రాజకీయ నాయకులు, ప్రముఖులకు వివిధ సందర్భాల్లో అనుచరగణం భారీ పూలమాలలు వేస్తుంటారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో అవి చెత్తకుప్పలోదర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కరెన్సీ నోట్లతో చేసిన మాలలను నేతలకు వేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కావాల్సిన పనులు చేయించుకునేందుకు ఇదొక మార్గమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డు జేమ్స్ గార్డెన్ వద్ద పూల దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారిని ఈ డబ్బుల దండలు (Currency Garlands) ఆకర్షిస్తున్నారు. చాలా మంది వీటిని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. కొంత మంది తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు కూడా తీసుకుంటున్నారు. ఈ దండల ధరలు అందులో పొందుపరిచిన నోట్లకు అనుగుణంగా ఉంటాయని తెలుస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

చదవండి: రఘురామకృష్ణరాజుతో కాస్త జాగ్రత్త


