్తిగా అరికట్టేశామని ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేస్తుంది? ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. బుధవారం పశు సంవర్థక శాఖ డైరెక్టర్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు లేనేలేవని ప్రకటన ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. బాలిక మృతి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చిన్నారి మరణించిన ప్రాంతంలో రెండు వారాల పాటు సర్విలెన్స్ పెట్టారు. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో కేవలం 4 హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లూయింజా కేసులు (హెచ్5ఎన్1), హెచ్9ఎన్2 కేసులు నమోదయ్యాయి. వీటిలో జూన్ 2019లో మహారాష్ట్ర, జూలై 2021లో హరియాణలో ఒక్కో కేసు, ఏప్రిల్, మే 2024లో పశ్చిమ బెంగాల్లో రెండు కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ మృతి కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.చికెన్ తీసుకురాలేదు రెండు నెలలుగా మా కుటుంబం చికెన్ తీసుకురాలేదు.. వండలేదు. రావిపాడు చర్చిలో ప్రార్థనలకు హాజరైనప్పుడు 40 రోజులపాటు మాంసాహారం తినొద్దని చర్చి పెద్దలు చెప్పటంతో చికెన్ తెచ్చుకోలేదు. ఈ జబ్బు ఏవిధంగా వచ్చిందో మాకు తెలియదు. మా అందరికీ రక్త పరీక్షలు చేశారు. అందరికీ బాగానే ఉందన్నారు. – పెండ్యాల లక్ష్మయ్య (చిన్నారి తాత), రాము (పెదనాన్న) -
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూర్తికి హ్యాట్సాఫ్..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. జగన్ 1.0 పాలనలో కోవిడ్ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండవచ్చు. కానీ.. జగన్ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్రబాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబాబులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసాలుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజులు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్లో 98 స్థానాలకు వైఎస్సార్సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ మేయర్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తున్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్లో లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినకపోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండలంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్ లేకపోయినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మనవాళ్లు 15 మందిని పోలీసులు బందోబస్తు కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్లోకి మనవాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ – వైఎస్ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ (తెల్ల) రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
సాక్షి, అమరావతి: సొంతూర్లోనే పనులు కల్పించి పల్లెల్లోని పేదల ఆకలి కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. ఎప్పటికప్పుడు గరిష్టంగా 15రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలను దాదాపు రెండు నెలలవుతున్నా చెల్లించకుండా కాలయాపన చేస్తూ వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పైగా.. మొన్న శివరాత్రి, ఇప్పుడు ఉగాది పండుగ రోజు కూలీలను నిర్దాక్షిణ్యంగా పస్తులుంచుతూ తన పబ్బం గడుపుకుంటోంది. రాష్ట్రంలో 57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 47 లక్షల కుటుంబాలకు సంబంధించి 75 లక్షల మందికి ఉపాధి పనులే జీవనాధారం. ఇంత పెద్ద మొత్తంలో పేదలు ఆధారపడ్డ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆ కుటుంబాల్లో ఉగాది పండుగ ఆనందం అనేది లేకుండా ఆవిరిచేస్తోంది. ఎందుకంటే.. వీరికి వారం వారం కాదు కదా.. కనీసం నెలకు కూడా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో పనులు చేసిన వారు కూలి డబ్బుల కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.శనివారం (మార్చి 29) నాటికి మొత్తం రూ.725 కోట్ల బకాయిలు వీరికి చెల్లించాల్సి ఉందంటే వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. నిజానికి.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలెవ్వరికీ ప్రభుత్వం ఇప్పటివరకూ వేతనాలు చెల్లించలేదు. అలాగే, జనవరి 9 తర్వాత పనిచేసిన కూలీలకూ అక్కడక్కడ అందలేదు. నిబంధనల ప్రకారం.. గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీల వేతనాలు బకాయిలు ఉంచకూడదని కేంద్ర చట్టం చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో సుమారు రెండు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి. ఉపాధి హామీ పథకం చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాటు వేతన బకాయిలు రాష్ట్రంలో ఎప్పుడులేవని వ్యవసాయ కారి్మక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా.. కేంద్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా టీడీపీ ఎంపీనే కొనసాగుతుండగా.. రాష్ట్రంలో ఉపాధి పథకానికి సంబంధించిన విభాగాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పరిధిలో ఉన్నాయి. నిత్యం నీతులు వల్లించే వీరు పండగ పూట లక్షలాది మంది పేదల కడుపులు మాడుస్తూ అవస్థలు పాల్జేస్తున్నారు.పనులకు వెళ్లే వారిలోనూ తగ్గుదల.. ఇదిలా ఉంటే.. చేసిన పనికి టీడీపీ కూటమి ప్రభుత్వం రోజుల తరబడి వేతనాలు చెల్లించకుండా రూ.వందల కోట్లు బకాయిలు పెట్టడంతో గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు దూరమవుతున్నారు. ఫలితంగా.. పనులకు వెళ్లే కూలీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణంగా.. గ్రామాల్లో వ్యవసాయ పనులు బాగా తక్కువగా ఉండే మార్చినెలాఖరు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 10 లక్షల మంది వరకు ఉపాధి పనులకు హజరవుతారని అంచనా. కానీ, శనివారం కేవలం 4.65 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. దీనికితోడు.. గత 2023–24 ఆరి్థక సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు కోటిన్నర తక్కువ పనిదినాలను ప్రభుత్వం పేదలకు కల్పించింది. 2023–24లో మొత్తం 25.59 కోట్ల పనిదినాలు పేదలకు దక్కాయి. అదే 2024–25లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అంటే.. 2024 ఏప్రిల్, మే నెలలో గత ఏడాది కన్నా కోటి పనిదినాలు ఎక్కువగా పేదలకు దక్కాయి. కానీ, ఏడాది మొత్తం చూస్తే మాత్రం గత ఏడాది కన్నా తక్కువగా కేవలం 23.96 కోట్ల పనిదినాలే పేదలు పొందారు. కూలీలకు ఈ ఏడాది కష్టకాలం.. » గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడంవల్ల ఎక్కువగా ఎస్సీలే నష్టపోయారు. ఎలాగంటే.. గత ఆర్థిక ఏడాది మొత్తం 25.59 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర ఎస్సీలు పనులు పొందగా.. ఈ ఆరి్థక సంవత్సరంలో మొత్తం 23.96 కోట్ల పనిదినాల్లో 21.61 శాతం మేర మాత్రమే వారు పనులు పొందారు. » అలాగే, ఉపాధి హామీ పథకంలో గరిష్టంగా వంద రోజుల పనిదినాలను ఉపయోగించుకున్న కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక ఏడాది 6,87,396 కుటుంబాలు పూర్తిస్థాయిలో వంద రోజుల పనిదినాలు ఉపయోగించుకోగా, ఈ ఆర్థిక ఏడాది కేవలం 4,69,437 లక్షల కుటుంబాలే వంద రోజుల పనిదినాలు పొందాయి. » మరోవైపు.. ఈ ఆర్థిక ఏడాదిలో కేంద్రం గరిష్ట వేతనాన్ని రూ.300కు పెంచినా, రాష్ట్రంలో కూలీలకు సరాసరిన రూ.255.56 చొప్పున మాత్రమే వేతనాలు దక్కాయి. » ఇక గత ఆర్థిక సంవత్సరం 80,589 మంది దివ్యాంగులు ‘ఉపాధి’ పొందగా.. ఈ ఏడాది 76,527 మంది మాత్రమే పనులు పొందారు. -
సత్తెన్నకు సెవెన్ పర్సంట్!
సాక్షి, అమరావతి: వివిధ పనులకు కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అస్మదీయుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఓ ప్రజా ప్రతినిధికి ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ చేసుకున్న పలు సంస్థలు.. తప్పుల తడకగా బిడ్లు వేసినా ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. మూడేళ్ల కాలపరిమితికి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు ఇవి. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. బిడ్ల పరిశీలన పూర్తవడంతో ఎల్1 కంపెనీలను ఎంపిక చేయడం కోసం గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తప్పు చేసినా అర్హత తప్పుల తడకగా బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు అర్హత కల్పించి, కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల ఆధారంగా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అవసరాల కింద ఎంత ఖర్చు చేయాలనే దానిపై టెండర్ నిబంధనల్లోనే పొందుపరిచారు. సర్వీస్ చార్జీ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండాలని సూచించారు. ఇంత స్పష్టమైన నిబంధనలున్నా రెండు సంస్థలు సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల విషయంలో నిర్దేశించిన దాని కంటే తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఒకటి శానిటేషన్, మరొకటి సెక్యూరిటీ టెండర్లలో పాల్గొన్నాయి. శానిటేషన్‌కు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిది. మరోవైపు ప్రస్తుతం జోన్–2(కోస్తాంధ్ర)లో శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ గతంలో బోధనాస్పత్రుల్లో 300 మందికి గానూ 250 మంది సిబ్బందితో పనులు నిర్వహించేలా ఎంవోయూ కుదుర్చుకుని టెండర్ నిబంధనలను అతిక్రమించింది. తక్కువ మంది ఉద్యోగులతోనే అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం నిర్వహించి రూ.కోట్లలో ప్రభుత్వ నిధులను దండుకుంది. ఈ సంస్థ ఏపీఎంఎస్ఐడీసీలో పనిచేసే ఇంజినీర్ల సన్నిహితులది కావడం.. వారే టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో తిమ్మిని బమ్మిని చేసి బిడ్‌కు అర్హత కల్పించారని వెల్లడైంది. టెండర్ నిబంధనలతో పనిలేకుండా ప్రజాప్రతినిధితో సదరు సంస్థలు డీల్ కుదుర్చుకున్న క్రమంలో ఈ మూడు సంస్థలకు కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. కూటమి పెద్దలు అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 108, 104 టెండర్లను ఓ సంస్థకు కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ టెండర్లలో సైతం ఓ సంస్థను ముందే అనేసుకుని.. దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. కేవలం ఆ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినా ఆమోదించేందుకు వీలుగా నిబంధనల్లో వెసులుబాటు పెట్టుకున్నారు.బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి.. గత కొద్ది రోజులుగా ఏపీఎంఎస్ఐడీసీలో తిష్ట వేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలూ ఉన్నాయి. అధికారుల వెంటపడి మరీ తన బిడ్‌కు అర్హత కల్పించుకున్నారని ఎంఎస్‌ఐడీసీలో చర్చించుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ ముగియకుండానే తనకు కాంట్రాక్ట్ వచ్చేసిందని డీఎంఈ అధికారులను కలిసి.. బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారని ఆరా తీసినట్టు సమాచారం. సిబ్బందికి వేతనాలు ఎగ్గొట్టి, అనుభవం లేకున్నా ఉన్నట్టు కొన్ని సంస్థలు ఆధారాలు చూపించాయని, ఈ నేపథ్యంలో ఆడిట్ చేసి సక్రమంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. -
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/మంగళగిరి/మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ రవి పటాన్శెట్టిని వైద్యమిత్రలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్యసేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆరోగ్యమిత్రలు తరలివచ్చి ఆందోళన చేశారు. బీమా విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్లు..⇒ వైద్యమిత్రలకు కేడర్ కల్పించాలి.. బీమా విధానాన్ని అమలుచేయాలి.. ⇒ డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రతలేదు..⇒ 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి..⇒ ఉద్యోగి మృతిచెందితే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలి..⇒ అందరికీ సర్వీసు వెయిటేజీ కల్పించాలి..⇒ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి.ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి..ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకం. మా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు అందజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను అమలుచేసి ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి. – ఎం ప్రత్యూష, గుంటూరుఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి..ప్రభుత్వానికి, ఆస్పత్రులకు, రోగులకు అనుసంధానంగా వుండే ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం అమలుచేయాలి. ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి. ఇటీవల మృతిచెందిన ఆరోగ్యమిత్రల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. – జీ నాగరాజు, ఆసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాంఆరోగ్యమిత్రల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీసం వేతనాలు అమలుచేయాలి. మేం ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమలులో ఎంతో సేవచేస్తున్నాం. రోగులను ఆస్పత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాం. – సత్యలక్ష్మి, ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు -
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్ జగన్
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«దానం’ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. -
ధర్నాచౌక్ సాక్షిగా ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది. ఉద్యోగ, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది. వెల్లువెత్తిన ఆందోళనలు.. » అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు. » పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు ఆందోళన జరిగింది. » ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. » వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది. » రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు. » కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు. » గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది. » కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు. » ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. » డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు. » ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు. » నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. » మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు. » మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్‌లో నినదించారు. -
సాగుకు ‘నీటి’ గండం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 46 లక్షల ఎకరాల్లోనే సాగు ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. –నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలనే కన్నీరు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు. –అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు చేలల్లోనే వినూత్న నిరసనలు అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు. ఆత్మహత్యలే శరణ్యం.. తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. –కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. వట్టిపోయిన కేసీ కెనాల్.. శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు. సాగర్ కిందా ఇదే దుస్థితి.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. –శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. –కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆత్మహత్యలే శరణ్యం ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్‌కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. –చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా అధికారులు కన్నెత్తి చూడడం లేదు మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? –వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలుషిత నీటిని తోడుకుంటున్నాంవరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. –దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా ఏం చేయాలో పాలుపోవడం లేదు4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. –కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా ఎండిపోతున్న మిర్చి పంట పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్‌లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు. రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టారు రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్‌కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు -
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్‌ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్‌కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్‌చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
అవినీతి నిత్య ‘సత్యం’
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో..! లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య‘సత్యం’గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లపై కన్నేసిన ఆయన ముందే కొన్ని సంస్థలతో డీల్ కుదుర్చుకుని వాటికి పనులను కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలను ఆస్పత్రులకు, ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్ఐడీసీ కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు వందల వాహనాలతో.. మూడేళ్ల కాల పరిమితితో టెండర్లను పిలిచారు. కాంట్రాక్టు పరిమితి ముగిశాక మరో రెండేళ్లు పొడిగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఈ సేవలకు ప్రభుత్వం వెచ్చించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది!!అస్మదీయుడికి కట్టబెట్టేలా పక్కా ప్రణాళికగతంలోనూ అత్యవసర వైద్య సేవల్లో అక్రమాలకు తెర తీయగా.. ఆ ఆశలపై ప్రభుత్వ పెద్దలు నీళ్లు చల్లడంతో.. ప్రత్యామ్నాయంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై సదరు నేత దృష్టి సారించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులను పిలిచి బెంగళూరుకు చెందిన తన సన్నిహితుడి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మార్చితో ప్రస్తుత కాంట్రాక్ట్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారని అధికారులు నివేదించడంతో.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త కాంట్రాక్ట్‌నే తమవారికి కట్టబెట్టేలా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ నిబంధనలన్నీ అస్మదీయ సంస్థకు అనుగుణంగా రూపొందించేలా అమాత్యుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సదరు సంస్థకు సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో కన్షార్షియంలో ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థ అనుభవాన్ని వాడుకునేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. ఓ సంస్థకు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకుని, ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించే వెసులుబాటుతో అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. సాధారణంగా ఒకే బిడ్ దాఖలైన సందర్భాల్లో బిడ్‌ను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ టెండర్లకు వెళుతుంది. గత ప్రభుత్వంలో ఇదే నిబంధనతో ఇవే టెండర్లను నిర్వహించారు. అయితే తాజా టెండర్లలో మాత్రం ఒకే బిడ్ వచ్చినా ఆమోదించే అవకాశాన్ని సృష్టించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ముందే ఓ సంస్థను నిర్ణయించుకుని పేరుకు టెండర్ల తంతు నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది.కాంట్రాక్ట్ లేకుండానే..తిరుపతికి చెందిన జనరిక్ మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట అమాత్యుడు ఇప్పటికే అవినీతికి తెర తీశారు! తాను డీల్ కుదుర్చుకున్న సంస్థతోనే ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు ఎంవోయూ కుదుర్చుకుని మందులు కొనుగోలు చేసేలా వైద్య శాఖ అధికారులతో నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇప్పించారు. ప్రభుత్వ బోధనాస్పత్రులకు డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్లో సరఫరా కాని వాటితో పాటు అత్యవసర మందులు, సర్జికల్స్‌ను ఏటా రూ.50 కోట్లకుపైగా వెచ్చించి స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఒకే సంస్థకు మేలు జరిగేలా అమాత్యుడు చక్రం తిప్పారు. మంత్రి డీల్ చేసుకున్న సంస్థతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకునేలా గతేడాది ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఎంవోయూలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన రెండేళ్లలో రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.‘‘అత్యవసర’’ ఆశలపై నీళ్లు..!టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైద్య శాఖలో అత్యవసర సేవల నిర్వహణపై కన్నేసిన సదరు అమాత్యుడు ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థను టార్గెట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం అమాత్యుడిని శరణు కోరగా.. తాను చెప్పిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇందుకు సరేనన్న యాజమాన్యం అమాత్యుడు సిఫార్సు చేసిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ కోసం వైద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ దశలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని.. సబ్ కాంట్రాక్ట్‌లు కుదరవని, తమ అస్మదీయుడికి అత్యవసర వైద్య సేవల కాంట్రాక్ట్ కట్టబెడతామని చెప్పడంతో చేసేదేమీ లేక అమాత్యుడు సైలెంట్ అయిపోయారు. -
నీకది.. నాకిది 'నాకింత.. నీకింత'!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతల లాలూ‘ఛీ’ పర్వం బట్టబయలైంది! టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయక ముందే అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలు జరిపి, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలను నిర్దేశించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు. ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) రూ.10,081.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులను ముఖ్యనేత అత్యంత సన్నిహితులకు చెందిన ఆరు కాంట్రాక్టు సంస్థలకు పంచి పెట్టడమే అందుకు నిదర్శనం. 2014–19 మధ్య ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకి పట్టుబడ్డ అధికారే నేడు రాజధాని నిర్మాణ టెండర్లలోనూ కాంట్రాక్టర్లతో బేరసారాలు సాగిస్తుండటం గమనార్హం. పనులు అప్పగించి కాంట్రాక్టర్లతో ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోగానే అంచనా వ్యయంలో 10 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పించేసి.. అందులో తిరిగి 8 శాతాన్ని ఆ అధికారి ద్వారా కమీషన్‌గా వసూలు చేసుకునే దిశగా ముఖ్యనేత వేగంగా అడుగులు వేస్తున్నారు. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూరుస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాయని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు రాజధాని టెండర్లలో ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెర తీసింది.రూ.31 వేల కోట్ల రుణ ఒప్పందాలు..రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్లు వెరసి ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో ఏడీసీఎల్, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది. ఏడీసీఎల్ రూ.10,714.57 కోట్లకు.. సీఆర్డీఏ రూ.20,358.83 కోట్లకు కలిపి మొత్తంగా రూ.31,073.4 కోట్లతో ఇప్పటివరకూ రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాయి. ఇందులో ఏడీసీఎల్ రూ.10,081.82 కోట్లతో పిలిచిన 35 పనుల టెండర్లను ఇటీవల ఖరారు చేశారు.ఇతరులు బిడ్ వేస్తే అనర్హత వేటే..ముఖ్యనేతలు ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు ఎవరైనా బిడ్ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి.. అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో రెండో ప్యాకేజీ (నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులే అందుకు నిదర్శనం. ఆ పనులకు హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. 3.98 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా(మంత్రి నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ ఎం.భరత్‌కు అత్యంత సన్నిహితుడైన ముప్పాన వెంకటరావుకు చెందిన సంస్థ)కు ఆ పనులను కట్టబెట్టారు. ఇక ఎన్–18 రహదారి (ప్యాకేజీ–5) నిర్మాణ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన హజూర్ మల్టీ ప్రాజెక్టŠస్ సంస్థపై అనర్హత వేటు వేసి... వాటిని బీఎస్సార్ ఇన్ఫ్రా (సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన సంస్థ) 3.18 శాతం అధిక ధరలకు కట్టబెట్టారు.అన్ని పనులూ అధిక ధరలకే..ఏడీసీఎల్ 35 పనులకు పిలిచిన టెండర్లలో ముఖ్యనేతలు ఎంపిక చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్(ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన సంస్థ), బీఎస్సార్.. ఎన్సీసీ (ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఏవీ రంగారాజు ఎండీగా ఉన్న సంస్థ).. బీఎస్పీసీఎల్ (సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన సంస్థ), మేఘా, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. ఆర్వీఆర్ ప్రాజెక్స్‌కు రూ.2,539.72 కోట్ల విలువైన 8 పనులు.. బీఎస్సార్ ఇన్ఫ్రాకు రూ.2,170.81 కోట్ల వ్యయంతో కూడిన 9 పనులు, ఎన్సీసీకి రూ.2,645.96 కోట్లు విలువైన 8 పనులు, బీఎస్సీసీఎల్‌కు రూ.748.75 కోట్లు వ్యయంతో చేపట్టిన 4 పనులు, మేఘాకు రూ.1,182.54 కోట్లు విలువైన 4 పనులు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు రూ.794.04 కోట్లు విలువ చేసే రెండు పనులను కట్టబెట్టారు.లాలూ‘ఛీ’కి ఇదిగో తార్కాణం..⇒ రాజధాని ముంపు నివారణ పనుల్లో ఒకటో ప్యాకేజీ (కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులకు రూ.462.25 కోట్లతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ఎల్–1గా నిలిస్తే... 4.35 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.69 శాతం అధిక ధరలకు కోట్ చేసిన మేఘా ఎల్–3లుగా నిలిచాయి. ⇒ రాజధాని ముంపు నివారణ రెండో ప్యాకేజీ పనులకు రూ.303.73 కోట్ల వ్యయంతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.84 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఎల్–1గా నిలిస్తే... 4.40 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.76 శాతం అధిక ధరకు కోట్ చేసిన మేఘా ఎల్–3గా నిలిచాయి. ⇒ ఈ రెండు ప్యాకేజీల టెండర్లలో దాఖలైన బిడ్లను గమనిస్తే కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతలు లాలూఛీ పడినట్లు స్పష్టమవుతోంది. ఇవే కాదు మిగతా 33 ప్యాకేజీల పనుల్లోనూ ఇదే కథ.అంచనాల్లోనే వంచన...⇒ రాజధాని ముంపు నివారణ పనుల అంచనాల్లోనే వంచనకు తెర తీశారు. అమరావతి ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు లాంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. ఒకటో ప్యాకేజీలో కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించాలి. కొత్తగా 7.843 కి.మీ పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వేందుకు ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, పది నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ లాంటి పన్నులతో కలిపి) మించదని జలవనరుల శాఖలో పలు ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు కలిపినా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్‌ఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద రాజధాని ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టుగా కాంట్రాక్టు వర్గాలే లెక్కలు వేస్తున్నాయి.మిగిలిపోయిన రోడ్డు పనులకు..దేశంలో ఒక కి.మీ. పొడవున ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిని సగటున రూ.20 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అది కూడా అన్ని రకాల పన్నులు జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన వాటికి కి.మీ.కి గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని చేయడం గమనార్హం. -
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్‌గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్‌కి మోడల్ స్కూల్‌గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
ఆర్బీకేల ఆక్రమణ
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి. డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
సీమ హక్కులు 'కృష్ణా'ర్పణం
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్‌కు పేరొస్తుందని కుళ్లా..?సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది. 880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. తాగునీటి పనులకూ బ్రేక్చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది. ‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్ జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. -
సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్‌లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్‌కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా -
ఖాకీ రాజ్యం కళ్లు తెరవదా!
