అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌ కౌంటర్‌ | Minister Sridhar Babu Counter To MIM MLA Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌ కౌంటర్‌

Feb 9 2026 8:17 PM | Updated on Feb 9 2026 8:52 PM

Minister Sridhar Babu Counter To MIM MLA Akbaruddin Owaisi

సాక్షి,కరీంనగర్: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రుల దగ్గరికి మేం వెళ్లం. ముఖ్యమంత్రిలే మా దగ్గరికి వస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం బ్రదర్స్ ఏంటో సత్తా చూపిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం’అని పునరుద్ఘాటించారు.   

అయితే,అక్బరుద్దీన్‌ కామెంట్స్‌పై మంత్రి  శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్‌లో మా సపోర్ట్ వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న అక్బరుద్దీన్ స్టేట్మెంట్‌పై స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లు వేశారు.మావల్లే గెలిచింది అని ఎవరైనా చెప్పుకుంటే ఏం చేస్తాం. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది.అదంతా మావల్లే అనుకుంటే ఎవరేమి చేయలేరు’అని కౌంటర్‌ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement