అమృత కలశంలో అభాండాల విషం | Sakshi Guest Column On Chandrababu coalition govt TTD | Sakshi
Sakshi News home page

అమృత కలశంలో అభాండాల విషం

Sep 25 2025 12:30 AM | Updated on Sep 25 2025 12:30 AM

Sakshi Guest Column On Chandrababu coalition govt TTD

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సంరంభం

అభిప్రాయం

ప్రజలకు నిశ్శబ్దంగా సేవ చేసేవారు ఒకరు. సేవ చేస్తున్నాము అని పెద్దగా అరుస్తూ  ప్రకటించుకునేవారు మరొకరు. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోని సంస్కారం ఒకరిది. గోరంత కూడా చేయకుండానే కొండంత చేశామని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రక టనలు ఇచ్చుకునే దగాకోరు సంస్కారం మరొకరిది. మొదటి వారు మాజీ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి, మరొకరు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అయినప్పటికీ – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఆరంభ సందర్భంలో పలు వాస్తవాలను మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను.

బాబుది అదే నీతి, అదే రీతి!
తన అయిదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మానికి, హైందవ ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. కాని ఆయన ప్రచారం కోరుకోలేదు. కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థా స్తంభించి పోయింది కాని, రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలోనూ పూజలు ఆగలేదు, జగన్‌ ఆగనివ్వలేదు. అధికారంలో ఉన్నపుడు వందల ఆలయాలు కూల్చిన చంద్రబాబు, దైవ పూజను కాలికి బూట్లు తీయకుండానే చేసే చంద్రబాబు; సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టి, శాలువా కప్పుకుని మైకు ముందు ఊగితే చాలు అనుకునే ‘పవన’స్వామి... జగన్‌ పాలనలో హైందవ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిందని అరుస్తున్నారు. 

మల మూత్రాలు, మద్యమాంసాల మధ్య సాక్షాత్తు మహావిష్ణువు విగ్రహం పడి ఉందయ్యా అంటే, ఆ తప్పును గుర్తించి సరిచేసుకోక, చెప్పిన వాడిది తప్పు. వెంటనే జైల్లో పెట్టండి అని పోలీసులను పురమాయిస్తున్నారు. అబద్ధాలు చెప్పే వాడికి అందలాలు, నిజం చెప్పే వాడికి అరదండాలు వేయడం అన్నది ఆది నుంచీ చంద్రబాబు నీతి, రీతి!

హైందవ ధర్మానికి స్వర్ణయుగం
వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం వేద సంస్కృతికీ, హైందవ ధర్మానికీ స్వర్ణయుగం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పాలన, జగన్‌ మోహన్‌రెడ్డి పాలన చిరస్మరణీయం అన్నది ప్రజావాక్కు. గత అయి దేళ్లు ప్రతి పక్షంలోనూ, ఇపుడు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చేస్తున్న ఒకే ఒక్క పని... జగన్‌ను తిట్టడం! జగన్‌ చేసిన మంచి పనుల మీద బకెట్లతో కాక ఓ నదీ ప్రవాహంలా విషాన్ని చల్లడం!  హిందూధర్మం మరింత వెలిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానమైందీ నిస్సందేహంగా జగన్‌ వల్లనే, ఆయన పరిపాలనా కాలంలోనే!  తిరుమలలో ‘శ్రీవాణి ట్రస్టు’ ద్వారా స్వామి వారి దర్శనానికి అంకురార్పణ చేసింది జగనే. 

తద్వారా శ్రీవారి శీఘ్ర దర్శనం, దేశవ్యాప్తంగా శి«థిలమై ఉన్న హైందవ దేవాలయాల పున రుద్ధరణ జరిగింది. బాబుకు అది అర్థం కాక ‘శ్రీవాణి ట్రస్టు’పై అనేక ఆరోపణలు చేశారు. చేయించారు. తాను అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు రద్దు మాటఅటుంచి, మరిన్ని ఎక్కువ టికె ట్లను అమ్ముతున్నారు. ఆలయాలలో దీపాలు వెలిగించి ఆరాధించిన వారు జగన్‌. విస్తరణ పనుల పేరుతో వందల ఆలయాలను కూల్చిన మనిషి చంద్రబాబు. ఎవరు నిజమైన హైందవ ధర్మ రక్షకులు? 

ఇప్పుడేదీ గో సంరక్షణ?!
జగన్‌ హయాంలో దేవస్థానం గోశాల సంరక్షణ జరిగింది. గోవులు ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉన్నదీ అప్పుడే. గో సంత తిని మరింత అభివృద్ధి చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల కింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు,ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకురావడం జరిగింది. వాటి సంరక్షణకు, సంతతికి వృద్ధికి పక్కా ప్రణాళికలు తయారుచేసి అమలు చేయడం మొదటిసారి జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ గోశాలలను గుర్తించి అనేక గోశాలలకు మేత, నిర్వహణ వ్యయం అందించింది జగనే. 

ఈ కూటమి ప్రభు త్వంలో, ఈ ధార్మిక మండలి పాలనలో దేవస్థానం గోశాలలో ఎన్ని గోవులు ఆకలితో, అనారోగ్యంతో మరణించాయో అందరికీ తెలుసు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు నవనీత ప్రియుడు. అందుకే నిత్యం ఆయనకు నవనీత సేవ జరుగుతుంది. జగన్‌ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ అత్యంత యాంత్రికంగా జరిపేవారు. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్‌. ప్రతినిత్యం శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగ చిలికించి, వెన్న తీసి అప్పుడే తీసిన నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించడం ఎంత ధార్మిక కార్యం!

వేదంలా ఘోషించిన అలిపిరి
తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించాం. వేద వ్యాప్తికి, రక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం చేయదగ్గ కార్యక్రమాలు ఎన్నో వారు వివరించారు. ఈ ఘనత జగన్‌ది కాదా? వేదమూర్తి, వేద స్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేదఘోష వినిపించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హెూమం ప్రారంభించాం. యువత వక్రమార్గం పట్టకుండా సక్రమ మార్గంలో సరైన హిందువుగా జీవించాలని శ్రీవారి గోవింద కోటి రాసినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాం. గోవిందనామ కోటి రాసి ఆలయ సంబంధిత అధికారికి అందజేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా శ్రీవారి బ్రేక్‌ దర్శనం లభించేలా చేశాం. 

వంద కీర్తనలకు బాణీలు
వేదాలు, పురాణాలు అందరికీ అర్థం అయ్యే భాషలో ముద్రించ డానికి ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. గతంలో నేను దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వ్యాఖ్యానంతో, ప్రతి పదార్థంతో కూడిన భారతాన్ని, భాగవతాన్ని ముద్రించాం. దేవ స్థానం గ్రంథాలలో అత్యంత అధికంగా అమ్ముడు పోతున్నవి అవే. సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించారు. 

అందులో కేవలం పదివేల కీర్తనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎస్‌.వి. భక్తి ఛానల్, ఇతర పండి తులు, సంగీతకారుల సహాయంతో నూతనంగా దాదాపు 100 కీర్తన లకు బాణీలు కట్టించి వెలుగులోనికి తెచ్చాం. ఆంజనేయస్వామి జన్మస్థలం మీద ప్రజలలో అనేక వాదాలు, అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని పండిత పరిషతు ఏర్పాటు చేశాం. వారు వేలాది గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, భౌగోళిక అంశాలు పరిశీలించారు. ఆంజనేయుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రి అని నిర్ధారించారు. ఆ ప్రాంతంలో బాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. 

జీవన భృతికి పారాయణం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన తండాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలోను, వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఉచిత దర్శనం కల్పించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వేదం వినిపించాలనే, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే మహత్తర సంకల్పంతో 700 మందికి పైగా వేద పారాయణ దారులను నియమించాలని సంకల్పించాం. దాని ద్వారా 700 పేద బ్రాహ్మణ కుటుంబాలకు జీవన భృతి ఏర్పడుతుంది. గ్రామ గ్రామాన వేదం వర్ధిల్లి, ధర్మరక్షణ జరుగుతుంది. కాని ఈ కూటమి ప్రభుత్వం, ఈ ధర్మకర్తల మండలి ఈ నియామకాలకు అడ్డుపుల్ల వేసింది. సనాతన ధర్మరక్షణ కంకణాబద్ధుడైన ‘పవనానందుడు’ దీనిపై మాట్లాడకపోవడం, 700 మంది పేద బ్రాహ్మణ కుటుంబాల నోరు కొట్టడం ఏ ధర్మరక్షణో ఆయనే చెప్పాలి.

కూటమి వచ్చాక నత్తనడక
తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు సైతం ఇంటిస్థలాలు ఇచ్చి తీరాలన్నది జగన్‌ సంకల్పం. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఉండగా ప్రభుత్వం నుంచి దాదాపు 1200 ఎకరాల స్థలం తీసుకొని తి.తి.దే విశ్రాంత ఉద్యో గులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాం. తి.తి.దే.లోని కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జీతం 5 వేల నుంచి 20 వేల వరకు పెంచి వారి కుటుంబాలకు ఆనందం పంచాం. 

2021లో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల నిమిత్తం రూ. 320 కోట్లతో పద్మావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టాం. అత్యవసరంగా పూర్తి చేయవలసిన ఆ పను లను ఈ కూటమి ప్రభుత్వం నత్తనడక నడిపిస్తోంది. రాయలసీమ ప్రజలందరికి అందుబాటులో ఉన్న అత్యా ధునిక వైద్యశాల ‘స్విమ్స్‌’ ఆధునికీకరణకు గాను రూ. 200 కోట్లు మంజూరు చేశాము. న్యూరాలజీ, కార్డియాలజీ విభా గాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ప్రారంభించాం. 

మాట తప్పని మనిషి జగన్‌
జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలోని స్థానికులు గుండె మీద చేయి వేసు కుని హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ప్రతీది సమస్యే. వారిపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యం చలాయించేవారే. మొదటిసారి కరోనా వచ్చినపుడు తిరుపతి వీధుల్లో వేలమంది కూలీలు, అనాధలు, చిరు వ్యాపారులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆకలికి అల్లాడుతూ రోడ్డుమీద మిగిలి పోయారు. జగన్‌  ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిత్యం రెండు పూటలా దాదాపు 50 వేల ఆహార పొట్లాలు అందించి వారిని ఆదుకున్నాం. 

ఆకలి విలువ తెలిసిన, మాట తప్పని మనీషి జగన్‌. వాలంటీర్లకు జీతం రెట్టింపు చేస్తా అని వాగ్దానం చేసి, గెలిచాక మొండిచేయి చూపిన మోసపూరిత స్వభావి చంద్రబాబు. మనసున్న మనిషిగా, హైందవ ధర్మరక్షణ కార్యకర్తగా జగన్‌ చేసిన వేలాది కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేదు. కానీ జనం మరచి పోలేదు. ఏమి చేయకుండానే ఎగిరెగిరి పడడం, అవతలి వారు చేసిన మంచికి మసి పూయడం చంద్రబాబు లక్షణం. అసత్య ప్రచారాలకు మీడియాను వాడుకోవడానికి హైందవ ధర్మక్షేత్రానికి ‘అసభ్యభాషా పద పండిత పంచ శస్త్రుడిని‘ అధిపతిని చేశారు. చివరికి దేవుడినీ, దేవుడి ప్రసాదాన్నీ తన అసత్యాలకు బాసట చేయాలనుకున్నారు. న్యాయస్థానం అక్షింతలు వేసినా దులుపుకుపోతున్నారు.

గారడీని నిజమనుకుని, మాటల వలకు చిక్కి, సనాతన ధర్మరక్ష కుడి ఊపుల నటనకు ఊతం ఇచ్చి జగన్‌మోహన్‌ రెడ్డిని కాదనుకు న్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజలు రోదిస్తున్న మాట సత్యం. ఈ సంద ర్భంగా మహాకవి దాశరథి వాక్యాలు మరోసారి స్మరించుకుందాం.
‘‘మంచితనము కలకాలం నిలచి యుండును వంచన ఏనాటికి నశించి తీరును’’

భూమన కరుణాకరరెడ్డి
వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement