‘ఒక తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నాం’ | BRS Working President KTR On Cngress Govt | Sakshi
Sakshi News home page

‘ఒక తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నాం’

Feb 8 2026 4:48 PM | Updated on Feb 8 2026 5:24 PM

BRS Working President KTR On Cngress Govt

వరంగల్ :  కాంగ్రెస్‌పై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.   కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నామని మరొకసారి ఆ తప్పు చేయొద్దన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్‌ ప్రసంగించారు. 

‘మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని దొంగ హామీలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’ అని ప్రజల్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement