కనకమేడల రవీంద్రకుమార్‌కు పీవీ సునీల్‌కుమార్ సూచన
సాక్షి, అమరావతి: సీబీఐతో 420 ముద్ర వేయించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వంటి వ్యక్తులతో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన కనకమేడల రవీంద్రకుమార్ కాస్త జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలోని తన ఖాతాలో బుధవారం ఆయన ఓ పోస్టు పెట్టారు.
కనకమేడల రవీంద్ర కుమార్‌తో గతంలో తీసుకున్న ఫొటోను ప్రస్తుతం రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని సునీల్‌కుమార్ ప్రస్తావించారు. మనీలాండరింగ్ ఆరోపణల్లో ఈడీతో నేరం నిరూపితమైన రఘురామకృష్ణరాజు ఆ ఫొటోను ఎలా దుర్వియోగం చేయగలరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆయన్ని కనమేడల రవీంద్రకుమార్ తన కార్యాలయం పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదని సూచించారు.
రఘురామకృష్ణరాజు అరాచకాలను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పీవీ సునీల్ కుమార్ (PV Sunil KUmar) ఎండగడుతున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయన త్వరలోనే జైలుకు వెళతారని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులను రూ. 2 వేల కోట్ల మేర మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సునీల్ కుమార్ చెప్పారు.
కనకమేడల రవీంద్ర కుమార్ గారు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. వీరు గతం లో రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు.
న్యాయ కోవిదుల్లో కనకమేడల ఒకరు. ఆయన న్యాయ శాస్త్ర పరిజ్ఞానం అపారం అని చెబుతారు. ఒక తెలుగు వ్యక్తి జాతీయ స్థాయి లో ఈ పదవి చేపట్టటం మనకి గర్వ కారణం
సార్…… pic.twitter.com/BhxvlZ4I16— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 24, 2025
చదవండి: బ్యాంకులకు రఘురామకృష్ణరాజు టోకరా


