సాక్షి, చిత్తూరు: సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దివ్యాంగులకు రక్షణ కరువైంది. చిత్తూరు జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐరాల మండలం ఎర్రిపల్లి పంచాయితీ కంపల్లె గ్రామంలో ఈనెల 8న దివ్యాంగురాలు సుమతిపై రాజేంద్ర రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన 48 సెంట్ల స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకుంది. తహశీల్దార్ పోలీసు బందోబస్తు ఇవ్వమని కోరినా పట్టించుకోకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. బాధితురాలు సుమతి దివ్యాంగుల జె.ఏ.సి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగా, తోటి దివ్యాంగురాలు విజయకు జరుగుతున్న అన్యాయంపై మద్దతుగా వచ్చిన ప్రతినిధుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది.
దివ్యాంగులపై ఇంత దాష్టీకమా?!... రక్షణ కల్పించాల్సిన సిస్టమ్ ఎక్కడుంది? 😡👇
సమాజంలో అణగారిన వర్గాలకు, దివ్యాంగులకు అండగా నిలవాల్సిన చట్టాలు, రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు ఎటు పోయాయి? చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతం చూస్తే చట్టాలు ఎవరికోసం పని చేస్తున్నాయనే… pic.twitter.com/b9IYHsOta6— MA-VI-GUN KAREEM (@ysrcp_vjw) July 19, 2026
ఐరాల పోలీస్ స్టేషన్‌లో దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈనెల 11న రాజేంద్ర రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 8 మంది దివ్యాంగులపై కేసు నమోదు చేయడం బాధితులను మరింత కలవరపెట్టింది. రేపు(సోమవారం) దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలవనున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో దివ్యాంగులకు రక్షణ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.