వ్యక్తి హక్కును తృణీకరించి అరాచకం రాజ్యమేలేచోట వ్యక్తికిగానీ, సమాజానికిగానీ రక్షణ ఉండ దంటాడు ఆఫ్రో–అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ డగ్లస్. జనాన్ని అన్ని విధాలా ఏమార్చి తొమ్మిది నెలల క్రితం అందలం ఎక్కిన కూటమి సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాలా ఆ పరిస్థితే కొన సాగుతోంది. ఎన్నికల్లో అడ్డూ ఆపూ లేకుండా ఇచ్చిన హామీలేమయ్యాయని అడిగితే... వరస వైఫ ల్యాలను ఎండగడితే... తప్పుడు ప్రచారాలను నిలదీస్తే... జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రాథ మిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛ బందీ అవుతోంది. అడుగడుగునా పౌరుల హక్కులను హరి స్తున్న పోలీసుల తీరును సహించబోమని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి మూడు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ తోలు మందం ప్రభుత్వానికి వివేకం కలిగినట్టు లేదు. అందుకే మంగళ వారం జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం మరో రెండు కేసుల్లో పోలీసులకు అక్షింతలు వేయాల్సివచ్చింది. పోలీసులైనాసరే చట్టానికి లోబడే వ్యవహరించాలని చీవాట్లుపెట్టింది. ఊహల ఆధారంగా కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా తప్పుడు సెక్షన్లు బనాయించటం సహించబోమంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి కూడా అరెస్టు చేస్తారంది. ఈ వ్యాఖ్యలు చాలు... ఏపీలో పాలన ఎంత నిరంకుశంగా ఉందో చెప్పడానికి! మనసంటే తెలియని, మనుషులంటే లక్ష్యంలేని కూటమి నాయకులకూ, కార్యకర్తలకూ మూడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి! అంటురోగం ప్రబలినట్టు, ఊరంతా ఒకేసారి పూన కాలు వ్యాపించినట్టు వీరంతా ఉన్నట్టుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమైంది వీళ్లకు? ఇదే తీరు కొనసాగిస్తే చట్టాన్ని సవరించి ఇలాంటి కేసుల్లో మొదటగా ఫిర్యాదీదారులను సైకియా ట్రిస్టుల దగ్గరకు పంపాలని... ఎన్నాళ్లుగా మనోభావాలు దెబ్బతిని వున్నాయో, పర్యవసానంగా వారిలో కనబడిన వైపరీత్యాలేమిటో కుటుంబసభ్యుల నుంచి తెలుసుకోవాలనీ నిబంధనలు చేర్చాలన్న డిమాండ్ బయల్దేరినా ఆశ్చర్యం లేదు. ఆ పనిచేస్తే ఇలాంటివారి రోగం కుదురుతుంది. అధికారంలో ఉన్నవారి మెప్పు పొందేందుకు ఫిర్యాదు అందిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా పోలీసులు అరెస్టులకు దిగుతున్నారు. గొలుసు కేసులతో వందలాది కిలోమీటర్ల దూరంలోవుండే పోలీస్ స్టేషన్లకు మార్చి మార్చి తిప్పుతున్నారు. ఎవరిపై ఎన్ని కేసులు పెడుతున్నారో గమనిస్తే ఎవ రంటే పాలకులు వణుకుతున్నారో అర్థమవుతుంది. ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంగతే తీసుకుంటే, 67 ఏళ్ల ఆ పెద్దమనిషిపై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఒకటి రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు తగిలించి అరెస్టు చేస్తున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని పలు అనారోగ్య సమస్యలతో ఉన్న పోసానిని కేసుల పేరుతో వందల మైళ్లు తిప్పుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై పెట్టిన కేసు గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అర్థమవుతుంది. ఒక కేసులో మేజిస్ట్రేట్ ఆయన రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించిన వెంటనే పోలీసులు అతి తెలివి ప్రదర్శించి తిరిగి అవే ఆరోపణలతో ఆయనను మరో సారి అరెస్టు చే శారు. ఈసారి న్యాయస్థానం ఆయన్ను రిమాండ్‌కు తరలించింది. ఈ విషయంలో పోలీసుల పనితీరును హైకోర్టు ధర్మాసనం నిశితంగా విమర్శించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారం అరెస్టు చేయటం, చట్టనిబంధనలను తుంగలో తొక్కడం చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో యాంత్రికంగా వ్యవహరించినందుకు మేజిస్ట్రేట్‌ను తప్పుబట్టింది. తాచెడ్డ కోతి వనమంతా చెరచినట్టు పోలీసుల తీరు వల్ల కిందిస్థాయి న్యాయస్థానాలకు సైతం మందలింపులు తప్పటం లేదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. ఆయన బంధువులకు సమాచారం ఇవ్వరు. అసలు ఆయనపై వున్న కేసులేమిటో చెప్పరు. ఇవి పాటించలేదని తెలిశాక కూడా యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతున్న వైనాన్ని ధర్మాసనం ప్రత్యేకించి ప్రస్తావించింది. ఈ ధోరణి సరికాదని మందలించింది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో కూడా న్యాయమూర్తులు ఈ విధంగానే స్పందించారు. వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపొందించిన ఒక చిన్న రూపకం పోలీసులకు అభ్యంతర కరంగా తోచింది. అంతే... నిరుడు డిసెంబర్లో అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు కర్నూలు పోలీసులు తలు పులు బద్దలుకొట్టి ప్రేమ్‌కుమార్ భార్యాపిల్లలను వేరే గదిలో బంధించి ఆయన్ను ఈడ్చుకెళ్లారు. హాస్యాస్పదమైన విషయమేమంటే వినయ్‌కుమార్ దగ్గర దొరికిన రూ. 300 అక్రమ వసూళ్లట! పైగా సంఘటిత నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించి బీఎన్ఎస్లోని సెక్షన్ 111 బనాయించారు. ఈ రెండు కేసుల విషయంలో మాత్రమే కాదు... ఇంతకు మునుపు మరో మూడు కేసుల్లో కూడా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీని రప్పించాల్సివస్తుందని హెచ్చరించింది. అయినా పోలీసుల తీరు మారడం లేదు. ఈ తెలివితక్కువ చర్యల్ని ఘనకార్యాలుగా భావిస్తూ పాలకులు సిగ్గువిడిచి ఊరేగుతున్నారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్నారు. అలవిమాలిన హామీలిచ్చి, ఈవీఎంలను నమ్ముకుని, డబ్బు సంచులు గుమ్మరించి అందలం ఎక్కిన కూటమి ఇకముందూ ఇదే దోవలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని కలలు కంటోంది. తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో పోలీసులను ఉపయోగించుకుని సంఘటిత నేరాలకు పాల్పడుతోంది. ఎల్లకాలమూ ఈ వ్యవహారం సాగదు. జనం నిజం గ్రహించారు. కీలెరిగి వాత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు. ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా? సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జర్నలిస్టులనూ వదలరా? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
సర్కారు తీరుపై కదం తొక్కిన యానిమేటర్లు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు సంఘ కార్యకలాపాల్లో సహాయకారులుగా పనిచేసే వెలుగు వీవోఏలు (గ్రామ సమాఖ్య సహాయకులు–డ్వాక్రా యానిమేటర్స్) కూటమి ప్రభుత్వ తీరుపై కదం తొక్కారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘కూటమి అధికారంలోకి వచ్చాక 4,500 మందిని తీసేశారు. అధికార పార్టీ నేతలు తమ వారిని నియమించుకునేందుకు 25 ఏళ్లుగా పనిచేస్తున్న వీవోఏలను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ అని నిలదీశారు. మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది వీవోఏలు విజయవాడ చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనాలు వర్తింపజేయాలని, 3 నెలల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల ఇవ్వాలని, రూ.10 లక్షలు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల సమాఖ్యలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమై కొత్త పుస్తకాలు తెచ్చుకుని, కొత్త వీవోఏల పేర్లు రాసుకుని ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు. ‘వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి విధిస్తూ అమల్లో ఉన్న సర్క్యులర్ రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచి్చంది. గెలిచాక ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా? అంటూ మాట మార్చారు’ అని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి విమర్శించారు. వీవోఏలకు పని ఒత్తిడి ఎక్కువైందని, ఇవి చాలదని రాజకీయ పార్టీలు ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. పొదుపు సంఘాల మహిళల ఉత్పత్తుల ఆన్లైన్ అమ్మకాల కోసం వీవోఏలకు టార్గెట్లు పెట్టడాన్ని ఆపాలని వీవోఏలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వీవోఏల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, సీఐటీయూ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వీవోఏ సంఘం కోశాధికారి ఎ.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు ఎ.నిర్మలాదేవి, కె.లక్ష్మి ఆందోళనకు నాయకత్వం వహించారు. -
యువత పోరు నేడే
