‘మంత్రి పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ పదవి మాత్రం లేదు’ | BRS L:eader Harish Rao Takes On Congress Govt | Sakshi
Sakshi News home page

‘మంత్రి పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ పదవి మాత్రం లేదు’

Feb 8 2026 4:14 PM | Updated on Feb 8 2026 4:35 PM

BRS L:eader Harish Rao Takes On Congress Govt

హైదరాబాద్‌ :  సుమారు మూడు నెలల క్రితం, అంటే జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల సమయంలో మహ్మద్‌ అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు విమర్శల వర్షం కురిపించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం బాగానే ఉన్నా, ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చి 3 నెలలైంది. ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి పోతుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నినందుకే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. 

అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని ఆయన 31 అక్టోబర్ 2025న స్వీకరించారు. అదేవిధంగా, ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారు .  అయితే ఎమ్మెల్సీగా లేరు.  అంటే, ప్రస్తుతం ఆయనకు ఉన్న పదవి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా లేరు. రాష్ట్ర మంత్రిగా ఉండాలంటే అటు  ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీ కానీ ఉండాలి. ఇదే విషయాన్ని ప్రశ్నించారు హరీష్‌రావు. 

Advertisement
 
Advertisement
Advertisement