breaking news
railwaykodur
-
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్): సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు రూరల్: ప్రత్యేక బలగాల కూంబింగ్‌లో భాగంగా గురువారం సాయంత్రం రైల్వేకోడూరు మండలంలోని వాగేటికోన వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 26 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చే సుకున్నట్లు తెలిసింది. వీటిని ఓ ట్రాక్టర్లో కోడూరుకు తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి వివరాలు తెలపలేదు. ఈ విషయమై రాజంపేట డీఎస్పీ రాజేంద్రను వివరణ కోరగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు.