బాబు సర్కార్‌ అప్పుల క్యాలెండర్‌ | Chandrababu Naidu government debt calendar | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ అప్పుల క్యాలెండర్‌

Jun 27 2026 5:37 AM | Updated on Jun 27 2026 5:37 AM

Chandrababu Naidu government debt calendar

జూలై – సెప్టెంబర్‌ రూ.21,800 కోట్లు బడ్జెట్‌ అప్పు

నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున చంద్రబాబు సర్కార్‌ అప్పు 

మూడు నెలల అప్పుల క్యాలెండర్‌ ప్రకటించిన ఆర్బీఐ

వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు అప్పు.. ఇప్పటికే ఈ ఆర్థిక ఏడాది తొలి 3 నెలల్లోనే రూ.29,663 కోట్లు అప్పు

సాక్షి, అమరావతి: రానున్న మూడు నెలలకు సంబంధించి మంగళవారం చేసే అప్పుల క్యాలెండర్‌ను చంద్రబాబు సర్కారు విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు క్యాలెండర్‌ లేదు గానీ అప్పుల క్యాలెండర్‌లో సర్కారు దూసుకు­పోతోంది. ప్రతీ ఆర్థిక ఏడాది క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2026–27 రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు) బడ్జెట్‌ అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో రూ.21,800 కోట్లు బడ్జెట్‌ అప్పు చేయనుంది. అంటే నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్‌ పెట్టింది. ఈమేరకు జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ అప్పుల క్యాలెండర్‌ను ఆర్బీఐ విడుదల చేసింది.

ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు. తాజాగా వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.2,600 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement