కరీంనగర్‌లో వార్‌ వన్‌ సైడే.. | Union Minister Bandi Sanjay Leads Campaign in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో వార్‌ వన్‌ సైడే..

Feb 10 2026 1:40 AM | Updated on Feb 10 2026 1:40 AM

Union Minister Bandi Sanjay Leads Campaign in Karimnagar

స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కార్పొరేషన్‌లో బీజేపీ 45 స్థానాలు గెలవడం తథ్యం 

ఆర్వోబీ సమస్య తీర్చే బాధ్యత నాదే 

భూకబ్జాదారులు, డ్రగ్స్‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతాం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. మేయర్‌ పీఠం బీజేపీకి అప్పగిస్తే.. కరీంనగర్‌ ప్రజలకు రక్షణ కవచంగా మారి భూకబ్జాదారులు, డ్రగ్స్‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ప్రచారం చివరి రోజైన సోమవారం ఆయన కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి, చింతకుంటలో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్నారు. 

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్‌ విఠల్‌తోపాటు స్థానిక నేతలు పాల్గొన్న ఈ మీటింగ్‌లలో బండి సంజయ్‌ మాట్లాడుతూ, గతంలో ఆర్వోబీ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, కేంద్రం నుంచి సేతుబంధు పథకం కింద మొత్తం రూ.154 కోట్లు తానే మంజూరు చేయించుకొచ్చానని వివరించారు. ఎన్నికలు అయిపో­గానే వీలైనంత త్వరగా ఆర్వోబీ సమస్యను తీర్చే బాధ్యత తనదే అన్నా­రు. ప్రస్తుతం అమృత్‌ 2.0 కింద వచ్చిన రూ.32 కోట్లతో ఎక్కువ శాతం పనులు చింతకుంట పరిధిలో చేయిస్తున్నామని, త్వరలోనే ఇక్కడ తాగునీటి సమస్య తీరుతుందన్నారు.

‘కరీంనగర్‌లో ఎలాగూ గెలవమని కొందరు పైసల సంచులు దించారట. తీసుకోండి. ఎంత ఇచ్చినా.. అదంతా మన వద్ద దోచుకున్న సొమ్మే. ఇన్నాళ్లూ దాచుకుని ఇప్పుడు ఇస్తు న్నారు. వాళ్లు మనీని నమ్ముకున్నారు. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. దయచేసి మీరు కరీంనగర్‌ను ఆగం చేయకండి. ఆలోచించకుంటే ఐదేళ్లు ఆగమైతం.. బీజేపీకి ఓటు వేయకుంటే అన్ని రకాలుగా నష్టపోతాం’అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement