‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ బొమ్మ-బొరుసులే’ | CM Revanth Reddy Slams BJP And BRS | Sakshi
Sakshi News home page

‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ బొమ్మ-బొరుసులే’

Feb 8 2026 8:23 PM | Updated on Feb 8 2026 8:25 PM

CM Revanth Reddy Slams BJP And BRS

భూపాలపల్లి: ఫోన్ల ట్యాపింగ్‌తో బ్లాక్‌ మెయిల్‌ చేసి వేల కోట్లు సంపాదించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ల ట్యాపింగ్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్‌ఎస్‌కు బీజేపీకి సహకరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ,  బీఆర్‌ఎస్‌లు రెండూ బొమ్మ-బొరుసు లాంటి పార్టీలని మండిపడ్డారు. ఇక భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తలపై సీఎం రేవంత్‌ స్పందించారు. 

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మారింది. కాంగ్రెస్‌ అభివృద్ధితోనే భూపాలపల్లి ఈ స్థాయికి చేరింది. భూపాలపల్లి ఎక్కడికి పోదు.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. మరొకవైపు మెడికల్‌ బోర్డు రద్దు అవుతుందనే విషం ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెడికల్‌ బోర్డు రద్దు ఆలోచన ప్రభుత్వ దృష్టిలో లేదు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement