గుర్తు తెలియని మృతదేహం లభ్యం | Find The UN Identified Dead Body | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Aug 19 2016 11:04 PM | Updated on Sep 4 2017 9:58 AM

సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు.

సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్‌):  సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement