కూటమి ప్రభుత్వం స్కెచ్‌.. గీతం విద్యా సంస్థలకు భూ నజరానా..? | Chandrababu coalition govt Plans To Give Govt Land To GITAM institutions | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం స్కెచ్‌.. గీతం విద్యా సంస్థలకు భూ నజరానా..?

Jan 22 2026 11:23 PM | Updated on Jan 23 2026 12:10 AM

Chandrababu coalition govt Plans To Give Govt Land To GITAM institutions

సాక్షి, విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు కట్టబెట్టే ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.  ఈ అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనపై అధికారిక చర్చ జరగనుంది. 

గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఇప్పటికే ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. భూ నజరానా రూపంలో ఈ భూములను కట్టబెట్టే ప్రక్రియకు రూపకల్పన చేశారు. కౌన్సిల్ ఆమోదం లభిస్తే ఈ భూములు అధికారికంగా గీతం సంస్థకు బదలాయింపు కానున్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement