చిత్తూరు జిల్లా: పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయారు. దారి ఇవ్వలేదని కారణంతో కొబ్బరి చెట్లను కూటమి నేతలు నరికేశారు. బైరెడ్డి పల్లి మండలం మిట్టపల్లిలో ఘటన జరిగింది. నాగిరెడ్డిపల్లికి చెందిన మురుగేశ్ శెట్టి, కిషోర్, జనార్ధన్, నాగరాజు శెట్టి, రాజా, మోహన్, శంకర్‌లు గురువారం అర్థరాత్రి కొబ్బరి చెట్లను నరికి వేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

హైకోర్టు పరిధిలో విచారణలో ఉండగా తమపై దాడి చేసి.. కొబ్బరి చెట్లు ధ్వంసం చేశారని.. తమ ప్రాణాలకు రక్షణ లేదని మిట్టపల్లికి చెందిన సంపంగి, కృష్ణప్ప, రుద్రప్ప, వేణుగోపాల్ బాధితులు అంటన్నారు.


