అమరావతి: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై మరో వీడియో విడుదల చేసింది బాధితురాలు. తనను ఎవరో రెచ్చగొట్టి పంపారనే వార్తలపై బాధితురాలు స్పందించింది. తనన ఏ పార్టీ రెచ్చగొట్ట పంపలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపైనే మీడియా ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర కొంతమంది పేర్లు చెప్పి తనను బద్నాం చేస్తున్నారన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే మోసం చేశారని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టానన్నారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బాధిత మహిళ. తనకు ఎమ్మెల్యే నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని స్పష్టం చేసింది.
కాగా, బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్ మోసపోయావ్.. అయ్యిందేదో అయ్యింది.. నువ్ సర్దుకుపోవడం మంచిది’ అంటూ సదరు బాధిత మహిళతో నాగేంద్ర తెర వెనుక రాజీ చేసే యత్నం చేశారు. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ.
కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీధర్ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్ ఫ్లర్ట్ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు.
ఇది కూడా చదవండి:


