సాక్షి, విజయవాడ: అక్టోబర్ నుండి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ వివరాల ప్రకారం, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంచనాలకు మించి 96 వేల సంతకాలు తూర్పు నియోజకవర్గంలోనే పూర్తయ్యాయి.
కూటమి ప్రభుత్వ విధానాలను వైఎస్సార్ సీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేశారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు కోరుకొంటున్న విధంగా పరిపాలన చేయాలి. ఎన్టీఆర్ జిలాల్లో ప్రతి నియోజకవర్గంలో 60వేల పైనే సంతకాలు చేశారు. 18నెలల్లో ప్రజలకు ఉపయోగ పడే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయి. ఈ ప్రభుత్వంలో 8వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు పడలేదు. మా పాలనలో ఒక్క రోజు లేట్ ఐతే నానా రభస చేసే వాళ్ళు. ఇప్పుడు ఎల్లో మీడియాకి కనపడడం లేదా? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చినా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు.
అప్పులు తీసుకొని వొచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. సంక్షేమం లేదు..అభివృద్ధి లేదు.. నియోజక వర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకి సేకరించిన సంతకాలు వస్తాయి.15వ తేదీన జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకి సంతకాలు పంపుతాం. 17న రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చిన సంతకాలు గవర్నర్ కి అందజేస్తాం. పిపిపికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని దేవినేని ఆవినాష్ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.