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు, పుస్తెలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. డీఎస్సీపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు.. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్సార్సీపీ కదనభేరి మోగించనుంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో బుధవారం ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది. అన్నదాతల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న రైతు పోరు.. విద్యుత్ చార్జీల బాదుడును నిరసిస్తూ డిసెంబర్ 27న విద్యుత్ పోరును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు రైతు పోరు, విద్యుత్ పోరును విఫలం చేయడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. వారి బెదిరింపులు.. నిర్భందాలను రైతులు, అన్ని వర్గాల ప్రజలు లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ నిర్వహించిన రైతు పోరులో అన్నదాతలు.. విద్యుత్ పోరులో అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు కదంతొక్కారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రైతు పోరు, విద్యుత్ పోరు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు యువత పోరును నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అయినా రైతు పోరు.. విద్యుత్ పోరు కంటే మరింతగా యువత పోరును విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. నమ్మించి నయ వంచన » రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది» నిజానికి గత విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టింది. » కూటమి సర్కారు ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. అయితే, వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ.. చాలా వరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం. » ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగు పడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేని వారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.» వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2,500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. ఇవ్వాల్సింది రూ.7,100 కోట్లు... బడ్జెట్లో రూ.2,600 కోట్లేగత ఐదు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. 2024–25కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే గతేడాది పిల్లలకు రూ.3,200 కోట్లు బాకీ పెట్టారు. అంతేకాకుండా 2025–26లో మరో రూ.3,900 కోట్లు విద్యాదీవెన, వసతి దీవెనకు కావాలి. ఈ రెండూ కలిపితే పిల్లలకు రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర తేటతెల్లమవుతోంది. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను నట్టేట ముంచారు. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసే పరిస్థితి వచ్చింది. వసతి దీవెనను పూర్తిగా గాలికి వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించడంతోపాటు 2025–26 బడ్జెట్లో ఈమేరకు తగినన్ని నిధులు కేటాయిస్తూ సవరణ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.రూ.18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్‌వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఏడాదికి రూ.3,900 కోట్లు చొప్పున అందచేసింది. ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను సైతం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. మొత్తం రూ.18,663.44 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.» కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడబెరికి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి, పీఠం ఎక్కాక 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. » తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు.»‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్ కాదు నేను..’ అంటూ 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో ప్రగల్భాలు పలికిన లోకేశ్.. ఇప్పుడు జాబ్ కేలండర్ ఊసే మర్చిపోయారు. చంద్రబాబు సైతం ఇదే హామీ పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది.. కానీ జాబ్ కేలండర్ ప్రకటన లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుసార్లు వాయిదా వేశారు. గత నెలలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని 10 లక్షల మందికి పైగా పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో.. శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలా? అని మథనపడుతున్నారు. » చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు, ఏడాదికి రూ.61,200 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూపాయి కూడా కేటాయించలేదు. -
‘అప్పు’డే.. మరో రూ.9,000 కోట్లు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా మరో రూ.9,000 కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిoది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో రూ.9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పు చేసేందుకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు.. సలహాదారు అండ్ మర్చంట్ బ్యాంకర్‌ను కూడా ఏపీఎండీసీ నియమించింది. అప్పు చేసిన నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు చేసే ఈ రూ.9,000 కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీఎండీసీ ద్వారా చేసిన అప్పులు రూ.14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం రూ.23,700 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే. -
కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టిమరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టింది. కూటమి సర్కారు ఏర్పడిన ఈ 9 నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. దీనికితోడు గత విద్యా సంవత్సరంలోని వసతి దీవెన చెల్లింపులు రూ.1,100 కోట్లకు మంగళం పాడింది. విద్యార్థులకు మొత్తం రూ.4600 కోట్లు బకాయిపడింది. అయితే, వైఎస్సార్సీపీ ‘యువత పోరుబాట’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు పాక్షిక చెల్లింపులు మాత్రమే జరిగాయి. చాలావరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమకాకపోవడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్నవారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగుపడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేనివారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.ఇవ్వాల్సింది.. ఇచ్చేది.. అంతా మాయే!ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు అందించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం రూ.700 కోట్లే. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలలకు చేరలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లు మాత్రమే జమయ్యాయి. ఇక 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయిలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి మరో రూ.3,900 కోట్లను కలుపుకొని మొత్తం రూ.7,100 కోట్లు చెల్లించాలి. తాజా బడ్జెట్లో మాత్రం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే కూటమి చెప్పిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ హామీ బూటకంగా తేలిపోయింది. పాత బకాయిలూ ఇచ్చిన వైఎస్ జగన్2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం రూ.18,663.44 కోట్లను అందజేశారు.తొలి సంతకానికి విలువేది?కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న కొలువులు ఊడబీకి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10 వేలు వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి పీఠం ఎక్కిన తర్వాత 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. మరోవైపు తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. సుమారు 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు. జనవరి వెళ్లిపోయే.. జాబ్ కేలండర్ పోయే!‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను’..2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు ఇవి. కానీ, ఎన్నికలై, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ కేలండర్ ఊసే మర్చిపోయారు. లోకేష్ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది..! కానీ జాబ్ కేలండర్ ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. వైద్య కళాశాలలపై ప్రైవేటు కత్తివైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫి కేషన్లు ఇచ్చి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు జరిపింది. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేసింది. ప్రస్తుతం పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతి నెల సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఉద్యోగం రాలేదు.. భృతి ఇవ్వలేదు!చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్ లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండిచెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు ఏడాదికి రూ.61,200 కోట్లు అవుతోంది. -
అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి!
తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం – ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు. – కడప/పులివెందుల/కాశినాయన/బద్వేలు అర్బన్ నాటి పాలకుల అండ.. నేటి పాలకుల కూల్చివేతలుగతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్ద ల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలి... క్షేత్రంలో కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్సీడీఎస్) అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట సర్వోత్తమరెడ్డి శనివారం ఇక్కడ పేర్కొన్నారు. అడవి మధ్యలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేని నిబంధనలు, కఠిన చర్యలు కాశినాయన ఆశ్రమంపై ఎందుకని ప్రశ్నిoచారు. ఆశ్రమానికి చేరుకోకుండా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పలు అడ్డంకులు సృష్టిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోరుమామిళ్ల నుంచి జ్యోతి (కాశినాయన ఆశ్రమం) వెళ్లే ఆర్టీసీ బస్సులను అడవిలోకి ప్రవేశించకుండా చివరి పల్లె అయిన వరికుంట్ల గ్రామం దగ్గరే ఆపి అటునుంచి అటే వెనక్కి పంపిస్తున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేదంటే తీవ్ర ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు కాపాడాలి: ఎమ్మెల్యే సుధ కూటమి నేతలు ఆలయాలపై రాజకీయాలు చేయడం మానుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేయాలని వైఎస్సార్ జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఉపన్యాసా లిచ్చే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చే దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న కాశినాయన ఆలయాన్ని అటవీ అధికారులు కూల్చి వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాశినాయన ఆలయ పరిరక్షణ కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందున తక్షణమే మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. దుశ్చర్యలను ఆపేయాలి సనాతన ధర్మాన్ని, ధార్మికతను కాపాడతానని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను ఆయన నేతృత్వంలోని అటవీశాఖ అధికారులే చేపట్టారు. వెంటనే ఈ దుశ్చర్యలను ఆపేయాలి. హిందువుల మనోభావాలను సంరక్షించాలి. – స్వామి విరజానందా, అచలాశ్రమ పీఠాధిపతి. బ్రహ్మంగారిమఠం ధర్మ ప్రచారానికి అండగా నిలవండి ధర్మం కోసం పనిచేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చివేస్తుండడం శోచనీయం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను అందులోని ధార్మిక వేత్తలను కాపాడాలని, కూల్చివేతలను తక్షణం ఆపేయించాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నాం. – శ్రీనివాసానందస్వామి, ఆశ్రమ నిర్వాహకులు -
పాడి రైతుకు దగా
సాక్షి, అమరావతి/నెట్వర్క్ పాడి రైతు చితికిపోతున్నాడు. ఓ వైపు దాణా ధరలు చుక్కలనంటుతుంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి. పశు పోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డెయిరీలు తగ్గించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర.. చెల్లించిందే రొక్కం.. అన్నట్టుగా తయారైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డెయిరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరకొరగా సేకరించడంతోపాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకు ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. నాడు అమూల్‌తో పాల విప్లవం.. వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో 2020 అక్టోబర్‌లో జగనన్న పాల వెల్లువ (అమూల్) కేంద్రాలను ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాలసేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేసేది. ప్రారంభంలో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్‌కు రూ.71.47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ధర పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లించేది. 40 నెలల్లో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ (జగనన్న పాల వెల్లువ) ప్రాజెక్టు కింద అమూల్‌కు పాలుపోసే రైతులకు రూ.97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్‌తో పోటీని తట్టుకోలేక పాల సేకరణ ధరలు పెంచడం వల్ల ప్రెవేటు డెయిరీలకు పాలుపోసే రైతులకు రూ.4,911 కోట్ల మేర అదనంగా లబ్ధి కలిగింది. మరో వైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి అణాపైసలతో సహా లెక్కగట్టి పది రోజులకోసారి నేరుగా వారి ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్టంగా ధర లభించింది. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనమనే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. అయినప్పటికీ ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10–20 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది. నేడు పాడి రైతుల నిలువు దోపిడీ ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాలసేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాలసేకరణ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో కేవలం ఐదారు వందల గ్రామాల్లో నామమాత్రంగా పాలసేకరణ చేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రోజుకు 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా, ఈ ఏడాది కేవలం 50–60 వేల లీటర్లకు మించి సేకరించలేని దుస్థితి ఏర్పడింది. గతంలో మంచి ధర లభించడంతో అమూల్‌కు పాలు పోసే ప్రతి ముగ్గురిలో ఒక పాడి రైతు 2–3 ఆవులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పాల సేకరణ ధరలు పడిపోవడంతో రైతులు ఆవులను అమ్ముకుంటున్నారు. ఇదేసాకుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు లీటర్‌కు రూ.15–40 మేర తగ్గించేయడంతో పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–300 వరకు నష్టపోతున్నాడు. రాయలసీమ, ఇటీవల ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వారు రోజు10 లీటర్లు పాలు పొసే రైతు నుంచి ఒక లీటర్, ఐదు లీటర్లు పాలు పొసే రైతుకు అరలీటర్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు. రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. మరొక వైపు రిటైల్ మార్కెట్లో పాల విక్రయ ధరలు ప్రైవేటు డెయిరీలు ఇష్టమొచ్చినట్టుగా పెంచేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. అర లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్‌తో రూ.32–37, రిచ్ గోల్డ్ పాలు రూ.30–32, గోల్డ్ పాలు రూ.28–30 చొప్పున విక్రయిస్తూ దోపిడీకి గురిచేస్తున్నాయి. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు తయారైంది పాల ధర. దీనివల్ల అటు పాడి రైతూ లాభ పడటం లేదు. ఇటు ప్రజలకూ మేలు జరగడం లేదు. మధ్యలో ప్రైవేట్ డెయిరీలు మాత్రం ఇష్టానుసారం దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పైగా రైతులకు అండగా నిలిచిన అమూల్ డెయిరీని తరిమేస్తూ ప్రైవేట్ డెయిరీ దందాను ప్రోత్సహిస్తోంది. పాలకు ధర లేదు అమూల్ డెయిరీ పాల సేకరణను ఆపేయించడంతో ధరలు లేకుండా పోయాయి. దీంతో మాకున్న ఆవుల్లో సగానికిపైగా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పాల ధర లీటర్‌పై రూ.15 నుంచి 20 వరకు తగ్గించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయండి.. లేదంటే మానుకోండి.. అంటున్నారు. చేసేదీ ఏమీ లేకు ఆవులను అమ్ముకుంటున్నాం. – విమల, కురవపల్లి, చిత్తూరు జిల్లారైతుల పొట్ట కొడుతున్నారు అమూల్ డెయిరీ ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలన్నీ గిట్టుబాటు ధర చెల్లించేవి. కూటమి ప్రభుత్వం రావడంతో కక్ష కట్టి అమూల్ కేంద్రాలను సాగనంపుతోంది. సహాయ నిరాకరణ చేస్తోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పోటీ లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమూల్ డెయిరీకి పాలు పోసేటప్పుడు లీటర్ ఆవు పాలకు రూ.40–45 వచ్చింది. కానీ విధి లేని పరిస్థితిలో ప్రైవేటు డెయిరీలకు తక్కువ ధరకు పాలు పోయాల్సి వస్తోంది. – అచ్చమ్మ, అంగళ్లు,, అన్నమయ్య జిల్లా ఇష్టానుసారం కొనుగోలుప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ పాలు కొనుగోలు చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ వరకు లీటరు ధర రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.70–75తో కొనుగోలు చేస్తున్నారు. హెరిటేజ్, శ్రీనివాస డెయిరీలు వారి ఇష్టం కొద్దీ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ధర నిర్ణయించి అమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. – శ్రీనివాసులు, రైతు నగరం, నంద్యాల బయటి వాళ్లకు విక్రయిస్తున్నా నాకు మూడు పాడి గేదెలున్నాయి. రెండు పూటలా 16 లీటర్ల పాలిస్తాయి. పాలలో వెన్నశాతం తక్కువగా వస్తోందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలకు 5 లీటర్లు, బయటి వారికి 10 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. బయటి వారు లీటర్‌కు రూ.50 ఇస్తుంటే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.32–34 ఇస్తున్నారు. – వావిలపల్లి హరిబాబు, ధవుమంతపురం, మన్యం జిల్లా గతంలో లీటర్‌కు రూ.69..ఆవు పాల ధర తగ్గించారు. గతంలో లీటర్‌కు రూ.69 వరకు ఇచ్చేవారు. విశాఖ డెయిరీ లీటర్‌కు రూ.3–5 తగ్గించేసింది. పాడి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక బయటి వాళ్లకు అమ్ముకుంటున్నాం. – పి.వెంకటరావు, యలమంచలి, అనకాపల్లి జిల్లా -
16 జిల్లాల్లో రెండో విడత పీ–4 సర్వే
సాక్షి, అమరావతి: పీ–4 రెండో విడత సర్వే 16 జిల్లాల్లో శనివారం మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం నిరుపేదలను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం తొలి విడతగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 మధ్య పది జిల్లాల్లో ఈ సర్వేను పూర్తి చేసింది. మిగిలిన 16 జిల్లాల్లో ఈ నెల 18 వరకు ప్రక్రియ కొనసాగనుంది. రెండు విడతల్లో మొత్తం 1,28,14,471 కుటుంబాల నుంచి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై 27 ప్రశ్నల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటి నుంచి సమాచార సేకరణ చేపడుతున్నారు. కుటుంబాల జాబితాను ప్రభుత్వం సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసింది. సర్వేపై సవాలక్ష అనుమానాలు సర్వే సందర్భంగా కుటుంబ యజమాని ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు, ఇంట్లో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వంటివి ఉన్నాయా? ఎంతమంది సంపాదించే వ్యక్తులు ఉన్నారు..? మున్సిపల్, పట్టణ పరిధిలో ఏ ఆస్తులు ఉన్నాయి..? నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది? వంటి ప్రశ్నలు అడుగుతుండడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలేవీ అమలు చేయడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. సర్కారు మాత్రం పేదల్లో పెద్ద పేదలు, చిన్న పేదలు ఎవరు అన్నది తేల్చడానికి సర్వే చేయడం భవిష్యత్తులో పథకాలను కొద్దిమందికే పరిమితం చేసే ఎత్తుగడ అని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం వివిధ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సాయం అందించడం కోసమే సర్వే నిర్వహిస్తున్నట్టు పేర్కొంటున్నది.పథకాల్లో కోతకేనా? అనే భయం పథకాల్లో కోతలు పెట్టేందుకే సర్వే నిర్వహిస్తున్నారన్న సందేహంతో పాటు బ్యాంకు ఖాతా, కుటుంబ ఆదాయం వంటి సున్నిత వివరాలు సైతం అడుగుతుండడంతో పలు కుటుంబాలు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇలాంటి కుటుంబాలను జాబితాలో ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. తొలి విడత పది జిల్లాలతో పాటు శనివారం నుంచి రెండో దఫా మొదలైన 16 జిల్లాల్లో సర్వే సిబ్బంది 54,70,565 కుటుంబాల సందర్శన పూర్తి చేశారు. ఇందులో 46,46,773 కుటుంబాలు వివరాలను తెలపగా, 8,23,792 కుటుంబాలు నిరాకరించాయి. సర్వే పూర్తయ్యాక ఈ నెల 21న వివరాలతో జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు.