
కడప నుంచి గండికి వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదని ఏర్పాటు చేసిన బోర్డులు
టీడీపీ కూటమి సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న మహిళలు
కడప కోటిరెడ్డి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం పల్లె వెలుగు బస్సుల్లో సైతం వర్తించకపోవడంపై మహిళలు మండిపడ్డారు. శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా ఆర్టీసీ అధికారులు కడప నుంచి వేంపల్లె మీదుగా పవిత్రమైన గండి క్షేత్రానికి రెండు బస్సులను ఏర్పాటుచేశారు.
గండి ఆలయానికి ఉచితంగా వెళ్లవచ్చని భావించిన మహిళలు బస్సు ఎక్కాక డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాయచోటి నుంచి గండికి వెళ్లే బస్సుల్లో కూడా చార్జీలు వసూలు చేశారు. ఆయా బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదని స్టిక్కర్లను ఏర్పాటు చేయడంతో మహిళలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.