
ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలపై సందేహాలెన్నో..
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదులో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. ఓఏఎండీసీ పోర్టల్‌లో సొంతంగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడంతోపాటుగా కళాశాలలకు నేరుగా వెళ్లి దరఖాస్తు ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించడం సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో సులభంగా ఆప్షన్ల వెసులుబాటు ఉన్నప్పుడు కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక విద్యార్థి ఆన్‌లైన్‌లో తనకు నచి్చన కళాశాల కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కళాశాలల్లో ఎన్ని కోర్సులకైనా ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యా మండలి మాత్రం వెబ్ ఆప్షన్లకు రెండు మార్గాలుగా అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ విద్యార్థి సొంతంగా ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే.. ఆ కళాశాలలో సీటు రాకపోతే సదరు విద్యార్థి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం.
పోనీ, ఒక కళాశాలకు వెళ్లి అక్కడి కోర్సుల్లో ఆప్షన్లతోపాటు వేరే కళాశాలలోని కోర్సుల ఆప్షన్ల ఎంపిక కుదరదు. మళ్లీ ఇక్కడ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఆç³్షన్ పెట్టుకోవాలి/మరో కళాశాలలకు వెళ్లి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్ల మార్పు సమయంలో ఆన్‌లైన్‌లో పెట్టిన ఆప్షన్లు ఎన్నైనా మార్చుకోవచ్చు. కానీ, కళాశాలకు వెళ్లి నమోదు చేసుకున్న ఆప్షన్‌ను మార్చడానికి వీలుపడదు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును హరించడమే.