నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు
రైల్వేకోడూరు శాసన సభ్యుడి రోత లీలలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేసిన బాధితురాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు..
వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సార్లు అబార్షన్ చేయించారు..
ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కులేకుండా పోయింది. సాక్షాత్తూ కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులే కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడటం నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్రా కలకలం రేపుతోంది.
బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామ పిశాచిలా మారిపోయి ఓ వివాహితను దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగ్‌లు, అసహ్యం పుట్టించే నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవీ..
జుట్టు పట్టుకుని కొట్టి.. కారులో రేప్ చేశారు!
నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నా. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14న స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు అభినందనలు తెలుపుతూ ఫేస్‌బుక్ ద్వారా ఓ మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్‌లో మాట్లాడదామంటూ ఆయన నాకు అందులో మళ్లీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని, ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, నువ్వు ఒంటరివి కాదు.. నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు.
మొదటి రోజే రెండు మూడు గంటలు పాటు మాట్లాడారు. రెండు రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని (న్యూడ్స్) నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించి, బలవంతం చేశారు. నువ్వొక చిన్న ఉద్యోగివి.. నీమీద ఎంక్వైరీ వేస్తాం.. నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు.. నీ కుమారుడికి ఏమైనా అయితే తరువాత నన్ను అడగొద్దు.. జాగ్రత్త! అంటూ భయపెట్టారు.
నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందేనని హెచ్చరించారు. దీంతో నేరుగా కలసి ఆయనకు అర్థం అయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో 2024 జూలై 9న మొదటిసారి కలిశా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు.
నేను వద్దంటూ వారించి, విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత మళ్లీ మళ్లీ నన్ను కలుస్తూనే ఉన్నారు.
ఐదుసార్లు గర్భం తీయించారు..
ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. రెండు మూడు రోజులు బెదిరించిన తరువాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. రెండు నెలలు వరకూ అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తరువాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో ఐదుసార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా బయటకు తీసుకువెళ్లడం లేదా ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు.
నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారు. అంతేకాకుండా నా భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారు. నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో లేడు.
ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత.. నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి, వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు. నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారు. నాకు న్యాయం కావాలి!


