మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలి సంచలన వ్యాఖ్యలు | Minister Sandhya Rani Pa Victim Sensational Comments | Sakshi
Sakshi News home page

మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

Nov 30 2025 4:14 PM | Updated on Nov 30 2025 4:38 PM

Minister Sandhya Rani Pa Victim Sensational Comments

సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రి పీఏ సతీష్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు చేస్తే పోలీసులు నన్ను  24 గంటల పాటు విచారించారు.  నా ఫోన్‌, ఇంటి దగ్గర ఉన్న పిల్లల ఫోన్లు లాక్కున్నారు’’ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఏ సతీష్‌,  మంత్రి కొడుకు ఫోన్లు ఎందుకు తీసుకోలేదు’’ అంటూ ఆమె ప్రశ్నించింది.

నిందితులను కనీసం విచారణ చేయకుండా బాధితరాలినే విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆమె వాపోయింది. ‘‘నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయకులను కూడా అనుమతించలేదు. ఆసుపత్రిలో పోలీసులు ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన చెందా. ఈ కేసు దర్యాప్తులో మంత్రి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలి’’ అని బాధితురాలు డిమాండ్‌  చేసింది.

సతీష్‌ను అరెస్ట్‌ చేయాలి: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి
మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. సతీష్‌పై కేసు నమోదు చేయకుండా నిందితుడి​​కి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాయడం అన్యాయం. మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

..కేసును తారుమారు చేయకుండా నిష్పక్ష పాతంగా పోలీసులు విచారణ చేపట్టాలి. పోలీసులు విచారణ పూర్తి కాకుండా వాయిస్, వాట్సాప్ చాటింగ్ మార్ఫింగ్ అని మంత్రి ఎలా చెప్తారు. సీఎంవో నుంచి పీఏను తొలగించాలని ఆదేశాలు వచ్చిన తరువాతే పీఏను తొలగించడం నిజం కాదా?’’ అంటూ పుష్పశ్రీవాణి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement