సాక్షి, హైదరాబాద్: ఏపీలో నియంత పాలన నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కూటమి పాలనలో వ్యవస్థలు కీలుబోమ్మలుగా మారాయని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు కొట్టివేయించుకుంటున్నారు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులన్నింటిపై ఉన్నత న్యాయస్థానంలో కొట్లాడుతాం అని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ ఒక్క నెలలో ఎలా కొట్టివేశారో అర్థం కావడం లేదు. కేసు పెట్టిన వ్యవస్థలే చంద్రబాబు నీతిమంతుడు అని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఐడీ, సిట్ సాక్షాదారాలు లేవని చంద్రబాబుపై ఉన్న కేసులు కొట్టివేశారు.
స్కీల్ డెవలప్‌మెంట్ కేసులో వందల మందిని విచారించి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు అన్ని ఏమయ్యాయి?. ఏపీలో దొంగా పోలీసు ఆట నడుస్తుంది.. దొంగలు వారే.. న్యాయ నిర్ణేతలు వారే. కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబును జైలులో వేసింది. మరి ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి?. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు భవిష్యత్‌లో దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులపై మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్లాడుతాం’ అని వ్యాఖ్యలు చేశారు.


